Ramban district
-
లోయలో పడ్డ తవేరా..10 మంది మృతి
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృత్యువాతపడ్డారు. జమ్మూ–శ్రీనగర్ హైవేపై రంబన్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి దాటాక ఘటన చోటుచేసుకుంది. తవేరా ట్యాక్సీ అదుపుతప్పి 300 అడుగుల లోయలో పడిపోయింది. డ్రైవర్‌తో పాటు అందరూ చనిపోయారు. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
మిషన్ రాంబన్ సక్సెస్ : ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో శనివారం ఉదయం నుంచి భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. బటోట్లోని ఓ ఇంట్లో నక్కిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వారి వద్ద బందీలుగా ఉన్న ఆరుగురిని క్షేమంగా వెలుపలికి తీసుకువచ్చాయి. మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది ఒసామాను భద్రతా దళాలు హతమార్చాయి. ఈ క్రమంలో ఓ జవాన్ అమరుడవగా, ఇద్దరు సైనికులకు గాయాలయ్యాయి. ఘటనాస్ధలంలో భారీ ఎత్తున ఆయుధ సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. -
కలకలం: పశువుల వ్యాపారులపై కాల్పులు
శ్రీనగర్: గోరక్షకుల పేరుతో అమాయకులను పెట్టుకుంటున్న ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా.. కశ్మీర్లో పశువుల వ్యాపారులపై భద్రతా దళాలు కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. ఈ ఘటన ఆదివారం ఉదయం 4 గంటలకు రాంబన్ జిల్లాలో చోటుచేసుకుంది. కాల్పుల్లో ఒకరు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. గూల్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ రఫీక్ గుజ్జార్ (28), షకీల్ అహ్మద్ (30) పశువుల కొనుగోలు, అమ్మకాలు చేస్తుంటారు. వ్యాపారం నిమిత్తం కోహ్లి అనే గ్రామానికి శనివారం రాత్రి వచ్చారు. పనిముగించుకొని తిరిగి వెళ్తుండగా.. అనుమానాస్పంగా సంచరిస్తున్నారనే కారణంగా రాష్ట్రీయ రైఫిల్స్ 58 బెటాలియన్‌కు చెందిన సైనికులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన గుజ్జార్ ఘటనా స్థలలోనే చనిపోయాడు. షకీల్ అహ్మద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామనీ, దర్యాప్తు జరగుతోందని జిల్లా ఎస్పీ మోహన్ లాల్ వెల్లడించారు. -
అగ్నిప్రమాదం :10 మంది కూలీలు మృతి
జమ్మూ : జమ్మూ ప్రాంతంలోని రాంబన్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి విషాదం చోటు చేసుకుంది. స్థానిక చంద్రకోటి క్యాంప్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారని జిల్లా ఎస్పీ రణదీప్ కుమార్ శుక్రవారం జమ్మూలో వెల్లడించారు. మృతులంతా నిర్మాణ రంగంలో పని చేసే కూలీలని తెలిపారు. నిర్మాణ రంగంలో పని చేసేందుకు వారంతా పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌తోపాటు జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల నుంచి వచ్చి ఈ క్యాంప్‌లో ఉన్నారని పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణం తెలియరాలేదన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారని చెప్పారు. అగ్ని ప్రమాదం సంభవించండంతో ఊపిరాడక... కాలిన గాయలతో ఈ 10 మంది మరణించారని తెలిపారు. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని రణదీప్ కుమార్ వివరించారు. -
లోయలో పడిన బస్సు: 17 మంది మృతి
-
లోయలో పడిన బస్సు: 17 మంది మృతి
బస్సు లోయలోపడి 17 మంది ప్రయాణికులు మృతి చెందిన ఘటన జమ్మూ కాశ్మీర్ రాంబన్ జిల్లా డిగ్డోల్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. ఆ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. బస్సు జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు.డ్రైవర్ బస్సును వేగంగా నడపడం వల్లే ఆ ప్రమాదం చోటు చేసుకుందని వివరించరు. బస్సు ప్రయాణికుల్లో అత్యధికులు పూంచ్, రాజోరి జిల్లాలకు చెందిన యవతేనని ఆయన స్పష్టం చేశారు. వారంతా రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఆ ప్రమాదం సంభవించిందన్నారు.