రామకుప్పం(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాయకనేరి గ్రామ శివారులోని జాతీయ రహదారిపైకి మంగళవారం రాత్రి ఏనుగుల గుంపు రావడంతో జనం భయంతో పరుగులు తీశారు. సమీప అడవిలోని ఏనుగుల గుంపు జాతీయరహదారికి అడ్డంగా వచ్చాయి ఫలితంగా ఆ మార్గంలో తమిళనాడులోని పేర్నంబట్టు వైపు వెళ్లే వాహనాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి.
రామకుప్పం మండలం నెర్నిమల తాండాకు చెందిన నలుగురు యువకులు ద్విచక్రవాహనాలపై వస్తుండగా కొన్ని ఏనుగులు వారిని వెంబడించాయి. భయభ్రాంతులకు గురైన ఆ యువకులు వేగంగా వచ్చి అటవీ అధికారులకు సమాచారం అందించారు. రాత్రి 9 గంటలకు టవీ అధికారులు సంఘటన స్థలానికి బయలుదేరారు.
యువకులను వెంబడించిన ఏనుగులు
Published Tue, Mar 29 2016 10:43 PM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM
Advertisement
Advertisement