
సాక్షి, మేడ్చల్ : ఈజీ మనీకి అలవాటు పడి రోడ్లపై దందాకు దిగారు కొందరు యువతులు. వచ్చీ, పోయే వాహనాలను అడ్డగించి డబ్బులు వసూలు చేస్తూ పోలీసులకు చిక్కారు. వివరాలు.. రాజస్థాన్, గుజరాత్ రాష్టాలకు చెందిన యువతులు ఐదు బృందాలుగా ఏర్పడి, జాతీయ రహదారి, నిర్మానుష ప్రాంతాలను టార్గెట్ చేశారు. ఓ గ్రూపు ఘట్కేసర్ రోడ్లపై స్వచ్ఛంద సంస్థ కోసం విరాళాలు అంటూ డబ్బులు వసూలు చేయసాగింది. ఆ గ్రూపులోని యువతులు వచ్చీ, పోయే వాహనాలను ఆపి దందాకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వని వారిని బెదిరించసాగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డబ్బులు వసూలు చేస్తున్న ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.
చదవండి : రోజుకో మలుపు తిరుగుతున్న బోధన్ పాస్‌పోర్టుల కేసు రోజుకో మలుపు తిరుగుతున్న బోధన్ పాస్‌పోర్టుల కేసు
Comments
Please login to add a commentAdd a comment