
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
ఇద్దరు మృతి, డ్రైవరుకు గాయాలు
పడగల్(వేల్పూర్), న్యూస్‌లైన్ : మండలంలోని పడగల్ క్రాస్‌రోడ్డు సమీపంలో 63 నంబరు జాతీయ రహదారిపై గురువారం వేకువజామున 3 గంటలకు ఆగి ఉన్న పేడ లారీని కారు ఢీకొంది. దీనిలో నరేందర్(40), తుంచపు కోటయ్య(50) అనే ఇద్దరు వ్యక్తులు మరణించారు. కారు డ్రైవర్ కలమూరి రాముకు గాయాలయ్యాయయి. ఎస్సై మురళి తెలిపిన వివరాలి ఉన్నాయి. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలోని దీనదయాల్ కాలనీకి చెందిన కలమూరి రాము తనకారు(ఏపీ 15ఏఎఫ్ 8797)లో బుధవారం షంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కిరాయిపై వెళ్లాడు.
తిరుగు ప్రయాణంలో గాంధారి మండలం రాంపూర్ గడ్డ తండాకు చెందిన కోటయ్యను, మెట్‌పల్లి మండలం బండ లింగాపూర్‌కు చెందిన నరేందర్‌ను ఎక్కించుకుని బయలు దేరాడు. జాతీయ రహదారిపై ఏఏకే 2579 నంబరు గల లారీ రాత్రిపూట ఎక్సెల్ విరిగి ఆగి ఉందన్నారు. కారు డ్రైవర్ రాము లారీని గమనించక అదపుతప్పి లారీని ఢీకొట్టిందన్నారు. నరేందర్, కోటయ్య కూర్చున్న భాగం లారీకి బలంగా తాకడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారన్నారు. డ్రైవర్ రామును 108 అంబులెన్స్‌లో ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నరేందర్‌కు భార్య, రెండేళ్ల కూతురు, కోటయ్యకు భార్య, కొడుకు, కూతరు ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి, మృతదేహాలను ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు.