
సాక్షి, కడప : ఒత్తిడి తట్టుకోలేక మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్జీవో కాలనీలో నారాయణ ప్రయివేటు కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న హర్షవర్థన్ అనే విద్యార్థి రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రిమ్స్ సమీపంలోని రైల్వే ట్రాక్ సమీపంలో అతడు శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే కళాశాల అధ్యాపకుల వేధింపుల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి జయరాం ఆరోపించారు. కాలేజీకి రానన్నవాడికి మళ్లీ ఎందుకు వచ్చావని ఏజీఎం తన కుమారుడిని కొట్టడాని, అంతేకాకుండా లెక్చరర్లు అందరి ముందు దూషించడంతో అవమానం తట్టుకోలేక మనస్తాపం చెందిన హర్షవర్థన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. తన కొడుకు రైలుకింద పడి చనిపోయినట్లు వాట్సప్ ద్వారా సమాచారం వచ్చిందని కన్నీటిపర్యంతం అయ్యాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment