
అల్జీర్స్: దక్షిణ అల్జీరియాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై బస్సు, వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 34 మంది మరణించారు. మరో 12 మంది గాయాలపాలయ్యారు.
పరస్పరం ఢీకొన్న వెంటనే రెండు వాహనాల్లోనూ మంటలు చెలరేగాయని, అందుకే భారీగా ప్రాణనష్టం జరిగిందని అధికారులు చెప్పారు. సహారా ఎడారి సమీపంలో తామన్‌రసెట్ ప్రావిన్స్‌లో తెల్లవారుజామున 4 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment