అప్పా– మన్నెగూడ రోడ్డు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎప్పుడెప్పుడా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్లే ఎన్‌హెచ్–63 (అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు.. 46 కి.మీ) నాలుగులేన్ల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.956 కోట్ల అంచనాలతో చేపట్టే ఈ పనుల కాంట్రాక్ట్‌ను సాగునీటి ప్రాజెక్టులు ఇతర నిర్మాణ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన మెఘా ఇంజినీరింగ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ చేజిక్కించుకుంది.
కేటాయించిన నిధుల్లో రూ.786 కోట్లు రహదారి నిర్మాణానికి ఖర్చు చేయనుంది. మిగిలిన మొత్తాన్ని భూ సేకరణకు వెచ్చించనుంది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గ్రామాలకు సర్వీసు రోడ్లు సైతం అందుబాటులోకి వస్తాయి. రోడ్డుకిరువైపులా గ్రామీణ ప్రజల సౌకర్యార్థం మొత్తం 18 ప్రాంతాల్లో అండర్ పాస్‌లు రానున్నాయి. వీటిలో మొయినాబాద్ అండర్ పాస్ (100 మీటర్లు) పెద్దది. (క్లిక్: హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌ల వైశాల్యం ఎంతో తెలుసా?)
ఈ రోడ్డు పనులు పూర్తయితే మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, వికారాబాద్ ప్రాంత ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. ప్రయాణం సులభతరం కావడంతో పాటు రోడ్డు ప్రమాదాలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇదిలాఉండగా చేవెళ్ల సమీపంలో రోడ్డుకు ఇరువైపులా భారీ మర్రి, ఇతర వృక్షాలు ఉన్నాయి. వీటి తొలగింపుపై ఇప్పటికే పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న క్రమంలో ఎలా సంరక్షిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. (క్లిక్: ‘సిటీ’జనులకు షాక్..! బస్ పాస్ చార్జీలు భారీగా పెంపు)
Comments
Please login to add a commentAdd a comment