
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో శనివారం ఉదయం నుంచి భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. బటోట్‌లోని ఓ ఇంట్లో నక్కిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వారి వద్ద బందీలుగా ఉన్న ఆరుగురిని క్షేమంగా వెలుపలికి తీసుకువచ్చాయి. మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది ఒసామాను భద్రతా దళాలు హతమార్చాయి. ఈ క్రమంలో ఓ జవాన్ అమరుడవగా, ఇద్దరు సైనికులకు గాయాలయ్యాయి. ఘటనాస్ధలంలో భారీ ఎత్తున ఆయుధ సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment