ఎంతటి రాచమార్గానికైనా మలుపులు ఉంటాయి. అక్కడక్కడా వంకరలుంటాయి. ఎలాంటి వంకరలు లేకుండా ఏకధాటిగా ముక్కుసూటిగా సాగిపోయే రహదారి ఇది. ప్రపంచంలోని అతి పొడవాటి ముక్కుసూటి రహదారి ఇదే!.
ఈ రహదారి సౌదీ అరేబియాలో ఉంది. ఏకంగా 240 కిలోమీటర్ల దూరం వరకు ఈ రహదారి ముక్కుసూటిగా సరళరేఖలా తిన్నగా ఉంటుంది. సౌదీ అరేబియా నైరుతి ప్రాంతంలోని అల్ దర్బ్ పట్టణం నుంచి తూర్పు ప్రాంతంలోని అల్ బతా పట్టణాన్ని కలుపుతూ ఉన్న ఈ 10వ నంబరు రహదారి మొత్తం పొడవు 1474 కిలోమీటర్లు. ఇది రబ్ అల్ ఖలీ ఎడారి మీదుగా సాగుతుంది.
ఎడారి మీదుగా సాగే మార్గంలోనే దీనిని ఎలాంటి మలుపులు, వంకరలు లేకుండా 240 కిలోమీటర్ల పొడవున కేవలం సరళరేఖ మార్గంలో మాత్రమే కాదు, ఎలాంటి ఎగుడు దిగుడులు ఎత్తు పల్లాలు కూడా లేకుండా నిర్మించడం విశేషం.
ఇవి చదవండి: పోయిన ప్రాణం ఎలా తిరిగి వచ్చింది? వింటే షాకే!
Comments
Please login to add a commentAdd a comment