బాలికపై సామూహిక లైంగికదాడి! | Narayana college student on gang raped | Sakshi
Sakshi News home page

బాలికపై సామూహిక లైంగికదాడి!

Published Tue, Sep 22 2015 2:05 AM | Last Updated on Sun, Sep 3 2017 9:44 AM

బాలికపై సామూహిక లైంగికదాడి!

బాలికపై సామూహిక లైంగికదాడి!

బాధితురాలు విశాఖ నారాయణ కళాశాల విద్యార్థిని!
* పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
ఎంవీపీ కాలనీ (విశాఖపట్నం): విశాఖ నగరంలో ఘోరం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు యువకులు సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారు. బాలికపై సామూహిక లైంగికదాడికి తెగబడ్డారు. భీమిలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని తగరపువలసలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై పోలీసులు పెదవి విప్పడం లేదు.

అధికారికంగా ఎలాంటి వివరాలు బయటకు వెల్లడించడం లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆదర్శనగర్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక నగరంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో తరగపువలస ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని కలిసేందుకు ఈ నెల 14న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ బాలికను.. కొందరు యువకులు గణేష్ సినిమా హాలు సమీపంలో గల ప్లే స్కూల్‌కు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

16వ తేదీన ఇంటికి  తిరిగివచ్చిన బాలిక విషయం తల్లిదండ్రులకు తెలిపింది. వారి ఫిర్యాదు మేరకు భీమిలి పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. మొత్తం 8 మంది యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. భీమిలి ఏసీపీ రవిబాబును ‘సాక్షి’ సంప్రదించగా.. ఈ సంఘటనపై ఫిర్యాదు అందిందని, విచారిస్తేగానీ ఏ విషయాన్నీ నిర్ధారించి చెప్పలేమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement