junction
-
HYD: ఆరు కార్లలో రూ. 6.5 కోట్ల పట్టివేత
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలో శనివారం భారీ నగదు పోలీసులకు పట్టుబడింది. ఆధారాల్లేకుండా తరలిస్తున్న రూ. 6.5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు అప్పా జంక్షన్ వద్ద ఆరు కార్లలో ఈ నగదు తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు. అయితే.. పట్టుబడ్డ ఈ నగదు ఖమ్మం జిల్లా నుంచి తొలిసారి పోటీ చేస్తున్న ఓ నాయకుడికి చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలె ఐటీ దాడులు ఎదుర్కొన్న నేత అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఈ తనిఖీలపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
భారత క్రికెటర్‌కు అరుదైన గౌరవం..
భారత మహిళా క్రికెటర్ మిన్ను మణికి కేరళలోని మనంతవాడి మున్సిపాలిటీ అరుదైన గౌరవం ఇచ్చింది. వయనాడ్ జిల్లాలోని ఈ మున్సిపాలిటీలో ఉన్న మైసూరు రోడ్డు జంక్షన్ పేరును మిన్ను మణి జంక్షన్ గా మార్చేసింది. తనకు ఈ గౌరవం దక్కడం పట్ల మిన్ను చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది. జులై 9న బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20తో మిన్ను మణి అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసింది. తొలి మ్యాచ్ లోనే అదరగొట్టింది. బంగ్లా బ్యాటర్ షమీమా సుల్తానాను తొలి వికెట్‌గా దక్కించుకుంది.తర్వాతి రెండు మ్యాచ్ లలో వరుసగా 4 ఓవర్లలో కేవలం 9 రన్స్ ఇచ్చి 2 వికెట్లు, 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకుంది. సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లలో రెండో స్థానంలో నిలిచింది. మూడు టీ20ల్లో కేవలం 11.6 సగటుతో 5 వికెట్లు తీసింది. కాగా ఈ నెల 14న ప్రత్యేకంగా సమావేశమైన మనంతవాడి మున్సిపల్ కౌన్సిల్.. మైసూరు రోడ్డు జంక్షన్ ను మిన్ను మణి జంక్షన్ గా మార్చాలని నిర్ణయించారు. మిన్నును ఎలా గౌరవించాలా అని ఆలోచించే క్రమంలో ఇలా రోడ్డు జంక్షన్ కు ఆమె పేరు పెట్టాలని నిర్ణయించినట్లు మనంతవాడి మున్సిపల్ ఛైర్ పర్సన్ రత్నవల్లి చెప్పారు. మనంతవాడిలో మిన్ను ఇంటికి మంచి రోడ్డు వేస్తామని స్థానిక ఎమ్మెల్యే ఓఆర్ కేలు చెప్పారు. మున్సిపల్ రోడ్డు నుంచి 200 మీటర్ల దూరంలో ఆమె ఇల్లు ఉంది. ప్రస్తుతం ఆమె ఇంటికి వెళ్లడానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. త్వరలోనే ఈ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని ఈ సందర్భంగా కేలు హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మిన్నును సన్మానించేందుకు ప్రత్యేక కార్యక్రమం కూడా మనంతవాడి మున్సిపాలిటీ అధికారులు చేపట్టారు. చదవండి: కోహ్లి టాప్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వరుస విజయాలు.. కెరీర్ బెస్ట్ అందుకున్న సాత్విక్-చిరాగ్ జోడి -
తిరుపతి: గూడూరు జంక్షన్ సమీపంలో రైలులో మంటలు
-
‘ఉప్పల్ కష్టాల్’ ఇలా తీరున్.. ప్రత్యామ్నాయ మార్గాలెన్నో..
ఉప్పల్(హైదరాబాద్): ఉప్పల్ కూడలిలో ట్రాఫిక్ చక్రబంధనం తప్పేందుకు కొన్ని చర్యలు తీసుకోవడం తక్షణావసరం. ఇక్కడ వాహనాల రద్దీని నిలువరించి సమస్యను పరిష్కరించేందుకు అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు మేల్కోవడం తప్పనిసరి. ఇక్కడ చేపట్టిన స్కై వాక్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను పూర్తి చేయాలి. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు, కార్పొరేటర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లయితే ట్రాఫిక్ పద్మవ్యూహం సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. చదవండి: ఇన్‌స్ట్రాగాంలో పరిచయం.. మాయమాటలు చెప్పి.. ఆటోలో తీసుకెళ్లి.. ఆ స్థలాన్ని సేకరిస్తే.. ఉప్పల్ జీహెచ్ఎంసీ మున్సిపల్ స్టేడియం పక్కనే దాదాపుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దాదాపు రెండు ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఉన్నతాధికారులు, పాలకులు మాట్లాడి శాశ్వత లేక తాత్కా లిక పద్ధతిలోనైనా స్థలాన్ని సేకరిస్తే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది. జిల్లా బస్టాప్‌ను మారిస్తే.. ఉప్పల్ వరంగల్ బస్ స్టాప్ నుంచి మొదలు నలువైపులా కిలోమీటరు మేర బస్సులను ఇష్టానుసారంగా నిలుపుతున్నారు. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి చౌరస్తా వరకు బస్సుల వరుస నిత్యకృత్యం. దీంతో పాటు ఉప్పల్ చౌరస్తా నుంచి మెట్రో స్టేషన్ వరకు రోడ్డుకు అడ్డుగా బస్సులను నిలిపివేస్తుంటారు. దీనికి ప్రత్యామ్నాయంగా జిల్లా బస్ స్టాప్‌ను మెట్రో స్టేషన్ వద్దకు మార్చవచ్చు. సమాంతర రహదారుల్ని అభివృద్ధి చేస్తే.. వరంగల్ జాతీయ రహదారికి సమాంతరంగా ఉన్న రహదారులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా పార్కు నుంచి లిటిల్ ఫ్లవర్ సమాంతర రోడ్ల మీదుగా ట్రాఫిక్‌ను డ్రైవర్షన్ చేస్తే దాదాపు 30 నుంచి 40 శాతం వరకు ట్రాఫిక్ రద్దీని తగ్గించుకోవచ్చు. ప్రైవేట్ వాహనాలను నిలువరిస్తే.. ఉప్పల్ వరంగల్ రహదారి.. ఇటువైపు ఎల్బీనగర్ వెళ్లే మార్గం దాదాపు రోడ్డుకు ఇరువైపులా ప్రైవేట్ వాహనాలు తిష్ఠ వేస్తున్నాయి. వాటికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించి ఆ స్థానంలోనే నిలిపే విధంగా చర్యలు తీసుకోవచ్చు. ఫుట్‌పాత్ ఆక్రమణలను పూర్తిగా తొలగించాలి. ఉప్పల్ నుంచి నాగోల్ వెళ్లే మార్గంలో ఆర్టీఏ కార్యాలయం వరకు ప్రైవేట్ వాహనాల షోరూంల యజమానులు దాదాపుగా సర్వీస్ రోడ్డును పూర్తిగా ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ తంతు జరుగుతున్నా అధికారులు వీరిని పట్టించుకోవడంలో విఫలమవుతున్నారు. సర్వీస్ రోడ్డును క్లియర్ చేస్తే ఎల్బీనగర్ రోడ్డు దాదాపుగా ట్రాఫిక్ ఫ్రీ అవుతుంది. పనుల నత్తనడకకు స్వస్తి పలికితే.. ఉప్పల్ చౌరస్తా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అన్ని రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నా.. ఇవి నత్త నడకన జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. ఎలివేటెడ్ కారిడార్ పనులు 2020లోనే పూర్తవ్వాలి. అధికారుల అలసత్వంతో ల్యాండ్ ఆక్విజేషన్ కాకపోవడంతోనే పనులు నిలిచిపోయాయి. ట్రాఫిక్ సమస్యకు ఇది కూడా కారణంగా చెప్పవచ్చు. బస్టాప్‌తో బోలెడు కష్టాలు.. ఈ చౌరస్తాలో ట్రాఫిక్ కష్టాలకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోలేదు. ఆర్టీసీ, మున్సిపల్, అర్అండ్బీ, మెట్రో రైల్, ట్రాఫిక్ పోలీసులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల మధ్య సమన్వయం అవసరం. యాదాద్రి టెంపుల్ తెరిచినప్పటి నుంచి నిత్యం వేలాది మంది ఉప్పల్ వరంగల్ బస్‌స్టాప్‌ను నుంచే యాదాద్రి వెళ్తున్నారు. దీంతో పాటు ఇటీవల కాలంలో యాదగిరిగుట్టపైకి మినీ బస్సులను సైతం ఉప్పల్ నుంచే ప్రారంభించారు. ఈ కారణంగానూ రద్దీ మరింత పెరిగింది. అదనంగా ఇమ్లీబన్, జూబ్లీ బస్‌స్టేషన్ వరంగల్, హన్మకొండ, పరకాల, చెంగిచర్ల, ఉప్పల్ డిపోల బస్సులు సైతం ఇక్కడి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ఒకే బస్‌స్టాప్ ఉంది. అది వరంగల్ బస్‌స్టాప్ మాత్రమే. సరైన బస్ బే లేక పోవడంతో రోడ్లపైనే బస్సులు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటారు. వీటిని పక్కపక్కనే పెట్టడంతో ట్రాఫిక్‌జాం సమస్య తలెత్తుతోంది. -
ఉప్పల్ కష్టాల్: అడుగడుగునా ట్రాఫికర్.. నలుదిక్కులా దిగ్బంధనం
మీరెప్పుడైనా ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి వాహనంపై వెళ్లారా? అయితే.. అక్కడి ట్రాఫిక్‌తో నరకం అనుభవించే ఉంటారు! వాహనాల ప్రవాహంతో ఆ కూడలి దిగ్బంధనంలో చిక్కుకున్న దృశ్యం మీకు కనిపించే ఉంటుంది. మరోసారి ఈ దారి నుంచి రావొద్దురా బాబు అని అనుకునే ఉంటారు. ఇసుక పోస్తే రాలనంత వాహనాల సమూహం. అక్కడి పరిసరాలన్నీ నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహం. ఓ వైపు సికింద్రాబాద్, హబ్సిగూడల నుంచి.. మరోవైపు ఎల్బీనగర్ నుంచి.. ఇంకోవైపు కోఠి, ఎంజీబీఎస్, అఫ్జల్‌గంజ్, రామంతాపూర్ ప్రాంతాల నుంచి వచ్చీ వెళ్లే వాహనాలతో ఉప్పల్ కూడలితో పాటు దాని సమీప ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో అటు పాదచారులు, ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ లోపం, స్కైవే నిర్మాణంలో జాప్యం తదితర కారణాలతో వాహన దిగ్బంధనం కొనసాగుతోంది. భారీ ప్రాజెక్టులు, ఆకాశాన్నంటే వంతెనలు, ఆకాశ మార్గాల్లో నడకదారులు.. ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నా ఇక్కడి ట్రాఫిక్ వ్యవస్థ తీరు మాత్రం మారడం లేదు. – ఉప్పల్ పెరిగిన వ్యక్తిగత వాహనాలు.. కోవిడ్ తర్వాత వ్యక్తిగత వాహనాలు పెరగడంతోనూ ట్రాఫిక్ సమస్యకు ఆజ్యం పోసినట్లవుతోంది. ఈస్ట్ సిటి అభివృద్థిలో బాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉప్పల్ వైపు ఐటీ కారిడార్లను తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉప్పల్ వద్ద జెన్‌ప్యాక్, అరీనా టవర్స్ వంటి సాఫ్ట్వేర్ సంస్థలు, డీఎస్ఎల్ మాల్ లాంటి అనేక కంపెనీలో అడుగుపెట్టాయి. మరిన్ని సంస్థలు వచ్చి చేరడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. వీటికి మార్గం సుగమం కావాలంటే మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థ అవసరం. పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన యూటర్న్ సిస్టంపై నెట్టుకుంటూ వస్తున్నారు. ఉప్పల్ చౌరస్తా మీదుగా నిమిషానికి సుమారు 600 నుంచి 700 వాహనాలు వెళ్తున్నట్లు అంచనా. బస్టాప్‌తో పరేషాన్.. హబ్సిగూడ, రామంతాపూర్‌ల నుంచి ఉప్పల్‌కు వచ్చే దారిలో బస్‌స్టాప్ ఉంది. సిటీ బస్సులతో పాటు వివిధ డిపోలకు చెందిన బస్సులు ఇక్కడ నుంచి వెళ్తుంటాయి. యాదాద్రి, వరంగల్‌కు వెళ్లడానికి ఈ బస్సుస్టాపే ప్రధానమైంది. దీంతో పాటు నాలుగు అడుగుల దూరంలోనే ఉప్పల్ చౌరస్తా వద్ద సిగ్నల్ ఉండటంతో ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యమవుతోంది. స్కైవే ఎఫెక్ట్‌తో.. ఉప్పల్ చౌరస్తా నుంచి సికింద్రాబాద్ వెళ్లే మార్గం కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. రామంతాపూర్ వైపు స్కైవే నిర్మాణం జరుగుతుండగా భారీ వాహనాలను దారి మళ్లించడంతో రద్దీ రెట్టింపైంది. ఉప్పల్ చౌరస్తా నుంచి కేవీ– 2 స్కూల్ నుంచి వెళ్లాల్సిన భారీ వాహనాలను ఏక్ మినార్ మజీద్, ఉప్పల్ క్రికెట్ స్టేడియం మీదుగా రామంతాపూర్‌కు మళ్లించారు. బస్సు పక్కన బస్సుతో.. హబ్సిగూడ నుంచి ఉప్పల్ వైపు వచ్చే దారిలో వరంగల్ వైపు వెళ్లే బస్సులతో పాటు మిగతావాటికీ ఇక్కడే బస్టాప్. వరంగల్, యాదాద్రి వెళ్లడానికి ఇదే ప్రధాన బస్టాప్గా మారడంతో ఇమ్లిబన్, జూబ్లీ నుంచి వచ్చే వాహనాలు రోడ్డుపైనే నిలబెట్టి ప్రయాణికులను ఎక్కించుకుంటారు. దీంతో బస్సు వెనక బస్సు కాకుండా బసు పక్కన బస్సులను నిలపడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. దీనికి తోడు యాదాద్రికి వెళ్లడానికి ఉప్పల్ చౌరస్తా ప్రధాన రహదారి కావడం, ఎల్బీనగర్ వైపు పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్లకు వెళ్లడానికి ఇదే ప్రధాన మార్గం. వీఐపీల ప్రయాణాలు అధికంగా ఉండటంతోనూ ట్రాఫిక్ నిత్యం నరకంగా మారుతోంది. అదనంగా లోకల్ బస్సు డిపోలకు సంబందించిన బస్సులు చేంజ్ ఓవర్ కూడా ఇక్కడే ఉండటంతో మరింత జటిలమవుతోంది. బోడుప్పల్ నుంచి ఉప్పల్ చౌరస్తా వరకు అడ్డదిడ్డం ఉప్పల్ బస్‌డిపో నుంచి ఉప్పల్ చౌరస్తా, ఎల్బీనగర్ బస్టాప్ వరకు దాదాపు 2 కి.మీ రోడ్లు అడ్డదిడ్డంగా ఉండటంతో ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. స్కైవే నిర్మాణం జరుగుతోందని ఈ రోడ్డును ఏమీ చేయలేమని జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. నత్తనడకన ఫ్లై ఓవర్ పనులు.. ఉప్పల్ ఎల్బీనగర్ బస్‌స్టాప్ నుంచి నాగోల్ చౌరస్తా వరకు దాదాపు 2 కి.మీ దూరం. ఉప్పల్ చౌరస్తాలోనే నాలుగు జిల్లాల ఆర్టీసీ బస్సులకు ఇక్కడే స్టాప్. దీంతో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లడానికి బస్‌స్టాప్ కూడా ఇక్కడే ఉండటం, రోడ్డుకు ఇరువైపులా మెట్రో స్టేషన్లు.. ఇలా దారి పొడవునా ట్రాఫిక్ ఇబ్బందులే. వీటికి తోడు నాగోల్ బ్రిడ్జి దాటిన తర్వాత నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు అనుకున్నంత వేగంగా జరగటంలేదు. ఉప్పల్ ప్రయాణమంటేనే హడల్ రోడ్లు సరిగా లేవు. స్కైవే నిర్మాణం ప్రారంభమై నాలుగేళ్లు గడిచినా ఇంకా కొలిక్కి రారేదు. మరోపక్క స్కైవాక్ వంతెన కూడా పూర్తి కాలేదు. రోడ్డు దాటాలన్నా హడలెత్తిస్తోంది. ఎప్పుడే ప్రమాదం వచ్చి పడుతుందోననే భయం వెంటాడుతోంది. – సతీష్, ప్రైవేటు ఉద్యోగి, ఉప్పల్ ఆదర్శ్‌నగర్ ట్రాఫిక్‌తో పాటు కాలుష్యం.. ఉప్పల్ జంక్షన్‌కు వస్తున్నామంటనే ట్రాఫిక్ భయం పట్టుకుంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ లేనందువల్లే అభద్రతా భావం ఏర్పడుతోంది. పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. కానీ అలా జరగడం లేదు. ట్రాఫిక్ పోలీసుల దృష్టి కేవలం చలానాలపైనే ఉంటోంది. – ప్రదీప్ కుమార్, ఉప్పల్ -
అప్పా–మన్నెగూడ రహదారి విస్తరణకు మోక్షం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎప్పుడెప్పుడా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్లే ఎన్‌హెచ్–63 (అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు.. 46 కి.మీ) నాలుగులేన్ల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.956 కోట్ల అంచనాలతో చేపట్టే ఈ పనుల కాంట్రాక్ట్‌ను సాగునీటి ప్రాజెక్టులు ఇతర నిర్మాణ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన మెఘా ఇంజినీరింగ్ కన్స్ట్రక్షన్ సంస్థ చేజిక్కించుకుంది. కేటాయించిన నిధుల్లో రూ.786 కోట్లు రహదారి నిర్మాణానికి ఖర్చు చేయనుంది. మిగిలిన మొత్తాన్ని భూ సేకరణకు వెచ్చించనుంది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గ్రామాలకు సర్వీసు రోడ్లు సైతం అందుబాటులోకి వస్తాయి. రోడ్డుకిరువైపులా గ్రామీణ ప్రజల సౌకర్యార్థం మొత్తం 18 ప్రాంతాల్లో అండర్ పాస్‌లు రానున్నాయి. వీటిలో మొయినాబాద్ అండర్ పాస్ (100 మీటర్లు) పెద్దది. (క్లిక్: హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌ల వైశాల్యం ఎంతో తెలుసా?) ఈ రోడ్డు పనులు పూర్తయితే మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, వికారాబాద్ ప్రాంత ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. ప్రయాణం సులభతరం కావడంతో పాటు రోడ్డు ప్రమాదాలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇదిలాఉండగా చేవెళ్ల సమీపంలో రోడ్డుకు ఇరువైపులా భారీ మర్రి, ఇతర వృక్షాలు ఉన్నాయి. వీటి తొలగింపుపై ఇప్పటికే పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న క్రమంలో ఎలా సంరక్షిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. (క్లిక్: ‘సిటీ’జనులకు షాక్..! బస్ పాస్ చార్జీలు భారీగా పెంపు) -
అభివృద్ధి పనులకు నిధుల దెబ్బ
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దాదాపు రూ.25వేల కోట్ల ఫ్లైఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి పనుల్లో సుమారు రూ.4,400 కోట్ల విలువైన వాటికి బ్రేక్ పడింది. అటు ప్రభుత్వం, ఇటు జీహెచ్ఎంసీ వద్ద నిధులు లేకపోవడం.. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం తదితర పరిణామాలతో ప్రారంభించని పనులతో పాటు 90శాతం భూసేకరణ పూర్తవ్వని ప్రాజెక్టుల జోలికి వెళ్లొద్దని జీహెచ్ఎంసీకి స్పష్టమైన ఆదేశాలు అందినట్లు తెలిసింది. వీటితో పాటుపురోగతిలో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి కూడా డోలాయమానంలో పడింది. ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా జీహెచ్ఎంసీ దాదాపు రూ.25వేల కోట్ల పనులకు ప్రణాళికలు రూపొందించిన విషయం విదితమే. వీటిని వివిధ దశల్లో చేపట్టాల్సి ఉండగా.. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం కొన్ని ఆగిపోయాయి. ఇప్పటికే ఈ పనుల కోసం బల్దియా రూ.495 కోట్లను బాండ్ల ద్వారా సేకరించింది. వీటి చెల్లింపులతో పాటు వివిధ నిర్వహణ పనులు, ఇతరత్రాలకు నిధులు లేవు. ప్రతినెల వస్తున్న ఆదాయానికి, ఖర్చులకు పొంతన కుదరడం లేదు. సిబ్బంది జీతాల చెల్లింపులకే కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తగిన నిధులు అందజేయగలదన్న ఆశలు కూడా అడుగంటాయి. మరోవైపు ఇంకా ప్రారంభం కాని, టెండర్ల ప్రక్రియ పూర్తికాని ప్రాజెక్టులు చేపట్టరాదన్న సంకేతాలతో పలు పనులకు బ్రేకులు పడ్డాయి. పురోగతిలో ఉన్న పనులు సైతం... సాధారణ ఫ్లైఓవర్ల కంటే స్టీల్ బ్రిడ్జీలను తక్కువ భూసేకరణతోనే చేపట్టే వీలుండడంతో రెండు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ టెండర్ల వరకు వచ్చినప్పటికీ... పూర్తికాకపోవడంతో నిలిపేయాల్సి వచ్చింది. మరోవైపు వివిధ దశల్లో పురోగతిలో ఉన్న రూ.2వేల కోట్లకు పైగా పనుల పరిస్థితి డోలాయమానంలో పడింది. వాటిలో కామినేని–బైరామల్‌గూడ అండర్‌పాస్, నాగోల్ జంక్షన్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45–దుర్గం చెరువు, షేక్‌పేట–విస్పర్‌వ్యాలీ, బొటానికల్ గార్డెన్, కొండాపూర్, కొత్తగూడ ఫ్లైఓవర్లు తదితర ఉన్నాయి. ఇతర ప్రాజెక్టులు ♦ రేతిబౌలి, నానల్‌నగర్ జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ అంచనా వ్యయం రూ.636.80 కోట్లు ♦ ఎన్ఎఫ్సీఎల్–మెహదీపట్నం ఫ్లైఓవర్ అంచనా వ్యయం రూ.1200 కోట్లు ♦ ఆరాంఘర్–జూపార్కు ఫ్లైఓవర్ అంచనా వ్యయం రూ.320 కోట్లు ♦ ఇవి కాకుండా మరో రూ.1,000 కోట్లకు పైగా ప్రాజెక్టులు ఆగిపోయాయి. వీటికే బ్రేకులు ♦ నల్లగొండ క్రాస్ రోడ్ – ఒవైసీ జంక్షన్ ♦ ఇందిరాపార్కు–వీఎస్టీ జంక్షన్ ♦ రేతిబౌలి, నానల్‌నగర్ జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ ♦ ఎన్ఎఫ్సీఎల్–మెహదీపట్నం ఫ్లైఓవర్ ♦ ఆరాంఘర్–జూపార్కు ఫ్లైఓవర్ ♦ ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఈ ప్రాజెక్టులకే బ్రేకులు ♦ నల్లగొండ క్రాస్ రోడ్ – ఒవైసీ జంక్షన్ ♦ నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ ♦ పొడవు 4 కిలోమీటర్లు ♦ అంచనా వ్యయం రూ.523.37 కోట్లు ♦ రద్దీ సమయంలో వాహనాలు:70,576 ( 2015లో) ♦ 2035 నాటికి వాహనాలు: 1,93,632 నల్లగొండ క్రాస్ రోడ్ నుంచి సైదాబాద్, ఐఎస్ సదన్ల మీదుగా ఒవైసీ జంక్షన్ వైపు దాదాపు 4కి.