national high way
-
నిజమే..! ఇది ముక్కుసూటి రహదారే..!! సుమారు..
ఎంతటి రాచమార్గానికైనా మలుపులు ఉంటాయి. అక్కడక్కడా వంకరలుంటాయి. ఎలాంటి వంకరలు లేకుండా ఏకధాటిగా ముక్కుసూటిగా సాగిపోయే రహదారి ఇది. ప్రపంచంలోని అతి పొడవాటి ముక్కుసూటి రహదారి ఇదే!.ఈ రహదారి సౌదీ అరేబియాలో ఉంది. ఏకంగా 240 కిలోమీటర్ల దూరం వరకు ఈ రహదారి ముక్కుసూటిగా సరళరేఖలా తిన్నగా ఉంటుంది. సౌదీ అరేబియా నైరుతి ప్రాంతంలోని అల్ దర్బ్ పట్టణం నుంచి తూర్పు ప్రాంతంలోని అల్ బతా పట్టణాన్ని కలుపుతూ ఉన్న ఈ 10వ నంబరు రహదారి మొత్తం పొడవు 1474 కిలోమీటర్లు. ఇది రబ్ అల్ ఖలీ ఎడారి మీదుగా సాగుతుంది.ఎడారి మీదుగా సాగే మార్గంలోనే దీనిని ఎలాంటి మలుపులు, వంకరలు లేకుండా 240 కిలోమీటర్ల పొడవున కేవలం సరళరేఖ మార్గంలో మాత్రమే కాదు, ఎలాంటి ఎగుడు దిగుడులు ఎత్తు పల్లాలు కూడా లేకుండా నిర్మించడం విశేషం.ఇవి చదవండి: పోయిన ప్రాణం ఎలా తిరిగి వచ్చింది? వింటే షాకే! -
టోల్ ఫీజుకు డబ్బులు లేక.. రాంగ్రూట్లో ప్రయాణించిన ఆర్టీసీ బస్సు
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): దుబారి టోల్ ఫీజు చెల్లించలేని కేఎస్ ఆర్టీసీ బస్సు వెనక్కు వెళ్లి పోయిన సంఘటన బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేపై చోటుచేసుకుంది. బుధవారం బెంగళూరు నుండి మైసూరు వెళ్తున్న బస్సుకు ఫాస్ట్‌ట్యాగ్ లేకపోవడంతో రామనగర తాలూకా శేషగిరి టోల్ వద్ద డబుల్ చార్జ్ చెల్లించాలని టోల్ సిబ్బంది చెప్పారు. దీంతో డ్రైవర్ అంత డబ్బులు తన వద్ద లేవని బస్సు వెనక్కు తీసుకుని కొన్ని కిలోమీటర్ల దూరం రాంగ్ రూట్లోనే వచ్చాడు. అనంతరం సర్వీస్ రోడ్ ద్వారా ప్రయాణించాడు. ఈ దృశ్యాలను కొందరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసారు. వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసుకున్నారు. చదవండి మణిపూర్ ఘటన:. ప్రధాన నిందితుడి ఇంటి తగలబెట్టి.. కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు -
అల్జీరియాలో 34 మంది మృతి
అల్జీర్స్: దక్షిణ అల్జీరియాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై బస్సు, వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 34 మంది మరణించారు. మరో 12 మంది గాయాలపాలయ్యారు. పరస్పరం ఢీకొన్న వెంటనే రెండు వాహనాల్లోనూ మంటలు చెలరేగాయని, అందుకే భారీగా ప్రాణనష్టం జరిగిందని అధికారులు చెప్పారు. సహారా ఎడారి సమీపంలో తామన్రసెట్ ప్రావిన్స్‌లో తెల్లవారుజామున 4 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. -
రహదారుల అభివృద్ధిలో ముందడుగు
రహదారులకు మహర్దశ పట్టింది.. జాతీయ రహదారుల నిర్మాణంతో కొత్త జిల్లాల రూపురేఖలు మారనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితంగా రాష్ట్రంలో హైవేల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా.. పశ్చిమగోదావరి జిల్లాలో రెండు ప్రాజెక్టులు మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికి కేంద్రం రూ.1,490 కోట్లు విడుదల చేసింది. ఎన్‌హెచ్–216, ఎన్‌హెచ్–165 విస్తరణ పనులు జరుగనున్నాయి. నరసాపురం: కోనసీమ, కోస్తా ప్రాంతాలను అనుసంధానం చేస్తూ జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా నరసాపురంలో వశిష్ట గోదావరిపై వంతెన నిర్మించాలని కూడా నిర్ణయించారు. బ్రిటిష్ కాలం నుంచి ఉన్న వశిష్ట వారధి డిమాండ్ ఇన్నాళ్లకు తీరనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వ యంగా రంగంలోకి దిగి జాతీయ రహదారుల కో సం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జరిపిన సంప్ర దింపులు సత్ఫలితాలను ఇచ్చాయి. దీనిలో భాగంగా భీమవరం కేంద్రంగా ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లా కు రూ.1,490 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కొత్త జిల్లాలో నాలుగు లైన్ల రహదారు లు అందుబాటులోకి రా నున్నాయి. దశాబ్దాల కల సాకారం కాకినాడ జిల్లాలోని కత్తిపూడి నుంచి ఒంగోలుకు వెళ్లే 216 జాతీయరహదారి అభివృద్ధి పనుల్లో భాగంగా కోనసీమ, కోస్తా ప్రాంతాలను కలుపుతూ బైపాస్ ని ర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ రూ.490 కోట్ల నిధులు కేటాయించింది. కోనసీమ జిల్లాలోని దిండి నుంచి పశ్చిమగోదావరి జిల్లా నర సాపురం మండలంలోని సీతారాంపురం వరకు బై పాస్‌ను నిర్మించనున్నారు. దీంతో జిల్లావాసులు ఎదురుచూస్తున్న నరసాపురంలో వశిష్ట గోదావరిపై వారధి నిర్మాణం కల సాకారం కానుంది. వంతెన నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లతో స్థల సేకరణ పూర్తిచేసింది. ఫలించిన ప్రయత్నం : ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు జిల్లాలో హైవేల నిర్మాణంపై సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. ఎన్‌హెచ్ 216కు బైపాస్, ఎన్‌హెచ్ 165 నాలుగు లైన్ల విస్తరణ విషయాలపై సీఎం ద్వారా కేంద్ర మంత్రికి లేఖ ఇప్పించారు. రూపురేఖలు మారనున్నాయి సీఎం వైఎస్ జగన్ కృషితోనే నిధులు మంజూర య్యాయి. కొత్త జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.1,490 కోట్లను కేంద్రం కేటాయించడం రికార్డు. ఇంత పెద్ద స్థాయిలో నిధుల కేటాయింపు ఎన్నడూ లేదు. వశిష్ట వంతెన నిర్మాణం కూడా పూర్తవుతుంది. రానున్న ఐదేళ్లలో జిల్లా రూపురేఖలు మారనున్నాయి. నరసాపురం, భీమవరం నుంచి విజయవాడకు ప్రయాణ సౌలభ్యం మెరుగుపడుతుంది. – ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్‌విప్ పనులు ఇలా.. ఎన్‌హెచ్ 216 బైపాస్ రూ. 490 కోట్లు కోనసీమ జిల్లా దిండి నుంచి మలికిపురం, టేకిశెట్టిపాలెం, సఖినేటిపల్లి మీదుగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలోని రాజుల్లంక నుంచి సీతారాంపురం వరకు ఎన్‌హెచ్ 165 1,000 కోట్లు పాలకొల్లు మండలం దిగమర్రు నుంచి ఆకివీడు వరకు 40 కిలోమీటర్ల మేర నాలుగు లైన్లుగా జాతీయ రహదారి విస్తరణ నాలుగు లైన్లుగా విస్తరణ జాతీయరహదారి 165 పాలకొల్లు మండలం దిగమర్రు నుంచి కృష్ణా జిల్లా పామర్రు వరకు 107 కిలోమీటర్ల మేర ఉంది. దిగమర్రు నుంచి ఆకివీడు వరకు నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడానికి రూ.1,000 కోట్లు మంజూరు చేశారు. ఆకివీడు నుంచి పామర్రు వరకు నాలుగు లైన్ల పనులు ఏడాది క్రితమే ప్రారంభమయ్యాయి. ఎన్‌హెచ్–165ను దిగమర్రు జంక్షన్ నుంచి ఎన్‌హెచ్–216కి అనుసంధానం చేస్తున్నారు. ఈ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. తాజాగా విధులైన నిధులతో దిగమర్రు నుంచి ఆకివీడు వరకు పనులు మొదలు కానున్నాయి. ఈ నిర్మాణంతో భీమవరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. -
అదొక రాకాసి రహదారి
-
ఆ జాతీయ రహదారి మృత్యు దారి!.. ఐదేళ్లలో 1066 ప్రమాదాలు.. కారణాలేంటి?
