ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు(ఫైల్ ఫొటో)
రాజమహేంద్రవరం క్రైం: యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నలుగురు నిందితుల్ని రాజమహేంద్రవరం అర్భన్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాజమహేంద్రవరం సెంట్రల్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషినల్ ఎస్పీ రెడ్డి గంగాధర్ వివరాలు వెల్లడించారు. నిర్భయ చట్టం కింద నిందితులపై కేసులు పెట్టినట్లు చెప్పారు.
ఈ నెల 16వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో రాజేంద్రనగర్‌లో ఉంటున్న యువతి తన స్నేహితులతో కలసి టీటీడీ కల్యాణ మండపం వద్దకు తన స్నేహితురాలి అన్న పెళ్లికి మండపం అలంకరణ నిమిత్తం మోటారు సైకిల్‌పై బయలుదేరింది. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్లు కక్కల సతీష్, తాడేపల్లి ప్రేమ్‌కుమార్, పాత నేరస్తులైన పలివెల రాజు, (అలియాస్ స్ట్రిక్) కంచి సత్యమణికంఠలు వారిని అడ్డగించి దౌర్జన్యంగా యువతిని రాజమహేంద్రవరం రూరల్ కవలగొయ్యి వద్ద నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక ఆత్యాచారానికి పాల్పడ్డారు.
అనంతరం బాధితురాలని ఇంటి వద్ద దించడానికి స్కూటర్‌పై తీసుకువస్తుండగా నందం గనిరాజు సెంటర్‌లో లారీ ఢీకొనడంతో యువతికి గాయూలయ్యాయి. ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి నిందితులు పరారయ్యూరు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలోని హుకుంపేటలో కరగాని వాసు ఇంట్లో నిందితులు తలదాచుకున్నట్లు సమాచారం తెలుసుకుని అరెస్ట్ చేశారు. నిర్భయతోపాటు 341, 376- సి, 365, 323, 506 సెక్షన్ల కింద కూడా నిందితులపై కేసు నమోదు చేసినట్లు అదనపు ఎస్పీ దామోదర్ వివరించారు.
అనంతరం బాధితురాలని ఇంటి వద్ద దించడానికి స్కూటర్‌పై తీసుకువస్తుండగా నందం గనిరాజు సెంటర్‌లో లారీ ఢీకొనడంతో యువతికి గాయూలయ్యాయి. ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి నిందితులు పరారయ్యూరు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలోని హుకుంపేటలో కరగాని వాసు ఇంట్లో నిందితులు తలదాచుకున్నట్లు సమాచారం తెలుసుకుని అరెస్ట్ చేశారు.
(చదవండి: రాజమహేంద్రవరంలో సామూహిక అత్యాచారం)