మీ మేర ఈ స్టీల్ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే మిథాని, సంతోష్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి చాదర్‌ఘాట్, కోఠిల మీదుగా న్యూసిటీలోకి వచ్చేవారు.. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ మార్గంలో పలు ప్రార్థనా మందిరాలు ,ఆస్పత్రులతో పాటు పోలీస్ స్టేషన్, శ్మశానవాటికలు ఉండడంతో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటోంది. ఇందిరాపార్కు–వీఎస్టీ జంక్షన్ దీన్ని రెండు భాగాలుగా చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించి టెండర్లు ఆహ్వానించారు. ఇందిరాపార్కు– వీఎస్టీ జంక్షన్ 2.6 కిలోమీటర్లు, రామ్‌నగర్–బాగ్‌లింగంపల్లి 0.84 కిలోమీటర్ల మార్గంలో నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. ఈ రెండింటి అంచనా వ్యయం రూ.426 కోట్లు. ♦ రామంతాపూర్, హిందీ మహావిద్యాలయ, విద్యానగర్, రామ్‌నగర్, వీఎస్టీల నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్ మీదుగా సచివాలయం, లక్డీకాపూల్ తదితర ప్రాంతాలకు ప్రయాణించే వారికి... రామ్‌నగర్ నుంచి బాగ్‌లింగంపల్లి మీదుగా హిమాయత్‌నగర్, లిబర్టీ, సచివాలయం తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి వీటి వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని టెండర్లు పిలిచారు. ♦ వీటికి టెండర్లు ఆహ్వానించినప్పటికీ మొత్తం ప్రక్రియ పూర్తి కాకపోవడం, భూసేకరణలో భాగంగా పలు ఆస్తులు సేకరించాల్సి ఉండడం తదితర కారణాలతో ఈ స్టీల్ బ్రిడ్జీలకు బ్రేక్‌లు పడ్డాయి. -
విశాఖపట్నంలో మరో ఫ్లైఓవర్!
సాక్షి, విశాఖపట్నం: నగరంలో మరో ఫ్లైఓవర్ రాబోతోంది. ఇప్పటికే ఆశీలుమెట్ట నుంచి రైల్వేస్టేషన్ వరకు ఒకటి, కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వెళ్లేందుకు మరొక ఫ్లైఓవర్ ఉన్నాయి. ఎన్ఏడీ జంక్షన్లో మరో ఫ్లైఓవర్ నిర్మాణం జరగబోతోంది. తాజాగా కాన్వెంట్ జంక్షన్ నుంచి విశాఖ పోర్టు వరకు మరో కొత్త ఫ్లైఓవర్ రానుంది. దీంతో విశాఖలో ఫ్లైఓవర్ల సంఖ్య నాలుగుకు చేరుతుంది. కేంద్ర ప్రభుత్వం సాగరమాల ప్రాజెక్టులో దీనిని నిర్మించనుంది. ఈ వంతెనకు రూ.60 కోట్లు వ్యయం కానుంది. ఇందులో సివిల్ పనులకు రూ.44.32 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తం వ్యయంలో సగం సొమ్మును కేంద్ర ప్రభుత్వం, మిగిలిన సగం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ), విశాఖ పోర్టు ట్రస్టు (వీపీటీ)లు సంయుక్తంగా భరిస్తాయి. ప్రస్తుతం కాన్వెంట్ జంక్షన్ నుంచి పోర్టు వరకు ఉన్న రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డులో ప్రమాదాల బారిన పడి ఏటా సగటున ఐదుగురు మృత్యువాత పడుతున్నారు. పది మందికి పైగా గాయాలపాలవుతున్నారు. పైగా ఈ రోడ్డులో వాహనాల సంఖ్య పెరిగిపోతుండడంతో ట్రాఫిక్ రద్దీ అధికమవుతోంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీంతో కేంద్రం దీనిని సాగరమాల ప్రాజెక్టులో చేర్చింది. కాన్వెంట్ జంక్షన్ నుంచి పోర్టు లోపల ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు 724 మీటర్ల మేర ఈ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తారు. ఇందుకోసం ఇటీవల టెండర్లను కూడా పిలిచారు. వీటిలో అత్యల్పంగా కోట్ చేసిన సంస్థకు నెలాఖరుకల్లా టెండరు ఖరారు చేయనున్నామని ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు. -
బీబీనగర్ జంక్షన్ అయ్యేనా ?
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం వేసిన మొదటి రైల్వేలైన్ నడికుడి-బీబీనగర్. నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1977లో ఈ రైల్వేలైన్‌ను ప్రారంభించారు. ఈ మార్గం ద్వారా తెలంగాణ, సీమాంధ్రతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు రవాణాను సులభతరం చేశారు. నిత్యం గూడ్స్, ప్యాసిం జర్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. దక్షిణమధ్య రైల్వే ప్రధాన కేంద్రమైన సికింద్రాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న నడికుడి రైల్వేలైన్ ఏర్పా టు సమయంలోనే బీబీనగర్‌లో జంక్షన్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. సికింద్రాబాద్ దక్షిణమధ్య రైల్వేకు అనుబంధంగా బీబీనగర్, పగిడిపల్లి, బొమ్మాయిపల్లి, నాగిరెడ్డిపల్లి రైల్వేస్టేషన్ వరకు రైలులైన్లను విస్తరించి జంక్షన్ ఏర్పాటు చేయాలని భావించారు. కానీ 40ఏళ్ల క్రితం చేసిన ప్రతిపాదనను పాలకులు ఏనాడో మరిచిపోయారు. బీబీనగర్ పారిశ్రామిక ప్రాంతం రైల్వే జంక్షన్‌గా రూపాంతరం చెందితే ఈ ప్రాంత నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పొందే అవకాశాలు ఉండేవి. రైల్వే వ్యాపార కేంద్రంగా బీబీనగర్ రైల్వే ద్వారా బీబీనగర్ పారిశ్రామిక ప్రాంతాల్లోని పరిశ్రమలకు ముడి సరుకుల రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. హిందుస్థాన్, బాంబీనో, ఐషర్ ట్రాక్టర్స్ వంటి పలు కంపెనీలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేశాయి. బీబీనగర్ ప్రధాన కేంద్రంగా కంకర రవాణా జరుగుతుంది. గుట్టల ప్రాంతంగా ఉన్న భువనగిరి డివిజన్లో వెలసిన క్రషర్ల ద్వారా 40ఎంఎం కంకర రైల్వే పట్టాల కింద వేయడానికి వినియోగించుకుంచారు. ఈ కంకరను దక్షిణమధ్య రైల్వే పరిధిలోని బల్లార్ష, కొండపల్లి, మహబూబ్‌నగర్, షెడామ్, వికారాబాద్, శంకర్పల్లి, విజయవాడ, వరంగల్ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు . సికింద్రాబాద్‌పై తగ్గనున్న వత్తిడి బీబీనగర్ రైల్వే జంక్షన్ ఏర్పాటు చేస్తే దక్షిణ మధ్యరైల్వే ప్రధాన స్టేషనైన సికింద్రాబాద్‌పై వత్తిడి తగ్గనుంది. పలు రైళ్లు సికింద్రాబాద్‌నుంచి ప్రారంభమై ఇక్కడే ఆగిపోతుంటాయి. బీబీనగర్‌ను జంక్షన్ చేయడం వల్ల పలు రైళ్లను ఇక్కడినుంచి ప్రారంభించే అవకాశం ఉంటుంది. నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. బీబీనగర్‌లో దిగిపోతున్న ప్రయాణికులు సికింద్రాబాద్ -ఖాజీపేట మార్గంలో భువ నగిరిలో ఇప్పటికే రైల్వే స్టేషన్ ఉంది. అ యితే భువనగిరి శివారు గుండా నడికుడి మార్గం ఉన్నా.. ఇక్కడ స్టేషన్ లేక రైళ్లు ఆగడం లేదు. దీంతో సికింద్రాబాద్ నుంచి వచ్చే వారు బీబీనగర్‌లో, నల్లగొండ నుంచి వచ్చే వారు నాగిరెడ్డిపల్లిలో దిగి 11కిలోమీటర్లు బస్‌లో ప్రయాణించి భువనగిరికి చేరుకోవాల్సి వస్తోంది. ఈ మార్గంలో రైల్వేస్టేషన్ నూతనంగా ఏర్పాటు చేస్తే భువనగిరి డివిజన్ ప్రాంత ప్రయాణికులతో పాటు జిల్లా ప్రయాణికులకు మేలు చేసినట్లవుతుంది. భువనగిరి-2 రైల్వేస్టేషన్ ఏర్పాటుకు వినతి పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన భువ నగిరి పట్టణానికి అనుసంధానంగా బీబీనగర్-నడికుడి మార్గంలో భువనగిరి-2 రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా కోరుతున్నారు. బీబీనగర్ పగిడిపల్లి, ముగ్దుంపల్లి తర్వాత భువనగిరి రెవెన్యూ గుండా వెళ్లే రైల్వేలైన్ అనాజీపురం మీదుగా నాగిరెడ్డిపల్లి వరకు ఉంది. ఈ మధ్యలో ఎక్కడా రైల్వేస్టేషన్ లేదు. దీంతో ఈ ప్రాంత ప్రజలు రైల్వే ప్రయాణం చేయాలంటే సికింద్రాబాద్‌కు వెళ్లాల్సి వస్తుంది. భువనగిరి ప్రయాణికులు సమారు 80కిలో మీటర్లు అప్ అండ్ డౌన్ అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. తిరుపతి, చెన్నై, తివేండ్రం, కోయంబత్తూర్ ఇలా పలు దక్షిణాది రాష్ట్రాలకు ఈ మార్గం గుండా రైళ్లు వెళ్తుంటాయి. నారాయణాద్రి, నర్సాపూర్ సూపర్ పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు, ప్యాసింజర్లు మిర్యాలగూడ డెమూ, డెల్టాప్యాసింజర్, రేపల్లే ప్యాసింజర్లు వెళ్తున్నాయి. ఇవి కాకుండా బీబీనగర్‌లో ఆగకుండా పల్నాడు, విశాఖ, ఫలక్‌నుమా, శబరి, జన్మభూమి, వారాకోసారి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వెళ్తాన్నాయి. భువనగిరి-2 రైల్వే స్టేషన్ ఉంటే ఈ రైళ్లలో ఎక్కువ భాగం ఆగే అవకాశం ఉంటుంది. -
ఏలూరు-జంక్షన్ మధ్య రాజధాని
సాక్షి ప్రతినిధి, ఏలూరు : సీమాంధ్ర రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు ఏలూరు-హనుమాన్ జంక్షన్ మధ్య ప్రాంతం అన్నివిధాలుగా అనువైనదని, ఈ ప్రతిపాదనకు అన్నివర్గాలు మద్దతు తెలపాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, వైఎస్సార్ సీపీ ఏలూరు లోక్‌సభా స్థానం అభ్యర్థి తోట చంద్రశేఖర్ కోరారు. శనివారం ఏలూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయూలనే విషయాన్ని నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించిందని తెలిపారు. రాజధాని ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను ఈ కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. ఏలూరు-హనుమాన్‌జంక్షన్ మధ్య రాజధాని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఆ కమిటీకి తాను పంపించానని తెలిపారు. ఈ ప్రాంతాన్ని రాజధాని చేయూలని కోరుతూ అన్నివర్గాలు ఈ కమిటీకి సలహాలు, సూచనలు పంపించాలని కోరారు. అభిప్రాయాలు పంపేందుకు మే 7వ తేదీ వరకూ సమయం ఉందని, యువకులు, విద్యావంతులు, మేధావులంతా స్పందించాలని కోరారు. తమ అభిప్రాయాలను హోం మంత్రిత్వ శాఖకు చెందిన జ్ఛ్ఛఛీఛ్చఛిజు.్ఛ్ఠఞఛిౌఝ్టః ఝజ్చి. జౌఠి.జీ వెబ్‌సైట్‌కు పంపాలని కోరారు. ఏలూరు-జంక్షన్ ప్రాంతం రాజధానికి ఏవిధంగా అనువుగా ఉందనే దానిపై తాను పలు సూచనలు చేసినట్లు తెలిపారు. భూమి లభ్యత ఎక్కువగా ఉందని, లక్ష ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు రెండు లక్షల ఎకరాల అటవీ భూమి ఉందని వివరించారు. నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను ఇందులోంచి తీసుకోవచ్చని తెలిపారు. కృష్ణా-గోదావరి నదుల మధ్య ఉన్న ప్రాంతం కావడంతో నీటి లభ్యత ఎక్కువగా ఉందని, తాగునీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. మచిలీపట్నం, కాకినాడ పోర్టుల మధ్య ప్రాంతం కావడంవల్ల పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు, అభివృద్ధికి, జల రవాణాకు అనుకూలమని స్పష్టం చేశారు. గన్నవరం, రాజమండ్రి ఎయిర్‌పోర్టుల మధ్య ఉండటం, ఐదో నంబర్ జాతీయ రహదారి ఉండటం, దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు అతి సమీపంలో ఉండటంతోపాటు బ్రాడ్‌గేజ్ రైలు మార్గం ఉండటం వల్ల ఈ ప్రాంతం రవాణా వ్యవస్థకు ఆయువు పట్టుగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో సహజవాయు నిక్షేపాలు అపారంగా ఉన్నాయని, పోలవరం ప్రాజెక్టు వల్ల అదనంగా విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కానుందని, దీనివల్ల విద్యుత్ సమస్య కూడా ఉండదని వివరించారు. అన్నిటికీ మించి భౌగోళికంగా ఏలూరు-జంక్షన్ ప్రాంతం సీమాంధ్రకు నడిబొడ్డుగా ఉందన్నారు. రాజధాని ఏర్పాైటైతే ఈ ప్రాంతంలో అనూహ్యమైన అభివృద్ధి జరుగుతుందని, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఇక్కడి వారంతా రాజధాని ప్రతిపాదనకు మద్దతు తెలిపి హోం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌కు అభిప్రాయాలు, సూచనలు పంపాలని కోరారు.