‘జబర్దస్త్’ కమెడియన్‌కు తప్పిన ప్రమాదం | Comedian Chalaki Chanti Escapes from Road Accident  | Sakshi
Sakshi News home page

‘జబర్దస్త్’ కమెడియన్‌కు తప్పిన ప్రమాదం

Published Tue, Jun 12 2018 1:51 PM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM

Comedian Chalaki Chanti Escapes from Road Accident  - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్: ‘జబర్దస్త్’ కమెడియన్ చలాకి చంటికి మంగళవారం పెను ప్రమాదం తప్పింది. మహబూబ్‌ నగర్‌ జిల్లా బాలానగర్‌ మండల కేంద్రం 44వ జాతీయ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి.

కాగా, అదృష్టవశాత్తూ ఈ ప్ర‌మాదం నుంచి చంటి సురక్షితంగా బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్వల్ప గాయాలైన చంటికి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement