![Ksrtc Bus Runs Backwards Not Paying Toll Free Bangalore Mysore Expressway - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/21/ksrtc_bus.jpg.webp?itok=62OqxlAb)
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): దుబారి టోల్ ఫీజు చెల్లించలేని కేఎస్ ఆర్టీసీ బస్సు వెనక్కు వెళ్లి పోయిన సంఘటన బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేపై చోటుచేసుకుంది. బుధవారం బెంగళూరు నుండి మైసూరు వెళ్తున్న బస్సుకు ఫాస్ట్‌ట్యాగ్ లేకపోవడంతో రామనగర తాలూకా శేషగిరి టోల్ వద్ద డబుల్ చార్జ్ చెల్లించాలని టోల్ సిబ్బంది చెప్పారు.
దీంతో డ్రైవర్ అంత డబ్బులు తన వద్ద లేవని బస్సు వెనక్కు తీసుకుని కొన్ని కిలోమీటర్ల దూరం రాంగ్ రూట్లోనే వచ్చాడు. అనంతరం సర్వీస్ రోడ్ ద్వారా ప్రయాణించాడు. ఈ దృశ్యాలను కొందరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసారు. వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసుకున్నారు.
చదవండి మణిపూర్ ఘటన:. ప్రధాన నిందితుడి ఇంటి తగలబెట్టి.. కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment