narayana college student
-
‘నారాయణ’ ఒత్తిళ్లు తాళలేకనే ఆత్మహత్యాయత్నం
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: కళాశాల యాజమాన్యం వేధింపులు తాళలేకనే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులకు అనంతపురం బస్టాండు సమీపంలోని నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థిని భవ్యశ్రీ వివరించింది. విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భవ్యశ్రీని పోలీసులు విచారణ చేస్తుండగా చిత్రీకరించిన అంశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగు చూసింది. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి మొదట కుటుంబకలహాలే కారణమన్న కోణంలో కళాశాల యాజమాన్యం చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అదే నిజమని బుకాయించే ప్రయత్నం చేసింది. అయితే బాధిత విద్యార్థిని కుటుంబసభ్యులు అందుబాటులో లేకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి దారితీసిన కారణాలను పోలీసులు ఆరా తీయడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను రాత్రికి రాత్రి బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. హాజరెందుకేయలేదని ప్రశ్నించిన పోలీసులు సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఘటనపై అదే రోజు నారాయణ కళాశాలలో అనంతపురం వన్‌టౌన్ సీఐ రవిశంకరరెడ్డి విచారణ చేపట్టారు. భవ్యశ్రీ ఉదయం 7.20 గంటలకు కళాశాలకు చేరుకున్నట్లుగా గుర్తించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కళాశాల నాల్గో అంతస్తు మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా నిర్ధారించుకున్నారు. హాజరుకు సంబంధించి పట్టికను పరిశీలించగా అందులో అబ్సెంట్ వేసి ఉండడంపై సంబంధిత అధికారులను సీఐ రవిశంకరరెడ్డి ప్రశ్నించారు. కళాశాలకు హాజరైనా.. అబ్సెంట్ ఎందుకు వేశారంటూ ప్రిన్సిపాల్‌ను మందలించారు. విద్యార్థులను ఆరా తీసిన డీఎస్పీ : విద్యార్థిని భవ్యశ్రీ ఆత్మహత్యాయత్నానికి దారి తీసిన కారణాలపై డీఎస్పీ జి. ప్రసాదరెడ్డి మంగళవారం ఆరా తీశారు. భవ్యశ్రీకి అత్యంత సన్నిహితంగా ఉన్న వారిని పిలిచి ఘటనకు సంబంధించిన కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఫీజుల చెల్లింపు విషయంలో యాజమాన్యం కర్కశంగా వ్యవహరిస్తోందంటూ డీఎస్పీ ఎదుట పలువురు విద్యార్థులు వాపోయినట్లు తెలిసింది. లెటర్ డ్రామా శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన సదాశివ, జ్యోతి దంపతులు అనంతపురం పాతూరులో నివాసం ఉండేవారు. వారి కుమార్తె భవ్యశ్రీ అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న నారాయణ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. తల్లిదండ్రులు రెండు నెలల క్రితం ఉపాధి కోసం బెంగుళూరుకు వలస వెళ్తూ.. భవ్యశ్రీని నీరుగంటి వీధిలో ఉన్న అమ్మమ్మ అలివేలమ్మ వద్ద వదిలి వెళ్లారు. కళాశాల ఫీజు రూ.12 వేలు చెల్లించాల్సి ఉండగా, ఇటీవల రూ.10 వేలు కట్టారు. మరో రూ.2 వేలు పెండింగ్ ఉంది. దీనికి తోడు పరీక్ష, రికార్డు ఫీజు రూ.820 కలిపి.. మొత్తం రూ.2,820 చెల్లించాలని కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో మనస్థాపానికి గురైన భవ్యశ్రీ సోమవారం ఉదయం 11 గంటల సమయంలో కళాశాల భవనం మూడో అంతస్తుపై నుంచి దూకేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇక.. ఇంటర్ విదార్థిని భవ్యశ్రీ ఆత్మహత్యాయత్నాకి వేరే కారణాలున్నాయని చూపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా సూసైడ్ నోట్ డ్రామాకు తెరలేపారు. తన అమ్మా నాన్న విడిపోయారని, వారిని ఎవరూ కలపలేరని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని విద్యార్థి లేఖ రాసి మరీ దూకినట్లు ప్రచారం జరిగింది. విద్యార్థిని సూసైడ్ నోట్ రాసిందని అనంతపురం వన్‌టౌన్ సీఐ రవిశంకర్‌రెడ్డి మీడియాతో అన్నారు. ఆ లేఖను సీజ్ చేశామని, తల్లిదండ్రులకు చూపించి తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. కానీ తాను లేఖ రాయలేదని విద్యార్థి సంఘాల నాయకులతో బాధిత విద్యార్థిని చెప్పినట్లు తెలిసింది. -
కాలేజీ యాజమాన్యం వేధించి చంపేసింది..
గూడూరు: ‘మా బిడ్డ సౌమ్యుడు. ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదు. ఫీజుల విషయంలోనే యాజమాన్యం వేధించి చంపేసింది..’ అంటూ తిరుపతి జిల్లా గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం అనుమానాస్పదంగా మృతిచెందిన విద్యార్థి ధరణేశ్వర్‌రెడ్డి (21) బంధువులు, తల్లిదండ్రులు ఆరోపించారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం నారేపల్లి గ్రామానికి చెందిన ఓబుల్‌రెడ్డి వెంకటకృష్ణారెడ్డి, గంగమ్మ కుమారుడు ధరణేశ్వర్‌రెడ్డి శనివారం అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుడి తల్లిదండ్రులు, బంధువులు ఆదివారం కళాశాల వద్దకు చేరుకున్నారు. తమ బిడ్డను కళాశాల యాజమాన్యమే చంపేసిందంటూ కళాశాల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మృతుడి తల్లిదండ్రులు, బంధువుల రోదన అందరినీ కలచివేసింది. కళాశాల యాజమాన్యమే తమ బిడ్డను పొట్టనబెట్టుకుందంటూ విలపించారు. తాము గూడూరు వచ్చేవరకు కూడా ఆగకుండానే మృతదేహాన్ని హాస్టల్ గది నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లారంటూ కన్నీరుమున్నీరయ్యారు. తమ బిడ్డను చంపేసి, కుటుంబకలహాల కారణంగానే అంటూ కట్టుకథ అల్లి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల విషయంలో యాజమాన్యం వేధించిందని, తమవద్ద సీసీ కెమెరాల పుటేజీ ఆధారాలున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా మృతుడి బంధువులు సమీపంలోనే ఉన్న హాస్టల్లోకి చొరబడి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. 1వ పట్టణ ఎస్ఐ పవన్‌కుమార్, సిబ్బంది వారిని అడ్డుకున్నారు. విచారించి న్యాయం చేస్తామని సర్దిచెప్పారు. నారాయణ విద్యాసంస్థల్లో బలైన ఎందరో విద్యార్థుల్లో తమ బిడ్డ కూడా ఒకడయ్యాడని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు పేర్కొన్నారు. తమకు పోలీసులపై నమ్మకం ఉందన్నారు. విచారించి న్యాయం చేయాలని కోరారు. నారాయణ కళాశాల యాజమాన్యంపై కేసు గూడూరు నారాయణ ఇంజినీరింగ్ కళాశాల బీటెక్ విద్యార్థి ఓబులరెడ్డి ధరణేశ్వర్‌రెడ్డిది అనుమానాస్పద మృతి అని ఆదివారం విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి విలేకరులకు చెప్పారు. కళాశాల హాస్టల్లో ఉరేసుకుని చనిపోయిన విద్యార్థి ధరణేశ్వర్‌రెడ్డి చాలా సౌమ్యుడని, చదువులో ఉత్తమ ప్రతిభ కనపరుస్తున్నాడని, విద్యార్థి మృతికి కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని తల్లిదండ్రులు గూడూరు 1వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విద్యార్థి మృతికి కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
నారాయణ ఇంజినీరింగ్ కాలేజిలో విద్యార్థి ఆత్మహత్య
గూడూరు రూరల్ (తిరుపతి జిల్లా): గూడూరు సమీపంలో ఉన్న నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ఒకే రోజు రెండు మరణాలు చోటుచేసుకున్నాయి. ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకోగా, ఆ విషయం తెలియడంతో షాక్‌కు గురైన వార్డెన్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనలతో కళాశాల విద్యార్థులు, సిబ్బంది హతాశులయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన ధరణేశ్వరరెడ్డి (21) నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఉదయం కళాశాలకు వెళ్ళి వచ్చిన విద్యార్థి గదిలో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి ఈ విషయాన్ని సహచర విద్యార్థులు గుర్తించి వార్డెన్ శ్రీనివాసులునాయుడు (57)కు చెప్పారు. దీంతో వార్డెన్ షాక్‌కు గురయ్యారు. గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయారు. ఆయన్ని హాస్టల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. విద్యార్థి ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించిన అనంతరం విద్యార్థి మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిపై ఒత్తిడి? విద్యార్థిని కళాశాల యాజమాన్యం ఒత్తిడికి గురిచేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మూడు రోజులుగా కళాశాలలో నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) ఇన్స్పెక్షన్ జరుగుతోందని, ఈ కారణంగా విద్యార్థులను రికార్డుల కోసం, ఇతరత్రా తీవ్రంగా ఒత్తిడికి గురి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. గతంలో కూడా ఈ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయని చెబుతున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు అతని కుటుంబంలో కలహాలే కారణమని కళాశాల యాజమాన్యం చెబుతోంది. ఇదిలా ఉంటే విద్యార్థి బ్యాగులో ఓ కత్తి ఉండడాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. -
ఇంటికి రావద్దన్నారని.. నారాయణ విద్యార్థి ఆత్మహత్య
ఆనందపురం ( భీమిలి): మండలంలోని వెల్లంకిలో ఉన్న నారాయణ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ రామచంద్రరావు శనివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా, వీరఘట్టం మండలం, తెట్టంగి గ్రామానికి చెందిన పొట్నూరు లక్ష్మణరావు, సుమతి దంపతులకు ఇద్దరు పిల్లలు శరణి, ముఖేష్ ఉన్నారు. వారిలో ముఖేష్‌ను ఈ ఏడాది మండలంలోని వెల్లంకిలో ఉన్న నారాయణ కళాశాల హాస్టల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేర్పించారు. చదవండి: తండ్రిని చంపితే రూ.3 లక్షలు.. తల్లిని కూడా చంపితే రూ.5 లక్షలు! ఇదిలా ఉండగా ముఖేష్ శుక్రవారం సాయంత్రం తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. అందరూ నాగులచవితికోసం ఇంటికి వెళ్తున్నారని తమ గదిలో నలుగురు విద్యార్థులమే మిగిలామని తాను కూడా ఇంటికి వస్తానని కోరాడు. అయితే ఇంటికి రావద్దని తల్లి దండ్రులు వారించారు. కాగా రాత్రి హాస్టల్లో నిర్వహిస్తున్న స్టడీ అవర్‌లో ఉన్న ముఖేష్ మధ్యలోనే తన గదిలోకి వెళ్లి, చేతిపై లైఫ్నిల్ అని రాసుకుని నైలాన్ తాడుతో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఇది గమనించిన కళాశాల సిబ్బంది కొన ఊపిరితో ఉన్న ముఖేష్‌ను తగరపువలసలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసును ఎస్ఐ నరసింహమూర్తి దర్యాప్తు చేస్తున్నారు. -
నారాయణ కళాశాల విద్యార్థి ఆత్మహత్య : ఐ మిస్ యూ అమ్మ..
-
ఒత్తిడి తట్టుకోలేకే చనిపోతున్నా: నారాయణ విద్యార్థి
బి.కోడూరు: నారాయణ కళాశాల యాజమాన్య వేధింపులు తాళలేక మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్సార్ జిల్లా బి.కోడూరు మండలం సిద్దుగారిపల్లె గ్రామానికి చెందిన నేలటూరి శ్రీనివాసులరెడ్డి(17) కడప నారాయణ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల కళాశాల యాజమాన్యం చదువు విషయంలో తీవ్ర ఒత్తిడికి గురిచేయడంతో మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. ఈ నేపథ్యంలో మూడు రోజుల కిందట ఇంటికి వెళ్లాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తన ఆత్మహత్యకు కారణం కళాశాల యాజమాన్యమేనని, రెండు రోజులుగా వారు చేసిన ఒత్తిళ్లకు మానసికంగా ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సూసైడ్ నోట్ రాశాడు. ‘నన్ను మీరు కని పెంచినందుకు క్షమించండి’ అంటూ తల్లిదండ్రులనుద్దేశించి అందులో పేర్కొన్నాడు. ఐ మిస్ యూ అమ్మ.. మిస్ యూ నాన్న.. మిస్ యూ బ్రదర్స్.. అంటూ సూసైడ్ నోట్లో రాశాడు. అంతేకాకుండా తన అరచేతిపై ‘ప్రెజర్ ఇన్ కాలేజ్’ అని రాసుకున్నాడంటూ తల్లిదండ్రులు నేలటూరి సుబ్బారెడ్డి, ప్రమీలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాసులరెడ్డి వారికి మూడో సంతానం. చేతికి అందివచ్చిన కుమారుడు మృతిచెందడంతో వారు శోక సంద్రంలో మునిగిపోయారు. బి.కోడూరు ఎస్ఐ వెంకటరమణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఆస్తి ఇవ్వలేదని టెన్త్ విద్యార్థి ఆత్మహత్య -
భవనంపై నుంచి పడ్డ ‘నారాయణ’ విద్యార్థి
సాక్షి, ఓర్వకల్లు: నారాయణ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో ఓ విద్యార్థి భవనంపై నుంచి పడి గాయపడ్డాడు. నన్నూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. నందికొట్కూరు మండలం కోళ్ల బావాపురం గ్రామానికి చెందిన మద్దిలేటి యాదవ్ కుమారుడు సురేంద్రయాదవ్ (17) నన్నూరు సమీపంలోని నన్నూరు నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) రెండో సంవత్సరం చదువుతున్నాడు. మూడు రోజుల కిందట హాస్టల్‌కు వెళ్లాడు. అక్కడ చదువుల ఒత్తిడితో మనస్తాపానికి గురయ్యాడు. గురువారం తెల్లవారుజామున నిద్రమత్తులో హాస్టల్ భవనంపైకి వెళ్లిన అతడు గ్రిల్ లేకపోవడంతో కాలుజారి కిందపడ్డాడు. దీంతో రెండుకాళ్లు, నడుము ఎముకలు విరిగాయి. గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ ఇన్చార్జికి సమాచారం ఇచ్చారు. బాధితుడిని చికిత్స నిమిత్తం కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. కళాశాల యాజమాన్యం గ్రిల్ ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.(చదవండి: భార్యను కాల్ గర్ల్‌గా చిత్రించి..) -
నారాయణ విద్యార్థిని ఆత్మహత్య: పరిస్థితి ఉద్రిక్తం
-
ఎంతపని చేశావురా..!
సాక్షి, కడప : హర్షా.. లేవరా..ఎంతపనిచేశావురా..నీవు చదువుకోకపోయినా బతికేవాడివి కదరా..అంటూ కుమారుడి మృతదేహం వద్ద తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించారు. చదువు కోసం కార్పొరేట్ కళాశాలలో చేర్పిస్తే, అక్కడ ఒత్తిడిని తట్టుకోలేక కుమారుడు మృతి చెందిన సందర్భంలో విద్యార్థి తండ్రి ఆవేదన ఇది. చదువే సర్వస్వంగా కార్పొరేట్ కళాశాలలు పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తూ ప్రాణాలు హరిస్తున్నాయి. కడప ఎన్జీవో కాలనీలోని నారాయణ కళాశాల మరో విద్యార్థి జీవితాన్ని బలి తీసుకుంది. తల్లిదండ్రులకు యాజమాన్యం వేధింపులు చెప్పుకోలేక చిన్నం హర్షవర్ధన్(16) అనే విద్యార్థి రైలు క్రిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప నగరంలోని చిన్నచౌక్‌లో నివసిస్తున్న చిన్నం జయరాం, సుబ్బమ్మలకు ఇరువురు కుమారులు ఉన్నారు. వీరిలో పెద్దకుమారుడు సురేష్‌కుమార్ ట్రావెల్స్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండో కుమారుడు హర్షవర్ధన్ (16)ను ఈ ఏడాది నగరంలోని ఎన్జీఓ కాలనీలో ఉన్న నారాయణ ఒలింపియాడ్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూప్‌లో చేర్పించారు. ప్రారంభం నుంచి కాలేజీకి వెళ్లడం హర్షవర్ధన్‌కు ఇష్టంలేదు. గత నెలలో ఓ రోజు కళాశాలకు వెళ్లలేదు. ఈ విషయంపై అధ్యాపకులు విద్యార్థి తండ్రి జయరాం తాను ఒప్పుదలగా లెటర్‌ను రాయించి ప్రతి రోజు తన కుమారుడు కళాశాలకు వెళ్లేలాగా చేశారు. తరువాత గత వారంలో ఓ రోజున హర్ష వర్ధన్‌కు జ్వరం రావడంతో కళాశాలకు వెళ్లలేదు. మరుసటి రోజున కూడా తనను అధ్యాపకులుగాని, ఏజీఎం చెన్నకృష్ణారెడ్డిగాని వేధింపులకు గురి చేస్తారని తన మనసులోనే కుమిలిపోయాడు. గత శుక్రవారం హర్షవర్ధన్‌ను తండ్రి జయరాం కళాశాలకు తీసుకెళ్లరు. అధ్యాపకులతో మాట్లాడారు. తన కుమారుడికి జ్వరం వచ్చిందని,అందువల్లే రాలేదని, ఇకమీదట రెగ్యులర్‌గా వస్తాడని చెప్పి వచ్చారు. అయినా హర్షవర్ధన్ పట్ల ఏజీఎం చెన్నకృష్ణారెడ్డి దుర్భాషలాడటంతో పాటు, టీసీ ఇచ్చి పంపిస్తాననీ బెదిరించారు. దీంతో కళాశాల నుంచి ఇంటికి వెళ్లకుండా హర్షవర్ధన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కళాశాల వదలగానే ఇంటికి వెళ్లలేదు. కడప–కనుమలోల్లపల్లె రైలు మార్గంలో స్పిరిట్ కళాశాల వెనుక భాగాన రైల్వే ట్రాక్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనలో రైల్వే పోలీసులు మొదట గుర్తుతెలియని యువకుడి మృతదేహంగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో ఉంచారు. అప్పటికే కళాశాల నుంచి ఇంటికి రాలేదని హర్షవర్ధన్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ బంధువులు, స్నేహితులతో కలిసి అతని కోసం వెతికారు. ఈనెల 3వతేదీ రాత్రి రైలు కిందదపడి విద్యార్థి మృతి చెందాడని ‘వాట్సాప్’ద్వారా తెలుసుకున్నారు. వెంటనే రైల్వే పోలీసులను ఆశ్రయించారు. మృతదేహాన్ని గుర్తించిన తండ్రి జయరాం, బంధువులతో కలిసి రిమ్స్ మార్చురీకి చేరుకున్నారు. విగతజీవుడైన కుమారుడి చూసి భోరున విలపించారు. నారాయణ కళాశాల యాజమాన్యం వల్లే.. జయరాం తన కుమారుడి బలవన్మరణానికి కడప నారాయణ జూనియర్ కళాశాలఅధ్యాపకులు, ఏజీఎంల వేధింపులే కారణమని తండ్రి జయరాం ఆరోపించారు. పదో తరగతి పూర్తయిన తరువాత తన ఇష్ట్రపకారమే నారాయణ కళాశాలలో చేర్పించానన్నారు. తన కుమారుడి తప్పులేకపోయినా జ్వరం తగ్గిన తరువాత శుక్రవారం కళాశాలకు వస్తే ఏజీఎం టీసీ ఇచ్చి పంపిస్తానని బెదిరించడం వల్లనే మనోవేదనకు గురై ఇంటిలో తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని విలపించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగకుండా కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు. ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థి బలవన్మరణం నారాయణ విద్యాసంస్థల్లో ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల పట్ల పరుషపదజాలంతో అధ్యాపకులు వ్యవహరించడంతో పాటు, వారిపై కట్టెలతో కూడా దాడి చేస్తున్నారు.ఇలా చేయడం సరికాదు. వారి ప్రవర్తన తీరుకు వ్యతిరేకంగా ఈనెల 5న కడపలోని నారాయణ కళాశాలను మూయిస్తాం, ఆందోళన చేపడతాం. - ఖాజా రహమతుల్లా, వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ నాయకులు, కడప తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు నారాయణ కళాశాల విద్యార్థి హర్షవర్ధన్ ఆత్మహత్యకు పాల్పడటం పట్ల తండ్రి జయరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. సమగ్రంగా విచారించి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. రైల్వే ఎస్ఐ రారాజు, కడప కడప నారాయణ జూనియర్ కళాశాలల్లో వరుస సంఘటనలు నారాయణ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఒత్తిడి, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుత్ను సంఘటనలు నెలకొంటున్నాయి. కడప- పులివెందుల రహదారిలో కృష్ణాపురం సమీపంలో ఉన్న జూనియర్ కళాశాల క్యాంపస్‌లో మనీషా, నందినీరెడ్డి జంటగా హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆ సంఘటనపై ఇప్పటికీ పోలీసులు నిగ్గుతేల్చలేదు..పావని అనే విద్యార్థిని అదే క్యాంపస్‌లో బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రులకు విషాదాన్ని మిగిల్చింది. తాజాగా హర్షవర్ధన్ అధ్యాపకుల, ఏజీఎం వేధింపుల వల్ల రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడటం జిల్లాలో సంచలనం కల్గించింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కళాశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. -
రైలుకింద పడి ‘నారాయణ’ విద్యార్థి ఆత్మహత్య
-
నారాయణ కళాశాల విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, కడప : ఒత్తిడి తట్టుకోలేక మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్జీవో కాలనీలో నారాయణ ప్రయివేటు కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న హర్షవర్థన్ అనే విద్యార్థి రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రిమ్స్ సమీపంలోని రైల్వే ట్రాక్ సమీపంలో అతడు శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కళాశాల అధ్యాపకుల వేధింపుల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి జయరాం ఆరోపించారు. కాలేజీకి రానన్నవాడికి మళ్లీ ఎందుకు వచ్చావని ఏజీఎం తన కుమారుడిని కొట్టడాని, అంతేకాకుండా లెక్చరర్లు అందరి ముందు దూషించడంతో అవమానం తట్టుకోలేక మనస్తాపం చెందిన హర్షవర్థన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. తన కొడుకు రైలుకింద పడి చనిపోయినట్లు వాట్సప్ ద్వారా సమాచారం వచ్చిందని కన్నీటిపర్యంతం అయ్యాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. -
నేలరాలిన విద్యాకుసుమం
అతను చదువులో ఎంతో ముందుండేవాడు. తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా చదివేవాడు. టెన్త్‌లో పదికి పది పాయింట్లు సాధించాడు. ఇంటర్ ఫస్టియర్‌లోనూ ప్రతిభ చూపాడు. కానీ నారాయణ కాలేజీ యాజమాన్యం కాఠిన్యం కారణంగా ఉరేసుకుని అర్ధంతరంగా తనువు చాలించాడు. తల్లిదండ్రులకు తీరని వేదన మిగిల్చాడు. కర్నూలు, వెల్దుర్తి: మండలంలోని రామళ్లకోటకు చెందిన ఆత్మకూరు రఘురామిరెడ్డి, ఆదినారాయణమ్మ(శ్రీదేవి) దంపతుల కుమారుడు శ్రీచరణ్ శుక్రవారం సాయంత్రం విజయవాడలోని కంకిపాడు నారాయణ క్యాంపస్ హాస్టల్ గదిలో బాత్రూం కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రఘురామిరెడ్డి, ఆదినారాయణమ్మ దంపతులకు కుమారుడు చరణ్‌తో పాటు కుమార్తె ప్రియాంక ఉన్నారు. గ్రామంలోని కాల్వబుగ్గరోడ్డులో నివాసముండే రఘురామిరెడ్డి వ్యవసాయదారుడు. పిల్లల చదువు కోసం పదేళ్ల క్రితం నుంచి డోన్ పట్టణంలోని రాజా టాకీస్ పక్కన నివాసముంటున్నాడు. ప్రతిరోజు స్వగ్రామానికి వచ్చి పొలం పనులు చూసుకుంటుంటాడు. ప్రియాంక ప్రస్తుతం కర్నూలులో డీఎడ్ చదువుతోంది. శ్రీచరణ్ పదో తరగతి డోన్‌లోని శ్రీసుధ స్కూల్లో చదివి 10కి 10 పాయింట్లు సాధించాడు. ఇంటర్మీడియట్ విజయవాడలోని నారాయణ కాలేజీలో ఎంపీసీ గ్రూప్‌లో చేర్పించారు. ఫస్టియర్‌లో మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ప్రస్తుతం సెకండియర్ చదువుతున్నాడు. ఇటీవల దసరా సెలవులకు వచ్చి తన చిన్ననాటి మిత్రులు, బంధువులతో కలిసి సరదాగా గడిపి వెళ్లాడు. అయితే.. శుక్రవారం జ్వరంతో రావడంతో ఇంటికి వెళతానని కాలేజీ నిర్వాహకులను కోరాడు. వారు ససేమిరా అనడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు నిర్ఘాంతపోయారు. సరైన సమాచారం ఇవ్వనికాలేజీ యాజమాన్యం శ్రీచరణ్ కాలేజీ విడిచిన తర్వాత హాస్టల్‌కు వెళ్లి తన గదిలో ఉరివేసుకుని అస్వస్థతకు గురయ్యాడని కాలేజీ యాజమాన్యం తమకు సమాచారమిచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు. కామినేని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించామని చెప్పారన్నారు. అయితే ఎలక్ట్రానిక్ మీడియాలో శ్రీచరణ్ చనిపోయినట్లు వార్తలు రావడంతో వారు కామినేని ఆస్పత్రికి ఫోన్ చేశారు. అతను చనిపోయినట్లు నిర్ధారించడంతో విజయవాడ బయలుదేరివెళ్లారు. -
మరో నారాయణ విద్యార్థి ఆత్మహత్య
కృష్ణాజిల్లా : కార్పొరేట్ కాలేజీ యాజమాన్యం వేధింపులు మరో విద్యార్థిని బలి తీసుకున్నాయి. వివరాలు.. వేపెనమలూరు మండలం ఈడ్పుగల్లలోని నారాయణ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోన్న ఓ విద్యార్ధి హస్టల్ గదిలో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతున్ని కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన ఆత్మకూరు శ్రీ చరణ్‌గా గుర్తించారు. యాజమాన్యం వేధింపుల వల్లే తమ పిల్లాడు మరణించాడని శ్రీ చరణ్ బంధువులు ఆరోపించారు. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం విద్యార్థి ఆత్మహత్యను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించింది. -
నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య
-
వేధింపులతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
-
నారాయణ కాలేజీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులపై దాడులు జరుగుతున్నా యాజమాన్యాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఏదో సంఘటన జరిగినప్పుడు కాస్త హడావుడి చేసి ఆపై ఆ కాలేజీ యాజమాన్యాలు చేతులు దులుపుకోవడం తరచుగా చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో నారాయణ జూనియర్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. సిబ్బంది భౌతికంగా దాడి చేయడంతో మనస్తాపానికి గురై విద్యార్థి బలవన్మరణానికి యత్నించినట్లు తెలుస్తోంది. సూర్యాపేటకు చెందిన విద్యార్థి సూర్య, చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని టెలిఫోన్ కాలనీలో ఉన్న నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. అయితే కాలేజీ సిబ్బంది వేధింపులకు పాల్పడటం, భౌతికదాడి చేసిన నేపథ్యంలో మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. కాలేజీ సిబ్బంది వల్లే తమ స్నేహితుడు ఆత్మహత్యాయత్నం చేశాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సోమవారం 300 మందికిపైగా విద్యార్థులు నారాయణ కాలేజీ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాలేజీ యాజమాన్యంతో పాటు సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలు విద్యార్థి సంఘాలు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నాయి. కాలేజీ సిబ్బంది వారికి నచ్చజెప్పాలని చేసినా విద్యార్థి సంఘాలు వెనక్కి తగ్గకపోవడంతో కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. -
కూర్చొని ఉరి వేసుకోవడం సాధ్యమేనా?
సరిగా ఆలోచించే వయసు కూడా లేని పసిమొగ్గలు బలవన్మరణాలకు పాల్పడేంత సాహసం చేస్తారా... లేక ఏదైనా కారణాలతో వారిని చిదిమేస్తున్నారా..కారణాలేమైనా ఒక విద్యాజ్యోతి ఆరిపోయింది. దీపం వెలిగించండని తల్లిదండ్రులు పడుతున్న వేదన అరణ్యరోదనగా మారింది. ఒక్క చరణ్రెడ్డే కాదు..గతంలో జిల్లాలోని నారాయణ కళాశాలలో ఇద్దరు, ఈ ఏడాది సెప్టెంబరులో మరొకరు ఇలా మైనర్ల శ్వాస గాలిలో కలిసిపోయింది. వీటికి అంతం లేదా? అందరిలోనూ మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరగకపోవడం కుదిపేస్తోంది. బాధితుల కుటుంబాలను కుంగదీస్తోంది. సాక్షి, కడప/అర్బన్: కడప నగర శివార్లలోని మౌంట్‌ఫోర్ట్ ఇంగ్లిషు మీడియం పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల చరణ్‌రెడ్డి మరణం అనుమానాలకు తావిచ్చింది. ఆత్మహత్య అంటూ యాజమాన్యం అంటున్నా పరిస్థితులు చూస్తే భిన్నంగా కనిపిస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. చిన్నారి ఆత్మహత్య చేసుకోవాల్సినంత పరిస్థితులు ఏమున్నాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా పాఠశాల మూడోఅంతస్తు వద్ద ఉరి వేసుకున్న తీరు అనుమానాలకు తావిస్తోందంటున్నారు. ప్రత్యేకంగా టై ఎక్కువ పొడవు కూడా ఉండదు. ఒకవేళ ఉరి వేసుకోవడానికి మెడకు చుట్టుకుంటే కడ్డీలకు ముడివేయాలన్నా సరిపోయే పరిస్థితి కనిపించడం లేదు. నిలబడి కాకుండా కూర్చొని ఆత్మహత్యలో భాగంగా ఉరి వేసుకున్నట్లు అక్కడి వారు చెబుతుండడం చూస్తే చిత్రంగా ఉంది. నిలబడి కాళ్లు కింద తగలకుండా ఉరి వేసుకున్న సంఘటనలు చూసి ఉంటారు. కానీ కూర్చొని ఉరి వేసుకున్నట్లు చెబుతున్న దానిపై పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసును నమోదు చేశారు. ఏదిఏమైనా వ్యవహారమంతా అనుమానాల పరంగానే సాగుతోంది. వరుస ఘటనలు వైఎస్సార్‌జిల్లాలో వరుసగా ఘటనలు జరుగుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. కృష్ణాపురం సమీపంలోని నారాయణ కళాశాలలో 2015లో మనీషా, నందినిలో ఒకే గదిలో ఫ్యాన్లకు చున్నీలతో ఉరి వేసుకున్న ఘటన మరువకమునుపే 2017 సెప్టెంబరులో పావని అనుమానాస్పదంగా అదే క్యాంపస్‌లో మృతి చెందారు. అంతలోనే మళ్లీ మంగళవారం మౌంట్‌ఫోర్ట్ పాఠశాల ఆవరణంలో విద్యార్థి చరణ్‌రెడ్డి చనిపోవడం ఆందోళన కలిగించే అంశం. ఇలా వరుస ఘటనలను పరిశీలిస్తే అసలు ఎందుకిలా జరుగుతుందో అర్థం కావడం లేదు. యాజమాన్యాల నిర్లక్ష్యమా...లేక వేధింపులా....లేక ఏదైనా ఇబ్బందులకు గురి చేస్తున్నారా? అన్నది బయటికి రావడం లేదు. విద్యార్థి దశలోనే.... చలాకీగా చదువుకుంటూ ఉత్తేజంగా, ఉల్లాసంగా వాలీబాల్ ఆడుకుంటూ విద్యను అభ్యసిస్తున్న చరణ్‌రెడ్డికి విద్యార్థి దశలోనే నిండు నూరేళ్లు నిండినట్లయింది. జిల్లాలోని బద్వేలు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన జోసెఫ్ కొండారెడ్డి, సుష్మల రెండవ కుమారుడైన కంభం చరణ్‌రెడ్డి (14) కడప నగర శివార్లలోని మౌంట్‌ఫోర్ట్ ఇంగ్లిషు మీడియం హైస్కూలులో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలోనే చింతకొమ్మదిన్నె మండలం విశ్వనాథపురంలో ఉన్న అమ్మమ్మ నిర్మలమ్మ ఇంటికి గత శనివారం వెళ్లి తిరిగి సోమవారం ఉదయం వచ్చాడని, అయితే అనుమతి లేకుండా మరలా బయటికి వెళ్లి మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో పాఠశాలకు వచ్చాడు. ఈ నేపథ్యంలో హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయులు, సహచర విద్యార్థుల సమక్షంలో చరణ్‌రెడ్డిని మందలించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీసీ పుటేజీలో కొంతమాత్రమే రికార్డు చరణ్ అందరు విద్యార్థుల్లాగే రాత్రి వేళ భోజనం ముగిసిన తర్వాత స్టడీ అవర్‌కు హాజరయ్యాడు. అనంతరం సహచర విద్యార్థులతోపాటు నిద్రించాడు. తరువాత మూడవ అంతస్తులోని మెట్ల క్యారిడార్లో తన టైతోనే ఉరేసుకుని అలాగే కూర్చొని ఉన్నట్లు చూసిన విద్యార్థులు యాజమాన్యానికి తెలిపారు. అయితే చరణ్ అర్దరాత్రి ఒంటి గంట 3 నిమిషాల ప్రాంతంలో టై తీసుకుని వెళుతున్న దృశ్యాలు మాత్రం రికార్డు అయ్యాయని పోలీసులు మీడియాకు తెలియజేశారు. తర్వాత ఏం జరిగిందన్నది కెమెరాలో లేకపోవడంతో వ్యవహారం బయట పడలేదు. సంఘటన ప్రాంతంలో సహచర విద్యార్థులు చరణ్నుచూసి వార్డెన్‌కు సమాచారం ఇచ్చే వరకు పైన ఏం జరిగిందో తెలియని పరిస్థితి. మెడ ఎడమవైపు కుమిలిన గాయం చరణ్‌రెడ్డి టైతోనే తనంతకు తానుగా ఉరి వేసుకుని మరణించాడా? లేక వేరే ఎవరైనా వచ్చి ఈ చర్యలకు పాల్పడ్డారా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మృతదేహం పరిశీలిస్తే మెడ ఎడమవైపు కమలిన గాయం ఉంది. కానీ నాలుక బయటికి ఉన్నట్లుగా కనిపించడం లేదు. పోలీసులు కూడా జోసెఫ్ కొండారెడ్డి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితిలో చరణ్‌రెడ్డి మృతి చెందాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఈ చర్యకు పాల్పడ్డాడా? లేదంటే ఎవరైనా అతన్ని హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? అనేది విచారణలో తెలియాల్సి ఉంది. జన్మదిన వేడుకలు జరుపుకుని పది రోజులు కాకముందే తన కుమారుడు చరణ్‌రెడ్డి ఈనెల 3వ తేదీన జన్మదిన వేడుకలు జరుపుకున్నాడని, ఆ సమయంలో రూ. 3 వేలు విలువైన డ్రస్‌ను కూడా కొనిచ్చానని, ఎంతో ఆనందంగా గడిపాడని తండ్రి జోసెఫ్ కొండారెడ్డి ఆవేదనతో మీడియాకు తెలిపారు. ఔటింగ్ పంపేటపుడు తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలనే కనీస బాధ్యతను కూడా పాటించలేదని, నిర్లక్ష్యంగా వ్యవహారించారని కొండారెడ్డి ఆరోపించారు. తమ కుమారుడు ఎలా మృతి చెందాడనే విషయం స్పష్టంగా తెలియడం లేదని, పోలీసులు దర్యాప్తు చేసి బాధ్యులైన వారిని శిక్షించాలని కొండారెడ్డి తెలియజేశారు. నా తప్పులేదు : ప్రిన్సిపల్ మౌంట్‌ఫోర్ట్ పాఠశాలలో చరణ్‌రెడ్డి మృతికి సంబంధించి తన తప్పు ఎంతమాత్రం లేదని.... పిల్లలను రాత్రంతా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వార్డెన్దేనని ప్రిన్సిపల్ జోసెఫ్ తెలిపారు. అందుకు సంబంధించి కడప డీఎస్పీ కార్యాలయం వద్ద మీడియాకు వివరణ ఇచ్చారు. చరణ్‌తో పాటు అందరు విద్యార్థులు వార్డెన్ పర్యవేక్షణలోనే ఉంటారన్నారు.. గతంలో జరిగిన సంఘటనల గురించి వివరణ కోరగా తనకు సంబంధించినత వరకు ఎలాంటి తప్పిదం లేదని వెల్లడించారు. బందోబస్తుతో పోలీసుల హడావుడి చరణ్‌రెడ్డి మృతి సంఘటన తెలియగానే వివిధ ప్రదేశాల్లో కడప డీఎస్పీ షేక్ మాసుంబాష ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నిర్వర్తించారు. మౌంట్‌ఫోర్ట్ స్కూలు, రిమ్స్ మార్చురీ, విద్యార్థి ఇంటి వద్ద పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తు భారీగా ఏర్పాటు చేసి ఎలాంటి సంఘటనలు జరగకుండా హడావుడి చేశారు. ఈ బందోబస్తు విధుల్లో సీఐలు టీవీ సత్యనారాయణ, భాస్కర్‌రెడ్డి, పురుషోత్తంరాజు, హేమసుందర్రావు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో పాఠశాల, కళాశాల స్థాయిల్లో వరుస సంఘటనలు జరుగుతున్నా అధికార యంత్రాంగం మేల్కొని తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీవ్రమైన మానసిక ఒత్తిల్ల వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అనుకుంటున్నారు. -
‘నారాయణ కాలేజీ ఒత్తిడి తగ్గించకుంటే ఆత్మహత్య చేసుకుంటా’
సాక్షి, హైదరాబాద్: నారాయణ కళాశాల యాజమాన్యం చదువుల పేరుతో వేధింపులకు గురి చేస్తోందంటూ ఆ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతనికి బీసీ విద్యార్థి సంఘం నాయకులు మద్దతు తెలిపారు. బడంగ్‌పేటకు చెందిన సాయినాథ్ రెడ్డి చంపాపేటలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చదువుల పేరుతో కళాశాల సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా వేధింపులకు పాల్పడుతున్నారని, ఆపై పరీక్షల పేరుతో తమపై ఒత్తిడి పెంచుతున్నారని సాయినాథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాలు తల్లిదండ్రులకు చెప్పడానికి ప్రయత్నిస్తే వారికి కట్టుకథలు చెబుతున్నారని.. కళాశాల యాజమాన్యం ఒత్తిడిలను మానుకోకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని అతను హెచ్చరించారు. ఇటీవలికాలంలో నారాయణ కాలేజీ విద్యార్థులు వరుసగా ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో సాయినాథ్‌రెడ్డి ఫిర్యాదు చేయడం గమనార్హం. -
‘నారాయణ’ విద్యార్థి ఆత్మహత్యపై అనుమానాలు
అనంతపురం సెంట్రల్ : అనంతపురంలోని నారాయణ కళాశాల విద్యార్థి చక్రవర్తి (17) ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి సంఘాలు కూడా మంగళవారం ఆందోళనకు దిగడం ఈ అనుమానాలకు మరింత బలమిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ముంబైలో నేవీలో పనిచేస్తున్న గోపాల్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య, పిల్లలు అనంతపురంలోని హౌసింగ్‌బోర్డులో నివాసం ఉంటున్నారు. పెద్ద కుమారుడు డిగ్రీ చదువుతున్నాడు. చిన్న కుమారుడు చక్రవర్తి స్థానిక సాయినగర్‌లోని నారాయణ కళాశాలలో ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గోపాల్ భార్య ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. చక్రవర్తి ప్రథమ సంవత్సరంలో మంచి పార్కులతో ఉత్తీర్ణత సాధించినా.. ద్వితీయ సంవత్సరంలో వెనుకబడ్డాడు. ఈ విషయమై కళాశాల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చినట్లు తెలిసింది. క్లాసులో కూడా అవమానాలు ఎదుర్కొనేవాడని తెలుస్తోంది. సోమవారం కూడా క్లాస్‌లో అవమానం జరగడంతో అర్ధంతరంగా ఇంటికి వెళ్లిపోయాడని సమాచారం. ఆ సమయంలో తల్లి, అన్న కూడా లేకపోవడంతో ఆవేదనకు లోనైన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మంత్రి నారాయణకు చెందిన కళాశాల కావడంతో పోలీసులు ఈ కేసుపట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. వన్‌టౌన్ ఎస్ఐ రంగాయాదవ్ను వివరణ కోరగా.. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, అసలు విషయాలు దర్యాప్తులో తేలుతాయని చెప్పారు. -
అఖిల్ మృతిపై అన్నీ సందేహాలే !
- విషయాన్ని కప్పిపుచ్చుతున్న కాలేజీ యాజమాన్యం - తల్లిదండ్రులతో మాట్లాడనివ్వని పోలీసులు లబ్బీపేట : నిడమానూరులోని నారాయణ కళాశాలలో విద్యార్థి నర్రా అఖిల్తేజ్కుమార్ రెడ్డి మృతి విషయాన్ని ఆద్యంతం గోప్యంగా ఉంచిన యాజమాన్యం, అసలు మృతికి గల కారణాలను సైతం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెతున్నాయి. విద్యార్థి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, పర్సనల్ ప్రాబ్లమ్స్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం చేయడంపై విద్యార్థి తండ్రి సింగారెడ్డి తీవ్రంగా ఖండిచారు. ఏవేవో కట్టుకథలు చెపుతున్నారని, మా అబ్బాయికి ఎలాంటి అనారోగ్యం లేదని, ప్రాబ్లమ్స్ కూడా లేవని చెబుతున్నారు. అసలు కళాశాలలో ఏమి జరిగిందో తెలియాల్సి ఉందని డిమాండ్ చేస్తున్నారు. గదికి తాళాలు వేసి ఉండగా, కిటికీలో నుంచి లోపలికి ఎలా ప్రవేశించాడని, అలా చేసే పర్యవేక్షణ లేకుండా కాలేజీ యాజమాన్యం ఏమి చేస్తున్నారని తండ్రి ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం 4.30 గంటల సమయంలోనే మృతి చెందినట్లు కాలేజీ యాజమాన్యానికి తెలిస్తే, తమకు 5.30 గంటల సమయంలో అనారోగ్యంగా ఉందని చెప్పడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అన్నీ చూస్తే అనేక అనుమానాలు రేకిత్తిస్తున్నట్లు చెబుతున్నారు. కాలేజీయాజమాన్యానికి అండగా పోలీసులు విద్యార్థి మృతికి గల కారణాలు బయటకు పొక్కకుండా పోలీసులు సైతం కళాశాల యాజమాన్యానికి అండగా నిలిచారు. అఖిల్ తేజకుమార్రెడ్డి రూమ్‌లో మృతి చెందిన ఉండటాన్ని తొలుత చూసిన సహచర విద్యార్థులు గుణశేఖర్, జె మహేశ్వరరెడ్డి, సీహెచ్ మహేశ్వరరెడ్డి, వినోద్, ధనుష్, సాయిచరణ్‌లు ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీ వద్దకు వచ్చారు. వారితో ఎవరినీ మాట్లాడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. తల్లిదండ్రులను సైతం మీడియాతో మాట్లాడకుండా చూశారు. ఒకదశలో తండ్రి సింగారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నట్లు తెలిసి, సీఐ వచ్చి సంతకాలు చేయాలంటూ లోపలికి తీసుకెళ్లి కూర్చోపెట్టారు. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తహశీల్దారు పంచనామా నిడమానూరులోని కళాశాల నుంచి సమీపంలోని కార్పోరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లిన మృతదేహాన్ని అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. కాగా మృతదేహానికి విజయవాడ రూరల్ తహశీల్దారు మదన్మోహన్ పంచనామా నిర్వహించారు. తల్లిదండ్రులు, బంధువులతో పాటు, ప్రత్యక్ష సాక్షులైన సహచర విద్యార్థుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించగా,ప్రకాశం జిల్లాలోని స్వగ్రామానికి తరలించారు. నారాయణ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి : ఎస్ఎఫ్ఐ విద్యార్థుల ఆత్మహత్య పరంపరలు జరుగుతున్నా ప్రభుత్వం నారాయణ కళాశాలల పట్ల ఉదాశీనంగా వ్యవహరిస్తుందని, తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు కోటి డిమాండ్ చేశారు. ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉన్న అఖిల్ మృతదేహాన్ని సందర్శించి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఆత్మహత్యలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.ఆత్మహత్యలు నివారించేందుకు నారాయణ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల రోదన బేస్తవారిపేట(ప్రకాశం): విజయవాడలోని నారాయణ కళాశాలలో జూనియర్ ఇంటర్ విద్యార్థి అఖిల్ తేజారెడ్డి మృత దేహం శనివారం స్వగ్రామం బేస్తవారిపేటకు చేరుకోగానే కుటుంబ సభ్యుల రోదన పలువురిని కంటతడి పెట్టించింది. వసతి గృహంలో శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. కుటుంబ సభ్యులు తేజారెడ్డి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. మృతుడి తండ్రి నర్రా శింగరెడ్డి ఉపాధ్యాయుడు కావడంతో కంభం, అర్థవీడు, బేస్తవారిపేట మండలాలకు చెందిన ఉపాధ్యాయులు తరలి వచ్చి తేజారెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అంత్యక్రియల కోసం తేజారెడ్డి మృతదేహాన్ని స్వగ్రామమైన బేస్తవారిపేట మండలం పిటికాయగుళ్లకు తరలించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరిపించాలి గాంధీనగర్ : విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దీనిపై విచారణ జరిపించాలని ఐద్వా, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శులు శ్రీదేవి, కె వసంత్ డిమాండ్ చేశారు. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల ఆత్మశాంతించాలని కోరుతూ లెనిన్‌సెంటర్‌లో ఐద్వా, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన శనివారం నిర్వహించారు.నారాయణ కాలేజీల్లో నెలల వ్యవధిలోనే నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.ఆత్మహత్యలకు కారణాలు వెలికితీయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.ప్రైవేటు విద్యాసంస్థల్లో పిల్లల్ని చదివిస్తున్న తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఆందోళనకారులపై కేసు పెనమలూరు: నిడమానూరు నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి చనిపోయిన ఘటనపై కామినేని ఆస్పత్రి వద్ద ధర్నా చేసిన విద్యార్థి సంఘ నేతలపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అతని మృతదేహం కామినేని ఆస్పత్రిలో ఉంచారు.మృతదేహాన్ని చూడటానికి ఎవ్వరిని అనుమతించక పోవటంతో విద్యార్థి సంఘ నేతలు పోతులసురేష్,బి.ఆంజనేయులు,ఎ.రవిచంద్ర,పలువురు విద్యార్థులు ఆందోళన చేశారు. ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
బాలికపై సామూహిక లైంగికదాడి!
బాధితురాలు విశాఖ నారాయణ కళాశాల విద్యార్థిని! * పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఎంవీపీ కాలనీ (విశాఖపట్నం): విశాఖ నగరంలో ఘోరం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు యువకులు సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారు. బాలికపై సామూహిక లైంగికదాడికి తెగబడ్డారు. భీమిలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని తగరపువలసలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై పోలీసులు పెదవి విప్పడం లేదు. అధికారికంగా ఎలాంటి వివరాలు బయటకు వెల్లడించడం లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆదర్శనగర్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక నగరంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో తరగపువలస ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని కలిసేందుకు ఈ నెల 14న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ బాలికను.. కొందరు యువకులు గణేష్ సినిమా హాలు సమీపంలో గల ప్లే స్కూల్‌కు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. 16వ తేదీన ఇంటికి తిరిగివచ్చిన బాలిక విషయం తల్లిదండ్రులకు తెలిపింది. వారి ఫిర్యాదు మేరకు భీమిలి పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. మొత్తం 8 మంది యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. భీమిలి ఏసీపీ రవిబాబును ‘సాక్షి’ సంప్రదించగా.. ఈ సంఘటనపై ఫిర్యాదు అందిందని, విచారిస్తేగానీ ఏ విషయాన్నీ నిర్ధారించి చెప్పలేమన్నారు. -
జూనియర్ ఇంటర్లో 64 ఉత్తీర్ణత
ఎంపీసీలో 466/470 నెల్లూరు హరనాథపురంలోని నారాయణ కళాశాల విద్యార్థి కొండూరు కార్తికేయన్ ఎంపీసీలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి జిల్లాలో టాపర్‌గా నిలిచారు. నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో జిల్లా 64 శాతం ఉత్తీర్ణత సాధించింది. గత నెల్లో ఇంటర్ పరీక్షలు జరిగాయి. మొదటి ఏడాది ఫలితాలను ఇంటర్‌బోర్డు సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేసింది. జిల్లాలో మొత్తం 26,947 మంది మొదటి ఏడాది పరీక్షలు రాశారు. వీరిలో 17,281 మంది ఉత్తీర్ణులయ్యారు. 64 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో నాల్గోస్థానాన్ని జిల్లా దక్కించుకొంది. గత ఏడాది కూడా ఇవే ఫలితాలు వచ్చాయి. ఈ ఏడాది 14,384 మంది బాలురు పరీక్ష రాయగా 8,885 మంది ఉత్తీర్ణులై 62 శాతం సాధించారు. 12,563 మంది బాలికలు పరీక్ష రాయగా 8,396 మంది ఉత్తీర్ణత సాధించి 67 శాతం నమోదు చేశారు. సరాసరి 64 శాతం విజయం సాధించినప్పటికీ ఫలితాల్లో బాలికలదే పైచేయి. రాష్ట్రంలో కృష్ణా, రంగారెడ్డి, విశాఖపట్టణం జిల్లాల తర్వాత నెల్లూరులో ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలో ఫెయిల్ అయిన వారికి, అధిక మార్కులు సాధిం చాలనుకునే వారికి ప్రభుత్వం వచ్చే 25 నుంచి జూన్ 1వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుంది. మే 6వ తేదీ లోపు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.