Four accused
-
సినీ ఫక్కీలో సిద్ధాంతి కిడ్నాప్
సాక్షి, నిడదవోలు (పశ్చిమ గోదావరి) : ఇంటిలిజెన్స్ ఆఫీసర్ తీసుకురమ్మంటున్నారని సివిల్ డ్రెస్‌లో వచ్చిన నలుగురు ప్రముఖ సిద్ధాంతిని కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. నిడదవోలుకు చెందిన ప్రముఖ సిద్ధాంతి వీరభద్ర శాస్త్రిని గుర్తు తెలియని నలుగురు ఉదయం 8గంటల సమయంలో విజయవాడ నుంచి ఇంటిలిజెన్స్ ఆఫీసర్ తీసుకురమ్మంటున్నారని చెప్పి కిడ్నాప్ చేశారు. ముందుగా సిద్ధాంతి చేతిలోని సెల్ ఫోన్ లాక్కున్న కిడ్నాపర్లు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు అతని భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త ఎక్కడికి వెళ్లాడో తెలియక ఆమె కన్నీళ్ల పర్యంతమయ్యింది. కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొవ్వూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. -
హత్యకేసులో నిందితుల అరెస్ట్
ఏలూరు అర్బన్: పెదపాడు మండలం నాయుడుగూడెంలో జరిగిన హత్య కేసుకు సంబంధించి నలుగురు నిందితులను పెదపాడు పోలీసులు అరెస్ట్ చేశారని ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పెదపాడు మండలం నాయుడుగూడెం గ్రామంలో గత నెల 16న కొల్లి నాగమోహన్ (40) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని పెదపాడు 17వ తేదీన పోలీసులకు సమాచారం అందిం ది. డీఎస్పీ ఆదేశాల మేరకు ఏలూరు రూరల్ సీఐ అడపా నాగమురళి, పెదపాడు ఎస్సై కె.రామకృష్ణ ఘటనా స్థలా నికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మృతుడు నాగమోహన్కు అదే గ్రామానికి చెందిన బేతపూడి భార్గవి అనే వివాహితతో వివా హేతర సంబం«ధం ఉందని గుర్తిం చారు. భార్గవి కుటుంబసభ్యులు హత్య కు పా ల్పడి ఉండవచ్చని భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు వేగవంతం చేశారు. భార్గవి భర్త బేతపూడి ఉదయకుమార్, అతని పినతండ్రి బేతపూడి జాన్ విలి యమ్, ఉదయకుమార్ స్నేహితులు వే మూరి రాజేష్, మాతంగి శ్యాంసన్ పరా రీలో ఉన్నారని తెలుసుకుని వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ విషయం తెలి సిన నలుగురు నిందితులు మంగళవారం పెదపాడు వీఆర్వో బి.కోటేశ్వరరావు వద్ద నేరం అంగీకరించి లొంగిపోయారు. నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న వీఆర్వో వారిని పెదపాడు పోలీస్‌స్టేషన్‌లో హాజరుపరిచారని డీఎ స్పీ వెంకటేశ్వరరావు చెప్పారు. రూరల్ సీఐ అడపా నాగమురళి, పెదపా డు ఎస్సై కె.రామకృష్ణ పాల్గొన్నారు. ఇది పరువు హత్య: డీఎస్పీ నాగమోహన్‌తో తన భార్య భార్గవి వివా హేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న భర్త ఉదయకుమార్ ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పురాలేదు. పైగా భర్తతో గొడవ పెట్టుకుని భార్గవి దాదాపు ఏడాది కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో కుల పెద్దలు, పినతండ్రి జాన్ విలియంతో కలిసి ఉదయ్‌కుమార్ అత్తగారింటికి వెళ్లి భార్యను తిరిగి నాయుడుగూడెం తీసుకువచ్చాడు. ఇంత జరిగినా ఆమె ప్రవర్తన మార్చుకోకపోగా నాగమోహన్‌తో సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఈనేపథ్యంలో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు భార్గవి ప్రయత్నించింది. ఉదయ్‌కుమార్‌ను ట్రా క్టర్‌తో ఢీకొట్టేందుకు నాగమోహన్ ప్రయత్నం కూడా చేశాడు. నాగమోహన్ కారణంగా కుటుంబం పరువు పోతుండటంతో పాటు తన ప్రాణాలకు హాని ఉందని భావించిన ఉదయ్‌కుమార్ తన పినతండ్రి, స్నేహితులతో కలిసి నాగమోహన్‌ను హతమార్చేందుకు పథకం వేశాడు. ఈక్రమంలో నాగమోహన్ మద్యం మత్తులో రోడ్డు పక్కన సమాధులపై పడుకుని ఉండటం అనువుగా మార్చుకుని కత్తి, రాడ్లతో తలపై నరికి హత్య చేశారు. -
రాజమహేంద్రవరం గ్యాంగ్ రేప్: నలుగురి అరెస్ట్
రాజమహేంద్రవరం క్రైం: యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నలుగురు నిందితుల్ని రాజమహేంద్రవరం అర్భన్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాజమహేంద్రవరం సెంట్రల్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషినల్ ఎస్పీ రెడ్డి గంగాధర్ వివరాలు వెల్లడించారు. నిర్భయ చట్టం కింద నిందితులపై కేసులు పెట్టినట్లు చెప్పారు. ఈ నెల 16వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో రాజేంద్రనగర్‌లో ఉంటున్న యువతి తన స్నేహితులతో కలసి టీటీడీ కల్యాణ మండపం వద్దకు తన స్నేహితురాలి అన్న పెళ్లికి మండపం అలంకరణ నిమిత్తం మోటారు సైకిల్‌పై బయలుదేరింది. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్లు కక్కల సతీష్, తాడేపల్లి ప్రేమ్‌కుమార్, పాత నేరస్తులైన పలివెల రాజు, (అలియాస్ స్ట్రిక్) కంచి సత్యమణికంఠలు వారిని అడ్డగించి దౌర్జన్యంగా యువతిని రాజమహేంద్రవరం రూరల్ కవలగొయ్యి వద్ద నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక ఆత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలని ఇంటి వద్ద దించడానికి స్కూటర్‌పై తీసుకువస్తుండగా నందం గనిరాజు సెంటర్లో లారీ ఢీకొనడంతో యువతికి గాయూలయ్యాయి. ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి నిందితులు పరారయ్యూరు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలోని హుకుంపేటలో కరగాని వాసు ఇంట్లో నిందితులు తలదాచుకున్నట్లు సమాచారం తెలుసుకుని అరెస్ట్ చేశారు. నిర్భయతోపాటు 341, 376- సి, 365, 323, 506 సెక్షన్ల కింద కూడా నిందితులపై కేసు నమోదు చేసినట్లు అదనపు ఎస్పీ దామోదర్ వివరించారు. అనంతరం బాధితురాలని ఇంటి వద్ద దించడానికి స్కూటర్‌పై తీసుకువస్తుండగా నందం గనిరాజు సెంటర్లో లారీ ఢీకొనడంతో యువతికి గాయూలయ్యాయి. ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి నిందితులు పరారయ్యూరు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలోని హుకుంపేటలో కరగాని వాసు ఇంట్లో నిందితులు తలదాచుకున్నట్లు సమాచారం తెలుసుకుని అరెస్ట్ చేశారు. (చదవండి: రాజమహేంద్రవరంలో సామూహిక అత్యాచారం) -
బాలికపై సామూహిక లైంగికదాడి!
బాధితురాలు విశాఖ నారాయణ కళాశాల విద్యార్థిని! * పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఎంవీపీ కాలనీ (విశాఖపట్నం): విశాఖ నగరంలో ఘోరం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు యువకులు సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారు. బాలికపై సామూహిక లైంగికదాడికి తెగబడ్డారు. భీమిలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని తగరపువలసలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై పోలీసులు పెదవి విప్పడం లేదు. అధికారికంగా ఎలాంటి వివరాలు బయటకు వెల్లడించడం లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆదర్శనగర్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక నగరంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో తరగపువలస ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని కలిసేందుకు ఈ నెల 14న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ బాలికను.. కొందరు యువకులు గణేష్ సినిమా హాలు సమీపంలో గల ప్లే స్కూల్‌కు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. 16వ తేదీన ఇంటికి తిరిగివచ్చిన బాలిక విషయం తల్లిదండ్రులకు తెలిపింది. వారి ఫిర్యాదు మేరకు భీమిలి పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. మొత్తం 8 మంది యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. భీమిలి ఏసీపీ రవిబాబును ‘సాక్షి’ సంప్రదించగా.. ఈ సంఘటనపై ఫిర్యాదు అందిందని, విచారిస్తేగానీ ఏ విషయాన్నీ నిర్ధారించి చెప్పలేమన్నారు. -
నిడో హత్య కేసు నిందితులకు జ్యుడీషయల్ కస్టడీ
న్యూఢిల్లీ: గ్రీన్‌పార్క్ ఎక్స్టెన్షన్లో ఉండే అరుణాచల్‌ప్రదేశ్ యువకుడు నిడో తనియా హత్య కేసు నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ స్థానిక కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఇది వరకు విధించిన రిమాండ్ ముగియడంతో నిందితులు ఫర్మాన్, సుందర్‌సింగ్, పవన్, సన్నీ ఉప్పల్‌ను సీబీఐ అడిషనల్ చీప్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ప్రీతమ్ సింగ్ ఎదుట ప్రవేశపెట్టగా ఈ నెల 21 దాకా కస్టడీ విధించారు. మృతుడి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ కేసును ఢిల్లీ పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయడం తెలిసిందే. లజ్‌పత్‌నగర్‌లో జనవరి 29న ఫర్మాన్, సుందర్‌సింగ్, పవన్, సన్నీ ఉప్పల్ కొట్టిన దెబ్బలకు తట్టుకోలేకే ఈ యువకుడు మరణించినట్టు కేసు నమోదయింది.