
సాక్షి, న్యూఢిల్లీ: 2020–21 సంవత్సరానికి రాష్ట్రంలో రూ.1,005.38 కోట్ల వ్యయంతో 195.6 కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేసిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. నిజాంపేట–బీదర్ ఎన్‌హెచ్ 161బీపై అదనంగా 2 లేన్ అప్‌గ్రెడేషన్ కోసం అవసరమైన భూ సేకరణకు రూ.27.79 కోట్లు మంజూరు చేసినట్లు వివరించా రు. నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారి కింద ఎన్‌హెచ్–565లోని నకిరేకల్–నాగార్జునసాగర్ మధ్య ప్రాంతంలో పునరావాసం, అప్‌గ్రేడ్ చేసేందుకు ఇంకా మిగిలి ఉన్న పనులను మంజూరు చేసినట్లు మంగళవారం ట్విట్టర్ వేదికగా గడ్కరీ ప్రకటించారు. అంతేగాక హైదరాబాద్–బెంగళూర్ జాతీయ రహదారి–44లో రోడ్డు రవాణా భద్రతను మెరుగుపరిచేందుకు అవసరమైన సర్వీసు రోడ్లు, వాహన అండర్ పాస్‌ల నిర్మాణం కోసం రూ.21.16 కోట్లు మంజూరు చేశామ న్నారు.
ఎన్‌హెచ్–163లోని హైదరాబాద్–భూపాలపట్నం మధ్య రహదారికి రూ.48.32 కోట్లు మంజూరు అయ్యిందన్నారు. ఇదే జాతీయ రహదారిలోని 2 లేన్ల రహదారులను 4 లేన్లులుగా అభివృద్ధి చేసేందుకు రూ.317.19 కోట్లు కేటాయించామన్నారు. ఎన్‌హెచ్–63పై ఉన్న ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ మధ్య రహదారిని 6 లేన్లకు విస్తరించడంతో పాటు పునరావాసం కల్పించడం, సర్వీస్ రోడ్ల నిర్మాణం, డ్రైన్లు, రహదారి భద్రతా సదుపాయాలు తదితర అంశాల అభివృద్ధికి రూ.545.11 కోట్లు మంజూరు అయ్యాయని గడ్కరీ వెల్లడించారు. ఎన్‌హెచ్ –167లోని జడ్చర్ల్ల–కల్వకుర్తి మధ్య జడ్చర్ల్ల పట్టణంలో 4 లేన్ల ఆర్‌ఓబీ నిర్మాణం/పునర్నిర్మాణం కోసం రూ.45.81 కోట్లు కేటాయించామని కేంద్ర మంత్రి తెలిపారు.
చదవండి: 48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ
Comments
Please login to add a commentAdd a comment