NH-63
-
అక్రమ నిర్మాణాలు కూల్చివేత
శ్రీరాంపూర్(మంచిర్యాల): శ్రీరాంపూర్ బస్టాండ్ ఏరియాలోని ఎన్‌హెచ్ 63 పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను సోమవారం మున్సిపల్ అధికారులు కూల్చివేయించారు. ఎన్‌హెచ్ అఽధికారుల ఆదేశాలతో నస్పూర్ మున్సిపల్ కమిషనర్ టీ.రమేశ్, సిబ్బందితో కలిసి జేసీబీలతో నిర్మాణాలను నేలమట్టం చేయించారు. మంచిర్యాల నుంచి శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు విస్తరణ పనులు ఆర్నెళ్లుగా నడుస్తుండటంతో ఇప్పటికే కొందరు రోడ్డుకు దగ్గరగా ఉన్న నిర్మాణాలను కూల్చివేసి వెనక్కి కట్టుకున్నారు. కొంతమంది నిర్ణీత దూరం జరగకుండానే కొత్త నిర్మాణాలు చేపట్టారు. వీటిని తొలగించాలని మూడు రోజుల నుంచి మున్సిపల్, ఎన్‌హెచ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో పోలీసు బందోబస్తు నడుమ జేసీబీలతో కూల్చివేశారు. రోడ్డు మధ్యభాగం నుంచి 66 ఫీట్ల వరకు రోడ్డు మార్కింగ్ చేసి ఆ పరిధిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు. వర్తకుల అభ్యంతరం.. గతంలో రోడ్డు మధ్యలో నుంచి 60 ఫీట్లు మార్కింగ్ చేశారని, ఇప్పుడు 66 ఫీట్లు జరగాలని చెప్పి కొత్తగా కట్టుకున్నవి కూడా కూల్చివేస్తున్నారని కొందరు వర్తకులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు నిర్వహించారు. -
అప్పా–మన్నెగూడ రహదారి విస్తరణకు మోక్షం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎప్పుడెప్పుడా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్లే ఎన్‌హెచ్–63 (అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు.. 46 కి.మీ) నాలుగులేన్ల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.956 కోట్ల అంచనాలతో చేపట్టే ఈ పనుల కాంట్రాక్ట్‌ను సాగునీటి ప్రాజెక్టులు ఇతర నిర్మాణ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన మెఘా ఇంజినీరింగ్ కన్స్ట్రక్షన్ సంస్థ చేజిక్కించుకుంది. కేటాయించిన నిధుల్లో రూ.786 కోట్లు రహదారి నిర్మాణానికి ఖర్చు చేయనుంది. మిగిలిన మొత్తాన్ని భూ సేకరణకు వెచ్చించనుంది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గ్రామాలకు సర్వీసు రోడ్లు సైతం అందుబాటులోకి వస్తాయి. రోడ్డుకిరువైపులా గ్రామీణ ప్రజల సౌకర్యార్థం మొత్తం 18 ప్రాంతాల్లో అండర్ పాస్‌లు రానున్నాయి. వీటిలో మొయినాబాద్ అండర్ పాస్ (100 మీటర్లు) పెద్దది. (క్లిక్: హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌ల వైశాల్యం ఎంతో తెలుసా?) ఈ రోడ్డు పనులు పూర్తయితే మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, వికారాబాద్ ప్రాంత ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. ప్రయాణం సులభతరం కావడంతో పాటు రోడ్డు ప్రమాదాలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇదిలాఉండగా చేవెళ్ల సమీపంలో రోడ్డుకు ఇరువైపులా భారీ మర్రి, ఇతర వృక్షాలు ఉన్నాయి. వీటి తొలగింపుపై ఇప్పటికే పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న క్రమంలో ఎలా సంరక్షిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. (క్లిక్: ‘సిటీ’జనులకు షాక్..! బస్ పాస్ చార్జీలు భారీగా పెంపు) -
195 కి.మీ. ఎన్‌హెచ్‌కు నిధులు
సాక్షి, న్యూఢిల్లీ: 2020–21 సంవత్సరానికి రాష్ట్రంలో రూ.1,005.38 కోట్ల వ్యయంతో 195.6 కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేసిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. నిజాంపేట–బీదర్ ఎన్‌హెచ్ 161బీపై అదనంగా 2 లేన్ అప్‌గ్రెడేషన్ కోసం అవసరమైన భూ సేకరణకు రూ.27.79 కోట్లు మంజూరు చేసినట్లు వివరించా రు. నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారి కింద ఎన్‌హెచ్–565లోని నకిరేకల్–నాగార్జునసాగర్ మధ్య ప్రాంతంలో పునరావాసం, అప్‌గ్రేడ్ చేసేందుకు ఇంకా మిగిలి ఉన్న పనులను మంజూరు చేసినట్లు మంగళవారం ట్విట్టర్ వేదికగా గడ్కరీ ప్రకటించారు. అంతేగాక హైదరాబాద్–బెంగళూర్ జాతీయ రహదారి–44లో రోడ్డు రవాణా భద్రతను మెరుగుపరిచేందుకు అవసరమైన సర్వీసు రోడ్లు, వాహన అండర్ పాస్‌ల నిర్మాణం కోసం రూ.21.16 కోట్లు మంజూరు చేశామ న్నారు. ఎన్‌హెచ్–163లోని హైదరాబాద్–భూపాలపట్నం మధ్య రహదారికి రూ.48.32 కోట్లు మంజూరు అయ్యిందన్నారు. ఇదే జాతీయ రహదారిలోని 2 లేన్ల రహదారులను 4 లేన్లులుగా అభివృద్ధి చేసేందుకు రూ.317.19 కోట్లు కేటాయించామన్నారు. ఎన్‌హెచ్–63పై ఉన్న ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ మధ్య రహదారిని 6 లేన్లకు విస్తరించడంతో పాటు పునరావాసం కల్పించడం, సర్వీస్ రోడ్ల నిర్మాణం, డ్రైన్లు, రహదారి భద్రతా సదుపాయాలు తదితర అంశాల అభివృద్ధికి రూ.545.11 కోట్లు మంజూరు అయ్యాయని గడ్కరీ వెల్లడించారు. ఎన్‌హెచ్ –167లోని జడ్చర్ల్ల–కల్వకుర్తి మధ్య జడ్చర్ల్ల పట్టణంలో 4 లేన్ల ఆర్ఓబీ నిర్మాణం/పునర్నిర్మాణం కోసం రూ.45.81 కోట్లు కేటాయించామని కేంద్ర మంత్రి తెలిపారు. చదవండి: 48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ -
కదలని రింగ్ రోడ్డు!
కార్యరూపం దాల్చని ఎంపీ ప్రతిపాదనలు తీరని ట్రాఫిక్ సమస్య జగిత్యాల: జిల్లా కేంద్రంలో రింగ్‌రోడ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అధికారులు ప్రతిపాదనలు రూపొందించాలని ఎంపీ కల్వకుంట్ల కవిత 2016 డిసెంబర్ 28న కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆదేశించారు. అయినా అధికారుల నుంచి స్పందన కరువైంది. ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదనలు రూపొందించడంలేదు. జగిత్యాలలో రింగ్‌రోడ్డు పూర్తయితే జిల్లా కేంద్రం రూపురేఖలు మారుతాయి. చిన్నరోడ్లతో ఇప్పటికే జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. 1983లో అమలులోని మాస్టర్‌ప్లాన్‌లోని రోడ్లే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారి అయిన యావర్‌రోడ్‌లో ఎన్‌హెచ్–63 విస్తరించి ఉంది. కానీ.. ఈ రోడ్లు కనీసం 100 ఫీట్లు కూడా లేవు. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో పాటు ప్రధాన ప్రాంతమైన టవర్‌సర్కిల్, గంజ్‌రోడ్డు, న్యూబస్టాండ్, ధర్మపురి రోడ్లంతా చిన్నవిగా ఉన్నాయి. వెడల్పు కార్యక్రమానికి గతంలో ప్రతి అధికారి ప్రతిపాదనలు తయారుచేశారే తప్ప మోక్షం దాల్చలేదు. ట్రాఫిక్‌ను తగ్గించాలనే ఉద్దేశంతో 10 సంవత్సరాల క్రితం జగిత్యాల పక్క నుంచి బైపాస్‌రోడ్డు సైతం నిర్మించారు. ప్రస్తుతం ఈ బైపాస్ సిటీలోనే కలిసిపోయి ట్రాఫిక్ సమస్యగా ఏర్పడింది. ప్రస్తుతం బైపాస్రోడ్లోసైతం జనాలు ఎక్కువగా ఉండటంతో పెద్దపెద్ద వాహనాలు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు పార్కింగ్ సమస్యతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రింగ్‌రోడ్డుతో కళ జగిత్యాల జిల్లా కేంద్రంలో రింగ్‌రోడ్ నిర్మిస్తే జగిత్యాల రూపురేఖలే మారనున్నాయి. ఇప్పటి కే ధరూర్ నుంచి గొల్లపల్లి రోడ్లోఉన్న డం పింగ్రోడ్ వరకు ఒక బైపాస్‌రోడ్డు నిర్మించారు. అలాగే ధరూర్ నుంచి కాకతీయ కెనాల్ పక్కనుంచి చల్గల్ వరకు సైతం బైపాస్‌రోడ్ నిర్మిం చారు.వీటితో పాటు మరో రింగ్‌రోడ్‌ను ఏర్పా టు చేస్తే ప్రజలకు కూడా ఎంతో వినియోగకరంగా ఉంటుంది. ట్రాఫిక్ నియంత్రణలో ఉం టుంది. జగిత్యాల జిల్లా జనాభా ప్రతిపాదికనఅతి పెద్ద జిల్లాగా విస్తరించింది. చుట్టు జిల్లా కేంద్రంలోని 18 మండలాలతోపాటు మూడు మున్సిపాలిటీలతో చుట్టూ జిల్లాలైనా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ నుంచి సైతం జగిత్యాలకు వస్తుంటారు. ప్రస్తుతం రింగ్‌రోడ్డు అయితే ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.