kerala woman
-
Inedible Ink: తొమ్మిదేళ్లయినా చెరగని సిరా గుర్తు!
ఓటేసినప్పుడు వేలిపై పెట్టే ఇంకు గుర్తు ఎన్ని రోజులుంటుంది? వారం. నెల. మహా అయితే రెండు మూడు నెలలు. కానీ కేరళకు చెందిన ఉష అనే ఓటరును మాత్రం తొమ్మిదేళ్లయినా సిరా గుర్తు వదలడం లేదు. ఆమెకు ఇదో పెద్ద తలనొప్పిగా కూడా మారింది! షోరన్పూర్లోని గురువాయూరప్పన్ నగర్లో ఉండే 62 ఏళ్ల ఉష 2016లో ఓటేసింది. ఆ సందర్భంగా వేలిపై వేసిన ఇంకు గుర్తు 9 ఏళ్లయినా మాసిపోలేదు. అనేక రకాల సబ్బులు, ద్రావణాలతో కడిగినా లాభం లేకపోయింది. ఆ తర్వాతి స్థానిక ఎన్నికల్లో ఓటేయడానికి వెళ్తే వేలిపై గుర్తు చూసి ‘నువ్విప్పటికే ఓటేశావు పొ’మ్మన్నారట ఎన్నికల అధికారులు! పోలింగ్ బూత్‌లోని ఏజెంట్లు అసలు విషయం చెప్పడంతో చివరికి ఓటేయడానికి అనుమతించారు. పోలింగ్ బూత్‌ల్లో ఎందుకీ గోల అని 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఉష ఓటే వేయలేదు! ఈసారీ అదే సమస్య ఎదురవుతుందేమోనని భయపడుతున్నారు.ప్రచారానికి వచ్చిన ఓ నాయకునికి విషయం చెప్పడంతో ఆయన ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరిస్తామని వాళ్లు హామీ ఇచ్చారట. ఎన్నికల సిరా గుర్తు ఇంతకాలం పాటు చెరగకుండా ఉన్న ఘటనలు ఎక్కడా లేవని వారు విస్తుపోతున్నారు! అయితే ఇలా జరిగేందుకు అవకాశం ఉందని చర్మవ్యాధి నిపుణులు అంటున్నారు. ‘‘సిరా చుక్క గోళ్ల కింద చేరితే మచ్చ అలాగే ఉండే చాన్సుంది. సమగ్ర వైద్య పరీక్షలు చేస్తే కారణం తెలుస్తుంది’’ అని చెబుతున్నారు. -
వాట్సాప్ స్టేటస్‌గా గర్ల్ ఫ్రెండ్ డెడ్‌బాడీ ఫొటో!
చెన్నై: గర్ల్ ఫ్రెండ్‌ను గొంతు పిసికి చంపేసిన ఓ యువకుడు, ఆమె మృతదేహం ఫొటోను తీసి వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. మృతురాలి స్నేహితులు గుర్తు పట్టి, పోలీసులను అప్రమత్తం చేయడంతో అతగాడు దొరికిపోయాడు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. కేరళలోని కొల్లంకు చెందిన ఫౌసియా(20) చైన్నైలోని ఓ హాస్టల్లో ఉంటూ క్రోంపేట్‌లోని కాలేజీలో నర్సింగ్ చదువుతోంది. ఆషిక్(20)అనే యువకుడితో అయిదేళ్లుగా సన్నిహితంగా ఉంటోంది. మైనర్‌గా ఉన్నప్పుడే ఫౌసియా గర్భవతి అయింది. ఆషిక్‌పై పోక్సో కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లాడు. ఫౌసియా పుట్టిన బిడ్డను దత్తతకిచ్చింది. జైలు నుంచి విడుదలయ్యాక ఆషిక్, ఫౌసియా సంబంధం తిరిగి కొనసాగుతోంది. శుక్రవారం చెన్నై వచ్చిన ఆషిక్ హోటల్లో రూం బుక్ చేసి, ఫౌసియాను వెంట తీసుకెళ్లాడు. అదే రోజు సాయంత్రం, మృతదేహం ఫొటోను తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. ఫౌసియా స్నేహితులు ఆ ఫొటోను గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే వెళ్లి హోటల్ రూంలో చూడగా ఫౌసియా మృతదేహం కనిపించింది. పరారీలో ఉన్న ఆషిక్‌ను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పట్టుకున్నారు. తనకు మరో యువతితో సంబంధముందని అనుమానిస్తూ మాట్లాడటంతో కోపం పట్టలేక ఫౌసియాను టీ షర్టుతో గొంతుకు బిగించి, చంపేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. -
స్తోమత లేక బడి మానేసి బీడీలు.. ఇప్పుడు అమెరికాలో జడ్జీగా తీర్పులు
తిరువనంతపురం: కష్టాలు వచ్చాయని ఆయన కుంగిపోలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో 10వ తరగతితోనే చదువు ఆపేశారు. తల్లిదండ్రులకు సాయం చేసేందుకు బీడీలు చుట్టారు. ఇళ్లల్లో పని మనిషిగానూ చేశారు. కట్ చేస్తే ప్రస్తుతం అమెరికాలో జడ్జీగా నియమితులై తీర్పులు చెబుతోంది. ఆయనే కేరళలోని కాసరగోడ్ ప్రాంతానికి చెందిన 51 ఏళ్ల సురేంద్రన్ కే పటేల్. ఇటీవలే అమెరికాలోని టెక్సాస్‌లో జిల్లా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తాను గతంలో బీడీలు చుట్టడం, పని మనిషిగా చేయటమే తన విజయానికి కారణమయ్యాయని చెప్పుకొచ్చారు సురేంద్రన్. ‘పైచదువులు చదివించే స్తోమత నా కుటుంబానికి లేకపోవడంతో 10వ తరగతి తర్వాత చదువు మానేశాను. రోజువారీ కూలీగా ఏడాది పాటు బీడీలు చుట్టాను. అదే జీవితంపై నా దృక్పథాన్ని మార్చేసింది.’అని పేర్కొన్నారు సురేంద్రన్ కే పటేల్. తన జీవితాన్ని మార్చుకునేందుకు చదువుకోవాలని నిర్ణయించుకున్నాని, అందుకోసం గ్రామంలోని తన స్నేహితులను సాయం చేయాలని కోరినట్లు గుర్తు చేసుకున్నారు. లా డిగ్రీ వరకు తనకు స్నేహితులు ఎంతగానో సాయపడినట్లు చెప్పారు. చదువుకునే రోజుల్లో ఓ హోటల్లో హౌస్‌కీపింగ్ జాబ్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఎల్ఎల్బీ పూర్తి చేసిన తర్వాత చేసిన ప్రాక్టీస్ అమెరికాలో నిలదొక్కుకునేందుకు సాయపడిందన్నారు. అమెరికాలోనూ తన జర్నీ అంత సాఫీగా సాగలేదని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గుర్తు చేసుకున్నారు సురేంద్రన్. ‘టెక్సాస్‌లో ఈ స్థాయికి రావడానికి చేసిన ప్రయత్నంలో నా మాటతీరుపై కామెంట్లు చేశారు. నాకు వ్యతిరేకంగా ప్రచారాలు చేశారు. నేను డెమోక్రటిక్ ప్రైమరీకి పోటీ చేసినప్పుడు నేను గెలవగలనని నా సొంత పార్టీ అనుకోలేదు. ఈ స్థాయికి వస్తానని ఎవరూ నమ్మలేదు. కానీ, నేను ఇక్కడ ఉన్నాను. అందరికి ఒకే ఒక్క సందేశం ఇవ్వాలనుకుంటున్నా. నీ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఎవరికీ ఇవ్వకు. ఆ నిర్ణయం నీ ఒక్కడిదే. ’ అని తెలిపారు సురేంద్రన్ -
ఒక్క రోజులో 81కోర్సులు
గంట సేపు స్థిరంగా కంప్యూటర్ ముందు కూర్చోవడమే కష్టం... కానీ 24గంటలు కూర్చొని 81 కోర్సులను పూర్తి చేయడం. ‘ఇంపాజిబుల్!’ అనుకుంటున్నారా. కానీ సాధించి చూపించింది రెహనా షాజహాన్. కేరళలోని కొట్టాయమ్‌కు చెందిన ఈ 25 ఏళ్ల మహిళ... అత్యధిక ఆన్లైన్ కోర్సులు పూర్తి చేసిన వ్యక్తిగా అంతర్జాతీయ రికార్డు సాధించింది. రికార్డు కోసం బహ్రైన్ వెళ్లిన రెహనా... ఫేస్బుక్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, సిస్కో.. ఇలా అనేక కంపెనీల నుంచి ఆన్లైన్ సర్టిఫికెట్లు పొందింది. ఉదయం 8 గంటలకు మొదలుపెడితే.. రాత్రి 11 గంటలకల్లా 66 సర్టిఫికెట్లు వచ్చాయి. వరల్డ్‌రికార్డు నెలకొల్పాలంటే ఇంకోగంటలో 9 కోర్సులు పూర్తి చేయాలి. ఒకానొక దశలో వదిలేద్దామా? అనుకుంది. వెంటనే ఆ ఆలోచన విరమించుకుని.. గంటలో తొమ్మిది కోర్సులు పూర్తి చేసింది. సర్టిఫికెట్ రావాలంటే.. ఒక్కో కోర్సులో 70శాతం మార్కులు రావాలి. అన్ని మార్కులూ సాధించింది. దుబయ్‌లోని ఓ కంపెనీ హెచ్ఆర్గా పనిచేస్తున్న రెహనా.. తండ్రి ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీకోసం ఉద్యోగానికి రిజైన్ చేసి ఇటీవలే ఇండియా వచ్చింది. ఇక్కడా ఖాళీగా లేదు. విద్యార్థులకు కెరీర్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్‌గా పనిచేస్తోంది. ఆన్లైన్ కోర్సులెలా చేయాలో గైడ్ చేస్తోంది. ఈ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే... రెహనా వాళ్ల చెల్లి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతోంది. సో చెల్లిలా ఏదైనా సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలన్నది ఆమె కల. జామియా మిల్లియా ఇస్లామియాలో ఎంకామ్ ఎంట్రన్స్ రాసి... హాఫ్ మార్కుతో అడ్మిషన్ కోల్పోయింది. ఆ యూనివర్సిటీలో చేరాలంటే మరో ఏడాది ఆగాలి. వేస్ట్ చేయడమెందుకని ఎమ్‌ఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా డిస్టెన్స్ కోర్సుల్లో చేరింది. ఆ తరువాత ఏడాదికే జామియాలో ఎంబీఏ సీటొచ్చింది. ఆ ఏడాది కేరళ నుంచి సీటు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి రెహనా. కోవిడ్ టైమ్‌లోనే ఆమె ఎంబీఏ అయిపోయింది. ఇంటర్వ్యూలకు వెళ్తే... కోవిడ్ టైమ్‌ను ఎలా ఉపయోగించుకున్నావని అడుగుతారు. అప్పుడు గుంపులో ఒకరిగా మిగిలిపోగూడదని.. ఎంబీఏ పూర్తవ్వగానే... ఒక రోజు 24 గంటల్లో 55 ఆన్లైన్ కోర్సులు పూర్తి చేసింది. అదే విషయాన్ని ఆమె పనిచేసిన ఎన్జీవో సీఈఓతో చెబితే... వరల్డ్ రికార్డ్‌కు ఎందుకు ట్రై చేయకూడదని ఓ సలహా ఇచ్చారు. అలా 24 గంటల్లో 81 కోర్సులు పూర్తి చేసి ఇలా స్ఫూర్తిగా నిలిచిందన్నమాట! -
అదృష్టాన్ని ఊహించగలమా?.. రూ. 44 కోట్లు గెల్చుకున్న లీనా
Kerala woman living in Abu Dhabi wins Big Ticket lottery Worth 44 Crores: నిజంగా అదృష్టాన్ని ఊహించగలమా? అలాంటి నమ్మకమే లేని ఓ యువతి.. సరదాగా తన కొలీగ్స్‌తో కలిసి టికెట్ కొన్న ఆ భారతీయ యువతికి జాక్‌పాట్ తగిలింది. అదీ కలలో కూడా ఆమె ఊహించని రేంజ్లో.. ఏకంగా 44 కోట్ల రూపాయల లాటరీ తగిలింది ఆమె టికెట్ మీద!. సౌదీ కంట్రీస్‌లో భారీ ప్రైజ్ మనీ లాటరీలు సర్వసాధారణం. అలాంటి జాక్‌పాట్ ఓ కేరళ యువతిని వరించింది. ఫిబ్రవరి 3న బిగ్ టికెట్ అబుదాబీ వీక్లీ డ్రా నిర్వహించారు. అందులో ఏకంగా 22 మిలియన్ల దీరామ్స్(మన కరెన్సీలో 44 కోట్ల 73 లక్షల 52 వేల 598 రూపాయల దాకా) ఆమె టికెట్ గెల్చినట్లు ప్రకటించారు. ఆమె పేరు లీనా జలాల్. లీనా స్వస్థలం కేరళ త్రిచూర్. అంజన్ గడి ప్రాంతానికి చెందిన ఆమె, ఉద్యోగరీత్యా గత నాలుగేళ్లుగా అబుదాబిలో ఉంటోంది. అబుదాబిలో షోయిదార్ ప్రాజెక్ట్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఎల్ఎల్ సీ అనే కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తోంది. ఈ మధ్య తన పది మంది ఆఫీస్ సహచరులతో కలిసి Terrific 22 million series 236లో భాగంగా ఆమె టికెట్ కొన్నది. తాజాగా డ్రా తీయగా, లీనా జలాల్ కొనుగోలు చేసిన టికెట్ కు రూ.44 కోట్ల భారీ ప్రైజ్ మనీ దక్కింది. అయితే, ఆ టికెట్ ను ఆమె తనతో పాటు ఆఫీసులో పనిచేసే మరో తొమ్మిది మందితో కలిసి కొనుగోలు చేసింది. దాంతో, ఆ ప్రైజ్ మనీని ఇప్పుడు వారందరూ పంచుకోనున్నారు. అయినప్పటికీ, ఒక్కొక్కరికి రూ.4 కోట్లు దాకా వస్తుంది. దీనిపై లీనా జలాల్ మాట్లాడుతూ.. లాటరీ తగిలిందని చెప్పగానే, తొలుత నమ్మలేకపోయానని వెల్లడించింది. తనకు మాటలు రావడంలేదని, దేవుడికి రుణపడి ఉంటానని తెలిపింది. అయితే, ఈ డబ్బును ఏంచేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని, కుటుంబ సభ్యులను అడిగిన తర్వాత నిర్ణయించుకుంటానని లీనా తెలిపింది. మరో నలుగురూ భారతీయులే.. బిగ్ టికెట్ అబుదాబీ వీక్లీ డ్రాలో లీనా కాకుండా గెలిచిన మరో నలుగురు కూడా భారతీయులే కావడం విశేషం. సెకండ్ ప్రైజ్‌ను సురాయిఫ్ సురు(2 కోట్ల రూ. పైగా), సిల్జోహ్న్ హోయాన్నన్ (కోటికి పైగా), నాలుగో ప్రైజ్ అన్జర్ సుక్కారియా(యాభై లక్షల రూ.), ఐదో ప్రైజ్ దివ్య (20 లక్షలరూ.) దక్కాయి. బంగ్లాదేశ్‌కు చెందిన నజీర్ అనే వ్యక్తికి రేంజ్ రోవర్ ఎవోక్యూ దక్కింది. మార్చి 3న ఈ ప్రైజ్‌మనీని, గిఫ్ట్‌ను అందించనున్నారు. -
కారు ప్రమాదం: భర్త డ్రైవింగ్.. భార్య మృతి
దుబాయ్: ఓ వ్యక్తి కారు పార్కింగ్ చేస్తున్న క్రమంలో అనుకోకుండా వాహనం భార్య మీదకు దూసుకెళ్లడంతో మహిళ మరణించింది. ఈ ఘటన దుబాయ్‌లో చోటుచేసుకోగా స్థానిక మీడియా సోమవారం ప్రచురించింది. వివరాలు.. లిజీ తన భర్తతో కలిసి శనివారం హెల్త్ చెకప్ కోసం తమ కమ్యూనిటీలోని ఆసుపత్రికి వెళ్లారు. యూఏఈలోని అజ్మాన్ ఎమిరేట్‌లోని ఆసుపత్రి వద్దకు వచ్చాక లిజీ కారు ఎదుట నిల్చోని వాహనాన్ని పార్కింగ్ చేస్తున్న తన భర్తకు డైరెక్షన్స్ చెబుతోంది. ఈ క్రమంలో అనుకోకుండా కారు వేగంగా ముందుకు దూసుకు రావడంతో లిజీని ఢికొని సరిహద్దు గోడకు తాకింది. చదవండి: దారుణం: ఏడేళ్లుగా అత్యాచారం.. కూతురికి గర్భం ఈ ప్రమాదంలో మహిళకు గాయాలవ్వగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. కాగా లీజీ, తన భర్త ఇద్దరూ కేరళకు చెందిన వారు. పదేళ్ల క్రితమే ఈ జంట దుబాయ్లోలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు ఇండియాలో ఇంజనీరింగ్ చేస్తుండగా కూతురు దుబాయ్‌లో చదువుతోంది. కాగా ఈ విషయం తెలియగానే యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ షాక్‌కు గురైనట్లు ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిట్టికా తెలిపారు. ఈ ఘటనపై అజ్మాన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడానికి ఇండియన్ అసోసియేషన్ కుటుంబానికి సహకరిస్తోందన్నారు. -
కరోనా బారిన కేరళ నర్స్
న్యూఢిల్లీ/తిరువనంతపురం: సౌదీ అరేబియాలోని ఒక ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తున్న కేరళ యువతికి ప్రాణాంతక కరోనా వైరస్ సోకింది. ఆమెను సౌదీలోని అసీర్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ‘అల్ హయత్ ఆసుపత్రిలో పనిచేస్తున్న దాదాపు 100 మంది భారతీయ నర్సులను పరీక్షించగా..ఒక నర్సుకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఆ నర్స్ ప్రస్తుతం కోలుకుంటోంది’ అని భారత విదేశాంగ శాఖ సహాయమంత్రి మురళీధరన్ గురువారం ట్వీట్ చేశారు. మిగతా నర్సుల్లో అత్యధికులు కేరళవారేనని, వారిలో ఎవరికీ ఈ వైరస్ సోకలేదని, సౌదీ విదేశాంగ శాఖతో జెడ్డాలోని భారతీయ రాయబారి సంప్రదిస్తున్నారని మురళీధరన్ పేర్కొన్నారు. ఆ నర్స్‌ది కొట్టాయం జిల్లాలోని ఎట్టుమన్నూర్ అని సమాచారం. కరోనా వైరస్ సోకిన తమ రాష్ట్రం వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని, అలాగే మిగతావారికి ఈ వైరస్ సోకకుండా జాగ్రత్త వహించాలని కోరుతూ కేరళ ముఖ్యమంత్రి విజయన్ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు లేఖ రాశారు. బుధవారం వరకు మొత్తం 60 విమానాల్లో వచ్చిన దాదాపు 13 వేల మంది ప్రయాణీకులను పరీక్షించామని, ఎవరిలోనూ వైరస్‌ను గుర్తించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, కొచ్చిన్, బెంగళూరు తదితర విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపింది. చైనాలో 630 కేసులు చైనాలో దాదాపు 630 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. 17 మంది చనిపోయారు. ఈ వైరస్‌ను మొదట గుర్తించిన వుహాన్ సహా ఐదు నగరాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. -
కిల్లర్ కోడలు
-
భర్తకు చెప్పకుండా లాటరీ.. కానీ..!
తిరువనంతపురం: అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనేమో..! యూఏఈలో నివాసముండే కేరళకు చెందిన సోప్నా నాయర్‌కు ఊహించని విధంగా జాక్‌పాట్ తగిలింది. అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్వహించే లాటరీలో బుధవారం ఆమెను భారీ లాటరీ వరించింది. వివరాలు.. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం వారు బిగ్ టిక్కెట్ లాటరీ నిర్వహిస్తున్నారు. సోప్నా గతంతో మూడునాలుగు సార్లు లాటరీ టిక్కెట్ కొనుగోలు చేసినప్పటికీ ఎలాంటి బహుమతి లభించలేదు. ఇటీవల మరోసారి తన అదృష్టం పరీక్షించుకొంది. తన భర్తకు తెలియకుండా ఐదోసారి టికెట్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన డ్రా.. బుధవారం జరిగింది. డ్రాలో సోప్నాకు 3.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.22 కోట్లు) బహుమతి వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. ఇక లాటరీ గెలుచుకోవడం పట్ల సోప్నా, ఆమె కుటుంబం ఆనందం వ్యక్తం చేశారు. గెలుచుకున్న సొమ్ములో కొంత నిరుపేదలను ఆదుకోవడానికి, మిగతాది తన కుటుంబ పోషణకు కేటాయిస్తానన్నారు సోప్నా. -
శ్రీలంక పేలుళ్లలో కేరళ మహిళ మృతి
తిరువనంతపురం/కొలంబో: శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్లలో మృతులు సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలోని ప్రముఖ చర్చిలు, హోటళ్లలోని విదేశీయులు లక్ష్యంగా బాంబు దాడులు జరిగాయి. ఈ పేలుళ్లలో కేరళకు చెందిన ఓ మహిళ కూడా మృతి చెందారు. బాధితురాలిని కాసర్గోడ్లోని మొగ్రాల్ పుత్తూరుకు చెందిన రసీనాగా గుర్తించారు. శ్రీలంక బాంబు పేలుళ్లలో రసీనా మృతి చెందినట్టు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ధ్రువీకరించింది. కొలంబో ఉన్న తమ బంధువులను కలవడం కోసం రసీనా అక్కడికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే రసీనా మృతదేహాన్ని వీలైనంతా తొందరగా స్వస్థలానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు కేరళ ప్రభుత్వ అధికారులు తెలిపారు. శ్రీలంకలో జరిగిన మరణహోమాన్ని కేరళ సీఎం పినరాయి విజయన్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఫేస్బుక్లో ఓ పోస్టు షేర్ చేశారు. అలాగే శ్రీలంకలోని రసీనా బంధువులతో, భారత హైకమిషన్ అధికారులతో తమ సిబ్బంది చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. శ్రీలంకలో ఆదివారం ఎనిమిది చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 207 మంది మరణించగా, 450 మందికి గాయాలయ్యాయి. మరణించినవారిలో 39 మంది విదేశీయులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పేలుళ్ల ఘటన అనంతరం శ్రీలంకలో ఎమర్జెన్సీ సర్వీసులు రంగంలోకి దిగాయి. శ్రీలంక వ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన అధికారులు.. కొలంబోలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. -
‘తలకు రంగేసుకుని ఆలయంలోకి వెళ్లాను’
తిరువనంతపురం : అన్ని వయసుల మహిళల్ని అయ్యప్ప ఆలయంలోనికి అనుమతించాలంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు నేలకొన్న సంగతి తెలిసిందే. అనేక ఆందోళనల నడుమ ఇప్పటికే ఎనిమిది మంది మహిళలు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. వీరేకాక కేరళకు చెందిన మంజు అనే 36 ఏళ్ల మహిళ కూడా ఆలయంలోకి ప్రవేశించానని తెలిపారు. తలకు తెల్లరంగు వేసుకుని అయ్యప్ప దర్శనం చేసుకున్నాని తెలిపారు మంజు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దాంతోపాటు ఎలా తాను అయ్యప్ప సన్నిధిలోకి వెళ్లిందనే వివరాలను కూడా షేర్ చేశారు మంజు. మంజు చెప్పిన వివరాలు.. ‘త్రిస్సూర్ నుంచి జనవరి 8న నా శబరిమల యాత్ర ప్రారంభించాను. అయితే ఆందోళనకారుల నుంచి వ్యతిరేకత ఎదురవకుండా ఉండాలనే ఉద్దేశంతో తలకు తెల్లరంగు వేసుకున్నాను. దాంతో నేను పెద్దవయసు స్త్రీలా కనిపించాను. ఈ ప్రయత్నం నాకు మంచే చేసింది. నన్ను చూసిన ఆందోళనకారులు పెద్దవయసు స్త్రీగా భావించి.. ఆలయంలోకి వెళ్లేందుకు అడ్డు చెప్పలేదు. దాంతో పోలీసుల సాయం లేకుండానే నేను అయ్యప్పను దర్శించుకున్నాను. ఆలయంలోకి ప్రవేశించిన నేను దాదాపు 2 గంటలపాటు సన్నిధానంలో గడిపానం’టూ చెప్పుకొచ్చారు మంజు. ఈ సమయంలో అఖిల భారత అయ్యప్ప సంఘం సభ్యులు తనకు చాలా సాయం చేశారన్నారు మంజు. అయితే గత ఏడాది అక్టోబరులోనే తాను అయ్యప్ప ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి.. విఫలమయ్యానని చెప్పారు మంజు. కానీ ఈ సారి మాత్రం దర్శనం చేసుకోగలిగానని సంతోషం వ్యక్తం చేశారు. -
కాపురం కూల్చిన వాట్సాప్ మెసేజ్..!
కొచ్చి : నకిలీ వార్తలు, పుకార్లతో దేశవ్యాప్తంగా అల్లర్లు, ఘర్షణలు చెలరేగి పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు తెలిసిందే. కేరళలోని కొచ్చిలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పొరపాటుగా పోస్టు చేసిన ఓ అడల్ట్ వీడియో శోభ అనే వివాహిత జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. వివరాలు.. సాజు జోసెఫ్‌కు చెందిన విద్యుత్ పరికరాల కంపెనీలో లిట్టో తంకచన్ ఉద్యోగం చేసేవాడు. 2015లో లిట్టో ఓ వాట్సాప్ గ్రూప్‌లో న్యూడ్ వీడీయో ఒకటి పోస్టు చేశాడు. వీడియోలో ఉన్నది సాజు భార్య శోభ అని పేర్కొన్నాడు. దీంతో సాజు కుటుంబంలో చిచ్చు రేగింది. నగ్నంగా ఉన్న వీడియోను శోభ కావాలనే ఇతరులకు పంపిందని ఆరోపిస్తూ సాజు ముగ్గురు పిల్లలతో కలిసి గత మూడేళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్నారు. భార్యతో విడాకులు మంజూరు చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించాడు. లిట్టో అరెస్టు.. శోభకు నరకయాతన తన పేరును, కుటుంబ పరువును రోడ్డుకీడ్చిన లిట్టోపై శోభ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. వీడియోలో ఉన్నది తాను కాదంటూ.. శోభ సైబర్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించారు. అందులో ఉన్నదెవరో తేల్చాలని ఫిర్యాదు చేశారు. కాగా, రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు.. రాష్ట్ర ఫోరెన్సిక్ లేబొరేటరీకి వీడియో పంపించి విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా వీడియోలో ఉన్నది శోభ కాదని తేల్చారు. వీడియో అస్పష్టంగా ఉండడంతో దాని మూలం (ఎక్కడి నుంచి వచ్చిందనే సమాచారం) సైతం కనుక్కోలేకపోతున్నామని ఫోరెన్సిక్ లేబొరేటరీ తమ నిసహాయతను తెలియజేసింది. ఓ వ్యక్తి పొరపాటు వల్ల తన జీవితం నాశనమైందని శోభ (36) వాపోయారు. గత మూడేళ్లుగా తన పిల్లలకు దూరంగా బతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అందరిలా నా పిల్లలు.. బయట తిరగకూడదా..! వాళ్ల అమ్మ క్యారెక్టర్ గురించి ఎవరైనా నీచంగా మాట్లాడితే వాళ్లు భరిస్తారా’ అని శోభ కన్నీటి పర్యంతం అయ్యారు. వీడియోలో ఉన్నది తాను కాకున్నా తన జీవితంలో తీవ్ర అలజడి రేగిందనీ, ఇప్పటికీ ఆ వీడియో షేర్ కాకుండా సైబర్ బ్రాంచ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని శోభ వాపోయారు. ఇదిలాఉండగా.. వీడియో వ్యవహారం ఎలా ఉన్నా.. మళ్లీ శోభను మా జీవితాల్లోకి ఆహ్వానించబోమని సాజు వెల్లడించారు. తామంతా తిరిగి కలిసేది లేదని చెప్పారు. -
భార్యను ఉగ్రవాదులకు బేరం.. 80 రోజులు బందీ
సాక్షి, కొచ్చి : కేరళకు చెందిన 24 ఏళ్ల మహిళ నరకంలో నుంచి బయటపడింది. కట్టుకున్న భర్తే తనను తీవ్రంగా హింసించడంతోపాటు ఏకంగా ఉగ్రవాదులకు అమ్మేయాలని చేసిన కుట్రలో నుంచి తప్పించుకొని ప్రాణాలు రక్షించుకుంది. సౌదీఅరేబియాలోని జెడ్డాలో దాదాపు 80 రోజులపాటు ఓ గదిలో బందీగా ఉండి చివరకు తప్పించుకోగలిగింది. పోలీసుల వివరాల ప్రకారం మహ్మద్ రియాస్ అనే వ్యక్తి బాధితురాలు 2017లో బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు ప్రేమలో పడ్డారు. అనంతరం పెళ్లి చేసుకొని సౌదీకి వెళ్లారు. అక్కడి వెళ్లాక రియాజ్ తన అసలు వ్యక్తిత్వం బయటపెట్టాడు. ప్రతి రోజు ఆమెను కొట్టడంతోపాటు లైంగిక వేధింపులు మొదలుపెట్టాడు. అశ్లీల వీడియోలు తీయడంతోపాటు ఆమెను ఓ గదిలో బందించి సిరియాలోని ఉగ్రవాదులకు అమ్మేసే కుట్ర చేశాడు. జెడ్డాలోని ఓ ఇంట్లో బంధించి దాదాపు 80 రోజులు బయటకు వెళ్లకుండా చేశాడు. వారి కదలికలను పసిగట్టిన ఆమె ఏదోలా ఇంటికి ఫోన్ చేసి తాను బంధీగా ఉన్న ప్రాంతాన్ని ఫొటోలు తీసి పంపించింది. వాటి ద్వారా ఆమె లొకేషన్‌ను గుర్తించిన బంధువులు నేరుగా విమానం టికెట్లు బుక్ చేసి ఆన్లైన్లో పంపించారు. పొరుగువారు ఆమె ఈ విషయంలో జెడ్డాలో సహాయం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులు ఎయిర్‌పోర్ట్‌లో ఎదురుచూడగా ఓ ట్యాక్సీ సాయంతో ఆమె ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి ఆ ఊబిలో నుంచి బయటపడింది. మొత్తం 12మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. -
శ్రీలక్ష్మి ఏం చేసిందో తెలుసా?
‘మనం ఎప్పుడు కలుద్దాం, మీ రేటు ఎంత, రూ. 3000కు వస్తావా, హోటల్ గది బుక్ చేయమంటారా’.... కేరళ మహిళ శ్రీలక్ష్మి సతీశ్ కు వచ్చిన ఫోన్లలో వినిపించిన మాటలు ఇవి. విద్యా సంస్థ కన్సల్టెన్సీ సీఈవో, మోటివేషనల్ స్పీకర్ గా పనిచేస్తున్న ఆమెకు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడారు. ఒకడైతే రూ. 25000 ఇస్తానని వాగాడు. ఇవన్నీ భరించలేక ఆమె సెల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు తనకు ఫోన్ చేసిన వారికి ఆమె మళ్లీ ఫోన్ చేశారు. తన నంబర్ ఉన్న వాట్సాప్ గ్రూప్ తో జరిపిన సంభాషణ స్ర్కీన్ షాట్లను ఆమె సంపాదించారు. దీని ఆధారంగా తన ఫోన్ నంబర్ ను దుర్వినియోగం చేసిన వ్యక్తిని గుర్తించారు. నిందితుడు ఒక జాతీయ పార్టీ యువజన విభాగంలో ప్రాంతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నాడని తెలుసుకున్నారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో పార్టీ నాయకులు రంగంలోకి దిగి ఈ వ్యవహారాన్ని కోర్టు బయటే రాజీ చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు శ్రీలక్ష్మి పలు షరతులు విధించారు. తన ఫోన్ నంబర్ ను దుర్వినియోగం చేసిన వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరించాలని, దీనికి సంబంధించిన సమావేశం వివరాలు తనకు అందించాలని నిష్కర్షగా చెప్పారు. గురువారం రాత్రి 8 గంటలకు సానుకూల స్పందన రాకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో నిందితుడి తండ్రి శ్రీలక్ష్మి వద్దకు వచ్చి తన కొడుకును క్షమించాలని, కేసు పెట్టొద్దని వేడుకున్నాడు. తాను చెప్పినట్టుగా చేస్తే కేసు పెట్టనని చెప్పడంతో ఆయనకు ప్రాణం లేచొచ్చింది. నిందితుడు ఏదైనా స్వచ్ఛంద సంస్థకు కూ. 25000 విరాళం ఇవ్వాలని, దీనికి సంబంధించిన రసీదు తనకు అందజేయాలని అన్నారు. శ్రీలక్ష్మి చెప్పినట్టుగానే చేసి రసీదు ఆమెకు ఇచ్చారు. తన కోపం చల్లారకపోవడంతో ఈ వ్యవహారం గురించి తన ఫేస్ బుక్ పేజీలో వివరంగా రాశారు. దీనికి 1317 షేర్లు, 1200 కామెంట్లు, 4500 లైకులు వచ్చాయి. తనను అవమానించిన వాడికి తగిన గుణపాఠం చెప్పారని శ్రీలక్ష్మిని అందరూ ప్రశంసించారు. అయితే ఇదంతా తాను ప్రచారం కోసం చేయలేదని ‘మలయాళం మనోరమ’తో శ్రీలక్ష్మి చెప్పారు. -
రాజమహేంద్రవరంలో సామూహిక అత్యాచారం
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దారుణం చోటు చేసుకుంది. స్నేహితురాలి పెళ్లి కోసం రాజమండ్రి వచ్చిన ఓ యువతిని ముగ్గురు రౌడీ షీటర్లు అపహరించారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తరలించి... ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత యువతిని ఆదివారం ఆటోలో రాజమహేంద్రవరంకి తీసుకుని వస్తున్న క్రమంలో సదరు వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు రౌడీ షీటర్లతోపాటు యువతి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దాంతో యువతి పోలీసులకు జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అలాగే ముగ్గురు రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని... ఆసుపత్రికి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి... విచారణ చేపట్టారు. అయితే బాధితురాలు కేరళ రాష్ట్రానికి చెందిన యువతి అని పోలీసులు తెలిపారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో స్నేహితురాలి పెళ్లి నేపథ్యంలో శనివారం రాత్రి రాజమహేంద్రవరం వచ్చింది. అక్కడే మద్యం సేవిస్తున్న ముగ్గురు రౌడీషీటర్లు ఆమెను అపహరించారని పోలీసులు చెప్పారు. -
నా ఫొటో వాడుతారా.. దావా వేస్తా!
ఎందుకొచ్చిన బాధరా అంటూ కేరళ సర్కారు తల పట్టుకుంటోంది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన 'నిర్భయ కేరళం సురక్షిత కేరళం' అనే కార్యక్రమ ప్రచార ప్రకటనలలో.. తన అనుమతి లేకుండా తన ఫొటో ఎలా ఉపయోగిస్తారంటూ ఓ మహిళ కేరళ సర్కారును నిలదీస్తున్నారు. సర్కారును కోర్టుకు ఈడుస్తానని బెదిరిస్తున్నారు. తన అనుమతి లేకుండా ఈ పథకానికి ప్రచారంలో తన ఫొటోను ఉపయోగించుకోవడంపై పరువునష్టం దావా వేయనున్నట్లు ఆమె చెప్పింది. ఇద్దరు బిడ్డల తల్లి అయిన ఆమె, భర్త మరణించాక బహ్రెయిన్‌లో ఉద్యోగం చేసుకుంటోంది. ఈ వివాదం నేపథ్యంలో ప్రకటనను రూపొందించిన ప్రజా సంబంధాల శాఖ నుంచి రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి కేసీ జోసెఫ్ వివరణ కోరారు. కేరళ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఈ పథకాన్ని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ గతవారం కొచ్చిలో ప్రారంభించారు. మరో ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె ఉన్నట్లున్న ప్రకటన స్థానిక దినపత్రికలలోప్రముఖంగా దర్శనమిచ్చింది. దీంతో ఆమె స్నేహితులు ఫోన్ చేసి, మోడలింగ్‌కు వెళ్లావా అని అడగడంతో ఆమె దిగ్భ్రాంతి చెందింది. ఇంటర్నెట్ లోంచి ఆమె ఫొటోను తీసుకున్నట్లు పౌరసంబంధాల శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.