soudi arabia
-
అరేబియా అద్భుతం
చాలామంది దుబాయికి వెళ్తారు. కానీ దాని పొరుగునే ఉండే అబూ ధాబీని ఎక్కువమంది పట్టించుకోరు. దుబాయిని న్యూయార్క్తోనూ, అబూ ధాబీని ప్యారిస్‌తోనూ పోల్చవచ్చు. రాజసం ఉట్టిపడే బంగళాలు, విశాలమైన రహదారులు, సజావుగా సాగిపోయే ట్రాఫిక్... ఒక్కమాటలో అబూ ధాబీకి వెళ్తే అరేబియా అద్భుత ప్రపంచంలో కాలు పెట్టినట్లే ఉంటుంది!మీకు దుబాయి తెలుసుగా? బంధుమిత్రుల్లో చాలామంది వెళ్లి ఉంటారు కూడా. అయితే దుబాయి నుంచి ఓ గంటన్నర ప్రయాణం దూరంలో ఉండే ఎమిరేట్స్ రాజధాని అబూ ధాబీ గురించి మాత్రం చాలామందికి తెలియకపోవచ్చు. వెళ్లి ఉండరు కూడా. ఇవ్వాళ మీతో కొన్ని దేదీప్యమానమైన విషయాలను పంచుకుంటాను. పోయిన వారం నేను అక్కడికి వెళ్లాను. చూడముచ్చటగా ఉందని చెప్పాలి. చూసి వచ్చినందుకు మనసులో ఓ సంతృప్తి మిగిలిపోయింది. దుబాయి మాదిరి తళుకుబెళుకుల్లేవు. గ్లామర్, హడావిడి అంతకంటే లేవు!అబూ ధాబీలో ప్రపంచం పరుగులు పెట్టదు. నెమ్మదిగా ఓ నదిలా హొయలు పోతూ సాగుతూంటుంది. పోలిక కావాలంటే... దుబాయ్‌ని న్యూయార్క్తోనూ, అబూ ధాబీని ప్యారిస్‌తోనూ పోల్చవచ్చు. రాజసం ఉట్టి పడే బంగళాలు, విశాలమైన రహదారులు, సజావుగా సాగిపోయే ట్రాఫిక్... వీటన్నింటి మధ్య అక్కడక్కడా లెక్కలేనన్ని ఆడంబ రాలు, హోటళ్లు, రెస్టా రెంట్లు! ఇదీ అబూ ధాబీ వర్ణన!ఎమిరాతీ జనాలు తమ నగరాన్ని బాగా ఆస్వాదిస్తూంటారు. షాపింగ్, డైనింగ్ ఏదైనా కానీ దుబాయి కంటే బాగా ఎంజాయ్ చేస్తూంటారు. విదేశీయులు ఎక్కువగానే ఉన్నా... వారు దుబాయిలో మాదిరిగా స్థానికులను బెదరగొట్టేంత స్థాయిలో లేరనే చెప్పాలి. అబూ ధాబీలో ఉన్న సాంస్కృతిక అద్భుతాల గురించి చెప్పాలంటే ‘ది లూవ్’, ‘షేక్ జాయెద్ మ్యూజియం’లను ప్రస్తావించాలి. ఈ రెండు ఉదాహరణలు కచ్చితంగా ఇచ్చి తీరాల్సినవే. షేక్ జాయెద్ సంగ్రహాలయంలో నేనుకొన్ని గంటల సమయం గడిపాను. అందులో ఉన్న వస్తువులు మాత్రమే కాదు... ఎంతో అద్భుతమైన ఊహతో వాటిని ప్రదర్శించిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. చరిత్ర గర్భంలో కలిసిపోయిన ఒక్కో కాలానికి ప్రతిరూపంగా ఈ సంగ్రహాలయ గదులను తీర్చిదిద్దారు. అలాగే చాలా తెలివిగా వేర్వేరు నాగరికతలకు సంబంధించిన వస్తువు లను ప్రదర్శించారు. ఫలితంగా వీటిని వేర్వేరు వస్తువు లుగా కాకుండా... ఒకే కాలంలో మానవ నాగరికతలు సాధించిన విజయాలను చూసినట్టుగా ఉంటుంది. చైనా నుంచి మెసపటోమియా వరకూ... అలాగే మెక్సికో నుంచి ఫ్రాన్స్ వరకూ వేర్వేరు నాగరికతలకు సంబంధించిన చారిత్రక అవశేషాలను ఇక్కడ భద్రపరిచారు. ఇంకోలా చెప్పాలంటే చోళుల కాలం నాటి విగ్రహాలు మొదలుకొని పర్షియన్ల కుండలు, బెల్జియం నేతపనుల నుంచి టర్కీ విగ్రహాలను ఒకే గదిలో చూడవచ్చు! ఏ శతాబ్దంలోనైనా మనిషి ఊహ ఎంత అద్భుతంగా ఉందో చెప్పే ప్రతీకాత్మ కత అన్నమాట!షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్‌ను ఒక్క మాటలో వర్ణిస్తా. చాలా పెద్దది. చూడటం మొదలుపెడితే పూర్తయ్యేందుకు రెండు కిలోమీటర్ల దూరం నడవాలి. కానీ ఇందులోని వైపరీత్యాలను మాత్రం కచ్చితంగా అధ్యయనం చేయా ల్సిందే. భూగర్భంలోని కారు పార్కింగ్ తరువాత స్టార్ బక్స్, కోస్టా కాఫీలతోపాటు చాక్లెట్లు, సుగంధ ద్రవ్యాల దుకాణాలున్న షాపింగ్ ప్రాంతానికి వెళతాం. ఆ తరువాత స్వచ్ఛమైన తెల్లటి పాలరాతి పరచుకున్న గోడలున్న భారీ హాల్లోకి ప్రవేశిస్తాం. హాల్లోని స్తంభాలపై అతి కౌశల మైన కళాకృతులు, అది కూడా విలువైన రంగురాళ్లు పొదిగి నవి ఉన్నాయి. పైకప్పు నుంచి జిలుగు వెలుగుల క్రిస్మస్ ట్రీల మాదిరిగా వేలాడే భారీ షాండ్లియర్లు... ఓహ్! అరే బియా అద్భుత ప్రపంచంలో కాలు పెట్టినట్లే ఉంటుంది!అతిథులను మనసారా ఆహ్వానించే రెస్టారెంట్లు దుబాయిలో మాత్రమే ఉంటాయని అనుకునేవాడిని. అబూ ధాబీ కూడా ఈ విషయంలో ఏమీ తీసిపోదు. ఫోర్ సీజన్స్‌లోని బర్గర్లు, స్టీక్స్ కానివ్వండి... సెయింట్ రెజిస్ లోని భారతీయ వంటకాలైనా కానివ్వండి... ఫాక్వెట్లోని ఫ్రెంచ్ మాధుర్యాలు, సముద్ర తీరంలోని ‘తాషా’లో తీరికగా చేసే భోజనం కానివ్వండి... ఒక్కోటి పొట్టకు స్వర్గాన్ని రుచి చూపించేవే. కాకపోతే, ఇక్కడికొస్తే అప్పటి వరకూ లేని తిండిపోతుతనం మనల్ని చుట్టేయడం మాత్రం గ్యారెంటీ!నేను ఇప్పటివరకూ చాలా దేశాల్లోని హోటళ్లలో బస చేశాను కానీ... ‘ది ఎమిరేట్స్ ప్యాలెస్’ ముందు అవన్నీ దిగదుడుపే! భారత్‌లోని ‘లేక్ ప్యాలెస్’, ‘తాజ్‌మహల్’లు కూడా దీనిముందు గల్లీ హోటళ్లలా చిన్న బోతాయి. పచ్చటి పచ్చికబయళ్లున్న రూమ్ టెర్రస్‌లో కూర్చుని సముద్రాన్ని చూస్తూ కాఫీ తాగడం... డిసెంబరు చలిలో సూర్యకిరణాలు నులి వెచ్చగా తాకడం... కవిత్వం చెప్పుకునేంత అద్భుతమైన అను భూతి. మొబైల్ ఫోన్ లేకుండా కూడా కాలం ఎంచక్కా గడచి పోతుందనేందుకు ఈ అనుభూతి ఒక ఉదాహరణంటే ఒట్టు!ఇంకో ముఖ్యమైన సంగతి. తప్పక చెప్పాల్సింది కూడా! ఎమిరాతీ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తారు. అందుకే ఇక్కడ అంతా ఒక పద్ధతి ప్రకారం నడిచిపోతూంటుంది. ఒకవేళ పొరబాటున ఎవరైనా నిబంధనలు మీరారో... జరిమానాలు వీపు విమానం మోత మోగిస్తాయి. రెడ్ లైట్ దాటారంటే ఐదు వేల దిర్హమ్ల చమురు వదులుతుంది. వచ్చే ఏడాది నుంచి దీన్ని ఏకంగా యాభై వేల దిర్హమ్లకు పెంచుతున్నారు. డాలర్లలో చెప్పాలంటే 15 వేలు. రూపాయల్లోనైతే రూ. 12.73 లక్షలు! రోడ్లపై అడ్డదిడ్డంగా నడిచే మనిషిని గానీ, ఒక్క హారన్ మోతగానీ వినలేదంటే నమ్మండి!అబూ ధాబీ ఓ అద్భుత ప్రపంచం అనేంతగా దాన్ని వర్ణించానా? వాస్తవం ఏమిటంటే, దుబాయిలా కాకుండా... అబూ ధాబీ నిశ్శబ్దంగానే మీ అభిమానాన్ని చూరగొంటుంది. మీకు తెలియను కూడా తెలియదు. దుబాయిదంతా చెమ్కీల అంగీలే! కళ్లూ, చెవులు మదిపై చెడామడా దాడులు చేసే టైపు! దుబాయిని చూడంగానే ఆహా ఓహో అనిపిస్తే... పొరుగునే ఉండే అబూ ధాబీ మాత్రం నెమ్మదిగా మీ మనసుల్లోకి చేరి మత్తెక్కిస్తుంది. చిరకాలం ఒక జ్ఞాపకంలా నిలిచిపోతుంది. ఎప్పుడైనా అరబ్ దేశాల వైపు వెళ్లే పని పడిందనుకోండి... అబూ ధాబీని చూసి రావడం మరచి పోకండే! మరపురాని అనుభూతిని మిగులుస్తుంది. అందుకే, నేనూ ఇంకోసారి అక్కడకు వెళ్లాలని ఇప్పటికే తీర్మానించుకున్నా!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
జర్మనీలో కారు బీభత్సం.. ప్రమాదంలో 68మందికి గాయాలు
బెర్లిన్ : జర్మనీలో ఓ డాక్టర్ బీభత్సం సృష్టించారు. మాగ్డేబర్గ్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ మార్కెట్లోకి తన బీఎండబ్ల్యూ కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. 68 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదానికి కారణమైన డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు జర్మన్ సాక్సోనీ-అన్హాల్ట్ రాష్ట్ర మినిస్టర్ ప్రెసిడెంట్ (ముఖ్యమంత్రి)ప్యూర్ హాసెలాఫ్ తెలిపారు. సౌదీ అరేబియాకు చెందిన 50ఏళ్ల డాక్టర్ 2006నుంచి జర్మనీలో నివాసం ఉంటున్నారు. డాక్టర్‌గా సేవలందిస్తున్నట్లు చెప్పారు.ప్రమాదంపై స్థానిక ప్రభుత్వ ప్రతినిధి మథియాస్ షుప్పె మాట్లాడుతూ నిందితుడు ఉద్దేశపూర్వకంగా తన కారుతో మార్కెట్లోకి దూసుకొచ్చినట్లు తెలుస్తోంది. సరిగ్గా శుక్రవారం సాయంత్రం 7గంటల సమయంలో నిందితుడు తన కారుతో ఎటునుంచి వచ్చాడో తెలియదు. మార్కెట్లోకి అత్యంత వేగంతో వచ్చాడు. ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే కావాలనే చేసినట్లు అనిపిస్తుంది.ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 2016లో ఇదే తరహాలో ప్రమాదం జరిగింది. దీంతో తాజా ప్రమాదంపై సంఘ విద్రోహ చర్య అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.🚨 2 Dead, 60 Injured in German Christmas Market Attack 🚨A car plowed into a bustling Christmas market in Magdeburg, Germany, killing two people, including a toddler, and injuring over 60 others in what authorities are calling a deliberate act, potentially linked to terrorism.… pic.twitter.com/8o6zVv62Vu— CanAm Network (@Canam_Network) December 21, 2024 2016లో ఇదే తరహా దాడిఎనిమిదేళ్ల క్రితం జర్మన్ రాజధాని బెర్లిన్‌లో క్రిస్మస్ మార్కెట్‌పై దాడి జరిగింది. డిసెంబర్ 19, 2016న రద్దీగా క్రిస్మస్ మార్కెట్లో తన కారుతో ఓ ఇస్లామిక్ తీవ్రవాది ట్రక్కుతో దూసుకొచ్చాడు. ఈ దుర్ఘటనలో 13మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. రెండు రోజుల తర్వాత నిందితుణ్ని జర్మనీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. Police arresting the Attacker 50-year-old Saudi doctor in Magdeburg, Germany#Terroristattack #Germany #Magdeburg #Weihnachtsmarkt #MagdeburgAttack #MagdeburgerWeihnachtsmarkt #festundflauschig pic.twitter.com/JO1nuTLal5— Chembiyan (@ChembiyanM) December 20, 2024 -
అక్కడ భారీగా బయటపడ్డ తెల్ల బంగారం
చమురు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్న సౌదీ అరేబియాలో లిథియం నిక్షేపాలను గుర్తించారు. దీంతో లిథియం ప్రత్యక్ష మైనింగ్‌ను ప్రోత్సహించడానికి త్వరలోనే కమర్షియల్ పైలెట్ ప్రోగ్రామ్ ప్రారంభించనున్నట్లు సౌదీ అరేబియా మైనింగ్ వ్యవహారాల డిప్యూటీ మినిష్టర్ 'ఖలీద్ బిన్ సలేహ్ అల్ ముదైఫర్' వెల్లడించారు.ఇప్పటికే ఆర్థికంగా బలమైన దేశంగా ఉన్న సౌదీ అరేబియా.. లిథియం నిక్షేపాలు బయటపడంతో మరింత బలపడనుంది. ప్రభుత్వ యాజమాన్యంలోని పెట్రోలియం, నేచురల్ గ్యాస్ కంపెనీ 'సౌదీ అరామ్కో అకా అరమ్‌కో' (Saudi Aramco aka Aramco) లిథియంను వెలికి తీయనున్నట్లు.. దీనికోసం కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన కొత్త టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు సమాచారం.లిథియం నిక్షేపాలు బయటపడిన సందర్భంగా అల్ ముదైఫర్ మాట్లాడుతూ.. చమురు క్షేత్రాలు, ఉప్పునీటి ప్రవాహాల నుంచి లిథియం తీయడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. అయితే లిథియం ధరలు పెరిగితే కొత్త ప్రాజెక్ట్ త్వరలో వాణిజ్యపరంగా లాభదాయకంగా ఉంటుందని అన్నారు.నిజానికి సౌదీ అరేబియా, దశాబ్దాలుగా చమురుపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు దీనికి లిథియం కూడా తోడైంది. చమురు మాత్రమే కాకుండా.. ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను కనుగొనే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రయత్నాలలో భాగంగా ఈ నిక్షేపాలను గుర్తించారు.లిథియం ఉపయోగాలుఈ రోజు మనం రోజూ ఉపయోగిస్తున్న స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్ బైకులు, కార్లు, సోలార్ పవర్ యూనిట్లు, ఎమర్జెన్సీ లైట్లు, బొమ్మలు వంటి ప్రతి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లో లిథియం ఉపయోగిస్తారు. నేడు ప్రతి రంగంలోనూ లిథియం అవసరం ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే దీనిని తెల్ల బంగారం అని పిలుస్తారు. -
నిజమే..! ఇది ముక్కుసూటి రహదారే..!! సుమారు..
ఎంతటి రాచమార్గానికైనా మలుపులు ఉంటాయి. అక్కడక్కడా వంకరలుంటాయి. ఎలాంటి వంకరలు లేకుండా ఏకధాటిగా ముక్కుసూటిగా సాగిపోయే రహదారి ఇది. ప్రపంచంలోని అతి పొడవాటి ముక్కుసూటి రహదారి ఇదే!.ఈ రహదారి సౌదీ అరేబియాలో ఉంది. ఏకంగా 240 కిలోమీటర్ల దూరం వరకు ఈ రహదారి ముక్కుసూటిగా సరళరేఖలా తిన్నగా ఉంటుంది. సౌదీ అరేబియా నైరుతి ప్రాంతంలోని అల్ దర్బ్ పట్టణం నుంచి తూర్పు ప్రాంతంలోని అల్ బతా పట్టణాన్ని కలుపుతూ ఉన్న ఈ 10వ నంబరు రహదారి మొత్తం పొడవు 1474 కిలోమీటర్లు. ఇది రబ్ అల్ ఖలీ ఎడారి మీదుగా సాగుతుంది.ఎడారి మీదుగా సాగే మార్గంలోనే దీనిని ఎలాంటి మలుపులు, వంకరలు లేకుండా 240 కిలోమీటర్ల పొడవున కేవలం సరళరేఖ మార్గంలో మాత్రమే కాదు, ఎలాంటి ఎగుడు దిగుడులు ఎత్తు పల్లాలు కూడా లేకుండా నిర్మించడం విశేషం.ఇవి చదవండి: పోయిన ప్రాణం ఎలా తిరిగి వచ్చింది? వింటే షాకే! -
సౌదీ జైల్లో భారతీయుడు.. విడుదలకు రూ.34 కోట్ల నిధుల సేకరణ
కోజికోడ్: ప్రపంచంలో ఏమూల ఉన్నాసరే విపత్కర సమయాల్లో కేరళ ప్రజలంతా ఒక్కటవుతుంటారు. ఈ క్రమంలో సౌదీ అరేబియాలో మరణ శిక్ష పడిన ఓ వ్యక్తి కోసం ఇప్పుడూ వాళ్లంతా ఏకం అయ్యారు. ఓ హత్య కేసులో మరణశిక్ష పడ్డ వ్యక్తి జైల్లో మగ్గుతున్న ఆ వ్యక్తిని కాపాడటానికి ఏకంగా రూ. 34 కోట్లు నిధుల సేకరణకు ముందుకొచ్చారు. కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్.. 2006లో సౌదీలో ఓ బాలుడికి అబ్దుల్ రహీమ్ కేర్‌టేకర్‌గా చేరారు. అయితే ప్రమాదవశాత్తు ఆ బాలుడు రహీమ్ సంరక్షణలో మృతి చెందాడు. దీంతో ఈ కేసులో అక్కడి న్యాయస్థానం రహీమ్‌కు మరణశిక్ష విధించింది. సుమారు 18 ఏళ్ల నుంచి సౌదీ అరేబియాలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులో రహీమ్‌కు క్షమాభిక్ష ప్రసాదించడానికి బాధిత కుటుంబం తొలుత నిరాకరించింది. అయితే.. బ్లడ్‌మనీ (నష్ట పరిహారం రూపంలో) చెల్లిస్తే క్షమించేందుకు ఎట్టకేలకు ఒప్పుకుంది. బ్లడ్ మనీ కింద రూ.34కోట్లు చెల్లించాలని ఆ బాలుడి కుటుంబం షరతు విధించింది. అయితే రహీం ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే కదా!. ఈ క్రమంలో సౌదీలోని కేరళీయులు అంతా ఏకమై నిధలు సేకరించడానికి ఓ కమిటిగా ఏర్పడ్డారు. ముందుగా నిధులు సమీకణకు పెద్దగా స్పందన రాలేదు. కొన్ని రోజుల అనంతరం కేరళీయుల నుంచి భారీ విరాళాలు రావటం ప్రారంభమైందని నిధుల సేకరణ కమిటీ మీడియాకు వెల్లడించింది. రియాద్‌లోని సుమారు 75 సంస్థలు, కేరళకు వ్యాపారవేత్తలు, స్థానిక రాజకీయ సంస్థలు విరాళాలు అందిచినట్లు తెలుస్తోంది. విరాళాల్లో పారదర్శకత కోసం సదరు కమిటి ప్రత్యేక నిధులకు సేకరణకు యాప్‌ను కూడా తయారు చేసింది. ‘ఇంత పెద్ద భారీ నిధులు సేకరణ సాధ్యం అవుతుందని అస్సలు ఊహించలేదు. రూ. 34 కోట్లు సేకరిస్తామన్న నమ్మకం మొదట్లో లేదు. కానీ మెల్లగా విరాళాలు పెరగటంతో సాధ్యం అయింది’ అబ్దుల్ రహీం తల్లి సంతోషం వ్యక్తం చేసింది. త్వరలోనే రహీమ్ జైలు నుంచి విడుదల కానున్నాడని అతని కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. -
14న మరో అద్భుత ఆలయాన్ని ప్రారంభించనున్న మోదీ
సుమారు 500 సంవత్సరాల తర్వాత అయోధ్యానగరిలోని భవ్యమైన ఆలయంలో రామ్‌లల్లా కొలువయ్యాడు. తాజాగా ఒక ముస్లిం దేశంలోని హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధం అయ్యింది. ఈ నెల ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఆలయం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో నిర్మితమయ్యింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 13న అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ప్రవాస భారతీయులు పాల్గొనే ‘హలో మోదీ’ కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 14న యూఏఈ రాజధాని దుబాయ్‌లోని బీఏపీఎస్‌లో నిర్మితమైన హిందూ దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ప్రధాని మోదీ యూఏఈ పర్యటనపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు. యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ మాట్లాడుతూ ‘హలో మోదీ’ కార్యక్రమానికి వేలాది మంది తరలివస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. యూఏఈలోని 150 భారతీయ కమ్యూనిటీ సొసైటీలు సంయుక్తంగా ‘హలో మోదీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. యూఏఈలో మూడేళ్ల వ్యవధిలో ఈ ఆలయాన్ని రాజస్థాన్, గుజరాత్‌లకు చెందినవారు నిర్మించారు. ఫిబ్రవరి 13న షేక్ జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ప్రవాస భారతీయుల సమావేశం నిర్వహించనున్నట్లు యూఏఈ రాయబారి తెలిపారు. 2020 నివేదిక ప్రకారం యూఏఈలో 35 లక్షలమంది ప్రవాస భారతీయులు ఉన్నారు. పురాతన, పాశ్చాత్య శిల్పకళల కలయికతో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. 2018లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. -
రష్యా వద్దు.. సౌదీయే ముద్దు.. పరిస్థితులు తారుమారు?
ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికా సహా సంపన్న దేశాలు ఆంక్షలు విధించాయి. ఆదాయం పెంచుకోవడానికి తన మిత్ర దేశాలకు రష్యా రాయితీపై ముడి చమురు సరఫరా చేసింది. దీన్ని భారత్ అనుకూలంగా మార్చుకుని రష్యా నుంచి ముడి చమురు దిగుమతి పెంచుకుంది. అయితే క్రమంగా యుద్ధ భయాలు తొలగిపోతుండడంతో రష్యా నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్న క్రూడాయిల్ ఖరీదుగా మారుతోంది. ఉక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి రష్యన్ క్రూడ్‌ను చాలా తక్కువ రేటుకు ఇండియన్ కంపెనీలు కొంటున్నాయి. తాజాగా ఈ క్రూడ్‌పై ఇస్తున్న డిస్కౌంట్‌ను రష్యా తగ్గించింది. ప్రస్తుతం బ్యారెల్‌పై 3-4 డాలర్ల వరకు మాత్రమే డిస్కౌంట్ ఇస్తోంది. కానీ, రవాణా ఛార్జీలను మాత్రం తగ్గించలేదని, సాధారణం కంటే ఇంకా ఎక్కువగానే ఉన్నాయని క్రూడ్ విక్రయిస్తున్న కంపెనీలు చెబుతున్నాయి. పశ్చిమ దేశాలు రష్యన్ క్రూడ్‌పై బ్యారెల్‌కు 60 డాలర్ల ప్రైస్ లిమిట్‌ను విధించిన విషయం తెలిసిందే. ఈ ధర కంటే కొద్దిగా తక్కువకు ఇండియన్ కంపెనీలు క్రూడాయిల్ కొంటున్నాయి. అదే ఆయిల్‌ను డెలివరీ చేస్తున్న రష్యన్ కంపెనీలు బ్యారెల్‌కు 11 నుంచి 19 డాలర్ల వరకు రవాణా ఛార్జీని వసూలు చేస్తున్నాయని సమాచారం. దాంతో రష్యా నుంచి వరుసగా క్రూడాయిల్ దిగుమతులు తగ్గుతున్నాయి. అందుకు ప్రత్యామ్నాయంగా గత నెలలో సౌదీ అరేబియా నుంచి ముడి చమురు దిగుమతులు పెరిగాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి 22 శాతం నుంచి 16 శాతానికి తగ్గితే, సౌదీ అరేబియా నుంచి నాలుగు శాతం పెరిగింది. చెల్లింపుల సమస్య తలెత్తడంతో రష్యా నుంచి గత నెలలో క్రూడాయిల్ కొనుగోళ్లు 11 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. రష్యాలోని సొకోల్ తదితర ప్రాంతాల నుంచి ఐదు క్రూడాయిల్ చమురు రవాణా నౌకలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాయని తెలుస్తుంది. భారత్‌లో టాప్ రిఫైనరీ సంస్థగా ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మాత్రమే సొకోల్తోపాటు రష్యాలోని రోస్ నెఫ్ట్ ప్రాంతం నుంచి చమురు కొనుగోళ్లకు వార్షిక ఒప్పందం కుదుర్చుకుంది. చెల్లింపు సమస్యను తగ్గించుకోవడానికి గత నెలలో సౌదీ అరేబియా సహా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి చమురు కొనుగోలు ప్రారంభించిందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ఇదీ చదవండి: రూ.10 వేలకోట్లు అప్పు చేసిన ‘రిచ్‌డాడ్ పూర్‌డాడ్’ పుస్తక రచయిత.. చమురు దిగుమతి చేసుకున్నందుకు రష్యాకు రుబెల్స్, రూపీల్లో చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ చెల్లింపులకు చాలా విలువ ఉంటుంది. దాంతో కంపెనీలు కొంత ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు చమురుపై ఇస్తున్న డిస్కౌంట్‌ను తగ్గిస్తూ, రవాణా ఛార్జీలు తగ్గించకపోవడంతో ఈ పరిస్థితులు ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. -
సౌదీ స్మార్ట్ సిటీ ‘నియోమ్’ ప్రపంచాన్ని ఎందుకు ఆకర్షిస్తోంది?
ఆధునిక నిర్మాణాలకు సౌదీ అరేబియా పెట్టిందిపేరు. ప్రపంచంలోని ఏ పెద్ద కట్టడానికి సంబంధించిన ప్రస్తావన వచ్చినా ముందుగా సౌదీ అరేబియా పేరే వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం సౌదీ అరేబియా భారీ స్మార్ట్ సిటీ నిర్మాణంలో తలమునకలై ఉంది. ఇది ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలవనుంది. నియోమ్.. ఇది అనేది వాయువ్య సౌదీ అరేబియాలోని టబుక్ ప్రావిన్స్‌లో నిర్మాణంలో ఉన్న అద్భుత స్మార్ట్ సిటీ. ఈ ప్రదేశం ఎర్ర సముద్రానికి ఉత్తరంగా, ఈజిప్టుకు తూర్పున అకాబా గల్ఫ్ సమీపంలో, జోర్డాన్‌కు దక్షిణంగా ఉంది. 500 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ భవిష్యత్ నగరం సంపూర్ణంగా ‘స్వచ్ఛమైన శక్తి’తో మనుగడ సాగించనుంది. ఈ అధునాతన సిటీలో కార్లు ఉండవు. రోడ్లు కూడా ఉండవు. జీరో కార్బన్ ఉద్గారాలతో స్మార్ట్ సిటీ కాలుష్య రహితంగా ఉండనుంది. కాగా ఈ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనలో 20 శాతం పనులు పూర్తయ్యాయని నియోమ్ సీఈఓ నద్మీ అల్ నాస్ర్ మీడియాకు తెలిపారు. మానవాళి ఎదుర్కొంటున్న అనేక కీలక సవాళ్లను పరిష్కరించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నామన్నారు. నియోమ్ అనేది గ్రీకు పదం. నియో అంటే కొత్తది. ఎం అనేదానిని అరబిక్ పదం ముస్తాక్బాల్ నుంచి తీసుకున్నారు. దీని అర్థం భవిష్యత్తు. నియోమ్ అనే పదాన్ని క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పేరు నుంచి కూడా తీసుకున్నారని చెబుతారు. ఎర్ర సముద్ర తీరంలో 26,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మెగాసిటీ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నట్లు 2017 అక్టోబరులో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) ప్రకటించారు. రియాద్‌లో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ కాన్ఫరెన్స్‌లో ఎంబీఎస్ ఈ ప్రకటన చేశారు. ఇది సౌదీ అరేబియా- 2030 విజన్లలో ఒకటి. దీనిని సౌదీ ఆర్థిక వ్యవస్థను మరింత వృద్ధి చేసే లక్ష్యంలో నిర్మిస్తున్నారు. నియోమ్ అనేది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నిర్మాణాలకు భిన్నంగా స్వతంత్రంగా పనిచేస్తుందని, దానికంటూ సొంత పన్ను, కార్మిక చట్టాలు, ‘స్వయంప్రతిపత్త న్యాయ వ్యవస్థ’ ఉంటుందని ఎంబీఎస్ తెలిపారు. నియోమ్‌లో పోర్ట్‌లు, ఎంటర్ప్రైజ్ జోన్లు, పరిశోధనా కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, క్రీడా కేంద్రాలు, వినోద వేదికలు ఉంటాయని ఎంబీఎస్ తెలిపారు. నియోమ్ పునరుత్పాదక ఇంధన వనరుల నుండి వంద శాతం శక్తిని అందుకుంటుంది. సూర్యరశ్మి, గాలి, హైడ్రోజన్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని మాత్రమే నియోమ్ వినియోగిస్తుంది. ఫలితంగా ఈ సిటీలో కర్బన ఉద్గారాల విడుదల ప్రస్తావనే ఉండదు. ఈ నగరానికున్న మరొక ప్రత్యేకత ఏమిటంటే కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థాలతో కూడిన నీటిని సముద్రంలోకి తరలించరు. దానిని తిరిగి పారిశ్రామిక ముడి పదార్థంగా వినియోగిస్తారు. వ్యవసాయం విషయంలో కూడా నియోమ్ ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలవనుంది. గ్రీన్‌హౌస్‌ల ఏర్పాటుతో ప్రపంచంలోనే ఆహార స్వయం సమృద్ధిగల నగరాన్ని సృష్టించనున్నారు. సౌదీ అరేబియా ప్రస్తుతం 80 శాతం మేరకు ఆహారాన్ని దిగుమతి చేసుకుంటున్నది. ఇది కూడా చదవండి: అమెరికా అంతరిక్ష ప్రయోగాలలో హిట్లర్ సన్నిహితుడు? 1969లో ఏం జరిగింది? -
ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబం.. ఒక షిప్ విలువే వేల కోట్లు!
ప్రపంచంలో ఎలాన్ మస్క్, ఇండియాలో ముఖేష్ అంబానీ అత్యంత ధనవంతులని అందరికి తెలుసు. అయితే వీరికంటే కూడా సంపన్న కుటుంబం ఒకటుందని నివేదికలు చెబుతున్నాయి తెలుస్తోంది. ఇంతకీ ఆ ఫ్యామిలీ ఏది, ఎక్కడుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, సౌదీలోని కింగ్ 'సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్' నేతృత్వంలో ఉన్న కుటుంబం అత్యంత సంపన్న కుటుంబం అని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ కుటుంబంలో 15,000 కంటే ఎక్కువమంది ఉన్నట్లు సమాచారం. వీరికి చమురు నిల్వల నుంచి భారీగా సంపద వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కుటుంబంలో అత్యంత ధనవంతుడు అల్వలీద్ బిన్ తలాల్ అల్ సౌద్.. ఆయన నికర విలువ దాదాపు 20 బిలియన్ డాలర్లు. అయితే కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ తమ ఖచ్చితమైన నికర విలువను వెల్లడించలేదు. కొన్ని నివేదికల ప్రకారం, సౌదీ అరేబియా రాజు ప్రస్తుతం విలాసవంతమైన అల్ యమామా ప్యాలెస్‌లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది సుమారు 4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 1000 గదులు, సినిమా థియేటర్, అనేక స్విమ్మింగ్ పూల్స్ మరియు మసీదు వంటి అదనపు సౌకర్యాలు ఉన్నట్లు సమాచారం. ఈ రాజ కుటుంబం విలాసవంతమైన పడవలు, ఖరీదైన బంగారు పూతతో కూడిన కార్లు, ఖరీదైన దుస్తులు వినియోగిస్తున్నట్లు సమాచారం. వీరి వద్ద ఉన్న అనేక లగ్జరీ క్రూయిజ్ షిప్‌లలో ఒక దాని విలువ సుమారు రూ. 400 మిలియన్ డాలర్లు. ఇంకా వీరు రెండు హెలిఫ్యాడ్స్, స్పోర్ట్స్ పిచ్ వంటి వాటితో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ విమానం బోయింగ్ 747-400 కలిగి ఉన్నారు. టర్కీ బిన్ అబ్దుల్లా ఏకంగా 22 మిలియన్స్ ఖరీదైన కార్లు కలిగి ఉన్నట్లు సమాచారం. ఇందులో అనేక అన్యదేశ్య మోడల్స్ అయిన లాంబోర్ఘిని అవెంటడోర్ సూపర్‌వెలోస్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ కూపే, మెర్సిడెస్, జీప్, బెంట్లీ మొదలైనవి ఉన్నాయి. -
అమ్మకానికి పాక్? సౌదీ యువరాజు పర్యటనలో పక్కా డీల్?
దిగజారుతున్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గురించి యావత్ ప్రపంచానికీ తెలిసిందే. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాక్ తరచూ ఇతర దేశాల ఆర్థికసాయం కోసం చేతులు జాస్తోంది. పాక్‌కు భారీగా ఆర్థిక సాయం అందిస్తున్న దేశాల్లో సౌదీ అరబ్ పేరు ముందుగా వినిపిస్తుంది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ త్వరలో పాక్‌లో పర్యటించనున్నారు. ఆయన తన పర్యటనలో పాకిస్తాన్ కొనుగోలుకు డీల్ కుదుర్చుకోనున్నారనే ఊహాగాగాలు వినిపిస్తున్నాయి. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సెప్టెంబర్ రెండో వారంలో పాకిస్తాన్లో పర్యటించనున్నారు. మహ్మద్ బిన్ సల్మాన్ పర్యటన ఇస్లామాబాద్‌లో స్వల్ప సమయం మాత్రమే ఉంటుందని, నాలుగు నుంచి ఆరు గంటలకు మించి ఉండదని ఆయన సన్నిహితులు మీడియాకు తెలిపారు. సెప్టెంబరు 10న ఇస్లామాబాద్‌లో పర్యటన ముగించిన అనంతరం ఆయన తన భారత పర్యటనను ప్రారంభిస్తారు. ఎంబీఎస్ పేరుతో ప్రసిద్ది పొందిన క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్-ఉల్-హక్ కక్కర్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అసిమ్ మునీర్‌లను కలుస్తారని సమాచారం. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ని కలవడం వెనుక తన ఇమేజ్ను పెంచుకోవడమే ప్రధాన ఉద్దేశమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్.. పాక్ ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నూతన ప్రభుత్వం ఎన్నికయ్యేవరకూ తెరవెనుక బాధ్యతలన్నీ మునీర్ తన భుజాలపై వేసుకున్నారు. కాగా న్యూ ఢిల్లీకి వెళ్లేముందు ప్రిన్స్ ఇస్లామాబాద్‌కు వెళ్లడంలో ప్రత్యేకత ఏమిలేదని, ఇది ఇది ఆయన పాటిస్తున్న సమభావన చర్య అని సన్నిహితులు పేర్కొన్నారు. పాక్‌ను ఆపద్ధర్మ ప్రభుత్వం నడుపుతున్న దశలో మహ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్‌ను సందర్శించడం వెనుకపెట్టుబడులకు సంబంధించి ఏవైనా మార్గాలు తెరుచుకుంటాయేమోననే అంచనా ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. కాగా సౌదీ రాజు సన్నిహితులు మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ అమ్మకానికి ఉందని, సౌదీ అరేబియా రాజు కొనుగోలుదారులలో ఒకరని పేర్కొన్నారు. ప్రిన్స్ పర్యటనలో మరిన్ని వివరాలు తెలియవచ్చన్నారు. కాగా సౌదీ అరేబియా- పాకిస్తాన్ మధ్య ఉన్న స్నేహ పూర్వక వాతావరణం ఇందుకు సహరించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇది కూడా చదవండి: జీ20 శిఖరాగ్ర సదస్సుకు జిన్‌పింగ్ గైర్హాజరు! -
12 ఏండ్ల 295 రోజులకే రికార్డుల ‘సిరీస్’
సౌదీ అరేబియా: పన్నెండేళ్లు.. వర్డ్ పజిల్స్‌తో ఆడుకునే వయసు. కానీ... వరుసగా మూడు నవలలను రాసిందో అమ్మాయి. తద్వారా నవలల సిరీస్‌ను రాసిన అతి పిన్న వయసు అమ్మాయిగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. పైగా.. ఇప్పుడు నాలుగో నవలను పూర్తి చేసే పనిలో ఉంది. సౌదీ అరేబియాకు చెందిన రితాజ్ హుస్సేన్ అల్‌హజ్మీ పుస్తకాలంటే చాలా ఇష్టం. అయితే తన వయసు పిల్లలకోసం సరైన నవలలు లేవనిపించిందామెకు. తానే ఎందుకు రాయకూడదు అని ఆలోచించింది. ఆరేళ్ల వయసులోనే చిన్నచిన్నగా రాయడం మొదలుపెట్టి, పన్నెండేళ్లు వచ్చేనాటికి నవలలే రాసేసింది. మొదటి మూడు పుస్తకాలు పబ్లిష్ అయ్యేనాటికి అల్‌హజ్మీ వయసు 12 ఏండ్ల 295 రోజులు. మొదటి నవల ‘ట్రెజర్ ఆఫ్ ది లాస్ట్ సీ’ 2019లో పూర్తి చేసింది. దానికి సీక్వెల్‌గా ‘పోర్టల్ ఆఫ్ ది హిడెన్ వరల్డ్’ను, తరువాత మూడో పుస్తకంగా ‘బియాండ్ ద ఫ్యూచర్ వరల్డ్’ తీసుకొచ్చింది. ఇప్పుడు అల్‌హజ్మీకి 13 ఏళ్లు. నాలుగో పుస్తకం ‘పాసేజ్ టు అన్నోన్’ రాస్తోంది. -
సౌదీ యువరాజుపై సంచలన ఆరోపణలు.. ప్రపంచానికే ముప్పు!
అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. మరికొద్ది రోజుల్లో సౌదీ అరేబియాకు వెళ్లనున్న నేపథ్యంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌పై ఆ దేశ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి షాకింగ్ ఆరోపణలు గుప్పించారు. సౌదీ యువరాజు ఓ సైకో అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారానికి దారి తీశాయి. వివరాల ప్రకారం.. సౌదీ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి సాద్ అల్ జాబ్రి తాజాగా ఓ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కిరాయి సైనికులతో 'టైగర్ స్క్వాడ్' అనే దళాన్ని కూడా నడుపుతున్నాడని తెలిపాడు. ఈ దళం ప్రత్యేకంగా కిడ్నాపులు, హత్యలు చేస్తుందని ఆరోపించాడు. ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని ఓ ఉన్మాది అని మహ్మద్ బిన్ సల్మాన్ ను అభివర్ణించారు. భావోద్వేగాలు లేని కఠినాత్ముడు అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చేసిన హత్యలకు, నేరాలకు తామే సాక్షులమని అల్ జాబ్రి కుండబద్దలు కొట్టారు. ఇక యువరాజు బాగా ధనవంతుడు కావడంతో అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఓ ముప్పులా పరిణమించాడని సంచలన ఆరోపణలు గుప్పించాడు. అయితే, ఆ మాజీ అధికారి పేరు సాద్ అల్ జాబ్రి.. ఒకప్పుడు సౌదీ ఇంటెలిజెన్స్ విభాగంలో నంబర్ 2 స్ధానంలో విధులు నిర్వర్తించాడు. అల్ జాబ్రి అప్పట్లో మహ్మద్ బిన్ నయేఫ్‌కు సలహాదారుడిగా కూడా ఉన్నాడు. కాగా, మహ్మద్ బిన్ నయేఫ్‌ను 2017లో సౌదీ యువరాజు పీఠం నుంచి దించివేశారు. ఇదిలా ఉండగా.. అల్ జాబ్రి వ్యాఖ్యలను అమెరికాలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం కొట్టిపడేసింది. తన ఆర్థిక నేరాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి కామెంట్స్ చేశాడని స్పష్టం చేసింది. BIG REVEAL: Saad Aljabri, a former top Saudi intelligence official has said that Crown Prince Mohammed bin Salman keeps a team of mercenaries to kidnap—and even kill—political dissenters. @ericgarland @Abukar_Arman @TrueFactsStated pic.twitter.com/BquD2mr1i5 — Colossus Diplomacy (@ColossusDiplo) July 12, 2022 -
సౌది అరేబియా కథ: హాస్యగాడు అబునువాస్
పూర్వపు వాళ్లలోను, ఇప్పటి వాళ్లలోను మనం జ్ఞాపకం ఉంచుకో తగిన ఉపాయశాలులందరిలో గొప్పవాడెవడో చెప్పగలరా? కొందరు ఒకడు గొప్పవాడు అంటే మరికొందరు ఇంకొకడు మరీ గొప్పవాడంటారు. కానీ నిజం తెలిసినవాళ్లంతా అబునువాస్ పేరే చెబుతారు. అబునువాస్ జీవితమంతా హాస్యకథలుగా, తమాషాపనులతో, మంచి మంచి ఉపాయాలతో నవ్వుల మాటలతో గడచిపోయింది. అంతేకాదు ఎన్నోసార్లు తన యుక్తితో హాస్యంతో ఎన్నో చిక్కుల్లోంచి బయటపడ్డాడు. ఆయన ఎవ్వరినైనా సరే నవ్వించాలనుకున్నాడా.. తమాషా మాటల్తో కడుపుబ్బేట్టు నవ్వించేవాడు. ఎంత తెలివిగలవాడినైనా చాదస్తుడనిపించాలంటే ఏదో యుక్తిపన్ని బోల్తా కొట్టించేసేవాడు. మామూలు మనుషుల్నే కాదు మహారాజుల్నీ లెక్కలేకుండా హాస్యమాడేవాడు. ఈ అబునువాస్కు ఒక గాడిద ఉండేది. ఆ గాడిదకి నీళ్లు పెట్టటానికి ఒక పెద్దపళ్లెం కావలసివచ్చింది. పొరుగింటి వాళ్లను అడిగాడు. వాళ్లు అబునువాస్కు రాగిపళ్లెం ఇచ్చారు. దాన్ని మూడురోజులు తన వద్దే ఉంచుకున్నాడు. నాలుగోరోజున ఆ రాగిపళ్లెంలో ఇంకో చిన్నపళ్లెం పెట్టి ఆ రెండిటినీ తీసుకెళ్లి పొరుగింటివాళ్లకు ఇచ్చాడు. పక్కింటి పెద్ద మనిషి తమ రాగిపళ్లెంలో ఇంకో చిన్నపళ్లెం కూడా ఉడడం చూసి ‘అయ్యో ఈ చిన్నపళ్లెం మాది కాదే!’ అన్నాడు. దానికి అబునువాస్ ‘మీరిచ్చిందేదో మీకు తిరిగి ఇచ్చేశాను. మీ రాగిపళ్లెం నా దగ్గర ఉన్నప్పుడు దానికి ఈ చిన్నపళ్లెం పుట్టింది. ఇది రాగిపళ్లెం బిడ్డ కాబట్టి ఈ రెండూ మీవే’ అని చెప్పాడు. అబునువాస్ తెలివి తక్కువతనానికి నవ్వుకుని ఇంకో పళ్లెం కూడా వస్తూంటే పోనివ్వటమెందుకని ‘మీరు చెప్పింది నిజమే! మా పళ్లానికి పుట్టిన బిడ్డ కాబట్టి ఇదీ మాదే. పళ్లాలకు కూడా బిడ్డలు పుట్టే చల్లని ఇల్లు మీది’అన్నాడు పొరుగింటాయన. మూడురోజులు పోయాక అబునువాస్ మళ్లీ వాళ్లింటికి వెళ్లి ఆ పళ్లమే ఇంకోసారి అరువడిగాడు. ఈసారి ఇంకో మంచి బిడ్డను తీసుకొస్తుందనే సంతోషంతో వెంటనే ఆ ఇంటి యజమాని ఆ పళ్లాన్ని తెచ్చిచ్చాడు. అబునువాస్ నవ్వుకుంటూ ఆయనకు నమస్కారం పెట్టి రాగిపళ్లెం చంకనబెట్టుకొని ఇంటికి పోయాడు. ఈసారి పళ్లెం తీసుకుపోయి ఎన్నాళ్లయినా తిరిగి ఇవ్వలేదు. పొరిగింటాయన వచ్చి పళ్లెం కావాలని అడిగాడు. అబునువాస్ ఎంతో విచారంగా‘ఏం చేయమంటారు బాబూ.. మీకు పుట్టెడు దుఃఖవార్త చెప్పాల్సి వచ్చింది. మీ పళ్లెం చచ్చిపోయింది బాబూ’ అని చెప్పాడు. ‘ పళ్లెం చచ్చిపోవడమేమిటి?’ విస్తుపోయాడు పొరుగింటి మనిషి. ‘ఈ విషయం మీకు చాలా దుఃఖం కలుగజేస్తుందనే నేను మీకు ఇన్నాళ్లూ చెప్పలేదు. ఏం చెయ్యను? చివరికి చెప్పక తప్పలేదు’ అన్నాడు అబునువాస్. ఆ మాటకు పొరుగింటి పెద్దమనిషికి తగని కోపం వచ్చింది. ‘తమాషాగా ఉందా? రాగిపళ్లెం చావటమేమిటి?నన్ను పిచ్చివాణ్ణనుకుంటున్నావా?’ అంటూ మండిపడ్డాడు. ‘ఆ రాగిపళ్లమే కదండీ ఇంతకుముంద బిడ్డను కనిందీ..’ గుర్తుచేశాడు అబునువాస్.‘అవును’ చెప్పాడు పొరుగింటాయన. ‘ఈ సృష్టిలో బిడ్డల్ని కనేవన్నీ ఏనాడో ఒకనాడు చచ్చిపోకమానవు బాబూ? ఎటొచ్చీ మీ రాగిపళ్లెం పాపం పరాయింట్లో చచ్చిపోవటమే చాలా విచారకరం. ఏం చేస్తాం.. దానికి అలా రాసిపెట్టి ఉంది’ అని ఓదార్చాడు అబునువాస్. అలా ఆ రాగిపళ్లాన్ని తన దగ్గరే ఉంచేసుకున్నాడు. ఇంకోసారి ఒకడు అబునువాస్ దగ్గరకు వచ్చి అతని గాడిదను అరువు అడిగాడు. పని మీద తన గాడిద ఊరికి వెళ్లిందని అబునువాస్ చెప్తూండగానే పెరట్లోంచి గాడిద ఓండ్రపెట్టింది. ‘దొడ్లో గాడిద అరుస్తూంటే ఊరెళ్లిందని చెప్తున్నావ్.. నువ్వేం పెద్దమనిషవయ్యా?’ అంటూ నిలదీశాడతను. ‘నీకు కావలసింది మా గాడిదా? దాని అరుపా? గాడిదైతే ఇక్కడలేదు. దాని అరుపు కావాలంటే తీసుకుపో’ అంటూ గాడిదలాగా ‘ఈ.. ఓర్.. ఈ ..ఓర్’ అంటూ ఓండ్రపెట్టి ‘ఇదిగోనయ్యా.. గాడిద అరుపు. దానిమీద ఎక్కి నీ దారిన నువ్వు పో త్వరగా’ అని చెప్పాడు. తెల్లబోయాడు ఆ పెద్దమనిషి. ఇంకోసారి ఇంకా మంచి తమాషా జరిగింది. అబునువాస్ రెండంతస్తుల మేడ కట్టాడు. అంతా కట్టిన తరువాత ఆ మేడ అమ్మాలని బేరం పెట్టాడు. అంత పెద్దమేడ ఎవరికీ అవసరం లేకపోయింది. అడిగినవాళ్లే లేకపోయారు. చివరికెట్లాగో అబునువాస్ తన మేడ మీది అంతస్తు మాత్రం ఒక వ్యాపారస్తుడికి అమ్మగలిగాడు. వర్తకుడు మేడ మీద ప్రవేశించాక కిందిభాగం కూడా కొనమని అతణ్ణి అడగసాగాడు అబునువాస్. వ్యాపారస్తుడు మాత్రం తనకు అక్కర్లేదని చెప్పేశాడు. ఒకనాటి ఉదయం అబునువాస్ చాలామంది కూలీలను పిలిపించి తన ఇంటి గోడలు పగలగొట్టమన్నాడు. ఈ గడబిడ ఏమిటా అని పైనున్న వర్తకుడు కిటికీలోంచి కిందికి తొంగి చూశాడు. అంతమంది కూలీలు అబునువాస్ చెప్పినట్టే మేడ గోడలను కూలగొట్టసాగారు. కంగారుపడుతూ ఆ వర్తకుడు ‘ఏం చేస్తున్నారు?’ అంటూ అరిచాడు. ‘కింది అంతస్తు అమ్ముతానంటే ఎవరూ కొనలేదు. అందుచేత పగలగొట్టించేస్తున్నాను. నీ పై అంతస్తును జాగ్రత్తగా చూసుకో. నీ మేడ విరిగి నా కూలీల మీద పడి వాళ్లకు దెబ్బలు తగిలితే మాత్రం నేనూరుకోను’ అన్నాడు అబునువాస్. ‘పగలగొట్టించకండి.. కింది అంతస్తు కూడా నేనే కొంటాను’ అంటూ ఆ వర్తకుడు కింది అంతస్తు కూడా కొన్నాడు విధిలేక. ఆఖరికి ఆ ఊరి రాజుకూడా అబునువాస్ హాస్యపుదెబ్బ నుంచి తప్పించుకోలేకపోయాడు. ఒకనాటి రాత్రి రాజుకి ఒక కల వచ్చింది. అబునువాస్ ఇంటి కింద.. భూమిలో వెండినాణాలతో నిండిన బిందెలు ఉన్నట్టు రాజుకి కలలో కనబడింది. తెల్లవారే ఆ బిందెలను తవ్వుకురమ్మని పదిమంది పనివాళ్లను అబునువాస్ ఇంటికి పంపాడు రాజు. అప్పుడు అబునువాస్ ఇంట్లోలేడు. పనివాళ్లు ఇంటి కింది నేలను తవ్వేస్తూంటే ఏమీ చేయలేక ఏడుస్తూ దూరంగా నిలబడింది అబునువాస్ భార్య. ఎంత పెళ్లగించినా వెండిబిందెలు కనబడలేదు. రాజుగారి కూలీలు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. అబునువాస్ ఇంటికి రాగానే అతని భార్య ఏడుస్తూ సంగతంతా చెప్పింది. ‘మరేమీ పరవాలేదులే. రాజుగారికి తగిన శాస్తి నే చేస్తాగా! నువ్వు దిగులు పడకు’ అంటూ భార్యను ఓదార్చాడు అబునువాస్. వండిన అన్నాన్ని కొంత తీసి ఒక పళ్లెంలో వేసుకుని దాని మీద ఒక తువాలు కప్పాడు. తువాలు మీద చాలా ఈగలు వాలాయి. అందులో కొన్ని లోపలికి దూరి అన్నం తినటానికి ప్రయత్నించాయి. మరునాడు తెల్లవారగానే తువాలు కప్పిన అన్నపు పళ్లాన్ని రాజుగారి కోటకు తీసుకెళ్లాడు. ‘ప్రభూ.. నాదొక ఫిర్యాదు. కొందరు నా ఇంటికి పిలవకుండానే వచ్చి నా ఆహారాన్ని తినేస్తున్నారు. వాళ్లను దండించ కుండా ఎట్లా ఊరుకోమంటారో మీరే చెప్పండి’ అని రాజుగారిని అడిగాడు. అబున్వాస్ ఏదో కట్టుకథలాంటిది చెబుతున్నాడేమో అనుకున్నాడు రాజు. తన పనివాళ్లు అతని ఇంట్లో నేలను పెళ్లగించిన విషయం చెబుతున్నాడేమోనని కూడా రాజుకి అనుమానం కలిగింది. ‘ఇంతకీ నువ్వు ఫిర్యాదు చేస్తున్నది ఎవరి మీద?’ అని అడిగాడు రాజు. తను తెచ్చిన అన్నపు పళ్లెం మీద కప్పిన తువాలు తీశాడు అబునువాస్. వెంటనే మూడు ఈగలు ఎగిరిపోయాయి. ‘వీటి మీదే నా ఫిర్యాదు’ అన్నాడు అబునువాస్ ఆ ఈగలను చూపిస్తూ. రాజుకి నవ్వు వచ్చింది. ‘ఈగల మీదా నీ ఫిర్యాదు? సరే. నన్ను ఏం చేయమంటావో చెప్పు’ అన్నాడు. ‘చట్టంప్రకారం నాకు న్యాయం చెయ్యమంటున్నాను. ఈగల్ని దండించడానికి మీరు నాకు అనుమతి ఇవ్వాలి. అంతే ప్రభూ’ అన్నాడు అబునువాస్. ‘భేష్.. ఈగలను దండించటానికి నీకు అనుమతి ఇచ్చాను. ఈగలు ఎక్కడ కనిపించినా నీ ఇష్టం వచ్చినట్టు దండించు’ అన్నాడు రాజు నవ్వుతూ. రాజుగారు ఈ తీర్పుని ఒక కాగితం మీద కూడా రాసి సంతకం చేసి అబునువాస్కి ఇచ్చాడు. అబునువాస్ ఈగలను దండించటానికి పెద్ద దుడ్డుకర్ర చేయించాడు. ఆ కర్ర చివర గట్టి ఇనుప పొన్ను వేయించాడు. ఎక్కడ ఈగ కంటబడితే అక్కడ కర్రతో కొట్టేసేవాడు. బజారుకు వెళ్లినప్పుడు ఖర్జూరపు పళ్ల బుట్టల మీద ఈగలు వాలటం చూసి దుడ్డుకర్ర విసిరేవాడు. పళ్లన్నీ చితికిపోయేటట్టు కర్రతో బాదేవాడు. అంగడివాళ్లు ‘ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నావు?’ అని గదమాయించి అడిగితే ‘నేనేమీ మీ పళ్లను కొట్టటం లేదయ్యా! వాటి మీద వాలిన ఈగల్నే దండిస్తున్నాను’ అని జవాబు చెప్పి రాజుగారు ముద్రవేసి ఇచ్చిన అనుమతి పత్రాన్ని చూపించేవాడు. వాళ్లు ‘ఇదేం మేళంరా!’ అనుకుంటూ ఊరుకునేవాళ్లు. ఇట్లా కొన్ని రోజులు గడిచాయి. అబునువాస్ వెర్రి చేష్టలకు విసుక్కునేవాళ్లు విసుక్కుంటున్నారు. నవ్వుకునేవాళ్లు నవ్వుకుంటున్నారు. రాజుగారు కూడా ఈ వింత చేష్టలన్నీ విని విరగబడి నవ్వాడు. చివరకు ఒకనాడు రాజుగారు రాజసభలో తీర్పులు చెబుతున్నాడు. అబునువాస్ కూడా వెళ్లి రాజుగారికి దగ్గరగా కూర్చున్నాడు. రాజుగారు ఏదో నేరాన్ని విచారణచేశాడు. గంభీరంగా తీర్పు చెబుతుండగా రాజుగారి వీపు మీద ఈగ వాలింది. చటుక్కున తన దుడ్డుకర్రతో రాజుగారి వీపు మీద గట్టిగా బాదాడు అబునువాస్. అతని ఆ చర్యకు సభంతా ఘొల్లుమంది. అబునువాస్ను చుట్టుముట్టి గట్టిగా పట్టుకున్నారు. రాజుగారిని కొట్టినందుకు అతనిని శిక్షించాలని పట్టుబట్టారు. ‘అబునువాస్.. ఏమిటీ పిచ్చి? రాజుగారిని కొడతావా?’ అని అధికార్లు అబునువాస్ మీద మండిపడ్డారు. జంకుగొంకు లేకుండా అబునువాస్ ‘నేను తప్పేం చేయలేదే? నన్ను శిక్షించడం న్యాయంకాదు. నేను రాజుగారి వీపు మీద వాలిన ఈగను కొట్టానుగాని, రాజుగారిని కొట్టలేదు. రాజుగానే ఈగల్ని చంపటానికి నాకు అనుమతి ఇచ్చారు’ అని చెప్పాడు. రాజుగారు స్వయంగా సంతకం చేసి ఇచ్చిన అనుమతి పత్రం జేబులోంచి తీసి అందరికీ చూపించాడు. ఇంకేం మాట్లాడతారు? అతను చెప్పిందంతా నిజమే. అతనిని నిర్దోషిగా వదలక తప్పిందికాదు. ‘వెధవ ఈగలకి తగిన శాస్తి జరిగింది. అవి నా ఇంట్లో ప్రవేశించి దౌర్జన్యంగా నా సొమ్మును తీసుకోటానికి ఎందుకు ప్రయత్నించాలి?’ అన్నాడు అబునువాస్. మరోసారి ఇంకో విచిత్రమైన సంగతి జరిగింది. పట్నంలో ఒక భాగ్యవంతుడైన వర్తకుడు మేకమాంసం వండించి మంచి విందు తయారు చేస్తున్నాడు. విందు భోజనం వండేటప్పుడు ఒక బిచ్చగాడు అక్కడ ఏమి జరుగుతూందో చూద్దామని వచ్చాడు. పాపం.. వాడు కాస్త దూరంగా వంటలు తయారుచేసే చోటు నుంచి వచ్చే ఘుమఘుమలాడే ఆ గాలిని పీల్చుకుంటూ కూచున్నాడు. వాసనే ఇంత కమ్మగా ఉంటే ఆ భోజనం ఇంకెంత రుచిగా ఉంటుందోనని విందు గురించి ఊహించుకోసాగాడు. అయితే ఆ ధనవంతుడు, ఆ బిచ్చగాడికి పిడికెడు అన్నం కూడా పెట్టించలేదు. మరునాడు ఆ వర్తకుడు కనిపించినప్పుడు ‘అయ్యా.. మీరెంత మంచివారో.. మీ వంట పందిరి దగ్గరైనా నన్ను కూచోనిచ్చారు! మీ విందులోని పసందైన మేకమాంసం కూరల కమ్మని వాసన పీల్చేటప్పటికే నాకు సంతృప్తిగా భోజనం చేసినట్టయింది’ అన్నాడు. ‘సరి..సరి.. అందుకేనేమో నిన్న మా మేకమాంసం రుచీపచీ లేకుండా పోయింది. ఆ కమ్మని వాసనంతా నువ్వే పీల్చేసి ఉండాలి సందేహం లేదు’ అన్నాడు వర్తకుడు. అంతటితో ఊరుకోక రాజు వద్దకు వెళ్లి తన మేకమాంసం కూరల కమ్మని వాసనంతా అపహరించుకుపోయాడని బిచ్చగాడి మీద అన్యాయంగా ఫిర్యాదు చేశాడు. రాజు.. వర్తకుల పక్షపాతి కాబట్టి అతడు చెప్పిన ఫిర్యాదు నమ్మి ఆ నేరం చేసినందుకు బిచ్చగాడు పన్నెండు వెండి నాణాలు ఆ వర్తకుడికి ఇచ్చి తీరాలని తీర్పు చెప్పాడు. బిచ్చగాడి చేతిలో పైసా లేదు. పాపం ఏడుస్తూ వెళ్లిపోయాడు. అదృష్టవశాత్తు వాడికి అబునువాస్ ఎదురుపడ్డాడు. రాజుగారి అన్యాయపు తీర్పు సంగతి చెప్పాడు. అబునువాస్ జాలిపడి ‘నేను నీకు సాయం చేస్తాను దిగులుపడకు. నీ అప్పు తీర్చిపారెయ్యటానికి రేపు ఉదయం కలుసుకుందాంలే’ అని ధైర్యం చెప్పాడు. మరుసటి దినం అబునువాస్ బిచ్చగాడితో సహా రాజసభకు వెళ్లాడు. వర్తకుడు కూడా తన పైకాన్ని తీసుకోటానికి వచ్చాడు. అబునువాస్ వర్తకుణ్ణి చూసి ‘నీ డబ్బు చెల్లిస్తే పుచ్చుకోటానికి సిద్ధంగా ఉన్నావయ్యా?’ అని అడిగాడు. ‘ఆ సిద్ధంగానే ఉన్నాను. ఇవ్వండి’ అన్నాడు వర్తకుడు. అబునువాస్ పన్నెండు వెండి నాణాలు తీసి బిచ్చగాడి చేతికిచ్చాడు. ‘ఇదిగో.. వీటిని భూమి మీద పడెయ్యి’ అన్నాడు అబునువాస్. అట్లాగే బిచ్చగాడు ఆ నాణాల్ని నేల మీద పడేశాడు. అవి రాతి నేల మీద పడగానే గణగణమని మోగాయి. ‘విన్నావా? ఆ నాణాల టింగు టింగు మోత!’ అన్నాడు అబునువాస్. ‘ఆ విన్నాను..’ చెప్పాడు వర్తకుడు. ‘ఆ వెండినాణాల్లో నీకు రావలసిన భాగం ఆ టింగ్ టింగే. తీసుకో’ అన్నాడు అబునువాస్. ‘నీ భోజనం కమ్మదనం వాసన చూసినంత మాత్రాన నువ్వు నష్టపోతే ఆ బిచ్చగాడి డబ్బు గణగణ ధ్వని నువ్వు విన్నావు గనుక అది నీకు ముట్టినట్టే. ఇక వెళ్లు’ అన్నాడు అబునువాస్. అతను చెప్పిన న్యాయం ప్రకారం బిచ్చగాడు వర్తకుడికి పన్నెండు కాసులూ చెల్లించినట్టే అని రాజుగారు కూడా ఒప్పుకున్నారు. తగాదా తీరిపోయింది. (‘వేటగాడి కొడుకు ఇతర విదేశ కథలు’ సంకలనం నుంచి) చదవండి: బాలల దినోత్సవం 2021: బొమ్మలతో ఆటలాడుకునే వయసులో.. ఎన్నెన్ని ఘనతలో..! -
భారత్‌కు సౌదీ నుంచి 80 టన్నుల ఆక్సిజన్
దుబాయ్: తీవ్ర ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న భారత్‌కు సౌదీ అరేబియా 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను పంపుతోంది. అదానీ గ్రూపు, ఆక్సిజన్ ఉత్పత్తిదారు లిండే కంపెనీ సహకారంతో 80 టన్నుల ఆక్సిజన్‌ను పంపుతున్నట్లు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ‘రియాద్‌లో భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు. ప్రపంచం నలుమూలల నుంచి ఆక్సిజన్‌ను భారత్‌కు తరలించే మిషన్‌లో నిమగ్నమయ్యాం. 80 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌తో 4 క్రయోజనిక్ ట్యాంకులు నౌకలో దమ్మామ్ నుంచి ముంద్రా పోర్టుకు బయలుదేరాయి’ అని అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు. Thank you @IndianEmbRiyadh. Indeed, actions speak louder than words. We are on an urgent mission to secure oxygen supplies from across the world. This first shipment of 4 ISO cryogenic tanks with 80 tons of liquid oxygen is now on its way from Dammam to Mundra. (1/3) https://t.co/BLZ0SbQ499 pic.twitter.com/lFKnx0hIhX — Gautam Adani (@gautam_adani) April 24, 2021 -
శత్రువుల మధ్య చిగురించిన స్నేహం!
అల్ఉలా: సంవత్సరాల తరబడి సాగుతున్న కయ్యానికి తెరదించుతూ ఖతార్, సౌదీ అరేబియా స్నేహం దిశగా అడుగులు వేశాయి. మంగళవారం ఖతార్ రాజు షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని సౌదీ అరేబియా పర్యటనకు వచ్చారు. ఆయనకు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ స్వాగతం పలికారు. ఇరుదేశాల మధ్య ఉన్న సరిహద్దు నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. యూఎస్‌కు నమ్మకమైన మిత్రులుగా ఉన్న ఈ రెండు దేశాలకు మధ్య చాలా సంవత్సరాలుగా పొసగడం లేదు. ఈ వివాదానికి తెరదించుతూ రెండు దేశాలు తమ సరిహద్దులు తెరుస్తున్నట్లు ప్రకటించాయి. గల్ఫ్ అరబ్ నేతల వార్షిక సమావేశం అల్ఉలాలో జరగనుంది. ఇరాన్‌తో సంబంధాలు, ఇస్లామిస్టు గ్రూపులకు ఖతార్ సాయాన్ని నిరసిస్తూ నాలుగు అరబ్ దేశాలు (ఈజిప్టు, యూఏఈ, సౌదీ, బహ్రైన్) 2017 నుంచి ఖతార్‌తో సంబంధాలు తెంచుకున్నాయి. వీటిని గాడిన పెట్టేందుకు షేక్ తమిమ్ యత్నించనున్నారు. అమెరికా, కువైట్‌లు ఖతార్‌కు ఇతర అరబ్ దేశాలకు మధ్య సత్సంబంధాల కోసం మధ్యవర్తిత్వం నెరిపాయి. రాజీకి ఖతార్ ఎలాంటి ప్రతిపాదనలు ఒప్పుకున్నది ఇంకా తెలియరాలేదు. గల్ఫ్ ఐక్యత తిరిగి సాధించేందుకు తాము కృషి చేస్తామని ఖతార్ మంత్రి అన్వర్ గారాఘ్ష్ చెప్పారు. తాజా సమావేశాల్లో సౌదీతో ఖతార్ రాజు ఒప్పందాలపై సంతకాలు చేయవచ్చని ఓ అంచనా. ఖతార్‌తో సత్సంబంధాలు సాధించడం ద్వారా బైడెన్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వంతో బంధం బలోపేతం చేసుకోవాలని సౌదీ యోచిస్తోంది. యెమెన్‌తో యుద్ధం, ఇరాన్, అమెరికా మధ్య సంబంధాలు బలోపేతం నేపథ్యంలో సౌదీకి యూఎస్ సాయం ఎంతో అవసరం ఉంది. అయితే ఇప్పటికీ టర్కీ, ఇరాన్‌తో ఖతార్‌కు మంచి సంబంధాలుండడం, టర్కీ మరియు ఖతార్‌లు ముస్లిం బ్రదర్‌హుడ్‌కు మద్దతు ఇవ్వడం వంటివి అరబ్ దేశాలను ఆందోళనపరుస్తూనే ఉన్నాయి. అరబ్‌దేశాల బహిష్కరణతో ఖతార్ ఎకానమీ బాగా దెబ్బతిన్నది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇకపై ఖతార్ అడుగులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. -
ట్రంప్ దూకుడు.. 3 వేల బాంబుల అమ్మకానికి ఓకే
వాషింగ్టన్: అధ్యక్ష పీఠం నుంచి వైదొలగడానికి మరి కొద్ది రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాకు 290 మిలియన్ డాలర్ల(21,25,29,40,000 రూపాయలు) విలువ చేసే 3 వేల స్మార్ట్ బాంబుల అమ్మకానికి ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ మంగళవారం ఓ నోటీసును విడుదల చేసింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ నోటీసు ప్రకారం సౌదీ అరేబియాకు 3 వేల బోయింగ్ నిర్మిత జీబీయూ -39 స్మాల్ డయామీటర్ బాంబ్ ఐ (ఎస్డీబీ ఐ) ఆయుధాలు, సంబంధిత పరికరాలను విక్రయించడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ నిర్ణయం ట్రంప్ పదవీకాలం చివరి రోజుల్లో వస్తుంది. అయితే ప్రపంచంలోని అత్యంత భయంకరమైన మానవతా సంక్షోభానికి కారణమైన యెమెన్‌లో యుద్ధాన్ని ముగించాలని రియాద్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగా సౌదీ అరేబియాకు ఆయుధాల అమ్మకాలను నిలిపివేస్తామని నూతన అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల్లో హామీ ఇవ్వడం గమనార్హం. ఇక మిడిల్ ఈస్ట్‌లో అమెరికన్ ఆయుధాలను భారీగా కొనుగోలు చేసేది సౌదీ అరేబియానే. (చదవండి: కరోనా ప్యాకేజీపై ట్రంప్ సంతకం) "డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఈ రోజు అమ్మకం గురించి కాంగ్రెస్‌కు తెలియజేస్తూ అవసరమైన ధృవీకరణ పత్రాన్ని ఇచ్చింది" అని అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కంటైనర్లు, సహాయక పరికరాలు, సేవలు, విడి, మరమ్మతు భాగాలతో కూడిన జీబీయూ -39 ఎస్డీబీ ఐ మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేయాలని సౌదీ అరేబియా కోరినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ప్రతిపాదిత అమ్మకం "మధ్యప్రాచ్యంలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక వృద్ధికి ముఖ్యమైన శక్తిగా కొనసాగుతున్న స్నేహపూర్వక దేశం భద్రతను" మెరుగుపరచడానికి సహాయపడుతుందని విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. -
జియో ఫైబర్ : రిలయన్స్ తాజా ప్రణాళికలు
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో ప్లాట్ఫామ్లో ప్రపంచ దిగ్గజాల ద్వారా వరుస పెట్టుబడులతో హోరెత్తించిన ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన అననుబంధ సంస్థలో పెట్టుబడుల సమీరణపై దృష్టి కేంద్రీకరించింది. జియో ఫైబర్ పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకునేందుకు సన్నద్ధమవుతున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. (రిలయన్స్ : "నెట్‌మెడ్స్" డీల్) జియో ఫైబర్ లో మేజర్ వాటాను సౌదీ అరేబియా ఆధారిత పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పీఐఎఫ్)కు విక్రయించనుంది. తద్వారా వందకోట్ల డాలర్ల (సుమారు 7495 కోట్ల రూపాయలు) విలువైన పెట్టుబడిని రిలయన్స్ దక్కించుకోనుంది. అలాగే పీఐఎఫ్‌తో పాటు, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఎడిఐఎ) కూడా ఆర్ఐఎల్ తో మరో డీల్ చేసుకోనుంది. ఈ మేరకు ఇరు సంస్థలు చర్చలు జరుపుతున్నట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. 300 బిలియన్ డాలర్ల విలువైన పోర్ట్‌ఫోలియోను సాధించే లక్ష్యంలో భాగంగా ఈ చర్చలు సాగుతున్నట్టు తెలిపింది. అయితే ఈ ఒప్పందంపై ఆర్ఐఎల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈ రెండు ఒప్పందాలు నిర్ధారణ అయితే ఆర్ఐఎల్, సౌదీ, ఇతర గల్ఫ్ దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా పీఐఎఫ్ ఇప్పటికే జియోలో భారీ పెట్టుబడులు పెట్టింది. మరోవైపు మార్కెట్ క్యాప్ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ కంపెనీ సౌదీ అరామ్కో కూడా రిలయన్స్ పెట్రో కెమికల్ రిఫైనింగ్ వ్యాపారంలో మేజర్ వాటాను కొనుగోలు చేయడానికి ఆర్ఐఎల్తో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. -
‘ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు’
రియాధ్: కరోనా వైరస్ మన జీవితాలను తారుమారు చేసింది. ఓ పండగ లేదు.. వేడుక లేదు. కనీసం ఎవరైనా మరణిస్తే.. చూడ్డానికి వెళ్లాలన్నా భయపడే పరిస్థితులను తీసుకువచ్చింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు తమ ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రాలు, టూరిజం ప్లేస్‌లలో లాక్డౌన్ విధించాయి. సౌదీ అరేబియా కూడా ఈ ఏడాది మక్కాను దర్శించడానికి విదేశీయులను అనుమతించడం లేదు. ప్రతి ముస్లిం జీవితంలో ఒక్క సారైనా మక్కా వెళ్లాలనుకుంటాడు. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా హజ్ యాత్రకు అటంకం ఏర్పడింది. ఈ ఏడాది మక్కా దర్శనానికి కేవలం సౌదీ అరేబియాలో ఉన్న వారిని మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. దాంతో ఏటా దాదాపు 2.5 మిలయన్ల మంది మక్కాను దర్శించుకుంటుండగా ఈ ఏడాది వీరి సంఖ్య కేవలం 10 వేలకు మాత్రమే పరిమితమయినట్లు అల్ జజీరా తెలిపింది. వీరిని కూడా 50 మంది చొప్పున మాత్రమే కాబా దర్శనానికి అనుమతిస్తోన్నట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది. అంతేకాక మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటిస్తూ.. కాబా చుట్టు తిరగాలని ఆదేశించింది. (హజ్ యాత్రపై కోవిడ్ ప్రభావం) ఈ క్రమంలో ప్రస్తుతం మక్కాలోని పరిస్థితులకు సంబంధించిన ఫోటోలను మహ్మద్ అలీ హరిస్సి అనే వ్యక్తి తన ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. ‘ఈ రోజు మక్కాలో కనిపించిన నమ్మశక్యం కానీ దృశ్యాలు.. కరోనా హజ్ యత్రపై ఎలాంటి ప్రభావం చూపిందో ఇవి చూస్తే అర్థమవుతోంది’ అంటూ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. వీటల్లో యాత్రికులంతా రంగురంగుల గొడుగులు పట్టుకుని.. సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కాబా చుట్టూ తిరుగుతున్నారు. వీరందరిని ఓ వైద్యుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది. అంతేకాక ప్రతి రోజు ఈ మసీదును శుభ్రం చేయడానికి దాదాపు 35 వేల మంది పని చేస్తున్నారని తెలిపింది. మసీదును శానిటైజ్ చేయడం కోసం 54 వేల లీటర్ల క్రిమి సంహారక మందును, 1050 లీటర్ల ఎయిర్ ఫ్రెషనర్‌ని వినియోగిస్తున్నట్లు తెలిపింది. (కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్) Unbelievable scenes from Mecca today! Historic Hajj amid the threat of coronavirus. @AFP has amazing colorful photos on a very, very sunny day! pic.twitter.com/0RvTVwGWtd — Mohamad Ali Harissi (@aleeharissi) July 29, 2020 గతంలో రోజుకు రెండు, మూడు సార్లు మసీదును శుభ్రం చేస్తుండగా.. ప్రస్తుతం పది సార్లు క్లీన్ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. సాధారణంగా 40 రోజులపాటు సాగే ఈ యాత్రకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒకసారైనా హజ్ యాత్ర చేయాలన్నది నిర్దేశం. కరోనా నేపథ్యంలో ఈసారి యాత్ర జూలై 28 నుంచి ఆగస్టు 2 వరకు మాత్రమే నిర్వహిస్తున్నారు. -
10 వేల జనాభాకు 8 మందే డాక్టర్లు
సాక్షి, హైదరాబాద్ : మన దేశంలో ప్రతీ 10 వేల జనాభాకు ఎనిమిది మంది కంటే కొంచెం తక్కువగానే డాక్టర్లు ఉన్నారని ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ తెలిపింది. కరోనా నేపథ్యంలో అంతర్జాతీయంగా వివిధ దేశాల పరిస్థితిని విశ్లేషిస్తూ, భారత్‌లో పరిస్థితిపైనా తాజాగా విడుదల చేసిన నివేదికలో అనేక అంశాలను ప్రస్తావించింది. భారతదేశంలో మూడు నెలల లాక్డౌన్ సడలింపుల తరువాత కేసులు మరింతగా పెరుగుతున్నాయని తేల్చిచెప్పింది. ఆ నివేదిక ప్రకారం... మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలు అత్యధికంగా కరోనాతో దెబ్బతిన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రభా విత ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించాల్సిన పరి స్థితి ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లోనూ గణనీయమైన సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. (ఆన్లైన్ ఈ ‘లైన్’లో) కాబట్టి మున్ముందు వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందడానికి అవకాశాలున్నాయని తేల్చిచెప్పింది. ‘దీనికి ప్రధాన కారణం లాక్డౌన్ సమయంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో దేశవ్యాప్తంగా వైఫల్యం జరిగింది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించలేద’ని ల్యాన్సెట్ ఘాటైన విమర్శలు చేసింది. వైద్య ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పన, పునర్నిర్మాణం జరగలేదు. వైద్య, ఆరోగ్య సిబ్బంది నియామకం జరగలేదు. దీనిపై ఇప్పటికైనా దృష్టిసారించాలని, రాబోయే నెలల్లో కరోనా వైరస్‌ను అంతం చేయడానికి ఇది కీలకమని ల్యాన్సెట్ వ్యాఖ్యానించింది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే అమెరికా, బ్రెజిల్‌తోపాటు భారతదేశంలోనూ జూన్ 26 నుండి జూలై 3 వరకు లక్షకన్నా ఎక్కువ కొత్త కేసులు నమోదు కావడాన్ని ల్యాన్సెట్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. పేదలపై పంజా... కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. అందులో ఎక్కువగా పేదలను కాటేస్తోంది. ప్రపంచ జనాభాలో 66 శాతం మంది పేదలున్నారు. ఆ వర్గాలను మరింత పేదలుగా మార్చే దుస్థితి కరోనా కారణంగా ఏర్పడిందని ల్యాన్సెట్ పేర్కొంది. కరోనా రష్యాలో కూడా ఉధృతంగా కొనసాగుతోంది. ఇది మధ్య ఆసియా గుండా మధ్యప్రాచ్యం, భారత ఉపఖండంలోకి ప్రవేశించేలా ఒక బలమైన గొలుసుకట్టును ఏర్పరుచుకుంది. ఆదర్శంగా సౌదీ అరేబియా... సౌదీ అరేబియా కరోనా నేపథ్యంలో ఆరోగ్యరంగానికి మరింత బడ్జెట్‌ను కేటాయించింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పడకల సామర్థ్యాన్ని విస్తరించింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న రోగులకు ఉచిత ప్రవేశం కల్పించడానికి వందలాది జ్వరం క్లినిక్‌లను ప్రారంభించింది. ఆరోగ్య సిబ్బందికి అవసరమైన ప్రత్యేక శిక్షణ కల్పించిందని ల్యాన్సెట్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఐదు నెలల తరువాత కూడా వైరస్ సంక్లిష్టత కొనసాగుతూనే ఉందని తెలిపింది. -
గల్ఫ్ కార్మికులకు శుభవార్త..
మోర్తాడ్ (బాల్కొండ): కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల కారణంగా సొంతూళ్లకు వెళ్లిపోవాలనుకుంటున్న వలస కార్మికులకు కువైట్ మినహా అన్ని గల్ఫ్ దేశాలలోని భారత రాయబార కార్యాలయాలు శుభవార్తను అందించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా, ఒమన్, బహ్రెయిన్, ఖతర్ తదితర దేశాలలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్డౌన్ అమలవుతోంది. దీంతో అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. ఉద్యోగాలు కోల్పోయిన వేలాదిమంది భారత కార్మికులు తమను స్వదేశానికి రప్పించేలా చూడాలని కోరడంతో గల్ఫ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు వారిని ఆదుకోవడానికి చర్యలు చేపట్టాయి. ఇంటికి చేరుకోవాలనుకునే భారతీయ కార్మికులు మన విదేశాంగ శాఖ వెబ్‌పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రాయబార కార్యాలయాలు తెలిపాయి. -
సౌదీ రాజ కుటుంబంలో కరోనా కలకలం
రియాద్ : ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి సౌదీ రాజ కుంటుంబంలో కలకలం రేపింది. సౌదీ రాజ కుటుంబంతో కొన్ని వారాల క్రితం సన్నిహితంగా మెలిగిన ఆ దేశ ప్రతినిధుల్లో 150 మందికి కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తమయ్యారు.రియాద్ గవర్నర్ ఫైసల్ బిన్‌కు కరోనా సోకడంతో ఇప్పటికే ఆసుపత్రికి తరలించారు. ఫైసల్ బిన్(72) వయసులో పెద్దవాడు కావడంతో అతన్ని ఐసీయుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఇప్పటికే సౌదీ రాజు సల్మాన్, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌లతో పాటు మిగతావారు ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే సౌదీలో ప్రఖ్యాత మక్కా, మదీనాలను ప్రజలెవరు సందర్శించకుండా మార్చి మొదటివారంలోనే మూసివేశారు.(దేశంలో 5,734కు చేరిన కరోనా కేసులు) సౌదీ రాజులు వేల సంఖ్యలో ఉన్న నేపథ్యంలో వారు క్రమం తప్పకుండా యూరోప్ దేశాలకు వెళ్లివస్తుంటారు. కాగా విదేశాల్లో వైరస్ బారిన పడే అవకాశం ఉండడంతో ఇప్పటికే వారందరిని సౌదీకి తీసుకువచ్చి క్వారంటైన్లో ఉంచారు. కరోనా విజృంభిస్తోన్నసమయం కావడంతో దేశం వెలుపల, అలాగే సౌదీ ప్రావిన్సుల మధ్య ప్రయాణాలు చాలావరకు పరిమితం చేశారు. అలాగే సౌదీలోని నాలుగు గవర్నెన్పెలతో పాటు ఐదు ప్రధాన నగరాలు 24 గంటల లాక్డౌన్లో ఉంచబడినట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. కాగా ఇప్పటివరకు సౌదీలో 2932 కరోనా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 41కి చేరింది. -
మునివేళ్ల సృష్టి
అందమైన చిత్రాలను సున్నితమైన బ్రష్‌తో తీర్చిదిద్దుతారు. కానీ, కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన వినీ వేణుగోపాల్ తన మునివేళ్లతో అద్భుత చిత్రాలను రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు 200 కు పైగా చిత్రాలను బ్రష్ లేకుండా వేళ్లతోనే ‘గీసిన’ వినీని పరిచయస్తులందరూ ప్రశంసలలో ముంచెత్తుతున్నారు. ప్యాలెస్ చేరిన చిత్రం రంగులను అద్దుకున్న వేళ్లు తెల్లని కాన్వాస్ పైన కదులుతూ ఒక మంచి చిత్రంగా ప్రాణం పోసుకునే కళలో మూడేళ్లుగా రాణిస్తున్నారు వినీ. ప్రస్తుతం ఆమె సౌదీ అరేబియాలో ఉంటున్నారు. భర్త అక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. ఏడాదిన్నర కొడుకు. పేరు గెహాన్. వాడిని ఆడించడం కోసం రకరకాల ప్రయోగాలు చేసేవారు వినీ. ‘ఆ ప్రయోగాల ఫలితమే ఇది’ అంటూ ఇటీవల రియాద్‌లోని నైలా ఆర్ట్ గ్యాలరీలో తన వేలి చిత్రాలను ప్రదర్శనకు పెట్టారు. ఆ ప్రదర్శనలో ఉంచిన సౌదీ రాజు అమిర్ మహమ్మద్ బిన్ సల్మాన్ చిత్రం ఇప్పుడు అక్కడి ప్యాలెస్‌లో చేరింది! కొడుకు ఆటకు రంగులు వినీ చిన్నప్పటి నుంచే పెయింటింగ్‌లో తన ప్రతిభ కనబరిచేది. అయితే, ఫింగర్ పెయింటింగ్ మాత్రం మూడేళ్ల నుంచే వేస్తున్నారు ఆమె. ఆసక్తి కొద్ది తనకు తానే సాధన చేసిన వినీ ఇప్పుడు ఈ వర్క్‌లో బిజీగా మారిపోయారు. తన కొడుకు ఆట కోసం మైదా, అందులో కొన్ని ఫుడ్ కలర్స్‌ను ఉపయోగించే క్రమంలో కొడుకుతోపాటూ తనూ కొత్త కొత్త నమూనాలు తయారు చేశారు. అక్కణ్ణుంచే వేళ్లతో పెయింటింగ్ వేస్తే బాగుంటుందనే ఆలోచన చేసి, ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. వాటర్ కలర్స్, ఆక్రిలిక్, పేస్టల్ కలర్స్‌తో అందమైన కొలను, సముద్రం ఒడ్డున పిల్లలు కట్టే ఇసుక గూళ్లు.. ఇలా ఏదో ఒకదాన్ని ఆ పెయింటింగ్‌లో ప్రధాన అంశంగా తీసుకుంటారు వినీ. కర్ణాటకలో జరిగే కంబాల బఫెలో రేస్, భయంకరమైన వన్యమృగాల వేట, ఆటలకు సంబంధించిన అంశాలకు కూడా ఆమె తన వేళ్లతో ప్రాణం పోశారు. సౌదీలో ఉండటం వల్ల కావచ్చు.. వినీ చిత్రాల్లో ఎక్కువగా అరేబియన్ జీవన శైలి కనిపిస్తుంది. లాంతరు చేతిలో పట్టుకున్న అరబిక్ మహిళ, ఒంటెల సవారీ, ఎడారి, ఖర్జూర చెట్లు, కాక్టస్ మొక్కలు.. ఇలా ఎన్నో ప్రకృతి నేపథ్యాలు ఈ చిత్రాల్లో కనిపిస్తాయి. 2017లో బహ్రెయిన్‌లో జరిగిన త్రీడీ పెయింటింగ్‌లో గిన్నిస్ రికార్డ్‌ను, 2018లో డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఎక్సలెన్స్ అవార్డులను పొందారు వినీ. ఎంచుకున్న కళతో ఓ కొత్త దారి వేసుకుంటూ వినీ తనప్రత్యేకతను చాటుకుంటూ వెళుతున్నారు. – ఆరెన్నార్ -
'జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్ చేయలేదు'
వాషింగ్టన్ : వాట్సప్ మెసేజ్ ద్వారా అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్ అయిందని వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ వాషింగ్టన్‌లోని సౌదీ ఎంబసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు తమ ట్విటర్ ద్వారా అధికారులు స్పందిస్తూ.. బెజోస్ ఫోన్ హ్యాక్‌కు గురైందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. వెంటనే దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మహ్మద్ బిన్ సల్మాన్‌కు బెజోస్ ఫోన్ హ్యాక్ చేయాల్సిన అవసరం ఏముంటదని తెలిపారు. కాగా 2018లో సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ నుంచి ఓ వాట్సాప్ మెసేజ్ రిసీవ్ చేసుకున్న అనంతరం జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్ అయిందని వాషింగ్టన్ పత్రిక పేర్కొన్న విషయం తెలిసిందే. మహ్మద్ బిన్ సల్మాన్ వ్యక్తిగత వాట్సాప్ అకౌంట్ నుంచి వైరస్‌తో కూడిన వీడియో ఫైల్‌ను పంపడం ద్వారా 2018 నుంచి అమెజాన్ చీఫ్ ఫోన్‌కు సంబంధించిన డేటా చోరీకి గురైందని తమ కథనంలో పేర్కొంది. దీంతో పాటు 2018లో కాలమిస్ట్ జమల్ ఖషోగ్గి మరణానికి సౌదీ రాజుకు ప్రమేయముందని సెంట్రల్ కూడా తమ కథనంలో రాసుకొచ్చింది. (జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్ చేసిన సౌదీ రాజు) -
ఓఐసీ తీరు గమనించాలి
అంతర్జాతీయ రాజకీయ యవనికపై చోటు చేసుకుంటున్న పరిణామాలు, ప్రత్యేకించి మన దేశాన్ని ప్రభావితం చేయగలవాటిని సహజంగానే కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తుంటుంది. ఇప్పుడు సౌదీ అరేబియా నేతృత్వంలోని ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ(ఓఐసీ) కశ్మీర్‌పై పాకిస్తాన్లో వచ్చే ఏప్రిల్‌లో నిర్వహించతలపెట్టిన సదస్సును ఆ కోణంలోనే చూస్తోంది. సౌదీ అరేబియా మన మిత్ర దేశం. అంతర్జాతీయ వేదికల్లో చాన్నాళ్లుగా మన దేశానికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తుందన్నది వాస్తవం. ఈమధ్యకాలంలో ఓఐసీతో అడపా దడపా భారత్ వ్యతిరేక ప్రకటనలు ఇప్పించడంలో విజయం సాధించిన పాకిస్తాన్‌కు తాజా నిర్ణయం సంతోషం కలిగించింది. వాస్తవానికి కశ్మీర్‌పై ఓఐసీ విదేశాంగ మంత్రుల సదస్సు జరిపించాలని పాకిస్తాన్ ప్రయత్నించింది. కానీ దాన్ని సంస్థ సభ్య దేశాల పార్లమెంటేరియన్ల సదస్సుగా కుదించడా నికి సౌదీ తెరవెనక ప్రయత్నాలు గట్టిగానే చేసింది. అది చివరకు ఫలించింది. సమావేశ స్థలి ముందనుకున్నట్టు సౌదీ అరేబియా కాదని, పాకిస్తానేనని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మాత్రం జరగడమైనా పాకిస్తాన్ విజయమని చెప్పుకోవాలి. యాభైయ్యేళ్లక్రితం... అంటే 1969లో ఓఐసీ శిఖరాగ్ర సమావేశానికి మన దేశం ప్రతినిధి వర్గం హాజరైనప్పుడు అప్పటి పాకిస్తాన్ సైనిక నియంత జనరల్ యాహ్యాఖాన్ పట్టుబట్టి ఆ ప్రతినిధి వర్గాన్ని బయటకు పంపించగలిగాడు. అయితే 2019 ఫిబ్రవరిలో జరిగిన ఒక పరిణామంతో పాకిస్తాన్ ఖంగుతింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మార్చిలో జరగబోయే ఓఐసీ సమావేశాలకు భారత్‌ను ‘గౌరవS అతిథి’గా ఆహ్వానించబోతున్నామని అప్పట్లో సౌదీ అరేబియా ప్రకటించింది. అనంతరం అప్పటి విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ ఆ సమావేశానికి హాజరై భారత్ గళాన్ని వినిపించారు. అది మొదలు పాక్ ఓఐసీలో భారత వ్యతిరేక ప్రచారం చేస్తూనే వుంది. దాని ఫలితమే ప్రస్తుత పార్లమెంటేరియన్ల సమావేశం. వాస్తవానికి కశ్మీర్ ప్రతిపత్తిని మార్చినప్పుడు ఓఐసీ స్పందించింది. బాబ్రీ మసీదు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, పౌరసత్వ సవరణ చట్టం తదితర అంశాల్లో కూడా ఓఐసీ ప్రకటనలిచ్చింది. మైనారిటీలుగా వున్న ముస్లింల భద్రతను పట్టించుకోవాలని, పవిత్ర ఇస్లామిక్ స్థలాలను పరిరక్షించాలని మన దేశాన్ని కోరింది. వివక్షకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి గతంలో చేసిన తీర్మానాన్ని కూడా ప్రస్తా వించింది. వీటన్నిటి వెనకా పాకిస్తాన్ ఒత్తిళ్లున్నాయని సులభంగానే అర్ధమవుతుంది. భారత్‌ను శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించిన పది నెలల్లోనే ఓఐసీ వైఖరి మారడం సహజంగానే ఆశ్చర్యం కలిగిస్తుంది. మొత్తానికి ఓఐసీని తన దారికి తెచ్చుకోవడానికి పాకిస్తాన్ చాన్నాళ్లుగా చేస్తున్న ప్రయ త్నాలు ఈ నిర్ణయంతో కొత్త మలుపు తిరిగాయి. సంస్థపై పట్టున్న సౌదీ అరేబియాకూ, దాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవాలని ఆశిస్తున్న మలేసియాకూ వున్న విభేదాలను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాల పర్యవసానంగానే ఓఐసీ పార్లమెంటేరియన్ల సదస్సు జరగబోతోంది. స్వదేశంలో సమస్యలున్నప్పుడు, వాటిని తీర్చలేనప్పుడు ప్రజల దృష్టిని మళ్లించేందుకు పాల కులు రకరకాల ప్రయత్నాలు చేయడం ఏ దేశంలోనైనా వున్నదే. ఇప్పుడు ఓఐసీ పాకిస్తాన్‌కు ఆవిధం గానే వుపయోగపడుతోంది. కశ్మీర్ పౌరుల కోసం తాను అంతర్జాతీయంగా కృషి చేస్తున్నానని చెప్పుకోవడానికి పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఓఐసీ పార్లమెంటేరియన్ల సదస్సు తోడ్పడుతుంది. ఇలాంటి అవసరమే మలేసియా ప్రధాని మహతీర్ మహమ్మద్‌కు కూడా వుంది. అందుకే ఆయన కూడా ఈమధ్య తరచు కశ్మీర్‌పై ప్రకటనలు చేస్తున్నారు. ఓఐసీపై పట్టుకోసం చేస్తున్న ప్రయత్నాల వుద్దేశమూ అదే. కనుకనే ఆయన డిసెంబర్ నెలాఖరున టర్కీ సహకారంతో ఇస్లామిక్ దేశాల శిఖరాగ్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వెళ్లబోతున్నట్టు ప్రకటించి పాకిస్తాన్ సౌదీని కంగారుపెట్టింది. కానీ దాని ఒత్తిళ్లకు తలొగ్గి చివరి నిమిషంలో వెనక్కుతగ్గింది. ఈమధ్యే సౌదీ పర్యటనకెళ్లిన ఇమ్రాన్ ఖాన్ తన వైఖరి మార్చుకున్నారు. పాకిస్తాన్‌ను సంతృప్తిపరచడం కోసం కశ్మీర్‌పై ఓఐసీ దేశాల పార్ల మెంటేరియన్ల సదస్సు జరపడానికి సౌదీ అరేబియా అంగీకరించింది. మన దేశంలో ముస్లింలు మైనారిటీలే కావొచ్చుగానీ, చాలా ముస్లిం దేశాలతో పోలిస్తే మన దేశంలోని ముస్లిం జనాభా అధికం. నిజానికి ఈ కారణంతోనే 1969లో మన దేశాన్ని ఓఐసీ సమా వేశానికి ఆహ్వానించారు. ముస్లింల అభ్యున్నతి కోసం తీసుకునే ఓఐసీ తీసుకునే చర్యలు భారతీయ ముస్లింలకు కూడా చేరాలంటే ఇది సరైన మార్గమని దాని నిర్వాహకులు భావించారు. కానీ భారత్‌పై శత్రుత్వం వున్న పాకిస్తాన్ దీన్ని పడనివ్వలేదు. ముస్లిం దేశాల్లో అతి పెద్ద జనాభావున్న ఇండో నేసియాతోపాటు సిరియా, అల్జీరియా వంటివి కూడా మన దేశంపట్ల సానుకూలంగానే వున్నాయి. కశ్మీర్‌పై కఠిన పదజాలంతో ప్రకటన చేయడాన్ని అవి వ్యతిరేకించాయి. భారత్‌ని గౌరవ అతిథిగా ఆహ్వానించాలన్న నిర్ణయాన్ని ఈ ఏడాది మొదట్లో బంగ్లాదేశ్‌తోపాటు టర్కీ కూడా గట్టిగా సమర్థిం చింది. ఇప్పుడు మాత్రం భారత వ్యతిరేక ప్రకటనలు చేస్తోంది. కాగా, కొందరిని విదేశీయులుగా ముద్రవేసి తమ దేశం పంపాలని భారత్ చేస్తున్న ప్రయత్నాలపై బంగ్లాదేశ్ గుర్రుగా ఉంది. ఈ అంశాలపై మన దేశం ఆచితూచి వ్యవహరించాలి. తన చర్యల వెనకున్న ఉద్దేశాలపై ప్రపంచ దేశాలన్నిటికీ వివరించాలి. అదే సమయంలో ఓఐసీ అంతర్గత రాజకీయాల మాటెలావున్నా ఇక్కడి ప్రభుత్వ చర్య లపై అసమ్మతివుంటే దాన్ని వ్యక్తం చేయడానికి, ఒత్తిళ్లు తీసుకురావడానికి, పోరాడటానికి ఈ దేశ పౌరులకు సత్తావుంది. బలూచిస్తాన్ వంటిచోట స్థానికుల ఆకాంక్షలను అణచడానికి అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్న పాకిస్తాన్ కశ్మీర్ విషయంలో సద్దులు చెప్పడానికి, ఓఐసీలాంటి సంస్థను స్వప్రయోజనాలకు వాడుకోవాలని చూసే ప్రయత్నాల వల్ల ఒరిగేదేమీ వుండదు. -
సౌదీలో 88వేల ట్విట్టర్ ఖాతాలు బ్లాక్
వాషింగ్టన్: సౌదీ అరేబియాలో ఆ దేశ అధికారులకు అనుకూలంగా సందేశాలు పోస్ట్ చేస్తున్నందుకు గానూ దాదాపు 88 వేల అకౌంట్లను శుక్రవారం బ్లాక్ చేసినట్లు ట్విట్టర్ వెల్లడించింది. ఇక ట్రంప్‌నకు అనుకూలంగా, ప్రత్యర్థులను కించపరిచే రీతిలో పోస్టులు చేసినందుకు గానూ వియత్నాం, అమెరికా, జార్జియాలలో 600 అకౌంట్లను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సంస్థలు బ్లాక్ చేశాయి. అలాగే వియత్నాంలోని ఓ నెట్‌వర్క్‌ను బ్లాక్ చేసినట్లు ఫేస్బుక్ తెలిపింది. సౌదీలో బ్లాక్ చేసిన 88 వేల అకౌంట్లలో 5,927 అకౌంట్ల సమాచారాన్ని ట్విట్టర్ విడుదల చేసింది. సౌదీకి చెందిన సోషల్ మీడియామార్కెటింగ్ సంస్థ స్మాట్ సమాచార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు ట్విట్టర్ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది.