
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృత్యువాతపడ్డారు. జమ్మూ–శ్రీనగర్ హైవేపై రంబన్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి దాటాక ఘటన చోటుచేసుకుంది. తవేరా ట్యాక్సీ అదుపుతప్పి 300 అడుగుల లోయలో పడిపోయింది.
డ్రైవర్‌తో పాటు అందరూ చనిపోయారు. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.