
సాక్షి, మేడ్చల్: మేడ్చల్‌లో పట్టపగలే దారుణ హత్య జరిగింది. బస్సు డిపో వద్ద నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. ఉమేష్ అనే వ్యక్తిని ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఉమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమ్ముడే అన్నను చంపినట్లు పోలీసులు గుర్తించారు. తమ్ముడే మరో వ్యక్తితో కలిసి అన్నను చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment