మనుబోలు (నెల్లూరు) : జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొమ్మలపుడి గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న ట్రాలీని ఢీకొట్టడంతో.. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వాహనాలు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో.. జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాలను తొలగించే యత్నం చేస్తున్నారు.