ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. | Weekly Telugu Horoscope On Jan 5th To Jan 11th, 2025: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Published Sun, Jan 5 2025 5:41 AM | Last Updated on Sun, Jan 5 2025 10:46 AM

Weekly Horoscope Telugu 05-01-2025 To 11-01-2025

మేషం...
బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ ఊహలు నిజం చేసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. వాహనయోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పనులు ఆటంకాలు లేకుండా చకచకా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో అనుకోని లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు చికాకులు, ఇబ్బందులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల వారు అభివృద్ధి పథంలో సాగుతారు. వారం చివరిలో  ఆరోగ్యభంగం. బంధువులతో వివాదాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు, గాయత్రీ ధ్యానం మంచిది.

వృషభం...
దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. ధనప్రాప్తి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల శ్రమ వృథా కాదు. వ్యాపారాలు పుంజుకుని లాభాల బాటలో నడుస్తారు. ఉద్యోగులకు శ్రమ ఫలించి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయవేత్తలకు మరింత పురోగతి కనిపిస్తుంది. . వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. గులాబీ, ఎరుపు రంగులు. వారాహీ స్తోత్రం పఠించండి.

మిథునం....
ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. అనుకున్న పనులు సజావుగా కొనసాగుతాయి. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలతో ముందుకు సాగి విజయాలు సా«ధిస్తారు. ఆస్తులు సమకూర్చుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు దక్కే అవకాశం. కళారంగం వారికి  నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. దూరప్రయాణాలు. పసుపు, నేరేడు రంగులు, మేధా దక్షిణామూర్తి స్తుతి మంచిది.

కర్కాటకం...
మిత్రుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇంటాబయటా మీకు ఎదురుండదు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఇంటిలో శుభకార్యాలపై ఒక నిర్ణయం తీసుకుంటారు.  బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. నిరుద్యోగులు, విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి.  వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవరోధాలు తొలగుతాయి. కళారంగం వారు పురస్కారాలు పొందుతారు.  వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. అనారోగ్యం. మానసిక అశాంతి. తెలుపు, ఆకుపచ్చ రంగులు, పంచాక్షరి మంత్రం పఠించండి.

సింహం.....
ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు ఉన్నా క్రమేపీ సర్దుబాటు కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వాహనాలు, భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.  ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత వరకూ తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.  వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనుకోని ప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. ఎరుపు, గులాబీ రంగులు, నారాయణ అష్టాక్షరి మంత్రం పఠించండి.

కన్య.....
ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వ్యాపారులు అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు  విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. మానసిక అశాంతి. ఆకుపచ్చ, నేరేడు రంగులు, శ్రీ భువనేశ్వరి మంత్రం పఠించండి.

తుల....
దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. పనులలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి  మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఒక వ్యక్తి ద్వారా కొంత సాయం అందే సూచనలు. నూతన విద్య,ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలు వేగవంతంగా చేస్తారు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగే అవకాశం. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. తెలుపు, గులాబీ రంగులు, శ్రీహయగ్రీవస్తుతి మంచిది.

వృశ్చికం....
వీరికి పట్టింది బంగారమే అన్నట్టుంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతస్థితి లభించే అవకాశం. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి.  వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. వృథా ఖర్చులు. ప్రయాణాలలో అవాంతరాలు. ఎరుపు, పసుపు రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు....
ముఖ్యమైన పనులు కొంత నెమ్మదించినా క్రమేపీ పుంజుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది.  ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వాహన, కుటుంబసౌఖ్యం. కుటుంబపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో మరిత విస్తరించే అవకాశం.  ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళారంగం వారికి సమస్యల నుండి విముక్తి. వారం చివరిలో  ధనవ్యయం. ఆప్తులతో కలహాలు. దూరప్రయాణాలు. గులాబీ, తెలుపు రంగులు, శ్రీదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మకరం....
వ్యయప్రయాసలు ఎదుర్కొంటారు. పనుల్లో కొంత జాప్యం తప్పదు. ప్రయాణాలలో మార్పులు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. సోదరులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్యపరంగా చికాకులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ యత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఇబ్బందిగా మారతాయి.. పారిశ్రామికవర్గాలకు  విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ధన,వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. నీలం, నేరేడు రంగులు, హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కుంభం...
ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు, మంచి గుర్తింపు రాగలవు. కళారంగం వారి చిరకాల కోరిక నెరవేరుతుంది.  వారం ప్రారంభంలో ధనవ్యయం. అనుకోని ప్రయాణాలు. మానసిక ఆందోళన. ఆకుపచ్చ, గులాబీ రంగులు, సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మీనం...
బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కోర్టు కేసులు కూడా అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు. గులాబీ, మెరూన్‌ రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement