ఆగివున్న బస్సును ఢీకొట్టిన వ్యాన్
నలుగురికి గాయాలు
ధవళేశ్వరం:
ఆగివున్న బస్సును వెనుకనుంచి వ్యాన్ ఢీకొట్టడంతో నలుగురు గాయపడ్డారు. ధవళేశ్వరం జాతీయరహదారిపై గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ధవళేశ్వరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజపురం గ్రామానికి చెందిన ఎనిమిదిమంది టవేరా వ్యాన్లో ఈ నెల 16వ తేదీన కృష్ణా పుష్కరాలకు విజయవాడ వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి వారు విజయవాడ నుంచి అన్నవరం వస్తుండగా వారి వ్యాన్ ధవళేశ్వరం జాతీయరహదారిపై భూలోకమ్మ గుడి సమీపంలో ఆగివున్న టూరిస్ట్బస్సును వెనుకనుంచి ఢీకొట్టింది. దాంతో వ్యాన్ అదుపుతప్పి డివైడర్ పైనుంచి అవతలరోడ్డుకు వెళ్లిపోయింది. ఈ సంఘటనలో వ్యాన్లో ప్రయాణిస్తున్న నిరంజనిసాహు, తెలుకుల సత్యసాహు, దాండ పాండిసాహు, హిన్నో మహాపాత్రో తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన ప్రయాణికుల్లో బిస్వనాథ్lసాహు, గురునాథ్lసాహు,హేమంత్సాహు,లక్ష్మీసాహులకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని 108లో రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసును ధవళేశ్వరం ఎస్సై బీఎన్ మూర్తి దర్యాప్తు చేస్తున్నారు.