సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం అప్పా పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన మెట్రో సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
న్యూయార్క్, పారిస్, లండన్‌లో కరెంట్ పోవచ్చు.. కానీ, హైదరాబాద్‌లో మాత్రం కరెంట్ పోయే అవకాశం లేదు. 1912లోనే నగరానికి కరెంట్ సదుపాయం ఉండేది. హైదరాబాద్ నిజమైన విశ్వనగరం. చరిత్రలో సుప్రసిద్ధమైన నగరం ఇది. అలాంటి నగరంలో ఒకప్పుడు నగరంలో తాగు నీటి సమస్య ఉండేది. ప్రత్యేక రాష్ట్రంలో నీటి సమస్య లేకుండా చూసుకున్నాం. అన్ని కష్టాలను అధిగమించి ముందుకు వెళ్తున్నాం. అందరికీ అనువైన వాతావరణ నగరంలో ఉంది. అన్నివర్గాలను అక్కన చేర్చుకుంది ఈ విశ్వనగరం.
దేశ రాజధాని ఢిల్లీ కంటే వైశాల్యంలో పెద్దది హైదరాబాద్. అలాంటి నగరంలో మెట్రో.. ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీతో ముందుకు పోతున్నాం. పరిశ్రమ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోంది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment