జమ్మూ కశ్మీర్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 39 మంది మరణించగా, 16 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దోడా జిల్లాలోని అస్సార్ సమీపంలో కిష్త్వార్-జమ్మూ హైవేపై కిష్త్వార్ నుండి జమ్మూకు ప్రయాణికులతో వస్తున్న బస్సు.. ఓల్డ్ జమ్మూ-కిష్త్వార్ రహదారిపై 300 అడుగుల లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. జమ్ముకశ్మీర్‌లో ఇటీవలి కాలంలో జరిగిన అతి పెద్ద ప్రమాదం ఇదేనని స్థానికులు చెబుతున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు సాయం అందజేస్తామని ప్రధాని ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందజేస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. కాగా జమ్ముకాశ్మీర్‌లో ఇటువంటి ప్రమాదాలు గతంలోనూ చోటుచేసుకున్నాయి.
జమ్ముకాశ్మీర్‌లో భారీ రోడ్డు ప్రమాదాలు
2019, జూలై 1: కిష్త్వార్‌లోని సాంగ్వారీ ప్రాంతంలో మినీ బస్సు లోయలో పడి 35 మంది మృతి, 17 మందికి గాయాలు.
2018, సెప్టెంబర్ 14: కిష్త్వార్‌లోని దండారన్ ప్రాంతంలో మినీ బస్సు లోయలో పడి 17 మంది మృతి, 16 మందికి గాయాలు.
2009, జూన్ 27: దోడా జిల్లాలోని పుల్ దోడాలో రోడ్డు ప్రమాదంలో 27 మంది దుర్మరణం.
2021, అక్టోబర్ 28: దోడా జిల్లాలోని థాత్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి.
2022, నవంబర్ 16: కిష్త్వార్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు.
2023, మే 30: జమ్మూ-శ్రీనగర్ హైవేపై జమ్మూ జిల్లాలోని ఝజ్జర్ కోట్లిలో యాత్రికుల బస్సు వంతెనపై నుండి పడటంతో 10 మంది దుర్మరణం.
2019, మార్చి 15: రాంబన్‌లో కారు లోయలో పడిన ప్రమాదంలో 11 మంది మృతి, నలుగురికి గాయాలు.
2023, మే 24: కిష్త్వార్‌లోని దచాన్ ప్రాంతంలోని దంగ్‌దురు డ్యామ్ వద్ద ఒక కారు లోయలో పడటంతో ఏడుగురు మరణించారు, ముగ్గురు గాయపడ్డారు.
2023, ఆగస్టు 30: ఒక కారు 300 అడుగుల లోతైన లోయలో పడటంతో ఎనిమిది మంది మృతి, ముగ్గురికి గాయాలు.
2023, జూన్ 27: దోడాలోని భదర్వా-పఠాన్‌కోట్ రహదారిపై ఒక వాహనం లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు.
ఇది కూడా చదవండి: జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. 36 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment