షాజహాన్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్, శ్రావస్తి జిల్లాల్లో శనివారం చోటుచేసుకున్న రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 18 మంది దుర్మరణం పాలయ్యారు. షాజహాన్‌పూర్ జిల్లా అజ్మత్‌పూర్‌కు చెందిన సుమారు 30 మంది గ్రామంలో జరిగే భాగవత కథ కార్యక్రమం కోసం నీటిని తెచ్చేందుకు గర్రా నదికి ట్రాక్టర్‌పై బయలుదేరారు. నిగోహి రోడ్డులో వంతెనపై వెళ్తుండగా అదుపుతప్పి ట్రాక్టర్ ట్రాలీ నదిలో పడిపోయింది. ఘటనలో 8 మంది చిన్నారులు, ఇద్దరు మహిళలు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 24 మందిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు అంటున్నారు.
మృతుల కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించారు. మరో ఘటన..శ్రావస్తి, బలరాంపూర్ జిల్లాలకు చెందిన కొందరు పంజాబ్‌లోని లూధియానాలో పనులు చేసుకుంటున్నారు. బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వీరు ఎస్‌యూవీలో బయలుదేరారు. ఆ వాహనం శనివారం వేకువజామున శ్రావస్తి జిల్లా ఇకౌనా ప్రాంతంలో అదుపుతప్పి రోడ్డు పక్క చెట్టును ఢీకొని, గుంతలో పడిపోయింది. ఘటనలో 9 ఏళ్ల బాలుడు సహా ఆరుగురు చనిపోయారు. మరో 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment