
సాక్షి, హైదరాబాద్: నారాయణ కళాశాల యాజమాన్యం చదువుల పేరుతో వేధింపులకు గురి చేస్తోందంటూ ఆ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతనికి బీసీ విద్యార్థి సంఘం నాయకులు మద్దతు తెలిపారు. బడంగ్‌పేటకు చెందిన సాయినాథ్ రెడ్డి చంపాపేటలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
చదువుల పేరుతో కళాశాల సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా వేధింపులకు పాల్పడుతున్నారని, ఆపై పరీక్షల పేరుతో తమపై ఒత్తిడి పెంచుతున్నారని సాయినాథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాలు తల్లిదండ్రులకు చెప్పడానికి ప్రయత్నిస్తే వారికి కట్టుకథలు చెబుతున్నారని.. కళాశాల యాజమాన్యం ఒత్తిడిలను మానుకోకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని అతను హెచ్చరించారు. ఇటీవలికాలంలో నారాయణ కాలేజీ విద్యార్థులు వరుసగా ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో సాయినాథ్‌రెడ్డి ఫిర్యాదు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment