
సాక్షి, కొచ్చి : కేరళకు చెందిన 24 ఏళ్ల మహిళ నరకంలో నుంచి బయటపడింది. కట్టుకున్న భర్తే తనను తీవ్రంగా హింసించడంతోపాటు ఏకంగా ఉగ్రవాదులకు అమ్మేయాలని చేసిన కుట్రలో నుంచి తప్పించుకొని ప్రాణాలు రక్షించుకుంది. సౌదీఅరేబియాలోని జెడ్డాలో దాదాపు 80 రోజులపాటు ఓ గదిలో బందీగా ఉండి చివరకు తప్పించుకోగలిగింది. పోలీసుల వివరాల ప్రకారం మహ్మద్ రియాస్ అనే వ్యక్తి బాధితురాలు 2017లో బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు ప్రేమలో పడ్డారు. అనంతరం పెళ్లి చేసుకొని సౌదీకి వెళ్లారు. అక్కడి వెళ్లాక రియాజ్ తన అసలు వ్యక్తిత్వం బయటపెట్టాడు. ప్రతి రోజు ఆమెను కొట్టడంతోపాటు లైంగిక వేధింపులు మొదలుపెట్టాడు.
అశ్లీల వీడియోలు తీయడంతోపాటు ఆమెను ఓ గదిలో బందించి సిరియాలోని ఉగ్రవాదులకు అమ్మేసే కుట్ర చేశాడు. జెడ్డాలోని ఓ ఇంట్లో బంధించి దాదాపు 80 రోజులు బయటకు వెళ్లకుండా చేశాడు. వారి కదలికలను పసిగట్టిన ఆమె ఏదోలా ఇంటికి ఫోన్ చేసి తాను బంధీగా ఉన్న ప్రాంతాన్ని ఫొటోలు తీసి పంపించింది. వాటి ద్వారా ఆమె లొకేషన్‌ను గుర్తించిన బంధువులు నేరుగా విమానం టికెట్లు బుక్ చేసి ఆన్‌లైన్‌లో పంపించారు. పొరుగువారు ఆమె ఈ విషయంలో జెడ్డాలో సహాయం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులు ఎయిర్‌పోర్ట్‌లో ఎదురుచూడగా ఓ ట్యాక్సీ సాయంతో ఆమె ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి ఆ ఊబిలో నుంచి బయటపడింది. మొత్తం 12మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment