రాజమహేంద్రవరంలో సామూహిక అత్యాచారం
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దారుణం చోటు చేసుకుంది. స్నేహితురాలి పెళ్లి కోసం రాజమండ్రి వచ్చిన ఓ యువతిని ముగ్గురు రౌడీ షీటర్లు అపహరించారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తరలించి... ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత యువతిని ఆదివారం ఆటోలో రాజమహేంద్రవరంకి తీసుకుని వస్తున్న క్రమంలో సదరు వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు రౌడీ షీటర్లతోపాటు యువతి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దాంతో యువతి పోలీసులకు జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అలాగే ముగ్గురు రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని... ఆసుపత్రికి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి... విచారణ చేపట్టారు. అయితే బాధితురాలు కేరళ రాష్ట్రానికి చెందిన యువతి అని పోలీసులు తెలిపారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో స్నేహితురాలి పెళ్లి నేపథ్యంలో శనివారం రాత్రి రాజమహేంద్రవరం వచ్చింది. అక్కడే మద్యం సేవిస్తున్న ముగ్గురు రౌడీషీటర్లు ఆమెను అపహరించారని పోలీసులు చెప్పారు.