జైనథ్ మండలంలోని గిమ్మ ఎక్స్‌రోడ్ సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై ఈనెల 16న లారీ ఢీకొని ఆంకోలి గ్రామానికి చెందిన వడరపు రాజారెడ్డి(59) మృతిచెందాడు. మరమ్మతుల కారణంగా తాత్కాలికంగా వన్‌వే ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్తున్న లారీని డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతి వేగంగా నడిపి బైక్‌ను ఢీకొన్నాడు. జైనథ్ మండలం భోరజ్ వద్ద ఈనెల 17న ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన ఆకిటి వెంకట్‌రెడ్డి ఏకైక కూతురు చైత్ర(13)కు జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బైక్‌పై బయలుదేరాడు. భోరజ్ ఎక్స్ రోడ్ సమీపంలో వేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొంది. చైత్ర కుడివైపుకు పడిపోవడంతో లారీ ఆమె మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆదిలాబాద్ పట్టణం సాయినగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఏనుగు పద్మ(56) శుక్రవారం స్కూటీపై బేల మండలం ఏటీ పాఠశాలకు బయల్దేరారు. జైనథ్ మండలం భోరజ్ చెక్‌పోస్ట్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఆమె కిందపడిపోగా, లారీ పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పాఠశాలకు బయల్దేరిన 15 నిమిషాల్లో మృత్యువు కబళించింది. సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో సుమారు వంద కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న 44వ నంబర్ జాతీయ రహదారి నెత్తురోడుతోంది. ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఈ రోడ్డుపై ప్రయాణికుల భద్రత గాలిలో దీపంలా మారింది. ప్రమాదాల నివారణకు కృషి చేయాల్సిన రోడ్ సేఫ్టీ కమిటీలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2016 నుంచి 2020 వరకు ఎన్‌హెచ్ 44పై 1,066 ప్రమాదాలు జరుగడం కమిటీల పనితీరు ఎలా ఉందో అర్థమవుతోంది. ఈ కమిటీలో కీలకపాత్ర పోషించే రవాణా శాఖ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన బారికేడ్లతో రోడ్డు ఇరుకుగా మారి ప్రమాదాలకు కారణమవుతోంది. శుక్రవారం ఉదయం ఉపాధ్యాయురాలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడానికి బారికేడ్లే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరుస ప్రమాదాలతో సంఘటన స్థలంలో నిరసన చేపట్టిన కొంతమంది రవాణ శాఖపై హత్యానేరం నమోదు చేయాలని డిమాండ్ చేయడం గమనార్హం. చదవండి: మేడారం వెళ్లే దారిలో ఘోర రోడ్డు ప్రమాదం. నలుగురు మృత్యువాత రవాణాశాఖే ఉల్లంఘన..! సమాచార హక్కు చట్టం ద్వారా జిల్లాకేంద్రం శాంతినగర్‌కు చెందిన టీఆర్ఎస్ నేత బాలూరి గోవర్ధన్‌రెడ్డి వివిధ అంశాలపై 2020లో వివిధ వివరాలను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్‌లోని ప్రాంతీయ అధికారిని కోరగా, అదే సంవత్సరం జూన్ 16న మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా హైదరాబాద్‌లోని బోయిన్పల్లి వరకు జాతీయ రహదారిపై హైవే అథారిటీ ద్వారా ఎలాంటి చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం జరగలేదని సమాధానం ఇచ్చారు. అలాంటి పరిస్థితుల్లో జైనథ్ మండలం భోరజ్ చెక్‌పోస్టు వద్ద బారికేడ్లు రోడ్డుకు అడ్డంగా పెట్టడం నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుంది. భద్రత కమిటీలో కీలకంగా వ్యవహరించాల్సిన రవాణాశాఖ పరంగానే లోపాలు కనిపిస్తుండటం విస్మయం కలిగిస్తోంది. నిధులు మంజూరైనా నిర్లక్ష్యం.. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ బోయిన్పల్లి వరకు జాతీయ రహదారి 44కు సంబంధించి రహదారి భద్రతపై కేంద్ర మంత్రిత్వ శాఖ గతంలో ఆడిట్ నిర్వహించారు. అనేక బ్లాక్ స్పాట్స్‌లను గుర్తించారు. ప్రమాదాల నివారణ కోసం రహదారిపై చేపట్టాల్సిన పనులకు సంబంధించి పెన్‌గంగ నుంచి ఇచ్చోడ దగ్గర ఇస్లాంనగర్ వరకు వివిధ రోడ్డ భద్రత పనుల కోసం రూ.40.28 కోట్లు మంజూరు చేశారు. అందులో కొన్ని పనులు పూర్తి చేశారు. మిగతా పనులు నిర్మాణంలో ఉన్నాయి. భోరజ్ వద్ద స్లిప్ రోడ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతోనే ద్విచక్రవాహనదారులు జాతీయ రహదారిమీదుగానే ప్రయాణిస్తున్నారు. స్లిప్ రోడ్డు నిర్మాణమై ఉంటే గురువారం చైత్ర(13), శుక్రవారం ఉపాధ్యాయురాలు పద్మ(56) దానిమీదుగా ప్రయాణించేవారు. వారి ప్రాణాలు పోయేవికావు. ఇక్కడ సమష్టిగా రోడ్డు భద్రతావైఫల్యం కనిపిస్తోంది. స్పీడ్ గన్లు ఎక్కడ? జిల్లాలో పెన్‌గంగ వద్ద నుంచి జాతీయ రహదారి 44 మొదలవుతుంది. నిర్మల్ జిల్లా వరకు వంద కిలో మీటర్ల పరిధిలో జిల్లాలో విస్తరించి ఉంది. ఈ రహదారిపై మావల నుంచి నిర్మల్ వైపు వెళ్లే దారిలో పోలీసు శాఖ పరంగా పలుచోట్ల స్పీడ్ గన్లు ఏర్పాటు చేసి అతివేగంగా వెళ్లే వాహనాలకు జరిమానా విధిస్తున్నారు. పెన్‌గంగ నుంచి మావల వరకు స్పీడ్ గన్లు కనిపించడం లేదు. దీంతో వాహనదారులు జాతీయ రహదారిపై వేగంగా దూసుకుపోతున్నారు. చదవండి: పెట్టీ కేసులో సైఫాబాద్ పోలీసుల దురుసు ప్రవర్తన.. లాఠీలతో మహిళలపై దాడి? వరుస ప్రమాదాలతో ఆందోళన.. మూడు రోజులుగా ఈ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. పెన్‌గంగ నుంచి ఇస్లాంనగర్ వరకు జాతీయ రహదారి రెన్యూవల్ పనులు జరుగుతున్నాయి. హైవే నుంచి స్లిప్ రోడ్లు, సర్వీస్ రోడ్లు సరిగ్గా లేకపోవడంతో అనేకంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పలువురు మృత్యువాత పడ్డ తర్వాత భద్రత కమిటీ మేల్కొంది. శుక్రవారం సాయంత్రం ఈ కమిటీ సభ్యులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇకనైనా వేగిరంగా పనులు చేపట్టి హైవేపై ప్రాణాలు పోకుండా చర్యలు చేపడతారో.. లేదో వేచిచూడాలి. కాగా పనుల విషయంలో వివరాలు అడిగేందుకు ఎన్హెచ్ఏఐ పీడీ శ్రీనివాస్‌ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
నేషనల్ హైవేపై దృష్టి సారించిన ఎమ్మెల్యే రోజా
-
ఏడుగురిని బలి తీసుకున్న మలుపు.. ఆ ఇంట్లో ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దం
6 People Died in a Road Accident Near Chandragiri Zone: అమ్మా.. నాన్నా.. తాతా.. నానమ్మా.. అన్న పలకరింపులతో వారం కిందటి వరకు ఈ ఇల్లు సందడిగా ఉండేది. ఇప్పుడు ఆ ఇంటి పరిసరాల్లో శ్మశాన నిశ్శబ్దం అలముకుంది. ఆరుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఈ ఇంటిలో ఒక్క చిన్నారిని మాత్రమే మృత్యుదేవత విడిచిపెట్టింది. మిగిలిన వారందరినీ మింగేసి ఆ పసిదానికి కన్నీటి జ్ఞాపకాలను మిగిల్చింది. రాజాం/తిరుపతి రూరల్/ తిరుపతి తుడా : ఏ వీధికి వెళ్లినా వారి మాటలే. ఏ అరుగున విన్నా వారి ముచ్చట్లే. ఆదివారం ఉదయం చంద్రగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలోని మేడమర్తిని ఏడిపించింది. ఈ ఊరిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం పాలవ్వడంతో ఊరుఊరంతా ఆదివారం గుండెలవిసేలా రోదించింది. గ్రామానికి చెందిన కంచరాపు శ్రీరామమూర్తి(65)తో పాటు అతని భార్య సత్యవతి(55), కుమారుడు సురేష్‌కుమార్(35), కోడలు మీనా (28), మనవరాలు జోష్మిక నందిత(ఏడునెలలు)తో పాటు పూసపాటిరేగకు చెందిన ఆయన వియ్యంకులు పైడి గోవిందరావు(58), వియ్యంకురాలు పైడి హైమావతి(53) చంద్రగిరి వద్ద జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందారు. పెద్ద మనవరాలు జిషిత మాత్రమే ప్రాణాలు దక్కించుకుంది. తిరుపతి నుంచి కాణిపాకం వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే మృతుల స్వగ్రామం మేడమర్తిలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీరామమూర్తి ఇంటిల్లిపాదీ తీర్థయాత్రకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో ఆముదాలవలసలో ఉంటున్న ఆయన సోదరుడు రంగారావు భోరున విలపిస్తున్నారు. తిరుపతి సమీపంలో ఉన్న తమ బంధువులను సంఘటనా స్థలానికి పంపించి సమాచారం తెలుసుకుంటున్నారు. ప్రమాదంలో మృతి చెందిన మీనా సోదరి శ్రీలత కన్నీరుమున్నీరవుతున్నారు. చిత్రంలో నవ్వుతూ కనిపిస్తున్న వారు సురేష్, మీనా, జిషిత. సురేష్‌కు ఐదేళ్ల కిందట వివాహం కాగా.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడేళ్ల కిందటే మెరైన్ ఇంజినీర్‌గా కొలువు సాధించడంతో ఆ కుటుంబం ఆర్థికంగా స్థిరపడుతోంది. ఆ ఆనందాన్ని ఆవిరి చేస్తూ సురేష్, మీనాను మృత్యువు తీసుకెళ్లిపోయింది. రెండేళ్ల చిన్నారి ఒంటరిగా మిగిలిపోయింది. మృత్యుమలుపు..! పూతలపట్టు– నాయుడుపేట జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు సంభిస్తున్నాయి. చిత్తూరు– తిరుపతి మార్గంలో కొత్తగా ప్రారంభించిన సువిశాలమైన హైవేపై కొన్ని మలుపులు మృత్యు ఘంటికలను మోగిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రగిరి సమీపంలో అగరాల వద్ద మలుపునకు ఎన్నో ప్రాణాలు బలవుతున్నాయి. ఆదివారం ఉదయం కారు ప్రమాదం కూడా ఇక్కడే సంభవించింది. శ్రీకాకుళం జిల్లా మేడమర్తి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ఏడుగురిని ఈ మలుపే బలితీసుకుంది. గతంలో ఈ ప్రాంతంలోనే జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తొమ్మిదిమంది కర్ణాటక వాసులు దుర్మరణం పాలవడం స్థానికులు మర్చిపోకముందే మరో ఘటన సంభవించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కనీసం సూచిక బోర్డులైనా ఏర్పాటు చేయించాలని కోరుతున్నారు. నమ్మలేకపోతున్నాం రెండురోజుల కిందటే శ్రీరామమూర్తి కుటుంబంతో తిరుపతి వెళ్లా డు. సొంతకారులో వెళుతున్నానని, త్వరగా వచ్చేస్తాంలే అని చెప్పాడు. ఆదివారం ఉద యం కూడా ఫోన్లో మాట్లాడాం. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. – కేవీ రమణ, మేడమర్తి మాతోనే చదువుకున్నాడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సురేష్‌కుమార్ ఐదో తరగతి వరకూ మాతోనే గ్రామంలో చదివాడు. ఉన్నత విద్య, ఇంటర్, బీటెక్ కోర్సులను శ్రీకాకుళం, విశాఖపట్నంలో పూర్తి చేశాడు. అందరితో సరదాగా ఉండేవాడు. చిన్నకూతురు మొక్కు కోసం తిరుపతికి వెళుతున్నామన్నాడు. ఇంతలో ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. – కె.రాము, మేడమర్తి -
రెండు బైపాస్‌లు.. 14 అండర్‌పాస్‌లు..
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ వే తరహాలో మరో జాతీయ రహదారి రూపుదిద్దుకోనుంది. ఇది నాలుగు వరుసల జాతీయ రహదారే అయినప్పటికీ, మధ్యలో రోడ్డు మీదుగా ఇతర చిన్న రహదారుల నుంచి వచ్చే వాహనాలు వెళ్లకుండా ఎక్కడికక్కడ అండర్ పాస్‌లను నిర్మిస్తూ ఎక్స్‌ప్రెస్ వే తరహాలో నిర్మించనున్నారు. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారికి మార్గం సుగమమైంది. మరో రెండు నెలల్లో టెండర్ల కసరత్తు పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నారు. ఏడాదిన్నర నుంచి రెండేళ్ల కాలంలో ఇది అందుబాటులోకి రానుంది. నగర శివారులోని అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ దారిలోని మన్నెగూడ కూడలి వరకు ఈ నాలుగు వరుసల విశాలమైన రోడ్డు అందుబాటులోకి వస్తుంది. మన్నెగూడ నుంచి పరిగి మీదుగా కర్ణాటకలోని బీజాపూర్ వరకు కొనసాగుతుంది. మన్నెగూడ కూడలి వరకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నాలుగు వరుసలుగా దీన్ని నిర్మించనుండగా, అక్కడి నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రోడ్డును వెడల్పు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని జాతీయ రహదారుల విభాగం పర్యవేక్షిస్తోంది. ఈ విభాగం ఇప్పటికే తన పరిధిలోని రోడ్డును 30 మీటర్లకు విస్తరించింది. ఇప్పుడు ఎన్హెచ్ఏఐ తన అ«దీనంలోని రోడ్డును 4 వరుసలుగా విస్తరించేందుకు సమాయత్తమైంది. 60 మీటర్ల వెడల్పుతో.. గతంలో రాష్ట్ర రహదారిగా ఉన్న బీజాపూర్ రోడ్డును 163వ నంబర్ జాతీయ రహదారిగా కేంద్రం ప్రక టించింది. ఇప్పుడు దాన్ని భారత్‌మాల పరియోజన పథకంలో చేర్చి ఇటీవలే ఎన్హెచ్ఏఐకి అప్పగించింది. అప్పా కూడలి వరకు విశాలంగానే ఉన్న రోడ్డు ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో 25 మీటర్లు, కొన్ని చోట్ల 30 మీటర్లుగా ఉంది. ఇప్పుడు దాన్ని 60 మీటర్లకు విస్తరించనున్నారు. ఇందులో ప్రధాన రోడ్డు 45 మీటర్లుగా ఉండనుంది. మధ్యలో నాలుగున్నర మీటర్ల సెంట్రల్ మీడియన్ ఉంటుంది. ప్ర ధాన క్యారేజ్ వే 30 మీటర్లుగా ఉంటుంది. దీనికి చివరలో వాలు, ఆ తర్వాత డ్రెయిన్ ఇలా మొత్తం 45 మీటర్ల వెడల్పుతో రోడ్డు ఉంటుంది. ఇక రెండు వైపులా విద్యుత్తు స్తంభాలు, చెట్లు, ఇతర అవసరాల కోసం 15 మీటర్ల (రెండువైపులా కలిపి) స్థలం ఉంటుంది. పెరిగిన ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని.. తాండూరు, వికారాబాద్, పరిగి, బీదర్ సహా కర్ణాటకలోని పలు ప్రాంతాలకు ఈ రోడ్డునే వినియోగిస్తుండటంతో కొంతకాలంగా ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగింది. గతంలో శివారు ప్రాంతంగా ఉండి అంతగా రద్దీలేని మొయినాబాద్ ప్రాంతం ఇప్పుడు కిక్కిరిసిపోతోంది. మొయినాబాద్ నుంచి వికారాబాద్ వరకు ఫామ్‌హౌస్‌లు బాగా పెరిగాయి. వాటికి నిత్యం వచి్చపోయే వారితో రద్దీ మరింత తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో దీన్ని విస్తరించాలన్న డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. కాగా, అప్పా కూడలి నుంచి 46.405 కి.మీ. దూరం వరకు, అంటే పరిగి కూడలిలో ఉండే మన్నెగూడ వరకు ఎన్హెచ్ఏఐ ఇప్పుడు పనులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. మొత్తం 221.90 హెక్టార్ల భూమిని కేంద్ర భూసేకరణ చట్టం కింద సమీకరిస్తున్నారు. చిన్న రోడ్లతో ఇబ్బంది లేకుండా.. ఈ రోడ్డుపై వాహనాల రద్దీ నేపథ్యంలో ఎక్కడా ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ప్లాన్ చేశారు. ముఖ్యంగా మధ్యలో ఉండే గ్రామాల వద్ద చిన్న రోడ్ల మీదుగా వచ్చే వాహనాలతో ఇబ్బంది లేకుండా అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారు. ఆ వాహనాలు ప్రధాన రోడ్డు దిగువగా అండర్‌పాస్‌ల నుంచి ముందుకుసాగుతాయి. చిన్న రోడ్లలోవాహనాల సంఖ్య ఎక్కువగా ఉండే ఆరు చోట్ల భారీ అండర్‌పాస్‌లు నిర్మిస్తారు. వీటి నుంచి బస్సులు, ట్రక్కులు, కంటెయినర్ వాహనాల లాంటి భారీ వాహనాలు వెళ్లిపోతాయి. ఇక 8 చోట్ల చిన్న అండర్‌పాస్‌లు నిర్మిస్తారు. వీటి నుంచి కార్లు లాంటి తక్కువ ఎత్తుండే వాహనాలు వెళ్తాయి. మొయినాబాద్ వద్ద 4.35 కి.మీ. మేర, చేవెళ్ల వద్ద 6.36 కి.మీ. మేర రెండు బైపాస్ రోడ్లను నిర్మిస్తారు. మన్నెగూడకు సమీపంలోని అంగడి చిట్టంపల్లి వద్ద 12 లేన్ల టోల్‌ప్లాజా నిర్మిస్తారు. ప్రమాదకరంగా మలుపులున్న 0.725 కి.మీ. పరిధిలో రోడ్డును నేరుగా ఉండేలా(రీఅలైన్మెంట్) మారుస్తారు. -
195 కి.మీ. ఎన్‌హెచ్‌కు నిధులు
సాక్షి, న్యూఢిల్లీ: 2020–21 సంవత్సరానికి రాష్ట్రంలో రూ.1,005.38 కోట్ల వ్యయంతో 195.6 కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేసిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. నిజాంపేట–బీదర్ ఎన్‌హెచ్ 161బీపై అదనంగా 2 లేన్ అప్‌గ్రెడేషన్ కోసం అవసరమైన భూ సేకరణకు రూ.27.79 కోట్లు మంజూరు చేసినట్లు వివరించా రు. నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారి కింద ఎన్‌హెచ్–565లోని నకిరేకల్–నాగార్జునసాగర్ మధ్య ప్రాంతంలో పునరావాసం, అప్‌గ్రేడ్ చేసేందుకు ఇంకా మిగిలి ఉన్న పనులను మంజూరు చేసినట్లు మంగళవారం ట్విట్టర్ వేదికగా గడ్కరీ ప్రకటించారు. అంతేగాక హైదరాబాద్–బెంగళూర్ జాతీయ రహదారి–44లో రోడ్డు రవాణా భద్రతను మెరుగుపరిచేందుకు అవసరమైన సర్వీసు రోడ్లు, వాహన అండర్ పాస్‌ల నిర్మాణం కోసం రూ.21.16 కోట్లు మంజూరు చేశామ న్నారు. ఎన్‌హెచ్–163లోని హైదరాబాద్–భూపాలపట్నం మధ్య రహదారికి రూ.48.32 కోట్లు మంజూరు అయ్యిందన్నారు. ఇదే జాతీయ రహదారిలోని 2 లేన్ల రహదారులను 4 లేన్లులుగా అభివృద్ధి చేసేందుకు రూ.317.19 కోట్లు కేటాయించామన్నారు. ఎన్‌హెచ్–63పై ఉన్న ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ మధ్య రహదారిని 6 లేన్లకు విస్తరించడంతో పాటు పునరావాసం కల్పించడం, సర్వీస్ రోడ్ల నిర్మాణం, డ్రైన్లు, రహదారి భద్రతా సదుపాయాలు తదితర అంశాల అభివృద్ధికి రూ.545.11 కోట్లు మంజూరు అయ్యాయని గడ్కరీ వెల్లడించారు. ఎన్‌హెచ్ –167లోని జడ్చర్ల్ల–కల్వకుర్తి మధ్య జడ్చర్ల్ల పట్టణంలో 4 లేన్ల ఆర్ఓబీ నిర్మాణం/పునర్నిర్మాణం కోసం రూ.45.81 కోట్లు కేటాయించామని కేంద్ర మంత్రి తెలిపారు. చదవండి: 48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ -
రోడ్లపై యువతుల దందా..
-
రోడ్లపై యువతుల దందా..
సాక్షి, మేడ్చల్ : ఈజీ మనీకి అలవాటు పడి రోడ్లపై దందాకు దిగారు కొందరు యువతులు. వచ్చీ, పోయే వాహనాలను అడ్డగించి డబ్బులు వసూలు చేస్తూ పోలీసులకు చిక్కారు. వివరాలు.. రాజస్థాన్, గుజరాత్ రాష్టాలకు చెందిన యువతులు ఐదు బృందాలుగా ఏర్పడి, జాతీయ రహదారి, నిర్మానుష ప్రాంతాలను టార్గెట్ చేశారు. ఓ గ్రూపు ఘట్కేసర్ రోడ్లపై స్వచ్ఛంద సంస్థ కోసం విరాళాలు అంటూ డబ్బులు వసూలు చేయసాగింది. ఆ గ్రూపులోని యువతులు వచ్చీ, పోయే వాహనాలను ఆపి దందాకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వని వారిని బెదిరించసాగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డబ్బులు వసూలు చేస్తున్న ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. చదవండి : రోజుకో మలుపు తిరుగుతున్న బోధన్ పాస్‌పోర్టుల కేసు రోజుకో మలుపు తిరుగుతున్న బోధన్ పాస్‌పోర్టుల కేసు -
పోలీస్ జీప్‌ను చూసి ఆ ఇద్దరు మహిళల పరుగులు..
కోల్‌కతా : మహిళల వేషధారణతో నేషనల్ హైవేపై నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో రానాఘాట్ పోలీస్ స్టేషన్ ఏరియా పరిధిలోని నేషనల్ హైవే 34పై రాత్రి వేళ పోలీసులు పాట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున చీకటిలో నిలుచుని ఉన్న ఇద్దరు మహిళలు వీరి కంటపడ్డారు. పోలీస్ వాహానాన్ని చూడగానే ఆ ఇద్దరు మహిళలు అక్కడినుంచి పరిగెత్తటం మొదలెట్టారు. ( పొగ వదలడం.. ఫుటేజీ ఎత్తుకెళ్లడం వీరి స్టైల్ ) దీంతో పోలీసులకు వారిపై అనుమానం వచ్చింది. ఇద్దర్నీ వెంటాడి పట్టుకున్నారు. అనంతరం వారు మహిళలు కాదని, పురుషులని తెలిసి షాక్ అయ్యారు. అర్థరాత్రి పూట నేషనల్ హైవేపై మహిళల వేషంలో నిల్చుని, వాహనాలను ఆపి వాటిని హైజాక్ చేస్తామని, అలా కుదరకపోతే అందులోని వ్యక్తిని దోచుకుంటామని నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు. -
వరంగల్ హైవేపై 2 ఆర్టీసీ బస్సులు ఢీ
సాక్షి, వరంగల్ అర్బన్: పండగపూట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి. వివరాలు.. కరీంనగర్ - వరంగల్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ వద్ద ఉన్న ఈ జాతీయ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 24మందికి తీవ్ర గాయాలయ్యాయి. 12 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
క్వారంటైన్ నుంచి 100 మంది పరారీ
గువహటి : తమకు సరైన ఆహరం, నీళ్లు అందించడం లేదంటూ కరోనా రోగులు ఆందోళనకు దిగారు. క్వారంటైన్ సెంటర్ నుంచి 100కు పైగా కరోనా రోగులు పారిపోయి జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ ఘటన అసోంలోని కామ్రూప్ జిల్లాలో చోటుచేసుకుంది. ఒకే గదిలో 10 నుంచి 12మందిని ఉంచుతున్నారని, భౌతిక దూరం ఎలా పాటించాలని ప్రశ్నించారు. తమకు సరైన ఆహరం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ కరోనా రోగులు జాతీయ రహదారిపై నిరసన చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన డిప్యూటీ కమిషనర్ కైలాష్ కార్తీక్.. పై అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని, సరైన వసతులు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో రోగులు తిరిగి క్వారంటైన్ కేంద్రానికి వెళ్లారు. (పక్కా ప్లాన్‌తో ప్రియుడితో కలిసి క్వారంటైన్‌కు..) ఈ ఘటన ఆరోగ్య శాఖ మంత్రి హిమంత భిశ్వ శర్మ మాట్లాడుతూ.. ఒకవేళ క్వారంటైన్ సెంటర్లో ఇబ్బందులు ఎదుర్కొంటే వారు ఇంట్లోనే స్వీయ నిర్భందంలో ఉండొచ్చని పేర్కొన్నారు. సాధ్యమైనంతగా సౌకర్యాల లేమి లేకుండా చూసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడుతున్నారని అన్నారు. అంతేకాకుండా వేరే రాష్ర్టాలతో పోలిస్తే ఆర్థిక భారం అయినప్పటికీ అస్సాంలోనే కరోనా టెస్టులు ఉచితంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. (కరోనాతో మాజీ సీనియర్ అధికారి, రచయిత్రి మృతి) -
నేషనల్ హైవేపై పోర్న్ వీడియో..
-
నేషనల్ హైవేపై పోర్న్ వీడియో..
మిచిగాన్ : ఓ ఇద్దరు యువకులు చేసిన అల్లరి పనికి మిచిగాన్ హైవేపై వెళుతున్న ప్రయాణికులు నోరెళ్లబెట్టారు. ప్రచార ప్రదర్శనలు రావాల్సిన బిల్‌బోర్డుపై బూతు చిత్రాలేంటని ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం మిచిగాన్ నేషనల్ హైవేపై బైకుమీద వెళుతున్న ఇద్దరు వ్యక్తులు బిల్బోర్డును కంట్రోల్ చేసే గది దగ్గరకు వెళ్లారు. తమ సెల్ఫోన్లో ఉన్న పోర్న్ వీడియో బిల్‌బోర్డు తెరపై వచ్చేలా చేశారు. దీంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో హైవేపై ఉన్న బిల్‌బోర్డు తెరలపై పోర్న్ వీడియోలోని దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ సమయంలో హైవేపై వెళుతున్న వారు ఆ దృశ్యాలను చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అక్కడినుంచి వెళ్లిపోతూ ఈ తతంగాన్నంతా వీడియో తీసిన ఆ ఇద్దరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బిల్‌బోర్డుపై దాదాపు 17 నిమిషాల పాటు పోర్న్ వీడియోలు ప్రదర్శితమయ్యాయి. ఇది గమనించిన పోలీసులు సంబంధిత వ్యక్తులను అలర్ట్ చేశారు. వారు వెంటనే వీడియోలను నిలిపివేశారు. బిల్బోర్డ్ గది సీసీ టీవీ ఫొటేజ్ల ఆధారంగా ఇద్దరు అనుమానితుల్ని గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. -
స్పీడ్ లిమిట్‌లోనే ఉన్నా... భారీగా చలాన్లు..!
న్యూఢిల్లీ : అనుమతించిన స్పీడ్‌లోనే వాహనాలు ప్రయాణించినప్పటికీ ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు భారీగా చలాన్లు విధించారు. వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు, విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. వేసిన చలాన్లను విత్‌డ్రా చేసేందుకు నిర్ణయించారు. వివరాలు.. ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉన్న 24వ జాతీయ రహదారిపై ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో దాదాపు ఒకటిన్నర లక్షల చలాన్లు విధించారు. వీటిలో అధిక భాగం ఓవర్‌స్పీడ్‌కు సంబంధించినవే. అయితే, ఉన్నఫళంగా చలాన్లు విత్‌డ్రా చేస్తామనడానికి కారణాలేంటనే ప్రశ్నకు ట్రాఫిక్ ఉన్నతాధికారి ఒకరు మట్లాడుతూ.. జాతీయ రహదారులపై గంటకు 70 కి.మీ వేగంతో మాత్రమే ప్రయాణించాలి. ఈ మేరకు ప్రజా పనుల విభాగం వేగం 70 దాటితే శిక్షార్హులు అనే బోర్డులు కూడా పెట్టాయి. అయితే, 24వ జాతీయ రహదారిపై నిజాముద్దీన్ బ్రిడ్జి, ఘాజీపూర్ మధ్య 60 కి.మీ వేగంతో వెళ్లిన వాహనాలకు సైతం చలాన్లు విధించారు. దాంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. అందుకే చలాన్లు వెనక్కు తీసుకుని ఉండొచ్చు’ అని అన్నారు. ఇదిలాఉండగా.. ఓవర్‌స్పీడ్ చలాన్లను ఇప్పటికే చాలామంది చెల్లించారని.. మరి ఆ సొమ్మునంతా వారికి తిరిగి ఇస్తారా అనే ప్రశ్నకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల నుంచి సమాధానం కరువైంది. అక్రమంగా ఫైన్లు వేయడంతో కోర్టుకు వెళ్తామన్న పలువురి హెచ్చరికల నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక విమర్శల నుంచి తప్పించుకోవడానకి 60 కి.మీ వేగం దాటితే శిక్షార్హులు అనే సూచిక బోర్డులు పెట్టాలని ట్రాఫిక్ అధికారులు ప్రజా పనుల విభాగాన్ని కోరడం గమనార్హం. -
నెత్తు‘రోడు’తున్నాయి
ఉమ్మడి జిల్లాలో రహదారులు నెత్తు‘రోడు’తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. కనీసం ఒకరిద్దరు చనిపోతూనే ఉన్నారు. ఇంకొందరు గాయాలపాలవుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడల్లా డ్రైవర్ అజాగ్రత్త.. అతివేగమే ప్రమాదానికి కారణాలని చెప్పుకొస్తున్న అధికారులకు తమ తప్పు మాత్రం కనిపించడం లేదు. సాక్షి, మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలోని రహదారులను అద్దంగా తీర్చిదిద్దే పనిలో ఉన్న అధికార యంత్రాంగం ప్రమాదకర మలుపులు.. కల్వర్టుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా మొద్దు నిద్రపోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్యాకేజీ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లతోనూ ఆ రహదారులను మరమ్మతు చేయించుకోవడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కనీసం జాతీయ రహదారుల నిర్వహణ సైతం అస్తవ్యస్తంగా తయారైంది. ఫలితంగా తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 2,600 కి.మీ. ఆర్అండ్బీ, సుమారు ఏడు వేల కి.మీ. పంచాయతిరాజ్ రోడ్లు ఉన్నాయి. తమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే రోడ్ల నిర్మాణంలో నాణ్యత అంశాల పరిశీలన, పర్యవేక్షణతో పాటు ఏయే ప్రాంతాల్లో మలుపులు ఉన్నాయి? ఎక్కడెక్కడ కల్వర్టులు ఉన్నాయి? వాటి వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, కల్వర్టుల మరమ్మతు చేపట్టాల్సిన బాధ్యత ఈ రెండు శాఖలదే. అయితే వందలాది మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు, కల్వర్టుల వద్ద రక్షణ చర్యలు లేవంటే పరిస్థితి ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎన్నో సందర్భాల్లో ఈ మలుపుల వద్ద రోడ్డు ప్రమాదాలు జరిగి.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకెంతో మంది క్షతగాత్రులయ్యారు. అయినా ఇంతవరకు ఆయా ప్రాంతాల్లో ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. 613 కి.మీ. ఎన్‌హెచ్‌లు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో 613 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయి. మొత్తం 110 గ్రామాల మీదుగా రహదారుల నిర్మాణం జరిగింది. తరచూ ప్రమాదాలు జరిగే 68 ప్రాంతాలను అధి కారులు గుర్తించారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ నుంచి నల్లగొండ జిల్లా కోదాడ వరకు అప్‌గ్రేడ్ అయిన 167 జాతీయ రహదారి పనులు నత్తకు నడకనేర్పుతున్నాయి. రాయచూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండగా.. జడ్చర్ల నుంచి కల్వకుర్తి వరకు పనులు పూర్తి దశలో ఉన్నా.. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయమై డీఈ వెంకటేశ్వర్లును వివరణ కోరగా 167 జాతీయ రహదారి పనుల్లో భాగంగా జడ్చర్ల–కల్వకుర్తి వరకు మొదటి బిట్ పనులు కొనసాగుతున్నాయన్నారు. పనుల గడువు ఈ ఏడాది డిసెంబర్ వరకు ఉందన్నారు. ఆలోపే పనుల పూర్తితో పాటు ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు.. రోడ్డుకు రేడియం ఏర్పాటు చేయిస్తామన్నారు. అటకెక్కిన ‘ట్రామాకేర్’ ప్రధాన రహదారులపై ప్రమాదాలు జరిగితే కొనఊపిరితో ఉన్న క్షతగాత్రులను ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రధాన ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అయితే.. చాలా వరకు ప్రమాదాలు జరిగిన ప్రాంతాల సమీపంలో పెద్ద ఆస్పత్రులు లేకపోవడం.. ఉన్న ఆస్పత్రుల్లో వైద్యసిబ్బంది.. రోగులను కాపాడేంత స్థాయిలో వైద్య పరికరాలు, ఇతర సదుపాయాలు లేవు. దీంతో ఆయా క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినా ప్రాథమిక చికిత్స అందించి ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆస్పత్రికి చేరుకునేలోపే గాయపడినవారు చనిపోవడం జరుగుతోంది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలందించేలా ఉమ్మడి జిల్లా పరిధిలోని జడ్చర్ల, కొత్తకోట వంటి ప్రమాదాలు జరిగే ప్రధాన ప్రాంతాల్లో ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన ప్రతిపాదనల్ని అధికారులు నివేదించారు. తర్వాత ఆ సెంటర్ల ప్రతిపాదనలు అటకెక్కాయి. మరోవైపు సుదూర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు అలసిపోతే వారు సేద తీరేందుకు జాతీయ రహదారులపై ఏర్పాటు చేయాల్సిన రెస్ట్ సెంటర్ల నిర్వహణపైనా అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొన్నిచోట్ల టాయిలెట్ల నిర్వహణ బాగా లేకపోవడంతో వాహనదారులు అక్కడక సేద తీరేందుకు ఇష్టపడడం లేదు. వీరిలో కొందరు రహదారుల వెంట ఉన్న హోటళ్లు.. దాబాల వద్ద ఆగి విశ్రాంతి తీసుకుంటున్నారు. చాలా మంది ఆగకుండా వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలు
సాక్షి, గుత్తి రూరల్: జక్కలచెరువు శివారులో ఇసురాళ్లపల్లి క్రాస్ వద్ద 67వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు... పెద్దవడుగూరు మండలం తిమ్మాపురానికి చెందిన రామాంజనేయులు, పెద్దొడ్డికి చెందిన వీరన్న, కోడలు సునీత, అనంతపురానికి చెందిన వాణి, కుమారుడు నరసింహ, కుమార్తె నందిని, రంగమ్మ, గుంతకల్లు మండల మొలకలపెంటకు చెందిన పార్వతి పెద్దవడుగూరు మండలం అప్పేచెర్లలో జరిగే వివాహానికి గుత్తి నుంచి తాడిపత్రి వైపు వెళ్లే ఆటో ఎక్కారు. ఇసురాళ్లపల్లి క్రాస్ వద్ద వేగంగా వెళ్తున్న ఆటో అకస్మాత్తుగా అదుపు తప్పి బోల్తా పడింది. గాయపడ్డ వారిలో రామాంజనేయులు మినహా అందరూ బంధువులు. తీవ్రంగా గాయపడ్డ వారిని 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ రామాంజనేయులు, వాణి, వీరన్న, సునీతలను మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హోదా సరే.. గుర్తింపు ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారుల గుర్తింపు విషయంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావట్లేదు. రాష్ట్రంలోని పలు రహదారులను జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) జాతీయ రహదారులుగా గుర్తించింది. వీటిని అధికారికంగా నోటిఫై చేసి, గెజిట్‌లో చేర్చాల్సిన కేంద్రం మాత్రం ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రూ.17,000 కోట్ల విలువైన 32 ప్రాజెక్టులకు శంకుస్థాపన, 7 ప్రాజెక్టులకు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. విభజన హామీల ప్రకారం తమకు రావాల్సిన జాతీయ రహదారులనే అడుగుతున్నామని కొత్త డిమాండ్లేవీ లేవని రాష్ట్ర ఎంపీలు అంటున్నారు. కనీసం ఉన్న జాతీయ రహదారుల విస్తరణ కూడా చేపట్టకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సగం ఖర్చు భరిస్తామంటున్నా.. విభజన చట్టం ప్రకారం.. తెలంగాణ అభివృద్ధికి జాతీయ రహదారుల అభివృద్ధి అత్యవసరం. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న 3,155 కి.మీ. పొడవైన 25 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇందులో ఇప్పటికే 1,388 కి.మీ.ల మేర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించింది. మిగిలిన 1,767 కి.మీల మేర రోడ్ల గుర్తింపును ఖరారు చేయకుండా తాత్సారం చేస్తోంది. ఈ జాతీయ రహదారుల నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ, ఇతర ఖర్చుల్లో సగం వరకు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కేంద్రం మీనమేషాలు లెక్కించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? రాష్ట్రంలోని 13 రహదారులకు కేంద్రం గతంలోనే జాతీయ రహదారుల హోదా ఇచ్చింది. వీటిని ఇంతవరకూ అధికారికంగా గెజిట్‌లో చేర్చలేదు. దీంతో ఇవి పేరుకు మాత్రమే జాతీయ రహదారులుగా మిగిలాయి. మొత్తం 1,767 కి.మీ.ల దూరం ఉన్న ఈ రహదారులకు అధికారిక గుర్తింపులో మోక్షం కలగకపోవడం గమనార్హం. హోదా దక్కినా గుర్తింపు రానివి ఇవే! 1. మెదక్–రుద్రూర్–బాసర–భైంసా (ఎన్‌హెచ్ 61, 166 కి.మీ.), 2.కరీంనగర్–సిరిసిల్ల–కామారెడ్డి–ఎల్లారెడ్డి (ఎన్‌హెచ్ 563, 165 కి.మీ.), 3.సరపాక–ఏటూరునాగారం–కాళేశ్వరం–చెన్నూరు–కౌతాల– సిర్పూర్ (306 కి.మీ.) 4.మిర్యాలగూడ–పిడుగురాళ్ల –నర్సంపేట (26 కి.మీ) 5.భద్రాచలం–మీలుగుజిల్లి–జంగారెడ్డిగూడెం–దేవురపల్లి (68 కి.మీ) 6. జహీరాబాద్–బీదర్–దేగీర్ (25 కి.మీ) 7. చౌటుప్పల్– ఇబ్రహీంపట్నం–ఆమనగల్–షాద్‌నగర్–చేవెళ్ల–శం కర్పల్లి–కంది (ఎన్‌హెచ్–65, 183 కి. మీ.) 8. మెద క్–సిద్దిపేట–ఎల్కతుర్తి (ఎన్‌హెచ్– 65, 133 కి.మీ) 9.హైదరాబాద్ ఓఆర్ఆర్ వలిగొండ–తొర్రూర్–నెల్లికుదురు–మహబూబాబాద్–ఇల్లందు–కొత్తగూడెం (ఎన్‌హెచ్ 30, 234 కి.మీ.), 10. తాండూరు–కొడంగల్–మహబూబ్‌నగర్ రోడ్ (96 కి.మీ.), 11 కొత్త కోట–గూడూరు–మంత్రాలయం (ఎన్‌హెచ్–167, 70 కి.మీ.), 12. రంగశాయిపేట– చింత నెక్కొండ–కేసముద్రం–మహబూబాబాద్ (71 కి.మీ.) 13.బహదూర్‌పల్లి–అశ్వాన్పల్లి–గోరియావీడు–నేరేడుపల్లి తండా–గర్మిలపల్లి–బుర్రాపల్లి–ఎంపేడ్–వావిలాల– జమ్మికుంట–వీణవంక– కరీం నగర్ (131 కి.మీ.). కాగా, రాష్ట్రంలోని పలు రోడ్ల విస్తరణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. కనీసం వీటి విస్తరణకైనా అనుమతించాలన్న రాష్ట్ర ప్రభుత్వ వినతిని కేంద్రం ఇంకా పట్టించుకోవట్లేదు. పార్లమెంటులో నిలదీస్తాం: వినోద్ రహదారులకు కిలోమీటరుకు రూ.4 కోట్ల చొప్పున ఖర్చు అవుతుందని అంచనా. ఈ లెక్కన 1,767 కి.మీ.లకు రూ.7,068 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. వీటికి అధికారిక గుర్తింపు, నిర్మాణానికి కావాల్సిన నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియట్లేదు. ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రి గడ్కరీని కలిశాం. తాజాగా మరోసారి లేఖ రాశాం. స్పందించకుంటే బడ్జెట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తాం. -
జాతీయ రహదారిపై చిరుత మృతి.. కలకలం
సాక్షి, నెల్లూరు : జిల్లాలోని మర్రిపాడులో చిరుత పులి మృతి కలకలం రేపింది. అడవిలోంచి ఓ చిరుత పులి బాటసింగంపల్లి జాతీయ రహదారిపైకి రావటంతో గుర్తు తెలియని వాహనం ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందింది. తరుచూ చిరుత పులులు ఇలా రహదారులపైకి వస్తుండటంతో స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
‘జబర్దస్త్’ కమెడియన్‌కు తప్పిన ప్రమాదం
సాక్షి, మహబూబ్‌నగర్: ‘జబర్దస్త్’ కమెడియన్ చలాకి చంటికి మంగళవారం పెను ప్రమాదం తప్పింది. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రం 44వ జాతీయ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. కాగా, అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి చంటి సురక్షితంగా బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్వల్ప గాయాలైన చంటికి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రాణాలు తీసిన ట్రావెల్స్ బస్సు
అప్పుడే తెల్లవారుతోంది. జాతీయ రహదారిపై భారీ శబ్దం. ఏం జరిగిందో అని ఉలిక్కి పడిన జనం రోడ్డు మీదకు వచ్చే సరికి భీతావహు పరిస్థితి. రోడ్డుపై క్షతగాత్రులు రక్తపు మడుగులో చెల్లాచెదురుగా పడి ఉన్నారు. వాహనంలో ఇరుక్కున్న ఇంకొందరి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదం ధ్వనించింది. వాహనంలో కూర్చున్న స్థితిలోనే డ్రైవర్, మహిళ, తల్లి ఒడిలోనే ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. కొన్ని గడియల్లో దైవ సన్నిధికి చేరుకుంటామనుకున్న కుటుంబాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. తెల్లవారుతూనే ఈ ఘోర కలిని చూసిన స్థానికులు చలించిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తలో చేయ్యేసి రోడ్డుపై పడిన, వాహనంలో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను వెలికి తీసి 108 వాహనాల్లో నాయుడుపేట ఆస్పత్రికి తరలించారు. ఈ విషాదకర దుర్ఘటన పెళ్లకూరు వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగింది. మృతులంతా గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం నాయుడుపాలెం గ్రామస్తులు. పెళ్లకూరు(నెల్లూరు) : నెల్లూరు జిల్లా పెళ్లకూరు వద్ద శనివారం తెల్ల వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనా స్థలిలో క్షతగ్రాతుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలవగా, 12 మంది గాయపడ్డారు. ట్రావెల్స్ బస్సును తుఫాన్ వాహనం ఢీకొనడంతో గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన మాసబోయిన సుబ్బులు, చిన్నారి సాయివెంకటచరణ్ (3), డ్రైవర్ వెన్నపూస పుల్లారెడ్డి (28) అక్కడికక్కడే మృతి చెందగా, మరో చిన్నారి పూజితను నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రాణాలు విడిచింది. ఘటనా స్థలి లో తీవ్ర రక్త గాయాలైన క్షతగాత్రులు కాపాడండి.. అంటూ ఆర్తనాదాలు చేశారు. తీవ్రంగా గాయపడిన పత్తి శీను, కోటేశ్వరమ్మ దంపతులతో పాటు బంధువులు ఆంజనేయులు, భూలక్ష్మి, ఇనుముల పుల్లమ్మ, నాగరాజు, ఎడ్ల చరణ్, ఎడ్ల శీను, కత్తి ఆదిలక్ష్మి, ఇనుముల భార్గవి, ఇనుముల శ్రీనివాసులు, ఇనుముల వెంకటేష్ గాయాలతో కొందరు వాహనంలో ఇంకొందరు నడిరోడ్డుపై చెల్లాచెదురుగా పడి సాయం కోసం చేసిన ఆర్తనాదాలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై మహ్మద్ హనీఫ్ ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో క్షతగాత్రులను నాయుడుపేట వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనతో జాతీయ రహదారి మార్గంలో రోడ్డుకు ఇరువైపులా సుమారు పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు, స్థానికుల చొరవతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. సమాచారం అందుకున్న గూడూరు డీఎస్పీ రాంబాబు, డీటీసీ శివరామ్‌ప్రసాద్, ఆర్టీవో చం దర్, ఎంవీఐ జకీర్ ప్రమాదస్థలిని పరి శీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ ట్రావెల్ బస్సు డ్రైవర్ అతి వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, బస్సును స్వాధీనం చేసుకున్నారు. -
జూన్‌లో అమిత్ షా తెలంగాణ పర్యటన
సాక్షి, హైదరాబాద్: జూన్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 14న అమిత్‌షాతో తెలంగాణ బీజేపీ నేతల సమావేశం ఉందని, ఆ సమావేశంలో అమిత్ షా పర్యటన తేదీలు ఖారారవుతాయని పేర్కొన్నారు. అమిత్ షా పర్యటన విధి, విధానాల ఖరారు కోసం ఈ నెల 17, 18 తేదిల్లో హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ నేతలు సమావేశం కానున్నారని తెలిపారు. ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ హజరవుతున్నారన్నారు. తెలుగురాష్ట్రాలకు కేంద్ర ఎంతో సాయం చేసింది తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఎంతో సాయం చేస్తున్నప్పటికీ.. ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్రంపై అనవసర నిందలు వేయడం సరికాదని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌లో 1500 కోట్ల రూపాయల నిధులతో రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. నాలుగేళ్లలో తెలంగాణకు 3వేల కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా మార్చిన ఘనత గడ్కరీదేనన్నారు. 50 వేల కోట్ల రూపాయలతో జల రవాణా మార్గం ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగు నీటి సమస్యలు ఉండవని పేర్కొన్నారు. ‘రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ కోసం కేంద్రం 5 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కూడా కేంద్రం అన్ని రకాల అనుమతులు మంజూరు చేసింది. అయినా కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం విమర్శలు చేయడం దారుణమ’ని లక్ష్మణ్ అన్నారు. ఈ నాలుగేళ్లలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఎంత ఖర్చుచేసింది, ఎంత అభివృద్ధి చేసిందనే దానిపై చర్చకు సిద్ధమని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవాలని టీడీపీ కోరుకుంటోందని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ బీజేపీని ఓడించడానికి కుట్రలు చేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు.