narayana college
-
అనంతపురం నారాయణ కాలేజీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత
-
అనంత: నారాయణ కాలేజీ వద్ద ఉద్రికత్త
సాక్షి, అనంతపురం: నారాయణ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థుల మరణాలకు కారణమైన నారాయణ కాలేజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ సందర్బంగా విద్యార్థి సంఘాలు కాలేజీకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో, అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.అనంతపురం నారాయణ కాలేజీ వద్ద విద్యార్థులు సంఘాలు ఆందోళనలకు దిగాయి. మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేస్తున్నారు. కాగా, నారాయణ కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకి ఇటీవల చరణ్ అనే విద్యార్థి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల మరణాలకు కారణమైన నారాయణ కాలేజీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం, విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు.. కొద్దిరోజుల క్రితమే నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్ అనే విద్యార్థి బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. క్లాస్ రూమ్‌లో అందరితో పాటు కూర్చున్న విద్యార్థి ఒక్కసారిగా లేచి వెళ్లి, చెప్పులు విప్పేసి కారిడార్ నుంచి కిందకు దూకేశాడు. దాంతో తరగతిలో ఉన్న లెక్చరర్‌తో పాటు విద్యార్థులంతా షాకయ్యారు. తీవ్రంగా గాయపడ్డ చరణ్‌ను ఆసుపత్రికి తీసుకెళుతుండగానే ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఇటీవల సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి వెళ్లిన కుమారుడు ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. అతడి మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కాలేజ్ బిల్డింగ్‌పై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
-
అనంతపురం జిల్లాలో నారాయణ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య
-
‘రెడ్‌బుక్ రాజ్యాంగం విద్యార్థుల మీద కూడా చూపిస్తారా?’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో విద్య పేరుతో జరిగే దోపిడీని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర. మంత్రి నారా లోకేష్ ఏం చేస్తున్నారు?.. రెడ్ బుక్ రాజ్యాంగం విద్యార్థుల మీద కూడా చూపిస్తారా? అని ప్రశ్నించారు. అలాగే, చంద్రబాబు హయాంలో మళ్ళీ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పారు.వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో మళ్లీ ప్రైవేటు కాలేజీల వేధింపులు పెరిగాయి. శ్రీ చైతన్య, నారాయణ సంస్థలు ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నాయి. ఫీజులు చెల్లించకపోతే బయటకు నెట్టేస్తున్నాయి. శ్రీ చైతన్య సంస్థ నిన్న ఒక విద్యార్థిని బయటకు నెట్టింది. తండ్రితో కలిసి ఆ విద్యార్థి కాలేజీ ఎదుట ధర్నా చేశాడు. విద్య పేరుతో జరిగే ఈ దోపిడీని వ్యతిరేకిస్తున్నాం. మంత్రి లోకేష్ ఏం చేస్తున్నారు?. రెడ్‌బుక్ రాజ్యాంగం విద్యార్థుల మీద కూడా చూపిస్తారా?.ఫీజుల మానిటరింగ్ కమిటీ ఏం చేస్తుందో అర్థం కావటం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఫీజుల పేరుతో వేధింపులనేవే జరగలేదు. చంద్రబాబు హయాంలో మళ్లీ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డులో నారాయణ సంస్థ సిబ్బందిని నియమించటం సిగ్గుచేటు. ఫీజుల గురించి వేధిస్తే వైఎస్సార్సీపీ హయాంలో బ్లాక్ లిస్టులో పెట్టారు. ఇప్పుడు ఆ పని ఎందుకు చేయటం లేదు?. విద్యార్థులను మానసిక ఆందోళనకు గురి చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలి.కార్పొరేట్ విద్యాసంస్థల్లో పిల్లలు పిట్టల్లాగా రాలిపోతున్నారు. నారాయణ, శ్రీ చైతన్య సంస్థలపై విచారణ జరపాలి. ఆ సంస్థలు పుస్తకాల ఫీజే రూ.18వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. రూ.50ల ఐడీ కార్డుకు రూ.400 వసూలు చేస్తున్నారు. ఇలాంటి చర్యలను వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం సీరియస్‌గా తీసుకుంటుంది. ఈ ప్రభుత్వ చర్యలపై ఉద్యమిస్తాం. నారాయణ, శ్రీ చైతన్య సంస్థల్లోని సిబ్బందికి సరైన జీతాలు ఇవ్వటం లేదు. పని భారంతో వేధింపులకు గురి చేస్తున్నారు. విద్యార్థుల నుండి ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తూ సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వటం లేదు’ అని ఆరోపించారు. -
నారాయణ కాలేజీలకు మహిళా కమిషన్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: నారాయణ కాలేజీలకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. విద్యార్థినుల వరుస ఆత్మహత్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అనూష(16) అనే విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటన మరువకముందే మాదాపూర్ నారాయణలో మరో విద్యార్థి ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడువిద్యార్థుల ఆత్మహత్య చేసుకోవడంపై మహిళా కమిషన్ ఆగ్రహం సీరియస్ అయ్యింది. ఎందుకు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారో వివరణ ఇవ్వాలని తెలంగాణ మహిళా కమిషన్ నారాయణ కాలేజీలకు నోటీసులు ఇచ్చింది. -
హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
-
అనూష ఆత్మహత్య.. నారాయణ కాలేజీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అనూష కాలేజీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.వివరాల ప్రకారం.. బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో అనూష ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆదివారమే అనూషను పేరెంట్స్ హాస్టల్లో దింపి వెళ్లారు. ఆమెను డ్రాప్ చేసిన కాసేపటికే గదిలో ఉరివేసుకుని అనూష ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం అనూష పేరెంట్స్‌కి ఫోన్ చేసి.. విద్యార్థి పేరెంట్స్‌కు స్పృహ తప్పి కిందపడిపోయినట్టు సమాచారం ఇచ్చారు. దీంతో, సిటీ దాటకముందే.. పేరెంట్స్ కాలేజీకి బయలుదేరారు. వారు.. కాలేజీకి వెళ్ళే సరికి అనూష ఉరి వేసుకొని చనిపోయిందని యాజమాన్యం తెలిపింది యాజమాన్యం. పేరెంట్స్ కాలేజీకి రాకముందే అనూష మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించింది నారాయణ కాలేజీ యాజమాన్యం. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇక, తాజాగా బాచుపల్లి నారాయణ కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనూష బంధువులు నారాయణ కాలేజీలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అనూష సూసైడ్ చేసుకున్న విషయాన్ని తమకు ముందే ఎందుకు చెప్పలేదని కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఇదే సమయంలో తాము అనూష డెడ్‌బాడీని చూడకముందే ఎందుకు గాంధీ ఆసుపత్రికి తరలించారని అడిగారు. ఈ క్రమంలో కాలేజీ ఎదుట వారు ఆందోళనకు దిగారు. దీంతో, పోలీసులు అక్కడికి చేరుకుని వారిని పంపించే ప్రయత్నం చేయగా.. వాగ్వాదం చోటుచేసుకుంది. -
కాలేజీలా.. మురికి కూపాలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేట్ ప్రైవేటు జూనియర్ కాలేజీలు భారీగా ఫీజులు దండుకుంటూ హాస్టళ్లలో విద్యార్థినులకు కనీస వసతు లు కలి్పంచకపోవడంపై తెలంగాణ మహిళా కమిషన్ తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఇటీవల రెండు కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీచైతన్య జూనియర్ కాలేజీ (మాదాపూర్ ఐఐటీ గర్ల్స్ క్యాంపస్), నారాయణ జూనియర్ కాలేజీ (బాచుపల్లి ఐఐటీ గర్ల్స్ క్యాంపస్)లను పూర్తిస్థాయిలో తనిఖీ చేసి అక్కడి విద్యార్థినులతో మాట్లాడారు. ప్రధానంగా ఆయా కాలేజీల్లో వాష్‌రూమ్‌లు, మంచినీటి వసతి అత్యంత దుర్భరంగా ఉన్న విషయాన్ని ప్రత్యక్షంగా గుర్తించి యాజమాన్యాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పబ్లిక్ టాయిలెట్ల కంటే అధ్వానంగా... రెండు కాలేజీల్లోనూ వందలాది మంది విద్యార్థినులు ఉండగా వారి సంఖ్యకు తగినన్ని వాష్‌రూమ్‌లు లేకపోవడం, మంచినీటి వసతి ప్రాంగణం దుర్గంధం వెదజల్లుతుండటంపై నేరెళ్ల శారద తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డారి్మటరీలు అపరిశుభ్రంగా ఉన్నాయని, చాలా వాష్‌రూమ్‌లకు తలుపులు లేవని పలువురు విద్యార్థినులు ఆమెకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ రెండు కాలేజీలకు ఎలాంటి అనుమతులు ఇచ్చారో పూర్తిస్థాయి నివేదిక సమరి్పంచాలని జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, ఆహార భద్రత విభాగం, ఇంటర్ బోర్డు కమిషనర్‌కు తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద నోటీసులిచ్చారు. ఎలాంటి ఇబ్బందులున్నా తనకు ఫిర్యాదు చేయాలని సూచిస్తూ ఫోన్ నంబర్‌ను విద్యారి్థనులకు ఇచ్చారు. -
‘నారాయణ’ యాజమాన్యం నిర్లక్ష్యానికి మా కుమారుడు బలి
తెనాలిరూరల్: నారాయణ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మరణించాడని తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని బీసీ కాలనీకి చెందిన కర్రె విజయ్‌కుమార్ దంపతులు ఆవేదన వ్యక్తంచేశారు. తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ మేరకు ఆదివారం తెనాలిలో విజయకుమార్ దంపతులు విలేకరులతో మాట్లాడారు. ‘మాకు కుమారుడు గిరీష్ అర్వంత్(15), కుమార్తె ఉన్నారు. కుమారుడు గిరీష్‌ను హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పరిధిలో గల కోహెడ నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేర్పించాము. ఈ నెల 12వ తేదీన కాలేజీ హాస్టల్లో చేరిన గిరీష్ తరచూ ఫోన్ చేసి తనకు అక్కడ బాగాలేదని ఇంటికి వచ్చేస్తానని చెబుతున్నాడు. మేం అర్వంత్‌కు సర్దిచెబుతూ వచ్చాం. అక్కడ ఇబ్బందులను భరించలేక అర్వంత్ ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి బయటకు రావాలని ప్రయత్నించాడని, ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలి మృతిచెందాడని కాలేజీ యాజమాన్యం తెలిపింది. వెంటనే మేం వెళ్లి మా కుమారుడి మృతదేహాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తిచేశాం. మా కుమారుడి విషయంలో నారాయణ కాలేజీ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అంతమంది చదువుతున్న కాలేజీ, హాస్టల్ నుంచి మా బిడ్డ బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తే యాజమాన్యం ఏం చేస్తుంది? మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు.’ అని విజయకుమార్ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. -
HYD: నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నారాయణ విద్యాసంస్థల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. మాదాపూర్ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వినయ్ అనే విద్యార్థి తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. శ్రీకాళహస్తికి చెందిన వినయ్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని రామానుజన్ క్యాంపస్ నారాయణ కాలేజీలో ఐఐటీ లాంగ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఐఐటీ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయనే మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: Us: అమెరికాలో మరో భారతీయుడి హత్య -
వారం రోజుల్లో 200 మంది విద్యార్థినులకు అస్వస్థత
జిన్నారం(పటాన్చెరు): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం శివారులోని నారా యణ కళాశాలలో విద్యార్థినులు వాంతులు, విరోచ నాలతో అస్వస్థతకు గురవుతున్నారు. ఈ ఘటన ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా రు. నారాయణ బాలికల కళాశాలలో సుమారు 500 మంది విద్యార్థినులు ఉన్నారు. నెలరోజుల నుంచి విద్యార్థినులు విరోచనాలు, వాంతులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని యాజ మాన్యం గుట్టుగా ఉంచటంతోపాటు రహస్యంగా విద్యార్థినులను ఇంటికి పంపిస్తోంది. వారంరోజు ల్లో 200 మంది విద్యార్థినులు ఆస్పత్రిపాలు కావ టంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో భారీ సంఖ్యలో కళాశాలకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యాన్ని నిలదీశారు. కలు షిత నీరు, ఆహారం వల్లే ఇబ్బందులు పడుతున్నా మని విద్యార్థినులు వాపోయారు. ఇంటర్ మొదటి సంవత్సరానికి చెందిన ఓ విద్యార్థిని తండ్రి వెంక టేశ్‌యాదవ్ మాట్లాడుతూ ఈ ఏడాది మూడుసార్లు ఇలాగే జరిగిందని, ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోలేదన్నారు. భారీగా ఫీజులు వసూలు చేస్తున్నదే తప్ప విద్యార్థుల ఆరోగ్యంపై యాజమాన్యం దృష్టి సారించటంలేదని విమర్శించారు. సంక్రాంతి పండుగ పేరిట విద్యార్థినులకు పది రోజులపాటు యాజమాన్యం సెలవులు ప్రకటించిందన్నారు. -
నారాయణ ఉమెన్స్ కాలేజీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్
-
కర్నూలులో ‘నారాయణ’ వీడియోల కలకలం..
కర్నూలు సిటీ: ఇప్పటి వరకూ నారాయణ విద్యా సంస్థల్లో ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలు, సరైన భోజనం, సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్న ఘటనలే వెలుగు చూశాయి. తాజాగా ఉద్యోగి రాసలీలల వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. నారాయణ విద్యాసంస్థల కోర్ డీన్ లింగేశ్వరరెడ్డి ఆక్కడ పనిచేసే కొందరు మహిళలతో జరిపిన రాసక్రీడల వీడియోల వ్యవహారం చర్చనీయాంశమైంది. నారాయణ విద్యాసంస్థల కోర్ డీన్ లింగేశ్వరరెడ్డి.. జూనియర్ కాలేజీల విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో తన కార్యాలయంలోనే అక్కడి మహిళలతో ఆయన సాగిస్తున్న సరస సల్లాపాలను గమనించిన అక్కడ పనిచేసే గోపీకృష్ణ, నజీర్ అనే ఉద్యోగులు ఆ గదిలో స్పై కెమెరాలు అమర్చారు. ఇందులో పదుల సంఖ్యలో రాసలీలల వీడియోలు రికార్డయ్యాయి. గోపీకృష్ణ, నజీర్‌లు ఆ వీడియోలను డీన్ లింగేశ్వరరెడ్డి వాట్సాప్‌కు పంపగా.. వారిని రాజీకి పిలిపించి ఒక ఇల్లు, రెండు విలువైన ప్లాట్లు వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అంతేగాక వారి వేతనాలు కూడా పెంచేందుకు హామీ ఇచ్చారు. మరికొంత మంది బ్లాక్మెయిల్ తర్వాత ఆ వీడియోలు ఓ ఉద్యోగి ద్వారా నబీ రసూల్ అనే వ్యక్తికి చేరాయి. ఇతను చంద్రశేఖరరెడ్డి, రవిశంకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి అనేవారికి వీడియోలను పంపడంతో వారు లింగేశ్వరరెడ్డి వద్ద డబ్బులు డిమాండ్ చేశారు. వీరితోనూ రాజీకి వెళ్లి పెద్ద మొత్తంలో నగదు ఒప్పందం చేసుకున్నారు. కొంత డబ్బులు ఇచ్చి, మిగిలిన మొత్తం ఇవ్వకపోవడంతో తిరిగి వీళ్లు ఈ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేయసాగారు. దీంతో ఇంకెంతమంది ఇలా బ్లాక్ మెయిల్ చేస్తారోనని భయంతో లింగేశ్వరరెడ్డి స్పందనలో ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. దీంతో తాలూకా పోలీస్‌స్టేషన్‌కు బ్లాక్‌మెయిలర్స్‌ను పిలిపించి సెల్ఫోన్లు తీసుకుని వారి దగ్గర ఉన్న వీడియోలను డిలీట్ చేయించి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఆయన ఆస్తులను కూడా తిరిగి అతని పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. నిందితులను కర్నూలు రూరల్ తహసీల్దార్ ఎదుట హాజరు పరిచి బైండోవర్ కేసు నమోదు చేయించారు. తనను బ్లాక్ మెయిల్ చేసిన ఉద్యోగులను కోర్ డీన్ హైదరాబాద్‌కు బదిలీ చేయించారు. తనను కొందరు బ్లాక్మెయిల్ చేస్తున్నారని లింగేశ్వరరెడ్డి స్పందనలో ఫిర్యాదు చేయడంతో విచారించి నిందితులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్టు కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ చెప్పారు. బాధితులు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేస్తే ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: విశాఖ జూ పార్క్‌లో దారుణం.. కేర్ టేకర్‌పై ఎలుగుబంటి దాడి -
నారాయణ మనుష్యులు మరీ..!
సాక్షి, నెల్లూరు: నరసింహ కొండ క్యాంపస్‌లోని నారాయణ కాలేజీ వార్డెన్‌గా పని చేస్తున్న హరిబాబుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొట్టి నెల్లూరు నగర సమీపంలో పడేశారు. హరిబాబును పోలీసులు ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం వార్డెన్ హరిబాబుకి, ప్రిన్సిపాల్ కొండారెడ్డికి మధ్య స్కూల్స్ గేమ్స్ విషయంలో వాగ్వాదం జరిగింది. కొండారెడ్డి దాడి చేయించారంటూ హరిబాబు కుటుంబ సభ్యులు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చదవండి: Fact Check: సచివాలయాలపైనా ఏడుపే.. -
నారాయణ కాలేజీలో మహిళా వార్డెన్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ అయ్యప్ప సోసైటిలో నారాయణ కళాశాలలో పనిచేస్తున్న వార్డెన్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన భవాని అదే కాలేజీలో డిగ్రీ చదువుతూ అసిస్టెంట్ వార్డెన్‌గా పనిచేస్తోంది. అయితే కాలేజీ గదిలో ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. మాదాపూర్ నారాయణ కళాశాల సరస్వతి క్యాంపస్‌లో భవాని నెల క్రితమే హాస్టల్ వార్డెన్‌గా చేరినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భవాని మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: హైటెక్ సిటీ: ప్రాణం తీసిన అతివేగం.. యువతి మృతి -
మాదాపూర్ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
-
మాదాపూర్ నారాయణ కాలేజీ విద్యార్థి బలవన్మరణం
సాక్షి, హైదరాబాద్: కార్పోరేట్ చదువులు మరో విద్యార్థిని బలిగొన్నాయి!. రాజేంద్రనగర్‌లో ఓ కార్పొరేట్ కళాశాల ఉదంతం మరువకముందే.. మాదాపూర్ నారాయణ కాలేజీలో సెకండ్ ఇయర్ విద్యార్థి ఒకరు శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన గదిలో ఫ్యాన్‌కి తాడుతో ఉరేసుకుని ఆత్మాహుతి చేసుకున్నాడు. కనక రాజు అనే విద్యార్థి.. మాదాపూర్ నారాయణ కాలేజీలో ఇంటర్ బైపీసీ సెకండియర్ చదువుతున్నాడు. మధ్యాహ్న సమయంలో అటెండెన్స్ సమయంలో కనకరాజు లేకపోవడంతో.. సిబ్బంది అతని గదికి వెళ్లి చూశారు. అక్కడ విగతజీవిగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు కనకరాజు. చదువులో బాగా రాణించేవాడని, ఫస్ట్ ఇయర్లో కూడా మంచి మార్కులు వచ్చాయని, అతనికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో తమకు తెలియదని కళాశాల యాజమాన్యం చెబుతోంది. మరోవైపు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులకు సమాచారం అందించామని, వాళ్లను ప్రశ్నిస్తే కనరాజుకి ఉన్న సమస్యేంటో బయటపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. -
బాచుపల్లిలో కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, మైదరాబాద్: బాచుపల్లి ఓ ప్రైవేట్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. బాలికల క్యాంపస్ హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం ఉదయం హాస్టల్ భవనం 5వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని వంశిక మృతి చెందింది. కామారెడ్డి జిల్లాకు చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వంశిక.. వారం రోజుల క్రితమే క్యాంపస్‌లో చేరినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వంశిక ఆత్మహత్య చేసుకుందా?. ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయిందా? అన్నది స్పష్టత లేదు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతికి గల కారణలపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: శిరీషది హత్యా.. ఆత్మహత్యా?.. తెలంగాణ డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశం -
విద్యార్థుల జీవితాలతో నారాయణ ఆడుకున్నారు: ఏజీ పొన్నవోలు
సాక్షి, అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ చేయడం ద్వారా నారాయణ విద్యా సంస్థ, దాని అధిపతి, మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఇలాంటి వారి పట్ల న్యాయస్థానం మెతక వైఖరి అవలంబించకూడదని అన్నారు. తీవ్ర నేరానికి పాల్పడిన నారాయణకు రిమాండ్ తిరస్కరించి, బెయిల్ మంజూరు చేయడం ద్వారా మేజి్రస్టేట్ తప్పు చేశారని, పరిధి దాటి వ్యవహరించారని, మినీ ట్రయల్ నిర్వహించారని తెలిపారు. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. సెషన్స్ కోర్టు ఉత్తర్వుల్లో ఈ కోర్టు జోక్యం చేసుకుంటే, మేజిస్ట్రేట్ల తప్పులను సమర్థించినట్లవుతుందని తెలిపారు. అందువల్ల మేజిస్ట్రేట్ ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు తీర్పును రిజర్వ్ చేశారు. నారాయణ ఈ నెల 30వ తేదీలోపు లొంగిపోవాలంటూ సెషన్స్ కోర్టు నిర్దేశించిన గడువును తీర్పు వెలువరించేంత వరకు పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. చదవండి: (ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు షాక్) మేజి్రస్టేట్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేస్తూ చిత్తూరు సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పొంగూరు నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు మంగళవారం మరోసారి విచారణ జరిపారు. ఏఏజీ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నారాయణకు బెయిల్ రద్దు ఉత్తర్వులు తాత్కాలికమైనవి కావని, మధ్యంతర ఉత్తర్వులని వివరించారు. అందువల్ల వాటిపై రివిజన్ పిటిషన్ దాఖలు చేయాలే తప్ప, క్వాష్ పిటిషన్ కాదని అన్నారు. ఈ సందర్భంగా చట్ట నిబంధనలను, పలు తీర్పులను వివరించారు. నిబంధనల ప్రకారమే బెయిల్ మంజూరు చేయాలి తప్ప, ఫలానా సెక్షన్ వర్తించదని రిమాండ్ సమయంలో మినీ ట్రయల్ నిర్వహించడానికి వీల్లేదని, ప్రస్తుత కేసులో మేజి్రస్టేట్ ఇలాంటి ట్రయల్ నిర్వహించారని, దీనిపైనే తమ ప్రధాన అభ్యంతరమని తెలిపారు. ప్రశ్నపత్నం లీకేజీ వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని, అందుకు నారాయణను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారులపై ఉందన్నారు. మేజిస్ట్రేట్ ఉత్తర్వుల వల్ల దర్యాప్తునకు విఘాతం కలిగిందన్నారు. విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న వ్యవహారమైనందువల్ల నారాయణ చర్యలను తేలిగ్గా తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. నారాయణ తరపు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. -
కృష్ణ జిల్లా: మద్యం మత్తులో నారాయణ కాలేజ్ బస్సు డ్రైవర్ హల్చల్
-
మద్యం మత్తులో నారాయణ కాలేజ్ బస్సు డ్రైవర్ హల్చల్.. విద్యార్థుల కేకలు!
సాక్షి, కృష్ణ: జిల్లాలో మద్యం మత్తులో నారాయణ కాలేజీ బస్సు డ్రైవర్ హల్చల్ చేశాడు. పీకాల దాకా మద్యం తాగి విద్యార్ధులు ప్రయాణిస్తున్న బస్సును నడిరోడ్డుపై వదిలేశాడు. దీంతో, విద్యార్థులు తమను రక్షించాలంటూ కేకలు వేశారు. వివరాల ప్రకారం.. మద్యం మత్తులో నారాయణ కాలేజీ బస్సు డ్రైవర్ నడిరోడ్డుపై హంగామా చేశాడు. కాలేజీ పూర్తైన తర్వాత ఉయ్యూరు నుంచి విద్యార్థులతో బస్సు బయలుదేరింది. ఈ క్రమంలో ఫుల్లుగా మద్యం సేవించిన డ్రైవర్..రోడ్డుపై బస్సును ప్రమాదకరంగా నడిపాడు. దీంతో, విద్యార్థులు కేకలు వేయడంతో పామర్రు మండలం కనుమూరు జాతీయ రహదారిపై బస్సును నిలిపివేశాడు. అంతటితో ఆగకుండా నడిరోడ్డుపై ఉన్న డివైడర్‌ను పట్టుకుని హల్చల్ చేశాడు. కాగా, డ్రైవర్ ప్రవర్తనతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. తమను రక్షించాలంటూ పెద్ద కేకలు వేశారు. ఈ క్రమంలో విద్యార్థులు నారాయణ స్కూల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. కానీ, విద్యార్థులు ఆందోళన చెందుతున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా, డ్రైవర్ ప్రవర్తనతో విద్యార్థుల పేరెంట్స్, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విద్యార్థిపై ‘నారాయణ’ లెక్చరర్ ప్రతాపం
సాక్షి, పటమట (విజయవాడ): విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థిని అధ్యాపకుడు కాలితో తన్నిన ఘటనను మరువక ముందే నగరంలోని నారాయణ కళాశాలలోనూ ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. మార్కులు తక్కువ వచ్చాయని ఓ విద్యార్థిని లెక్చరర్ తీవ్రంగా కొట్టారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.. విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థికి మార్కులు తక్కువ వచ్చాయి. అయితే, మార్కులు ఎందుకు తగ్గాయంటూ ప్రసాదరావు అనే లెక్చరర్ శుక్రవారం మధ్యాహ్నం సదరు విద్యార్థిని చితకబాదారు. ఈ దృశ్యాన్ని మరో విద్యార్థి తన సెల్ఫోన్లో చిత్రీకరించడం గమనించిన ఆ లెక్చరర్, కళాశాల ప్రతినిధి కోటితో కలిసి అతన్ని(చిత్రీకరిస్తున్న విద్యార్థి) తీవ్రంగా కొట్టారు. అంతేగాక వారిద్దరినీ వేరే తరగతి గదిలోకి తీసుకెళ్లి.. బెదిరించడమేగాక సెల్‌ఫోన్ లాక్కొని పగులకొట్టారు. జరిగిన ఘటనను విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పగా, వారు పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మహేంద్ర చెప్పారు. చదవండి: (ఇదీ చరిత్ర.. ఇవీ నిజాలు: ఎన్టీఆర్.. చంద్రబాబు.. అలనాటి నగ్నసత్యాలు) -
Narayana College: అగ్గి రాజేసిన ఫీజు
అంబర్‌పేట (హైదరాబాద్): ఫీజుల పేరిట కార్పొరేట్ కళాశాలలు సాగిస్తున్న దోపిడీకి అద్దం పట్టే ఘటన ఇది. ఓ కాలేజీ ధనదాహం ఏకంగా ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. గతంలో పనిచేసిన ప్రిన్సిపల్ ఇచ్చిన ఫీజు రాయితీ చెల్లదని, ఉత్తీర్ణత పత్రాలు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ) ఇవ్వాలంటే బకాయి ఉన్న రూ.16 వేలు కట్టాల్సిందేనని ఓ విద్యార్థిపై ఇప్పటి ప్రిన్సిపల్ ఒత్తిడి తెచ్చారు. ఎంత వేడుకున్నా ఫలితంలేకపోవడంతో, ఈ మొత్తం చెల్లించే స్థితిలో లేని ఆ విద్యార్థి.. విద్యార్థి సంఘాల నేతలను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఆ కళాశాలకు వెళ్లిన విద్యార్థి నేతల్లో ఒకరు.. ఎంత ప్రాధేయపడినా ప్రిన్సిపల్ విన్పించుకోక పోవడంతో, విధిలేని పరిస్థితుల్లో తనపై పెట్రోల్ పోసుకున్నాడు. అదే సమయంలో పెట్రోల్ అక్కడే వెలుగుతున్న దీపంపై కూడా పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆ విద్యార్థి నేతతో పాటు మరో నాయకుడు, కాలేజీ సిబ్బంది ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అంబర్‌పేట డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాయితీ ఇచ్చిన ఫీజు చెల్లించాలంటూ... మల్కాజిగిరి వెంకట్‌రెడ్డినగర్‌కు చెందిన సాయి నారాయణ అంబర్‌పేట–రామంతాపూర్ ప్రధాన రహదారిలో ఉన్న నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదివాడు. ఇటీవల పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత కళాశాలకు వెళ్లిన సాయి తనకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతకు సంబంధించిన పత్రాలు, టీసీ ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే తమకు చెల్లించాల్సిన ఫీజులో ఇంకా రూ.16 వేలు బకాయి ఉందంటూ చెబుతూ వచ్చిన కాలేజీ ప్రిన్సిపల్ సుధాకర్, ఆ మొత్తం చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ తెగేసి చెప్పారు. అయితే గతంలో పనిచేసిన ప్రిన్సిపల్ రాధాకృష్ణ తనకు రూ.16 వేలు రాయితీ ఇచ్చారంటూ చెప్పిన సాయి, ఆయన్ను సంప్రదించి అనుమానం నివృత్తి చేసుకోవాలని కోరాడు. పదే పదే విజ్ఞప్తి చేసినా.. సాయి మాటలు పట్టించుకోని ప్రిన్సిపల్ సుధాకర్ గత ప్రిన్సిపల్ ఇచ్చిన రాయితీ ఇప్పుడు చెల్లదని స్పష్టం చేశారు. రూ.16 వేలు కూడా చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తానని తేల్చిచెప్పారు. అయినా సాయి దాదాపు 15 రోజులు కళాశాల చుట్టూ తిరుగుతూ, తన సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందిగా ప్రిన్సిపల్, తదితరులను వేడుకున్నాడు. అయినా ప్రిన్సిపల్ కనికరించలేదు. దీంతో సాయి తనకు సాయం చేయాల్సిందిగా విద్యార్థి సంఘం నేతలు వెంకటచారి, సందీప్‌లను కోరాడు. వీరు శుక్రవారం మరికొందరు విద్యార్థులతో కలిసి నారాయణ కళాశాలకు వచ్చారు. ప్రిన్సిపల్‌ను కలిసి సాయి విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పదేపదే కోరినా ఆయన విన్పించుకోలేదు. ఫీజు బకాయి చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ పునరుద్ఘాటించారు. సాయిని కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురి చేయడం, తాము వచ్చినా పట్టించుకోకపోవడంతో విద్యార్థి నేత సందీప్ ‘ఇస్తారా.. మమ్మల్ని ఇక్కడే చావమంటారా?’ అంటూ ప్రిన్సిపల్‌పై అసహనం వ్యక్తం చేశారు. ససేమిరా అన్న ప్రిన్సిపల్, ఏఓ.. ఈ క్రమంలోనే కళాశాల కార్యాలయంలో ఉన్న ప్రిన్సిపల్ గదిలో ప్రిన్సిపల్ సుధాకర్‌తో పాటు అడ్మినిస్ట్రేటివ్ అధికారి (ఏఓ) అశోక్రెడితో సందీప్ తదితరులు కొద్దిసేపు వాగ్వివాదానికి దిగారు. ఎంత వాదించినా సర్టిఫికెట్లు ఇవ్వడానికి వారుç ససేమిరా అన్నారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో సందీప్.. అప్పటికే తెప్పించి పెట్టుకున్న పెట్రోల్ బాటిల్ తీసుకుని తనపై పోసుకున్నాడు. అలా పోసుకునే క్రమంలో పెట్రోల్ ఏఓ అశోక్‌రెడ్డి (45), మరో విద్యార్థి నేత వెంకటచారి పైనా పడింది. అలాగే ఆ పక్కనే ఉన్న దేవుడి చిత్రపటం ముందు వెలిగించిన దీపంపై పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సందీప్ సహా ముగ్గురికి తీవ్రగాయాలు... మంటలు అంటుకున్న సందీప్, చారి, అశోక్ తీవ్రంగా గాయడపడ్డారు. అక్కడే ఉన్న ప్రిన్సిపల్‌కు సైతం మంటల ప్రభావానికి స్వల్పగాయాలయ్యాయి. ప్రిన్సిపల్ గదిలో నుంచి దట్టమైన పొగలు రావడం గమనించిన ఉద్యోగులు, విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకుని అక్కడకు చేరుకున్న చాదర్‌ఘాట్ అగ్నిమాపక శకటాలు మంటల్ని పూర్తిగా అదుపులోకి తెచ్చాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తొలుత గాంధీ ఆస్పత్రికి, అక్కడి నుంచి యశోద హాస్పిటల్‌కు తరలించారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడి ఐసీయూలో చికిత్స పొందుతున్న సందీప్‌కు 65 శాతం, అశోక్‌కు 50 శాతం, వెంకటచారికి 30 శాతం శరీరంపై కాలిన గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. అడ్డుకట్ట వేయాలంటూ ఆందోళన విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాల నేతలు అక్కడికి చేరుకున్నారు. నారాయణ కళాశాల ఫీజుల దోపిడీకి ఇప్పటికైనా అడ్డుకట్ట వేయాలంటూ ఆందోళనకు దిగారు. ఏబీవీపీ నాయకులు శ్రీకాంత్, ప్రవీణ్, ఎస్ఎఫ్ఐ నేత ఆశోక్‌రెడ్డి, ఇతర నాయకులు శ్రీకాంత్, దీప్కుమార్లు కళాశాల వద్ద ధర్నా చేశారు. ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు విద్యార్థి నేతలను అరెస్టు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫీజు వేధింపులే ఘటనకు కారణం నా కుమారుడు ఇదే కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఫీజు కట్టలేదని బయట నిలబెట్టారని తెలియడంతో కాలేజీకి వెళ్లాను. ఆ సమయంలోనే ఒక్కసారిగా అరుపులు, కేకలు వినిపించాయి. ప్రిన్సిపల్ గది వైపు వెళ్లడంతో మంటలు అంటుకుని నేను కూడా స్వలంగా గాయపడ్డాను. ఫీజు కోసం వేధింపులకు గురిచేయడం వల్లే ఈ సంఘటన జరిగింది. – ప్రత్యక్ష సాక్షి మహ్మద్ బూరాన్ ––––––––––––––––––––––––––– విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు: మంత్రి సబిత అంబర్‌పేటలోని ఓ ప్రైవేటు కాలేజీలో జరిగిన ఆత్మహత్యాయత్నం ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాల్సిందిగా విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి శుక్రవారం ఇంటర్ బోర్డు కార్యదర్శిని ఆదేశించారు. నివేదిక అందిన వెంటనే ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చదవండి: సభ్యసమాజం తలదించుకునేలా సంజయ్ మాటలు -
ప్రిన్సిపాల్ రూమ్‌లో ఏం జరిగిందో కళ్లకు కట్టినట్లు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
-
రామంతాపూర్ నారాయణ కాలేజీలో ఎప్పుడేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: రామంతాపూర్ నారాయణ కాలేజీలో గాయపడిన విద్యార్థినేత సందీప్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని ముందుగా గాంధీ ఆసుపత్రికి, అక్కడి నుంచి యశోద ఆసుపత్రి పోలీసులు తరలించారు. అయితే యశోద ఆసుప్రతిలో బెడ్లు ఖాళీ లేకపోవడంతో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. సందీప్ సహా వెంకటేష్‌చారీ, కాలేజ్ ఏవో అశోక్‌కు డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మొత్తం ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు హైదరాబాద్ నారాయణ కాలేజీకి తెలంగాణ ప్రభుత్వం షోకాజు నోటీసులు జారీ చేసింది. రామాంతాపూర్ నారాయణ కాలేజీ ఘటనపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. టైం టు టైం ఏం జరిగిందంటే ► 12:20కి కాలేజ్ వచ్చిన సాయి నారాయణ అతని స్నేహితుడు సందీప్‌తో పాటు మరో ఆరుగురు ►12:35 ప్రిన్సిపాల్ ఛాంబర్లోకి వెళ్లిన సాయి నారాయణ స్నేహితులు ►12:40కి ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డితో సర్టిఫికెట్ విషయంలో వాగ్వివాదం ►12:43కి పెట్రోల్ పోసుకున్న సందీప్ అనే విద్యార్థి సంఘం నాయకుడు ►12:43కి ప్రిన్సిపాల్ రూమ్‌లో మంటలు రావడంతో ఛాంబర్లోకి పరుగెత్తిన ఏఓ అశోక్ ►12:44 కి ప్రిన్సిపాల్ రూమ్‌లో నుంచి పరుగు ఎత్తడం తో ఏఓ అశోక్ ను పట్టుకున్న సందీప్ ►12:45కి గాయాలతో బయటకు వచ్చిన సందీప్, అశోక్ ►12:45 కి మంటలు ఆర్పిన సిబ్బంది ►12:50కి విద్యార్థి నాయకుడు సందీప్, అశోక్ రెడ్డి, ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డిని ఆస్పత్రికి తరలించిన స్థానికులు ► 1:20కి గాంధీ ఆస్పత్రికి చేరుకున్న బాధితులు. అక్కడి నుంచి యశోద, డీఆర్డీఓ ఆసుపత్రికి బాధితులను తరలించి చికిత్స అందిస్తున్నారు. -
రామాంతపూర్ నారాయణ కాలేజీ ఘటనపై స్పందించిన మధుయాష్కీ
సాక్షి, హైదరాబాద్: రామాంతపూర్ నారాయణ కాలేజీ ఘటనపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. నారాయణ యాజమాన్యంపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఆ విద్యాసంస్థల అనుమతులు వెంటనే రద్దు చేయాలన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వకపోతే విద్యార్థి విద్యా సంవత్సరం కోల్పోతాడు.. ఫీజులు కట్టకపోతే వేరే మార్గాల ద్వారా తీసుకోవాలి తప్ప.. సర్టిఫికెట్లు ఇవ్వవద్దని ఏ చట్టంలోనూ లేదు. నారాయణ యాజమాన్యం చేసింది.. రాజ్యాంగ వ్యతిరేక చర్య.. ఇది అత్యంత హేయమైన, దారుణమైన చర్యగా ఆయన అభివర్ణించారు. చదవండి: ‘ఫీజు విషయంలోనే వివాదం.. ప్రిన్సిపాల్ వెనక్కి తగ్గకపోవడంతో’.. తెలంగాణ ఉద్యమ సమయంలో కార్పొరేట్ కాలేజీలు దోచుకుంటున్నాయని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మండల కేంద్రాల్లోకి సైతం నారాయణ, చైతన్య కాలేజీలు విస్తరించాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా కేంద్రాల్లో సైతం ఇవి లేవు. మండల కేంద్రాలకు సైతం నారాయణ, చైతన్య విద్యాసంస్థలు వచ్చి.. ప్రజల రక్తాన్ని తాగుతున్నాయని.. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా కేసీఆర్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు... తగిన చర్యలు తీసుకోలేదని మధుయాష్కీ మండిపడ్డారు. -
సూసైడ్ లెటర్ రాసి నారాయణ కళాశాల లెక్చరర్ ఆత్మహత్య
అనంతపురం: పట్టణంలోని నారాయణ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్ పనిచేసే ప్రత్యూష (26) శుక్రవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాలమేరకు... ప్రత్యూష అప్పుడప్పుడు కడుపునొప్పితో బాధపడేదని, ఇందులో భాగంగానే ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె తల్లిదండ్రులు పేర్కొన్నారు. ప్రత్యూష ఉదయం కళాశాల విధులకు హాజరై పర్మిషన్ తీసుకుని గుడ్డం సమీపంలోని రైల్వేట్రాక్‌కు చేరుకుని గూడ్స్‌రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. బ్యాగులో ఉన్న సూసైడ్ నోట్‌ను పరిశీలించగా తన చావుకు ఎవరూ బాధ్యులు కారని రాసి ఉంచిన ఉత్తరాన్ని స్వాదీనం చేసుకున్నామని రైల్వే ఎస్ఐ బాలాజీనాయక్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వార్తలు.. సంచలన విషయాలు వెలుగులోకి
సాక్షి, కర్నూలు: ఏపీ పదో తరగతి పరీక్షల్లో అక్రమాలు జరిగాయన్న ఘటనలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాల్ ప్రాక్టిస్‌లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందిదే ప్రధాన పాత్రగా తేల్చారు. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ కూడా వెలుగులోకి వచ్చింది. చిత్తూరు పదో తరగతి పరీక్షా పత్రాల మాల్‌ప్రాక్టీస్‌లో తిరుపతి నారాయణ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ గిరిధర్‌రెడ్డిని నిందితుడిగా గుర్తించారు. అలాగే తిరుపతి ఎన్ఆర్ఐ కాలేజ్ లెక్చరర్ సుధాకర్‌ను నిందితులుగా గుర్తించారు. వీరిద్దరిపై కేసులు నమోదు చేశారు. నారాయణ విద్యాసంస్థల అధినేత గత ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆనాడు ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకుని యథేచ్చగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే మాదిరిగా అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నించగా పోలీసులు వాటిని అడ్డుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తులోఆడుకునే ప్రయత్నాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. చదవండి: (గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన సీఎం జగన్ దంపతులు) -
ఒత్తిడి తట్టుకోలేకే చనిపోతున్నా: నారాయణ విద్యార్థి
బి.కోడూరు: నారాయణ కళాశాల యాజమాన్య వేధింపులు తాళలేక మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్సార్ జిల్లా బి.కోడూరు మండలం సిద్దుగారిపల్లె గ్రామానికి చెందిన నేలటూరి శ్రీనివాసులరెడ్డి(17) కడప నారాయణ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల కళాశాల యాజమాన్యం చదువు విషయంలో తీవ్ర ఒత్తిడికి గురిచేయడంతో మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. ఈ నేపథ్యంలో మూడు రోజుల కిందట ఇంటికి వెళ్లాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తన ఆత్మహత్యకు కారణం కళాశాల యాజమాన్యమేనని, రెండు రోజులుగా వారు చేసిన ఒత్తిళ్లకు మానసికంగా ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సూసైడ్ నోట్ రాశాడు. ‘నన్ను మీరు కని పెంచినందుకు క్షమించండి’ అంటూ తల్లిదండ్రులనుద్దేశించి అందులో పేర్కొన్నాడు. ఐ మిస్ యూ అమ్మ.. మిస్ యూ నాన్న.. మిస్ యూ బ్రదర్స్.. అంటూ సూసైడ్ నోట్లో రాశాడు. అంతేకాకుండా తన అరచేతిపై ‘ప్రెజర్ ఇన్ కాలేజ్’ అని రాసుకున్నాడంటూ తల్లిదండ్రులు నేలటూరి సుబ్బారెడ్డి, ప్రమీలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాసులరెడ్డి వారికి మూడో సంతానం. చేతికి అందివచ్చిన కుమారుడు మృతిచెందడంతో వారు శోక సంద్రంలో మునిగిపోయారు. బి.కోడూరు ఎస్ఐ వెంకటరమణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఆస్తి ఇవ్వలేదని టెన్త్ విద్యార్థి ఆత్మహత్య -
అగ్నిప్రమాదం..నారాయణ కాలేజీ బస్సులు దగ్ధం
విశాఖ : విశాఖ జిల్లా పెందుర్తిలో అగ్ని ప్రమాదం జరిగింది. నారాయణ కాలేజీకి చెందిన మూడు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే పార్క్ చేసిన బస్సులు దగ్ధం అవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బస్సులు నిలిపి ఉంచిన స్థలంలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పార్కింగ్‌లో ఉన్న మిగిలిన బస్సులను పక్కకు తీయడంతో ప్రమాద తీవ్రత కాస్త తగ్గింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో ఐటీ దాడులు
-
నారాయణ, శ్రీచైతన్య క్యాంపస్‌లలో ఐటీ దాడులు
సాక్షి, విజయవాడ : నగరంలోని బెంజ్ సర్కిల్ వద్ద గల నారాయణ, శ్రీచైతన్య క్యాంపస్‌లలో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి ఐటీ అధికారులు నారయణ, శ్రీచైతన్య కాలేజీలలో తనిఖీలు జరుపుతున్నారు. నారాయణ క్యాంపస్‌కు వెళ్లిన ఐటీ అధికారులు.. అక్కడి రికార్డులను పరిశీలిస్తున్నారు. పోలీసు బందోబస్తు మధ్య కాలేజీ సిబ్బందిని బయటకు పంపించి సోదాలు చేస్తున్నారు. తాటి గడప, ఈడ్పుగల్లులోని క్యాంపస్‌లలో కూడా దాడులు చేసి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్‌లోని మాదాపూర్ సమీపంలో ఉన్న శ్రీచైతన్య కార్పొరేట్ కాలేజీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి పలు రికార్టులను స్వాధీనం చేసుకున్నారు. -
చై.. నా... గిమ్మిక్కులు చానా!
ఇంటర్లో ప్రభంజనం.. స్టేట్ టాపర్ మా కళాశాల విద్యార్థే.. అంటూ రిజల్ట్ రోజున చెవులు చిల్లులు పడేలా టీవీల్లో నిమిషానికోసారి ప్రచారం చేసే కార్పొరేట్ కళాశాలల డొల్లతనం తేలిపోయింది. మనీతో మార్కులు సాధించిన తీరు బట్టబయలైంది. ప్రాక్టికల్స్‌లో కార్పొరేట్ కళాశాలలు చేసే గిమ్మిక్కులను టాస్క్‌ఫోర్స్ కమిటీ పట్టేసింది. 30కి 30 మార్కులు సాధించిన విద్యార్థుల పేపర్లను పునర్ మూల్యాకనం చేసి బోగస్ మార్కులకు చెక్‌పెట్టింది. కాసులకు కక్కుర్తి పడిన ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ల లెక్కలు కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ పరిణామంతో అందరిలో టెన్షన్ మొదలైంది. అనంతపురం విద్య: ఇంటర్ మార్కుల వెయిటేజీతో ర్యాంకులు తారుమారవుతాయి. అందుకే విద్యార్థి గణనీయమైన మార్కులు సాధించేలా కళాశాలలు ప్రణాళిక సిద్ధం చేస్తాయి. ఈ క్రమంలో కొన్ని కళాశాలలు అడ్డదారులు తొక్కుతున్నాయి. ప్రాక్టికల్స్‌లో గంపగుత్తగా మార్కులు కొట్టేసేందుకు మనీతో మాయ చేస్తున్నాయి. ఈ సారి కూడా కార్పొరేట్ కళాశాలలన్నీ ఏకమయ్యాయి. తమ కళాశాలల విద్యార్థులకు మంచి మార్కులు తెప్పించుకునేందుకు డబ్బు కుమ్మరించాయి. ఏకంగా ఎక్స్టర్నల్ అధికారులను కొనేసి మార్కులు వేయించాయి. అయితే ప్రాక్టికల్స్‌పై కన్నేసిన రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ కమిటీని రంగంలోకి దించింది. దీంతో కార్పొరేట్ ఖరత్నాక్ కథలన్నీ ఒక్కొక్కటిగా వెలుగుచూశాయి. కాసులకు ఆశపడిన అధికారులపై వేటు రంగం సిద్ధమవుతోంది. టార్గెట్ 30కి 30 ఇంటర్లో జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ సబ్జెక్టుల్లో ప్రతి సబ్జెక్టుకు 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇంటర్ స్కోర్ బాగా ఉండాలంటే తప్పకుండా ప్రాక్టికల్స్‌లోనూ మంచి మార్కులు రావాల్సి ఉంటుంది. అందుకే కార్పొరేట్ కళాశాలలు తమ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌లో వీలైనన్ని మార్కులు తెప్పించుకునేందుకు కృషి చేస్తాయి. జిల్లా వ్యాప్తంగా 62 పరీక్ష కేంద్రాల్లో ఫిబ్రవరి 4 నుంచి 19 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించగా... 14వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే ప్రాక్టికల్స్‌పై ఎప్పటినుంచో పథకం రచించిన జిల్లాలోని పలు కార్పొరేట్ కళాశాలలు.. అందులోనూ నారాయణ, చైతన్య జూనియర్ కళాశాలల యాజమాన్యాలు తమదైన శైలిలో చక్రం తిప్పాయి. దీంతో చాలా మందికి 30కి 30 మార్కులు వచ్చాయి. షరా మామూలేనని భావించి... ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ప్రాక్టికల్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించింది. సీసీ కెమెరాలతో ప్రాక్టికల్స్ నిర్వహిస్తూ జంబ్లింగ్ విధానాన్ని అనుసరించి పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించింది. దీంతో ఇంటర్‌బోర్డు అధికారులు కూడా రోజూ పరీక్ష ముగిసిన వెంటనే వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి ఆర్ఐఓలతో సమీక్ష నిర్వహించారు. అయితే కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు మాత్రం షరా మామూలేనన్న రీతిలో వ్యవహరించాయి. ఎప్పటిలాగే ఎక్స్టర్నల్ ఎగ్జామినర్లను పెద్దమొత్తంలో నగదు ముట్టజెప్పి ‘మార్కులు’ కొనుగోలు చేసేశారు. టాస్క్‌ఫోర్స్ కమిటీలను నియామకాన్ని గోప్యంగా ఉంచిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రాక్టికల్స్ ముగిసే రోజున రంగంలోకి దింపింది. దీంతో కార్పొరేట్ కళాశాల బాగోతం బట్టబయలైంది. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులపై వివక్ష ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులపై ఎక్స్టర్నల్ ఎగ్జామినర్లు వివక్ష చూపారు. ప్రతిభ కనబరిచినప్పటికీ మామూళ్లు ఇవ్వలేదనే కారణంతో వారికి ఇవ్వాల్సి మార్కులు కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. కార్పొరేట్ కళాశాల విద్యార్థులకు వచ్చిన మార్కులు, ప్రతిభ ప్రదర్శించినప్పటికీ ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు వచ్చిన మార్కుల్లో భారీ వ్యత్యాసం ఉండడంతో టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు చర్యలకు ఉపక్రమించారు. అధికంగా వేసిన మార్కుల్లో కోత విధించి.. మార్కులు ఎన్ని రావాల్సి ఉందో.. అన్నే మార్కులు వేశారు. రంగంలోకి టాస్క్ఫోర్క్ ఇంటర్ ప్రాక్టికల్స్ మార్కులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం.. వెంటనే టాస్క్‌ఫోర్స్ కమిటీని రంగంలోకి దింపింది. 30కి 30 మార్కులు వచ్చిన ప్రతి పేపర్‌ను పరిశీలించి పునర్ మూల్యాంకనం(రీవాల్యుయేషన్ ) చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో 16 మందితో కూడిన నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. జిల్లాలోని నారాయణ, చైతన్యతో పాటు ఇతర కార్పొరేట్ కళాశాలల విద్యార్థుల మార్కులను పరిశీలించాయి. నారాయణ కళాశాలలో చదివిన ఒక విద్యార్థికి కెమిస్ట్రీలో 30 మార్కులు వచ్చాయి. టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు పునఃపరిశీలన చేస్తే 10 మార్కులు కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. దీంతో కమిటీ సభ్యులు నివ్వెరపోయారు. ఎక్కువ మార్కులు వేశారు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్లు ప్రాక్టికల్స్‌లో విద్యార్థి చేసిన దానికంటే అదనంగా మార్కులు వేసినట్లు టాస్క్‌ఫోర్స్ కమిటీలు గుర్తించాయి. ఇందుకు కారణాలను ఆరా తీశారు. ముఖ్యంగా 30కి 30 మార్కులు వచ్చిన జవాబుపత్రాలను పునర్మూల్యాంకనం చేశారు.– వెంకటరమణ నాయక్,ఆర్ఐఓ, అనంతపురం -
నారాయణా.. అనుమతి ఉందా!
కర్నూలు సిటీ: కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ప్రభుత్వ ఆదేశాలను, అధికారుల సూచనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నా బోర్డు అధికారులు తనిఖీలు చేయడం లేదు. ఇందుకు గాయత్రి ఏస్టేట్‌లోని నారాయణ జూనియర్ కాలేజీలో కోచింగ్ ఇస్తుండటమే నిదర్శనం. దీంతో పాటు లక్ష్మీనగర్‌లోని ఓ నూతన భవనంలోకి ఇటీవల కోచింగ్ తరగతులను మార్చారు. అలాగే ఈద్గా సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీ కూడా తరగతులు నిర్వహిస్తోంది. మిగిలిన కార్పొరేట్ కాలేజీల్లో తరగతులతో పాటే పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్ బోర్డు అధికారులు పట్టనట్ల వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. నామ మాత్రపు తనిఖీలు.. జిల్లాలో ఇంటర్మీడియట్ కాలేజీలు 266 ఉండగా వీటిలో 226 మాత్రమే పనిచేస్తున్నాయి. ఇందులో ప్రైవేటు కాలేజీలు 105, కార్పొరేట్ కాలేజీలు 18 ఉన్నాయి. ప్రభుత్వ గుర్తింపు ఉన్న జూనియర్ కాలేజీల్లో కేవలం ఇంటర్మీడియట్ విద్య అందించాలి. పోటీ పరీక్షల తరగతులు నిర్వహించకూడదని, ప్రతి కాలేజీని తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు చేయడంలేదు. స్థానిక గాయత్రి ఎస్టేట్‌లోని నారాయణ కాలేజీలో లాంగ్ టర్మ్ కోచింగ్ క్లాస్‌లు నిర్వహిస్తున్నా యాజమాన్యానికి నోటీస్‌లు ఇవ్వలేదు. నీట్, జేఈఈ లాంగ్‌టర్మ్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.70 వేల నుంచి లక్ష వరకు ఫీజులు వస్తున్నా ఆ విషయం తమ దృష్టికి రాలేందంటున్నారు. శ్రీచైతన్యలో తరగతులతో పాటే కోచింగ్ క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు నగరంలోని మరికొన్ని ప్రైవేటు కాలేజీల్లో కూడా ఇదే తంతు జరుగుతోందని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. తనిఖీలు చేస్తున్నాం.. ప్రభుత్వ గుర్తింపు ఉన్న జూనియర్ కాలేజీలను తనిఖీ చేస్తున్నాం. కాలేజీల్లో పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నట్లు తెలిసి తనిఖీ చేసి విద్యార్థులను అడిగితే లేదని చెబుతున్నారు. గాయత్రి ఎస్టేట్‌లోని నారాయణ కాలేజీలో కోచింగ్ ఇస్తున్నట్లు తెలియడంతో తనిఖీలు చేసి తరగతులు నిర్వహించకూడదని ఆదేశించాం. అయితే వారు మరో భవనంలోకి మార్చినట్లు తెలిసింది. కొన్ని కాలేజీల్లో తరగుతులతో పాటు కోచింగ్ క్లాస్‌లు ఇస్తున్న మాట వాస్తవమే. విషయం బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – సాలబాయి, ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ ►రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ గుప్పిట్లో పెట్టుకొని నిబంధలకు విరుద్ధంగా కాలేజీలను నిర్వహిస్తున్నారని, ఏ కాలేజీలో కూడా కోచింగ్ పేరుతో తరగతులు నిర్వహించకూడదని, బోర్డు అధికారులు తనిఖీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ►ప్రభుత్వ గుర్తింపు ఉన్న కాలేజీ దగ్గర విద్యార్థుల ఫొటోలతో ప్రచార బోర్డులు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రతి కాలేజీలో కేవలం తరగతులు మాత్రమే నిర్వహించాలి. పోటీ పరీక్షలకు తరగతులు నిర్వహించకూడదు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీలు తీరు మార్చుకోవాలి. అక్టోబర్ 22న ప్రైవేటు జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ సాలబాయి సూచించారు. -
నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, విజయవాడ: గొల్లపూడిలోని నారాయణ కళాశాల హాస్టల్లో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థి రామాంజనేయరెడ్డి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న అతను.. కాలేజీ హాస్టల్లోని రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యతో హాస్టల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కళాశాల యాజమాన్యం వేధింపులవల్లే రామాంజనేయరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
నారాయణలో ఫీ'జులుం'
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ)/తిరుపతి ఎడ్యుకేషన్ : నారాయణ కళాశాలల్లో ఫీజుల జులుం మరోసారి వెలుగు చూసింది. విజయవాడలో ఫీజు కోసం ఒత్తిడి చేయడంతో అవమానంగా భావించిన ఓ విద్యార్థి తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకోబోగా, తిరుపతిలో ఫీజు బకాయి విషయంలో ప్రిన్సిపాల్ తనపై దాడి చేశాడంటూ ఓ విద్యార్థి తండ్రి ఆందోళనకు దిగాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం మెట్టగూడెంకు చెందిన కల్యాణం సునీత తన కుమారుడితో కలిసి మొగల్రాజపురంలో నివాసముంటోంది. స్థానికంగా ఉన్న నారాయణ ఒలంపియాడ్ క్యాంపస్‌లో ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఏడాదికి ఫీజు రూ.85 వేలు చెల్లించాల్సి ఉంది. ఫీజులో ఐదువేలతో పాటు యూనిఫామ్, పుస్తకాల కోసం మరో రూ.16 వేలు చెల్లించింది. మిగిలిన రూ.80 వేలలో 60 శాతం మొత్తాన్ని డిసెంబర్ లోపు చెల్లిస్తానని ఆమె యాజమాన్యానికి వివరించింది. బాబుకు అడ్మిషన్ నెంబర్ ఇస్తే పరీక్షలకు హాజరవుతాడని బతిమలాడింది. అయితే మొత్తం ఫీజు చెల్లిస్తేనే అడ్మిషన్ నంబర్ ఇస్తామని మొండికేశారు. ఈ నేపథ్యంలో పిల్లవాడు నలుగురిలో ఇబ్బందులు పడటంతో ఆమె తీవ్రంగా మానసిక సంఘర్షణకు గురైంది. సోమవారం సాయంత్రం ప్రకాశం బ్యారేజీ 51వ కానా వద్ద నదిలోకి దూకేందుకు ప్రయత్నించింది. పాదచారులు ఆమెను అడ్డుకుని స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారమందించారు. ఆమెను స్టేషన్‌కు తరలించి సీఐ కాశీవిశ్వనాథ్ కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తిరుపతిలో ఫీజు బకాయి వివాదం తిరుపతికి చెందిన గోవిందరెడ్డి కుమారుడు నితిన్ పట్టణంలోని గాంధీ రోడ్డులోని నారాయణ జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్ ఎంపీసీ చదువుతున్నాడు. మొదటి సంవత్సరం నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో చదివాడు. ఈ ఏడాది డే స్కాలర్‌గా గాంధీ రోడ్డులోని కళాశాలలో చేరాడు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి రూ. 15 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంది. దీంతో బకాయి ఫీజు చెల్లించాలంటూ సోమవారం నితిన్‌ను కళాశాల యాజమాన్యం ఇంటికి పంపించేసింది. కుమారుడిని వెంటబెట్టుకుని కళాశాలకు వచ్చిన గోవిందరెడ్డి, ప్రిన్సిపాల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ తనపై దాడి చేశాడంటూ గోవిందరెడ్డి కళాశాల ఎదుటే ఆందోళనకు దిగాడు. మొదటి ఏడాది ఫీజు బకాయి చెల్లించకపోవడంతో తండ్రిని తీసుకురావాలని నితిన్‌ను ఇంటికి పంపించిన విషయం వాస్తవమేనని, గోవిందరెడ్డిపై తాము దాడి చేయలేదని ప్రిన్సిపాల్ వివరించారు. పోలీసులు ఇరువర్గాలను విచారించి, ఫిర్యాదు చేయాల్సిందిగా చెప్పడంతో విద్యార్థి తండ్రి ఆందోళన విరమించాడు. -
తిరుపతిలో నారాయణ కాలేజీ దౌర్జన్యం!
సాక్షి, తిరుపతి: నారాయణ కళాశాల సిబ్బంది దౌర్జన్యం మరోసారి బయటపడింది. కేవలం ఒక్క రోజు ఫీజు చెల్లించడంలో ఆలస్యం జరగడంతో ఇంటర్ సెంకడియర్ విద్యార్థిని నారాయణ కాలేజీ సిబ్బంది గెంటేశారు. ఫీజు కట్టడానికి వచ్చిన విద్యార్థి తండ్రిపైన దౌర్జన్యానికి దిగారు. తిరుపతి నారాయణ కాలేజీలో ఈ ఘటన జరిగింది. తిరుపతికి చెందిన గోవిందరెడ్డి కుమారుడు నితిన్ నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ ఏడాదికి సంబంధించిన ఫీజు కట్టడంలో అతనికి కొంత ఆలస్యం జరిగింది. దీంతో గత శనివారం నితిన్‌ను కళాశాల సిబ్బంది అమానుషంగా కాలేజీ నుంచి గెంటి వేశారు. ఈ నేపథ్యంలో నితిన్ తండ్రి గోవిందరెడ్డి ఫీజు కట్టడానికి సోమవారం కళాశాలకు వెళ్లాడు. ఒక్క రోజు ఆలస్యం అయినందుకే మా అబ్బాయిని కాలేజి నుంచి గెంటేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. దీంతో నారాయణ కాలేజీ సిబ్బంది ఆయనపై దాడికి దిగినట్టు తెలుస్తోంది. నారాయణ కాలేజీ సిబ్బంది దౌర్జన్యపూరితంగా ప్రవర్తించారని, విద్యార్థిని గెంటేయడమే కాకుండా ఇదేం పద్ధతి అని ప్రశ్నించిన తమపై దాడికి పూనుకున్నారని బాధితులు గోవిందరెడ్డి, ఆయన కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు. -
కూలిన నారాయణ కాలేజీ గోడ
సాక్షి, నెల్లూరు: నారాయణ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం మరోసారి వెలుగు చూసింది. కళాశాల గోడ కూలడంతో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. వివరాలు.. జిల్లాలోని అరవింద్ నగర్లో ఉన్న నారాయణ జూనియర్ కళాశాలలో గోడ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ కొందరు విద్యార్థులు ఉండడంతో వారికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో దాదాపు ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిని కళాశాల సిబ్బంది వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఈ ఘటనపై కాలేజీ ప్రిన్సిపల్ కానీ, యాజమాన్యం కానీ ఇంతవరకూ స్పందించలేదు. ప్రమాదం గురించి తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ప్రస్తుతం నారాయణ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టాయి. కాలేజీ లోనికి ఎవ్వరినీ అనుమతించడం లేదు. -
‘నారాయణ’ దాష్టీకం
అనంతపురం: విద్యార్థుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవను సాకుగా చూపి నారాయణ కళాశాల అధ్యాపకులు విద్యార్థులను చితకబాదారు. ఈ ఘటన సోమవారం రాత్రి అనంతపురం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మంగళవారం తమకు న్యాయం చేయాలని కోరుతూ కళాశాలలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. నగర శివారులోని టీవీ టవర్ వద్ద నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో సోమవారం రాత్రి జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య గొడవ చోటు చేసుకుంది. రాత్రి భోజన సమయంలో మెస్‌హాల్లో టేబుల్ విషయంలో గొడవ పడ్డారు. సీనియర్లకు ఎదురు చెప్పినందుకు జూనియర్లపై చేయి చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం యాజమాన్యం దృష్టికి పోవడంతో రాత్రి కౌన్సెలింగ్ నిర్వహించారు. గొడవకు పాల్పడ్డారనే కారణంతో యశ్వంత్, మరో విద్యార్థిని కట్టెతో కొట్టారు. దీంతో వాతలు పడ్డాయి. ఈ విషయం కుటుంబసభ్యులు, విద్యార్థి సంఘాల నాయకుల దృష్టికి పోవడంతో మంగళవారం ఉదయం కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని, కళాశాలను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. వంట మనుషులు, పని మనుషులతో తమను గొడ్డును కొట్టినట్లు కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవని ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన పోలీసులు ప్రిన్సిపాల్ శిఖామణి, వైస్ ప్రిన్సిపాల్ నారపరెడ్డి, ఏజీఎం సుధాకర్‌రెడ్డి, వార్డెన్ భవాని ప్రసాద్‌లపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. -
నారాయణ కాలేజీలో ర్యాగింగ్.. విద్యార్థులకు వాతలు
అనంతపురం: పట్టణంలోని నారాయణ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతోంది. ర్యాగింగ్‌లో భాగంగా జూనియర్లు, సీనియర్ల మధ్య ఘర్షణ జరగడంతో... కాలేజీ సిబ్బంది రెచ్చిపోయారు. విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. అంతేకాకుండా విద్యార్థులకు కాలేజీ లెక్చరర్లు వాతలు కూడా పెట్టినట్టు తెలుస్తోంది. ఈ గొడవలో పలువురు విద్యార్థులు గాయపడ్డట్టు సమాచారం. -
నారాయణ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
-
నారాయణలో విద్యార్థి అనుమానాస్పద మృతి
-
నారాయణలో విద్యార్థి అనుమానాస్పద మృతి
సాక్షి, విజయవాడ : గూడవల్లిలోని నారాయణ కాలేజ్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. కాలేజ్ సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించింది. విద్యార్థి మృతిపై వివరాలు వెల్లడించేందుకు కాలేజ్ సిబ్బంది నిరాకరిస్తుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థి మృతిపై పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. iframe border="0" width="100%" height="380" src="https://www.sakshi.com/sites/default/files/video/embed/2019/07/02/1203235.html" frameborder="0" scrolling="no" > -
నడి వేసవిలో ‘నారాయణ’
సాక్షి, అమరావతి బ్యూరో : నారాయణ కాలేజీల యాజమాన్యాలు బరితెగిస్తున్నాయి. ఒకవైపు మండుతున్న ఎండలతో ప్రజలు బెంబేలెత్తిపోతుంటే నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. వేసవిలో సెలవులు ఇవ్వకుండా ఉక్కపోతలో విద్యార్థులను మగ్గబెడుతున్నాయి. తమ పిల్లలకు సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నా యాజమాన్యాలు ఇసుమంతైనా లెక్కచేయడం లేదు. ఇష్టం ఉంటే ఇక్కడ చేర్పించండి లేదంటే.. వెళ్లిపోండి అన్న రీతిలో వ్యవహరిస్తున్నాయి. ఏసీ క్యాంపస్‌ల పేరుతో నిలువు దోపిడీ..! విజయవాడలోని కార్పొరేట్ కళాశాలలన్నీ అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నాయి. 10వ తరగతి ఫలితాలు వెలువడక ముందు నుంచే ఇంటర్ ఫస్టియర్ తరగతులు ప్రారంభించాయి. ఏసీ క్యాంపస్‌ల పేరుతో తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఏసీలు పనిచేయకపోవడంతో వేసవిలో ఉక్కపోతకు విద్యార్థులు అల్లాడుతున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఏకధాటిగా తరగతులు నిర్వహిస్తూనే ఉన్నారు. టిఫిన్, లంచ్, డిన్నర్ చేయడానికి కేవలం 45 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చి మిగిలిన సమయమంతా తరగతుల్లో పాఠాలు బోధిస్తూ ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీనికితోడు హాస్టల్ పేరుతో మరో దోపిడీకి యాజమాన్యాలు తెరతీశాయి. నగరంలోని కార్పొరేట్ కళాశాలల్లో అధిక శాతం క్యాంపస్‌లు అనుమతిలేని భవనాల్లోనే కొనసాగుతున్నాయి. నివాసానికి అనుగుణంగా నిర్మించిన ఫ్లాట్లలో తరగతులు నిర్వహిస్తున్నాయి. సరైన భద్రతా ప్రమాణాలు పాటించిన దాఖలాలు ఎక్కడా కనిపించడంలేదు. నిబంధనలు పట్టవా..! నిబంధనల మేరకు ఇంటర్ తరగతులు జూన్ మొదటి వారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, నగరంలోని కార్పొరేట్ కాలేజీలు ఇప్పటికే తరగతులు ప్రారంభించాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యార్థులకు క్లాసులు చెబుతున్నారు. పరీక్షలు ముగియగానే కేవలం వారం రోజులు సెలవులు ఇచ్చి వెంటనే తరగతులు ప్రారంభించడంతో విద్యార్థులు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. అలాగే పదో తరగతి ఫలితాలు ఈ నెల 14న విడుదలకాగా 10వ తరగతి పూర్తయిన పది రోజులకే కార్పొరేట్ కళాశాలలు ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభించాయి. వేసవిలో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు చేస్తున్న హెచ్చరికలను కళాశాలల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ఆ రెండు క్యాంపస్లంటే దడ..! పెనమలూరు నియోజకవర్గం కానూరులోని నారాయణ ఎన్40 లేడీస్ క్యాంపస్, గొల్లపూడి నల్లకుంటలోని అయ్యప్ప క్యాంపస్‌లు నరకానికి నకళ్లుగా మారాయని విద్యార్థులు చెబుతున్నారు. ప్రత్యేక తరగతుల పేరుతో వేసవి సెలవులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ అనుమతుల్లేని భవనాల్లో తరగతులు నిర్వహిస్తూ తమ భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే ఇవన్నీ తెలిసినా సంబంధిత అధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. తెరచాటుగా లంచాలు ముట్టజెప్పడంతోనే మిన్నకుండిపోతున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సంబంధిత కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
నారాయణ కాలేజీ ఏజీఎం ఇంట్లో సోదాలు
-
డబ్బుతో మళ్లీ దొరికిన ‘నారాయణ’ సిబ్బంది
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర మంత్రి నారాయణ విద్యాసంస్థల సిబ్బంది డబ్బు ప్రవాహం పారిస్తూ రెండోసారి పట్టుబడ్డారు. నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా ఇచ్చి వారితో మాట్లాడి నేరుగా ఓటరుకే డబ్బులు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. ఆదివారం నెల్లూరులోని 43వ డివిజన్లోని టీడీపీ ఎన్నికల ప్రచార కార్యాలయంలో రూ.8.30 లక్షల నగదుతో నారాయణ విద్యాసంస్థల ఏజీఎం రమణారెడ్డి పట్టుబడిన సంగతి తెలిసిందే. సోమవారం 40వ డివిజన్ మూలాపేటలో నారాయణ విద్యాసంస్థల్లో అధ్యాపకుడిగా పనిచేస్తున్న బాలమురళీకృష్ణ రూ.50 వేల నగదు పంపిణీ చేస్తుండగా వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకుని ఫ్లయ్యింగ్ స్క్వాడ్ అధికారులకు సమాచారమిచ్చారు. ఫ్లయ్యింగ్ స్క్వాడ్ అధికారి రాజేంద్రకుమార్‌సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని అధ్యాపకుడిని అదుపులోకి తీసుకుని బైక్‌ను తనిఖీ చేయగా రూ.50 వేల నగదు, ఓటరు స్లిప్పులు, పార్టీ కండువాలను స్వాధీనం చేసుకుని అధ్యాపకుడితోపాటు నారాయణలో పనిచేస్తున్న మరో ముగ్గురిని పోలీసుస్టేషన్‌కు తరలించి బాలమురళీకృష్ణపై కేసు నమోదు చేశారు. స్టేషన్లో టీడీపీ నేత పట్టాభి వీరంగం టీడీపీ నేత, మంత్రి నారాయణ ముఖ్యఅనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డితోపాటు పలువురు నేతలు పోలీసుస్టేషన్‌కు చేరుకుని వీరంగం సృష్టించారు. తమ సిబ్బందిని అనవసరంగా ఎందుకు తీసుకొచ్చారు? కావాలనే చేస్తున్నారా? అంటూ పోలీసు సిబ్బందితో గొడవకు దిగారు. తాము సూచించిన వారిపై చర్యలు తీసుకోకపోతే మీ ఇష్టం అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. రూ.50 వేలు తాము వెంట తీసుకెళతామని.. పట్టుకునే దమ్ముందా? అంటూ పలువురు టీడీపీ నేతలు పోలీసులకు, ఫ్లయ్యింగ్ స్క్వాడ్ అధికారులకు సవాల్ విసిరారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వరుసగా నగదు పంపిణీ చేస్తూ తమ వారు పట్టుబడుతుండడంతో పట్టాభిరామిరెడ్డి సహనం కోల్పోయారు. నగదుతో పట్టుబడిన తమ వారిని వెంటనే విడిచిపెట్టాలని పట్టాభిరామిరెడ్డి పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చారు. తమ వారిని అకారణంగా తీసుకువచ్చారని, వెంటనే విడిచిపెట్టాలని డీఎస్పీ మురళీకృష్ణపైఒత్తిడి తెచ్చారు. -
ఫీజుల ఒత్తిడి.. నారాయణ విద్యార్థినికి అస్వస్థత
శ్రీకాకుళం , కాశీబుగ్గ: కాశీబుగ్గ నారాయణ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గేదెల వెన్నెల కళాశాల యాజమాన్యం తీరుతో అస్వస్థతకు గురైంది. వజ్రపుకొత్తూరు మండలం పల్లిసారిథికి చెందిన గేదెల మన్మధరావు, రాజేశ్వరిల కుమార్తె వెన్నెలను కళాశాల యాజమాన్యం ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేసింది. అయితే తిత్లీ ధాటికి ఉన్నదంతా పోవడంతో తల్లిదండ్రులు ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక విద్యార్థిని తీవ్ర ఒత్తిడికి గురై ఇంటి వద్ద స్పృహ కోల్పోయింది. వెంటనే స్థానికులు ఆ మెను స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. విషయం తెలుసుకున్న పలు ప్రజా సంఘాల నేతలు కళాశాల వద్ద ఆందోళన చేశారు. పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి మద్దిల వినోద్‌కుమార్, సీఐటీయూ నెయ్యిల గణపతి, జిల్లా అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు, ప్రగతిశీల కార్మిక సంఘ నాయకులు పుచ్చ దుర్యోధన, గ్రామస్తురాలు అరుణ, కొర్రాయి నీలకంఠం తదితరులు కళాశాల వద్ద ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావును నిలదీశారు. అయితే అటువైపు నుంచి మాత్రం సరైన సమాధానం రాలేదు. ఆమె మూడు రోజులుగా రావడం లేదు ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న వెన్నెల మూడు రోజులుగా కాలేజీకి రావడం లేదు. ఆమె డయాబెటిక్ పేషెంట్. ఇన్సులిన్ లేకపోవడం వల్ల పడిపోయింది. ఆమెపై ప్రత్యేకించి ఒత్తిడి చేయలేదు. అందరినీ అడిగినట్టే అడిగాం.– తిరుపతిరావు, ఏజీఎం,నారాయణ విద్యాసంస్థ -
నారాయణ కాలేజీలో డీన్ లైంగిక వేధింపులు
-
నారాయణ కాలేజీలో లైంగిక వేధింపులు.. డీన్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : తార్నాకాలోని నారాయణ కళాశాల డీన్ తనను లైంగికంగా వేదిస్తున్నాడని ఓ మహిళా ఉద్యోగి బంధువులతో సహా ఆందోళనకు దిగింది. బాధితురాలి బంధువులు డీన్‌పై దాడికి ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు డీన్ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని ఓయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డీన్ శ్రీనివాస్ రావు కొద్దిరోజులుగా ఫోన్ చేస్తూ తనను వేదిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. గత 10 ఏళ్లుగా తాను నారయణ కాలేజీల్లో పనిచేస్తున్నానని, ఇటీవల వచ్చిన డీన్ శ్రీనివాస్ కాలేజీ అయిపోయిన తర్వాత కూడా ఫోన్ చేస్తూ అసభ్యకర మాటలతో టార్చర్ పెడుతున్నాడని పేర్కొంది. అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని యాజమాన్యాన్ని కోరింది. ఈ విషయం యజమాన్యానికి తెలియజేయడం కోసమే తాను ఆందోళన చేపట్టినట్లు స్పష్టం చేసింది. -
విద్యార్థిపై ‘నారాయణ’ ప్రిన్సిపాల్ దాష్టీకం
సాక్షి, అమరావతిబ్యూరో : నారాయణ విద్యా సంస్థలకు చెందిన ఓ ప్రిన్సిపాల్ దాష్టీకానికి విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యాడు. అల్లరి చేస్తున్నాడంటూ ప్రిన్సిపాల్ కర్రతో ముఖంపై మోదడంతో విద్యార్థి కింద పడి రెండు పళ్లు విరిగిపోయి తీవ్ర రక్తస్రా వమైంది. ఓ వైపు విద్యార్థి తీవ్ర గాయాలపాలయినా ఆ బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా సాయంత్రం వరకు స్కూల్లోనే ఉంచారు. ఈ ఘటన కృష్ణా జిల్లా నూజివీడులో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ స్కూల్ రాష్ట్ర మంత్రి నారాయణకు సంబంధించిన విద్యా సంస్థ కావడంతో వెంటనే రంగంలోకి దిగిన యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులను బెదిరించి మీడియా దృష్టికి రాకుండా తీవ్ర ఒత్తిడి పెంచారు. ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడెంలోని ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న రమేష్ బాబు కుమారుడు రోహిత్‌సాయి నూజివీడు నారాయణ ఈ టెక్నో బ్రాంచ్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం క్లాస్ రూంలో విద్యార్థులు అల్లరి చేస్తున్నారని టీచర్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదుచేశాడు. ఆగ్రహించిన ప్రిన్సిపల్ క్లాస్‌రూంలోకి వెళ్లి కర్రతో రోహిత్ మొహంపై బలంగా మోదడంతో విద్యార్థి కిందపడ్డాడు. ఈఘటనలో విద్యార్థి రోహిత్‌కు రెండు పళ్లు విరిగి రక్రస్రావం అయింది. విద్యార్థికి వైద్యచికిత్స చేయించకపోగా సాయంత్రం వరకు స్కూల్లోనే ఉంచారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన విద్యార్థి పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు వెంటనే వైద్య చికిత్స కోసం నూజివీడుకు తరలించారు. తమ బిడ్డపై దాడి చేసిన ప్రిన్సిపాల్‌ను తండ్రి నిలదీయడంతో స్కూల్ యాజమాన్యం రంగంలోకి దిగి ఈ విషయాన్ని మీడియాకు చెప్పవద్దంటూ వారిపై బెదిరింపులకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా సృందన ఉండదని బెదిరింపులకు దిగడంతో ఒత్తిళ్లకు తలొగ్గిన తల్లిదండ్రులు మౌనం దాల్చారు. చిన్న దెబ్బే తిగిలింది విద్యార్థికి చిన్న దెబ్బే తగిలింది. ఎలాంటి ప్రమాదం లేదు. విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడాం. ఏ సమస్యా లేదు. – మహేష్, నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ -
నారాయణ కాలేజీ ఏఓ అరెస్ట్..
సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్ సీట్లు ఇప్పిస్తానని చెప్పి రూ.5లక్షలు వసూలు చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న నారాయణ కాలేజీ ఏఓను బుధవారం వనస్థలీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణ కాలేజీ ఏఓ రఘు విద్యార్థులకు ఇంజనీరింగ్ సీట్లు ఇప్పిస్తానని చెప్పి దాదాపు 5లక్షల రూపాయలు వసూలు చేశాడు. రఘు వారికి సీట్లు ఇప్పించకపోవటంతో ఇద్దరు విద్యార్థులు విద్యాసంవత్సరాన్ని కోల్పోయారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు వనస్థలీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏఓ రఘుపై కేసు నమోదు చేసిన పోలీసులు అతనితో పాటు ప్రశాంత్‌రెడ్డి అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. -
రెండో రోజూ కొనసాగిన ‘ఎంసెట్’ విచారణ
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించి నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణ, శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబుల విచారణ రెండో రోజు కూడా కొనసాగింది. శివనారాయణ ద్వారా మరిన్ని వివరాలు రాబట్టేందుకు శనివారం మధ్యాహ్నం అతన్ని కటక్ తీసుకెళ్లినట్లు సీఐడీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులతో కటక్‌లోనే శివనారాయణ క్యాంపు నడిపినందున అక్కడి బ్రోకర్ల జాడ తెలిసే అవకాశముందని, క్రైమ్ సీన్ రీ కన్స్ట్రక్షన్ కూడా చేయాల్సి ఉండటంతో అతన్ని అక్కడికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఇక శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబును హైదరాబాద్‌లో మరో బృందం విచారించింది. ముగ్గురు విద్యార్థులకే కాకుండా మరో నలుగురికి వాసుబాబు ప్రశ్నపత్రం ఇచ్చినట్లు విచారణలో సీఐడీ గుర్తించింది. కానీ, తాను ముగ్గురినే క్యాంపునకు తరలించినట్లు వాసు చెబుతుండటంతో రుజువులతో సహా ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మేలో పరీక్ష జరగాల్సి ఉండగా ఫిబ్రవరి నుంచే కొంతమంది విద్యార్థులతో వాసు టచ్‌లో ఉన్నట్లు సీఐడీ గుర్తించింది. దీంతో వారితో వాసు ఎందుకు టచ్‌లో ఉన్నాడో చెప్పాలని సీఐడీ ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే రెండు రాష్ట్రాల్లోని శ్రీచైతన్య కళాశాలల విద్యార్థులను హైదరాబాద్ పిలిపించి మాట్లాడారని, ప్రశ్నపత్రం వ్యవహారంపైనే చర్చించారా అని అధికారులు వివరణ కోరినట్లు తెలిసింది. మళ్లీ బ్రోకర్ల విచారణ వాసుబాబు, శివనారాయణ ద్వారా విద్యార్థులను క్యాంపులకు పంపిన తల్లిదండ్రుల వాంగ్మూలాలు సేకరించాలని సీఐడీ నిర్ణయించింది. వారిరువురూ డీల్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులను వారి ముందే ప్రశ్నించనుంది. రూ.35 లక్షల చొప్పున డీల్ సెట్ చేసుకున్న వీరు అడ్వాన్స్‌గా ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 లక్షలు, పూచీకత్తుగా పదో తరగతి సర్టిఫికెట్లు తీసుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది. వీరి నుంచి రికవరీ లేకపోవడంతో ఈ రెండు అంశాలపై తల్లిదండ్రుల నుంచి వివరాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రతి అంశంపైనా వారు పొంతన లేకుండా వ్యవహరించడంతో సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఎక్కడా సరిగా సమాధానాలు చెప్పడం లేదని అధికారులు తెలిపారు. వీరికి ఎవరెవరితో సంబంధాలున్నాయో ఆయా బ్రోకర్లను సైతం మళ్లీ విచారణకు పిలుస్తున్నామని ఉన్నతాధి కారి ఒకరు చెప్పారు. అప్పుడే వారి బాగోతం వెలు గులోకి వస్తుందని, కార్పొరేట్ సంస్థల చీకటి వ్యవహా రం కూడా ఆధారాలతో బయటపడుతుందన్నారు. -
ఆ మంత్రి పేషీతో నీకేం పని?
సాక్షి, హైదరాబాద్: ‘నీకు ఆ మంత్రి కార్యాలయంతో సంబం«ధం ఏంటి? పదే పదే మంత్రి పేషీలోని వ్యక్తులకు ఎందుకు ఫోన్లు చేశావు. లీకేజీ కుంభకోణం బయటకు వచ్చిన సందర్భంలో డాక్టర్ ధనుంజయ్, సందీప్‌తో చర్చిస్తూనే మంత్రి కార్యాలయానికి ఎందుకు కాల్స్ చేశావు’ఇవీ సీఐడీ కస్టడీలో ఉన్న శివనారాయణకు దర్యాప్తు అధికారులు వేసిన ప్రశ్నలు. ఎంసెట్ స్కాంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీచైతన్య కాలేజీ మాజీ డీన్ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణపై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపించింది. శుక్రవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి ఆరు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న సీఐడీ దర్యాప్తు అధికారులు ఈ ఇద్దరినీ స్కాంలోని కీలక అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఎప్పటి నుంచి పరిచయం.. ప్రశ్నపత్రం లీకేజీ స్కాంలో ఉన్న నిందితులతో పరిచయం ఎప్పటి నుంచి ఉందో చెప్పాలని సీఐడీ అధికారులు శివనారాయణను ప్రశ్నించినట్లు తెలిసింది. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులను చేర్పించడంతో పాటు మెడికల్ సీట్లు ఇప్పించే కర్ణాటక దావణగెరె గ్యాంగ్‌తో శివనారాయణకు లింకున్నట్లు సీఐడీ గుర్తించింది. మేనేజ్మెంట్ సీట్ల మాటున ప్రవేశ పరీక్ష పత్రాలు లీక్ చేసే గ్యాంగ్‌తో ఎందుకు సంబంధాలు పెట్టుకున్నారో చెప్పాలని సీఐడీ ప్రశ్నించగా, కేవలం సీట్ల కోసమే సంబంధాలు కొనసాగించానని శివనారాయణ చెప్పినట్లు సమాచారం. రెండు కార్పొరేట్ కాలేజీలకే చెందిన ఆరుగురు విద్యార్థులు ఆ క్యాంపులో ఎందుకున్నారని అధికారులు వివరణ కోరారు. అయితే మంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి వచ్చేంతగా ప్రభావితం చేయడంపైనా సీఐడీ దర్యాప్తు చేసింది. సంబంధిత మంత్రి కాలేజీలకు ఏడెనిమిదేళ్లుగా విద్యార్థులను చేర్పించడం, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, పశ్చిమగోదావరి, ఖమ్మం తదితర ప్రాంతాల్లో పరిచయాలున్నాయని శివనారాయణ వివరించే ప్రయత్నం చేశాడని సీఐడీ వర్గాలు తెలిపాయి. అయితే మంత్రి పేషీలో పనిచేస్తున్న వారి సంబంధీకుల పిల్లలకు కాలేజీల్లో ఫీజు తగ్గించాలని కోరేవారని, అందుకే ఫోన్ మాట్లాడినట్లు శివనారాయణ సీఐడీ అధికారులు వివరించినట్లు తెలిసింది. ధనుంజయ్‌తో పరిచయం వెనుక.. లీకేజీ స్కాంలో కీలకంగా ఉంటూ వస్తున్న బిహార్‌లోని పట్నా వాసి, ధావనగిరి మెడికో ధనుంజయ్‌తో ఎందుకు టచ్‌లో ఉన్నారని ప్రశ్నించగా, సందీప్‌తో పాటు గణేశ్ ప్రసాద్ ద్వారా అతడు పరిచయం అయ్యాడని, విద్యార్థులకు కర్నాటకలోని బెంగళూర్, బీదర్ తదితర ప్రాంతాల్లో మెడికల్ సీట్లు ఇప్పించేవాడని చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధనుంజయ్ గురించి తెలిసే సంబంధాలు పెట్టుకున్నావా అని ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని, తన స్నేహితుల పిల్లల కోసమే తాను ఈ స్కాంలో పాలుపంచుకున్నానని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. మాజీ విద్యార్థులతో పనేంటి? వాసుబాబుపైనా సీఐడీ భారీస్థాయిలో ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. వాసుబాబు పనిచేసిన కాలేజీల విద్యార్థులే లీకేజీ మాఫియా క్యాంపులకు ఎక్కువగా వెళ్లడం, వారికే మంచి ర్యాంకుల రావడంపైనా దర్యాప్తు అధికారులు సందేహాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు సీఐడీ వాంగ్మూలాలు సేకరించిన 136 మందిలో ఒకే కార్పొరేట్ సంస్థకు చెందిన 86 మంది విద్యార్థులు క్యాంపునకు వెళ్లడంపై వాసుబాబును అధికారులు ప్రశ్నించారు. పూర్వ విద్యార్థులతో సంబంధాలున్నాయా అని ప్రశ్నించగా, తన స్నేహితుల పిల్లల కోసమే సందీప్, గణేశ్ ప్రసాద్‌తో టచ్‌లో ఉన్నట్లు వివరించారని తెలిసింది. మిగతా విద్యార్థుల తల్లిదండ్రులతో ఎందుకు మాట్లాడారో చెప్పాలని ప్రశ్నించగా ఏమీ చెప్పలేదని తెలిసింది. 2016 ఎంసెట్ లీకేజీలోనే తాను సందీప్, గణేశ్ ప్రసాద్‌తో టచ్‌లో ఉన్నట్లు వాసుబాబు చెప్పగా, సందీప్, గణేశ్ ప్రసాద్ వివరించిన అంశాలను సీఐడీ అధికారులు ముందుపెట్టడంతో వాసుబాబు ఖంగుతిన్నట్లు తెలిసింది. 2015, 2014లోనూ సందీప్, గణేశ్ ప్రసాద్‌తో ఉన్నారని, అప్పుడు కూడా విద్యార్థులకు సీట్ల పేరుతో సంబంధాలు నడిపినట్లు ఆధారాలున్నాయని చెప్పగా వాసుబాబు నోరుమెదపలేని తెలిసింది. తాను ముగ్గురికి మాత్రమే అవకాశం ఇచ్చానని, మిగతా వాళ్లతో సంబంధం లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తు వర్గాలు స్పష్టం చేశాయి. ఎంసెట్ స్కాం దర్యాప్తులో భాగంగా గతంలో విచారణ సందర్భంగా ఏం జరిగిందని అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. అప్పటి అధికారులు గంట పాటు ప్రశ్నించి వదిలేశారని చెప్పినట్లు తెలిసింది. అలా ఎందుకు వదిలేశారని, ఎక్కడినుంచి ఒత్తిడి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించగా, తనకేం తెలియదని సమాచారం. కటక్‌కు శివనారాయణ.. లీకైన ఎంసెట్ ప్రశ్నపత్రంపై విద్యార్థులను కటక్ తీసుకెళ్లిన శివనారాయణను అక్కడికి తరలించాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. కటక్‌లోని ఏ హోటల్లో మూడ్రోజుల పాటు శిక్షణ ఇప్పించారు.. ఎవరి ద్వారా ప్రశ్నపత్రం తీసుకొచ్చారు వంటి వాటిపై అధికారులు ఆరా తీయనున్నారు. కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సీఐడీ విచారించింది. శివనారాయణ, వాసుబాబును వేర్వేరుగా తల్లిదండ్రుల ఎదుట ప్రశ్నించినట్లు తెలిసింది. కస్టడీ మొదటి రోజులో భాగంగా వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా మరికొంత మంది బ్రోకర్ల అరెస్టుకు సీఐడీ 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. -
నారాయణ కాలేజీ బస్సులో మంటలు
ఏలూరు టౌన్: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటరులో నారాయణ విద్యా సంస్థల కళాశాల బస్సులో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకోవడంతో బస్సులోని విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. విద్యార్థులను ఎక్కించుకున్న తర్వాత డ్రైవర్ కొద్ది దూరం వెళ్లగానే బస్సులో ఆకస్మాత్తుగా మంటలు రావడంతో విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. పెద్దగా కేకలు వేస్తూ బస్సును ఆపాలంటూ డ్రైవర్‌కు చెప్పడంతో బస్సును నిలిపివేశారు. వెంటనే విద్యార్థులు కిందకు దూకి రోడ్డుపైకి పరుగులు తీశారు. కూతవేటు దూరంలోనే జిల్లా అగ్నిమాపక కార్యాలయం ఉండటంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాద సంఘటన జరిగిన బస్సులో 30 మంది కళాశాల విద్యార్థులు ఉన్నారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది బస్సు వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు. దీనిపై కళాశాల యాజమాన్యం, ఫిట్నెస్ లేకుండానే బస్సుకు అనుమతులిచ్చిన రవాణాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఎంసెట్ లీకేజీ కేసులో శ్రీచైతన్య డీన్
-
ఎంసెట్ కేటు.. కార్పొ‘రేటు’
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎంసెట్ (మెడికల్) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కార్పొరేట్ కాలేజీల డొంక కదులుతోంది! ఇన్నాళ్లు లీకేజీకి పాల్పడ్డ నిందితులతోపాటు సాదాసీదా బ్రోకర్లను కటకటాల్లోకి నెట్టిన సీఐడీ తాజాగా ప్రముఖ కార్పొరేట్ కాలేజీ శ్రీచైతన్య డీన్ ఓలేటి వాసుబాబును అరెస్ట్ చేసింది. ఈయనకు సహకరిస్తూ విద్యార్థులను క్యాంపులకు తరలించిన ఏజెంట్ కమ్మ వెంకట శివ నారాయణ రావును కూడా గురువారం అరెస్ట్ చేసింది. దిల్సుఖ్నగర్ శ్రీచైతన్య బ్రాంచ్‌తోపాటు మరో ఆరు కేంద్రాల్లోని కాలేజీలకు ఓలేటి వాసుబాబు(ఏ–89) డీన్‌గా వ్యవహరిస్తున్నాడు. గుంటూరుకు చెందిన శివ నారాయణ రావు(ఏ90).. శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో విద్యార్థులను చేర్పించే ఏజెంట్. వీరిద్దరూ ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ ధనుంజయ్ థాకీర్, డాక్టర్ సందీప్‌కుమార్‌తో డీల్ కుదుర్చుకున్నారు. కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిండ్రులకు మెడికల్ సీట్లు ఇప్పిస్తామని చెప్పి ముందుగానే ప్రశ్నపత్రం ఇచ్చేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇందులో భాగంగా భువనేశ్వర్ కేంద్రంగా నడిచిన ప్రిపరేషన్ క్యాంపునకు ఆరుగురు విద్యార్థులను పంపారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.35 లక్షలు వసూలు చేసినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. మరో ప్రముఖ కాలేజీకి సంబంధం? ప్రముఖ కార్పొరేట్ కాలేజీలకు ఎంసెట్ లీకేజీ స్కాంతో లింకులుండటం సంచలనంగా మారింది. డీన్ వాసుబాబు నిందితులతో పదేపదే మాట్లాడటంతోపాటు మరికొందరు విద్యార్థులను చేర్పించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఏజెంట్ శివ నారాయణ నుంచి మరిన్ని విషయాలు రాబట్టాల్సి ఉందని, మరో ప్రముఖ కాలేజీకి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా ఆయన టచ్‌లో ఉన్నట్టు విచారణలో తేలినట్టు తెలిపారు. వీరిద్దరూ ప్రధాన నిందితులతో స్కాం బయటపడిన తర్వాత కూడా టచ్‌లో ఉండటం, విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లపై మరింత స్పష్టత రావాల్సి ఉందని దర్యాప్తు అధికారులు వివరించారు. అధికారుల పిల్లలకూ ‘ముందస్తు’ శిక్షణ శివ నారాయణ, డీన్ వాసుబాబు తీసుకువెళ్లిన విద్యార్థుల్లో కొందరు ప్రభుత్వాధికారుల పిల్లలుండటం సీఐడీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇద్దరు ఐఏఎస్ అధికారుల పిల్లలతోపాటు ఆరుగురు ప్రభుత్వాధికారుల పిల్లలు కూడా లీకైన ప్రశ్నపత్రంపై శిక్షణ కోసం కటక్ క్యాంపునకు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై సీఐడీ అధికారులు స్పందించడం లేదు. శ్రీచైతన్య కాకుండా మరో ప్రముఖ కాలేజీ విద్యార్థులను సైతం వాసుబాబు కటక్‌లో శిక్షణకు తరలించినట్టు సీఐడీ గుర్తించింది. మరో 12 మంది విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయన ఫోన్ ద్వారా పదే పదే టచ్‌లో ఉన్నట్టు తేలింది. ఈ మేరకు సీఐడీ ఆధారాలు సేకరించింది. త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు సీఐడీ వర్గాలు స్పష్టం చేశాయి. కాలేజీ కోసమే చేశా.. తమ కాలేజీకి పేరు తీసుకువచ్చేందుకే ఈ స్కాంలో పాలు పంచుకున్నట్టు డీన్ వాసుబాబు తన వాంగ్మూలంలో ఒప్పుకున్నాడని సీఐడీ తెలిపింది. తల్లిదండ్రులను ఒప్పించి క్యాంపునకు పంపినట్టు ఆయన తెలిపాడు. తాను పంపిన ఆరుగురు విద్యార్థుల్లో ముగ్గురికి మంచి ర్యాంకులు వచ్చాయని, దీంతో వారి నుంచి మరింత డబ్బు వసూలు చేసేందుకు కూడా ఒప్పందం కుదిరినట్టు విచారణలో తేలింది. దర్యాప్తులో ఎందుకింత ఆలస్యం? సరిగ్గా రెండేళ్ల క్రితం ఎంసెట్ లీకేజీపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీక్ చేసినవారితోపాటు ఇతర నిందితులు అరెస్ట్ చేస్తూ వచ్చింది. మొదటి రెండు నెలల్లోనే 22 మంది కీలక నిందితులను అరెస్ట్ చేసిన సీఐడీ ఆ తర్వాతి రెండు నెలల్లోనే 64 మంది బ్రోకర్లను జైలుకు పంపించింది. కానీ ఆ తర్వాత నుంచి కేసు దర్యాప్తు నెమ్మదించింది. అయితే మొదట్లోనే శ్రీచైతన్య, మరో కార్పొరేట్ కాలేజీకి లింకుందని తెలిసినా ఎందుకు పట్టించుకోలేదన్న దానిపై ఇప్పుడు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో విచారించిన అధికారులు ఎవరి ఒత్తిడి మేరకు వారిని నిందితుల జాబితాలో చేర్చకుండా వదిలేశారు? దీని వెనుక ఎంత మొత్తం చేతులు మారిందన్న దానిపై ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు. గతంలో ఇదే కేసులో అక్రమాలకు పాల్పడ్డ ఓ డీఎస్పీతోపాటు మరో ఇన్స్పెక్టర్, ఇతర సిబ్బందిని సీఐడీ అధికారులు సస్పెండ్ చేశారు. అయినా జంకని అధికారులు శ్రీచైతన్య డీన్‌తోపాటు ఏజెంట్‌ను వదిలిపెట్టడంపై ఇప్పుడు అంతర్గత విచారణ జరుపుతున్నట్టు సీఐడీ కీలక అధికారి ఒకరు చెప్పారు. పిలిచి పంపించారు గతేడాది ఆగస్టులో శ్రీచైతన్య డీన్ ఓలేటి వాసుబాబును ఓ సీనియర్ అధికారి విచారణకు పిలిచి పంపించి వేసినట్టు తాజాగా బయటపడింది. ఎందుకు పిలిచారు, ఎందుకు పంపించి వేశారు? కనీసం వాంగ్మూలం కూడా ఎందుకు రికార్డు చేయలేదు? సీఐడీ అదనపు డీజీపీకి కూడా తెలియకుండా నిందితుల జాబితా నుంచి పేరు ఎందుకు తొలగించారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ఆరోపణల జాబితాలో ఉన్న మరో కాలేజీ హైదరాబాద్ కీలక బ్రాంచ్ ప్రిన్సిపల్‌ను సైతం దర్యాప్తు అధికారి ఓ హోటల్‌కు పిలిపించి వదిలేయడంపైనా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరి సెల్‌ఫోన్ డేటాను పరిశీలిస్తే సంబంధిత ఉన్నతాధికారితోపాటు ఓ ఇన్స్పెక్టర్, మరో డీఎస్పీ వ్యవహారం బయటపడుతుందని సీఐడీ వర్గాలు పేర్కొన్నాయి. దర్యాప్తు అధికారులు మార్పు వెనుక.. ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నాటినుంచి ఎనిమిది మంది దర్యాప్తు అధికారులు మారడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు దేశవ్యాప్తంగా లింకులుండటంతో ఒక సీనియర్ అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించి బృందాలను ఏర్పాటు చేసి అరెస్టులు కొనసాగించారు. అయితే ఇదే క్రమంలో ఒకరి తర్వాత ఒకరు దర్యాప్తు అధికారి మారిపోవడం, సస్పెన్షన్‌కు గురవడంతో అనుమానాలు తీవ్రమయ్యాయి. పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ ఒత్తిళ్ల వల్లే తాను స్వచ్ఛందంగా దర్యాప్తు నుంచి తప్పుకున్నట్టు గతంలో కేసును దర్యాప్తు చేసిన అధికారి ఒకరు తెలిపారు. పదే పదే ఫోన్లు చేసి ఈ రెండు కార్పొరేట్ కాలేజీల జోలికి వెళ్లవద్దని, అటు యూనివర్సిటీ అధికారుల పాత్రపైనా పెద్దగా విచారణ చేయవద్దని, ఏదైనా ఉంటే ఫార్మాలిటీ పూర్తి చేస్తామని, దానికి కాలేజీ యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయని తనతో పదే పదే చెప్పినట్టు సదరు అధికారి ‘సాక్షి’కి వెల్లడించారు. అయితే వాటికి తాను ఒప్పుకోలేదని, కేసు దర్యాప్తు బాధ్యతల నుంచి తప్పించాలని వేడుకోగా ఉన్నతాధికారులు మరో అధికారికి అప్పగించినట్టు ఆయన వివరించారు. కీలక నిందితుల మృతిపైనా అనుమానాలు ప్రశ్నపత్రం లీకేజీ సూత్రధారి కమిలేశ్ కుమార్ సింగ్ సీఐడీ కస్టడీలో మృతి చెందడం, ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రం బయటకు తెచ్చిన రావత్ అనుమానాస్పదంగా చనిపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిలేశ్ సింగ్ గుండెపోటుతో మృతిచెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారని సీఐడీ అధికారులు చెబుతున్నా.. రావత్ మృతిపై మాత్రం నోరుమెదపడం లేదు. కమిలేశ్‌కు కస్టడీలో ఉండగా రెండుసార్లు గుండెపోటు వచ్చింది. మొదటిసారి ఆస్పత్రికి తీసుకెళ్లారు.. కానీ రెండోసారి నటన అనుకొని నిర్లక్ష్యం చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి మృతి వెనక కూడా అదృశ్య శక్తులు ఏమైనా ఉన్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాసుబాబును సస్పెండ్ చేసిన శ్రీచైతన్య ఎంసెట్ లీకేజీ కేసులో అరెస్టయిన డీన్ ఓలేటి వాసుబాబును సస్పెండ్ చేస్తున్నట్టు శ్రీచైతన్య యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిణామంతో తమకేమీ సంబంధం లేదని, 32 ఏళ్ల విద్యాప్రస్థానంలో ఎప్పుడూ చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడలేదని ఆ విద్యాసంస్థల స్టేట్ కో–ఆర్డినేటర్ నరేంద్రబాబు పేర్కొన్నారు. -
ఎంసెట్ పేపర్ లీకేజీ కేసులో కీలక మలుపు
-
ఎంసెట్ పేపర్ లీక్.. నారాయణ, శ్రీచైతన్యలకు లింక్
సాక్షి, హైదరాబాద్: 2016లో సంచలనం సృష్టించిన తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీ కేసులో కీలక మలుపు. ఈ స్కాంతో నారాయణ, శ్రీచైతన్య కాలేజీలకు సంబంధాలున్నాయని తెలంగాణ సీఐడీ పోలీసులు నిర్ధారించారు. ఆయా కాలేజీల్లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను గురువారం అరెస్టు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ...ఎంసెట్ పేపర్ లీకేజీ స్కాం ప్రధాన నిందితులతో సంబంధాలున్న వాసుబాబును హైదరాబాద్‌లో, శివనారాయణను గుంటూరులో అరెస్టు చేశామని చెప్పారు. చైతన్య కాలేజీలకు డీన్‌గా వ్యవహరిస్తున్న వాసుబాబును ఎ-89, మరో నిందితుడు శివనారాయణ ఎ-90గా పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు ధనుంజయ ఠాకూర్, సందీప్ కుమార్‌లతో వీరిద్దరూ టచ్‌లో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆరుగురు విద్యార్థులకు ర్యాంకులు రావడానికి వాసుబాబు, శివనారాయణ ప్రధాన నిందితులతో ఒప్పందం చేసుకున్నారని వెల్లడించారు. ఒక్కొక్క విద్యార్థి నుంచి 36 లక్షల రూపాయలు వసూలు చేశారని పోలీసులు పేర్కొన్నారు. వీరిలో ముగ్గురికి టాప్ ర్యాంకులు వచ్చాయని అన్నారు. ఫోన్ కాల్ లిస్టు ఆధారంగా నిందితులను గుర్తించామని తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని పోలీసులు వెల్లడించారు. -
నారాయణ కళాశాల మూసివేత
మదనపల్లె: పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తామంటూ ఇల్లిల్లూ తిరిగి, బతిమాలి కళాశాలలో చేర్పించుకున్న నారాయణ కళాశాల యాజమాన్యం ముందస్తు సమాచారం లేకుండా అర్ధాంతరంగా కళాశాలను మూసివేసింది. శుక్రవారం కళాశాలకు బయలుదేరిన పిల్లలు ఈ విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు కళాశాల ఎదుట ధర్నా చేశారు. వారి గోడు వినేవారు, సమాధానం చెప్పేవారు లేకపోవడంతో విలేకరులను ఆశ్రయించారు. స్థానిక ఎస్బీఐ కాలనీలో నారాయణ స్కూల్ యాజమాన్యం 1 నుంచి 10 వరకు పాఠశాల, ఇంటర్మీడియట్ కళాశాల నడుపుతోంది. ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూపులో సుమారు 90 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. 2018–19లో ప్రవేశాల కోసం పదో తరగతి పరీక్షలు ప్రారంభంకాక ముందు నుంచి అధ్యాపకులు పట్టణంలో ఇంటింటికీ తిరిగి పిల్లలను చేర్పించారు. కళాశాల ప్రారంభమై నెల రోజులకు పైగానే నడిచింది. విద్యార్థుల సంఖ్య ఆశించిన స్థాయిలో లేకపోవడం, లెక్చరర్లు పనిచేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఉన్నట్టుండి కళాశాలను యాజమాన్యం మూసివేసింది. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రశ్నిస్తే.. తిరుపతిలోని తమ బ్రాంచీల్లో ఎక్కడైనా ఇదే అడ్మిషన్ నంబర్‌పై చేర్చుకుంటామని, కాకపోతే ఫీజు ఎక్కువగా ఉంటుందని, హాస్టల్ చార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. కట్టిన ఫీజుల్లో అడ్మిషన్ ఫీజు మినహాయించుకుని తిరిగి ఇచ్చేందుకు సిద్ధమని చెబుతోంది. కానీ ముందస్తు సమాచారం లేకుండా కళాశాల మూసివేయడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల ఎదుట ఆందోళన చేస్తున్నా వారికి సమాధానం చెప్పేందుకు, పరిస్థి తి వివరించేందుకు కళాశాల యాజమాన్యం ఎవ రూ లేకపోవడం గమనార్హం. సిబ్బంది ఎవరైనా వస్తారేమోనని ఆశగా ఎదురుచూసి ఉసూరుమంటూ వెళ్లిపోయారు. -
భోజనం సరిగా లేదని నారాయణ కాలేజీలో విద్యార్థుల ఆందోళన
-
‘నారాయణ’ విద్యార్థుల ఆగ్రహం..!
సాక్షి, కర్నూలు: నారాయణ కాలేజీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన కర్నూల్ జిల్లా నన్నూర్ నారాయణ కాలేజీలో చోటుచేసుకుంది. వివరాలివి.. హాస్టల్లో భోజనం సరిగా లేదని విద్యార్థులు తిరగబడ్డారు. కోపోద్రిక్తులై.. కాలేజీలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కాలేజీ యాజమాన్యం విద్యార్థులపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు క్యాంపస్ చేరుకుని విద్యార్థులను చితకబాదారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
స్టూడెంట్ను చితకబాదిన నారాయణ ప్రిన్సిపల్
-
స్టూడెంట్స్‌ను చితకబాదిన ‘నారాయణ’ ప్రిన్సిపల్ !
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలోని నన్నూరు నారాయణ కాలేజీలో శనివారం దారుణం చోటు చేసుకుంది. కాలేజ్‌లో చదువుతున్న కొంతమంది విద్యార్థులను ప్రిన్సిపల్ రక్తం వచ్చేలా చితకబాదాడు. దీంతో బాధిత విద్యార్థులు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో ఫీజలు కట్టి కాలేజీకి పంపుతుంటే.. ఇలా హింసిస్తారా అని మండిపడ్డారు. ఒకవేళ విద్యార్థులు తప్పు చేసినా.. రక్తం వచ్చేలా కొట్టడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. -
యాదాద్రిలో మిస్ ఆస్ట్రేలియా వరల్డ్-2017
యాదాద్రి భువనగిరి జిల్లా : చౌటుప్పల్ మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలను ఆస్ట్రేలియా మిస్ వరల్డ్-2017 ఎస్మా వోలోడేర్ సోమవారం సందర్శించారు. అనంతరం పాఠశాలలో జరిగిన డాన్స్ పోటీలలో బాలికలతో కలసి డాన్స్ చేశారు. హైదరాబాద్‌లోని నారాయణ కాలేజీలో జరిగే ఓ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎస్మా హాజరయ్యారు. గురుకుల పాఠశాల అధికారుల విజ్ఞప్తి మేరకు చౌటుప్పల్‌లోని గురుకుల పాఠశాలకు వచ్చారు. ఆమెతో కలిసి ఫోటోలు దిగేందుకు పలువురు ఉత్సాహం చూపారు. -
నారాయణ విద్యార్థి ఆత్మహత్య
గూడూరు: నారాయణ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో మంగళవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. రాపూరు మండలం గుండవోలు గ్రామానికి చెందిన మాచిరాజు విజయభాస్కర్‌రాజు, సునీత దంపతుల ఒక్కగానొక్క కుమారుడు లక్ష్మీసాయి (20) గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఏం జరిగిందో.. ఏమో ఆ విద్యార్థి ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందడం ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. లక్ష్మీసాయి గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్లో ఉంటూ చదువుతున్నాడు. గత శుక్రవారం (ఈ నెల 15న) గూడూరులోని అశోక్‌నగర్ ప్రాంతంలో రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్న తన స్నేహితుడు ఎ.మనోజ్ వద్దకు వెళ్లాడు. తనను కళాశాల హాస్టల్ నుంచి పింపించివేశారని 2 రోజులు రూమ్‌లో ఉంటానని చెప్పడంతో మనోజ్ సరేనన్నాడు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో లక్ష్మీసాయిని రూమ్‌లోనే ఉంచి మనోజ్ ఊరికి వెళ్లి, మంగళవారం తన రూమ్‌కు చేరుకున్నాడు. తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీని తొలగించి చూడగా.. లక్ష్మీసాయి మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. మృతదేహం దుర్వాసన వెదజల్లుతుండటంతో ఆదివారం రాత్రే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఇదిలావుండగా.. లక్ష్మీసాయి ఫీజు చెల్లించాల్సి ఉండటంతో యాజమాన్యం అతడిపై విపరీతమైన ఒత్తిడి తెచ్చిందని.. సకాలంలో చెల్లించకపోవడంతో హాస్టల్ నుంచి పంపించివేసిందని విద్యార్థి సంఘ నాయకులు చెబుతున్నారు. కళాశాల యాజమాన్యం ఒత్తిడి కారణంగానే లక్ష్మీసాయి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. -
నారాయణ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: టీచర్ వేధింపులు భరించలేక కూకట్పల్లి వివేకానంద నగర్‌లోని నారాయణ బాలికల రెసిడెన్షియల్ హాస్టల్లో నవ్యశ్రీగౌడ్ అనే విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసుకుంది. కొంతకాలంగా లెక్కల టీచర్ కీర్తి తనను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు విద్యార్థిని చెబుతోంది. పరీక్షలు బాగా రాసినా తక్కువ మార్కులు వేస్తోందని, ఆ తర్వాత మార్కులు తక్కువ వచ్చాయని స్కేల్‌తో కొడుతున్నట్లు తెలిపింది. దీంతో మానసిక వేదనకు గురైన నవ్యశ్రీ చేతిని బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లి దండ్రులకు విషయం తెలియజేయడంతో వారు మంగళవారం కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘నారాయణ కాలేజీ ఒత్తిడి తగ్గించకుంటే ఆత్మహత్య చేసుకుంటా’
సాక్షి, హైదరాబాద్: నారాయణ కళాశాల యాజమాన్యం చదువుల పేరుతో వేధింపులకు గురి చేస్తోందంటూ ఆ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతనికి బీసీ విద్యార్థి సంఘం నాయకులు మద్దతు తెలిపారు. బడంగ్‌పేటకు చెందిన సాయినాథ్ రెడ్డి చంపాపేటలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చదువుల పేరుతో కళాశాల సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా వేధింపులకు పాల్పడుతున్నారని, ఆపై పరీక్షల పేరుతో తమపై ఒత్తిడి పెంచుతున్నారని సాయినాథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాలు తల్లిదండ్రులకు చెప్పడానికి ప్రయత్నిస్తే వారికి కట్టుకథలు చెబుతున్నారని.. కళాశాల యాజమాన్యం ఒత్తిడిలను మానుకోకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని అతను హెచ్చరించారు. ఇటీవలికాలంలో నారాయణ కాలేజీ విద్యార్థులు వరుసగా ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో సాయినాథ్‌రెడ్డి ఫిర్యాదు చేయడం గమనార్హం. -
విద్యార్థుల ఆత్మహత్యలు.. మంత్రి గంట ఏమన్నారో చూడండి!
సాక్షి, అమరావతి: కార్పొరేట్ కాలేజీల్లో వరుసగా విద్యాకుసుమాలు రాలిపోతుండటం.. ఒత్తిడి తాళలేక పెద్దసంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుండటం రాష్ట్రంలో తీవ్ర ఆందోళన రేపుతోంది. విద్యా వికాసాన్ని పంచాల్సిన చదువులే.. యమపాశలై.. కార్పొరేట్ కళాశాలల ఒత్తిళ్లకు విద్యార్థులు బలి అవుతుండటం రాష్ట్రంలో తీరని విషాదాన్ని నింపింది. ఇటీవలికాలంలో నారాయణ కాలేజీలో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం.. వారి తల్లిదండ్రుల గుండెల్లో తీరనిశోకాన్ని నింపింది. అయితే, ఇంతటి తీవ్రమైన ఘటనపై ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తేలికగా స్పందించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సిన మంత్రే.. కాలేజీల్లో ఆత్మహత్యలు ఓవర్‌నైట్‌లో ముగిసిపోవు అంటూ తేల్చేశారు. విద్యార్థులు చనిపోవాలని ఎవరూ కోరుకోవడం లేదని, విద్యార్థుల ఆత్మహత్యల నియంత్రణకు కమిటీ వేశామని ఆయన చెప్పుకొచ్చారు. నిబంధనలు ఎవరూ ఉల్లంఘించినా కాలేజీలను మూసివేస్తామని మంత్రి గంట అన్నారు. -
నారాయణ కాలేజీకి షాక్; భారీ జరిమానా
సాక్షి, రాయచోటి రూరల్: కడపలోని నారాయణ కళాశాలకు రూ.10 లక్షలు జరిమానా విధించినట్లు ఆర్ఐఓ రవి పేర్కొన్నారు. బుధవారం ఆయన వైఎస్సార్ జిల్లా రాయచోటిలో పలు కళాశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కడపలోని నారాయణ కళాశాలలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సమగ్ర విచారణ నిర్వహించామన్నారు. విద్యార్థిని ఆత్మహత్య విషయంలో కళాశాల యాజమాన్యం, సిబ్బంది తప్పు ఉన్నందున ఉన్నతాధికారులు జరిమానా విధించినట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులపై ఒత్తిడి పెంచితే చర్యలు తప్పవని ఆర్ఐఓ పేర్కొన్నారు. -
నారాయణ విద్యార్థిని కిడ్నాప్ చేసిన శ్రీచైతన్య
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చదువులో మేటిగా ఉన్న ఓ విద్యార్థికోసం రెండు కార్పొరేట్ విద్యాసంస్థలు కొట్లాటకు దిగాయి. నెల్లూరులోని నారాయణ విద్యాసంస్థలో చదువుతున్న ఓ విద్యార్థిని శ్రీచైతన్య సిబ్బంది తమ వెంట హైదరాబాద్‌కు తీçసుకెళ్లారు. దీంతో నారాయణ సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి శ్రీచైతన్య సిబ్బందిపై నెల్లూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టించారు. వాస్తవానికి ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో కార్పొరేట్ విద్యాసంస్థల మధ్య ఈ తరహా వ్యవహారాలు జరుగుతుంటాయి. కానీ విద్యా సంవత్సరం మధ్యలో ఈ ఘటన జరగడం విశేషం. నెల్లూరు చాకలి వీధికి చెందిన రియాజ్ అహ్మద్, ఆరీఫా దంపతుల కుమారుడు ఎండీ ఫాజిల్ నగరంలోని ధనలక్ష్మీపురంలో ఉన్న నారాయణ విద్యాసంస్థలో పదో తరగతి చదువుతున్నాడు. చదువులో మేటి అయిన ఫాజిల్ నారాయణ హాస్టల్లో ఉంటున్నాడు. దీపావళి సెలవుల నేపథ్యంలో ఈనెల 18న ఇంటికొచ్చాడు. ఫాజిల్ మంచి ర్యాంక్ సాధించే విద్యార్థి కావడంతో 19న శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన లింగాల రమేష్, టి.పార్థసారథిలు అతనింటికి వెళ్లి.. ఫాజిల్‌కు తమ విద్యాసంస్థలో చేర్పిస్తే ఇంటర్ వరకు ఉచితంగా చదువు చెప్పిస్తామంటూ వలవేశారు. ఫాజిల్ తల్లిదండ్రులకు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా 20వ తేదీ రాత్రి ఫాజిల్‌ను తమ వెంట హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అక్కడి అయ్యప్ప సొసైటీలో ఉన్న శ్రీచైతన్య రెసిడెన్షియల్ క్యాంపస్‌లో ఉంచి చదివిస్తున్నారు. అయితే ఫాజిల్ స్కూల్‌కు రాకపోవడంతో నారాయణ విద్యాసంస్థల సిబ్బంది ఆరా తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నారాయణ సిబ్బంది ఫాజిల్ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టాలని కోరారు. విద్యాసంస్థల మధ్య కొట్లాటలో తలదూర్చడమెందుకని భావించిన ఫాజిల్ తండ్రి రియాజ్ అహ్మద్ రెండు రోజులపాటు మౌనం వహించారు. ఒత్తిడి పెరగడంతో రెండు రోజులక్రితం హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీ క్యాంపస్‌కు వెళ్లి తన కుమారుడితో ఒకసారి మాట్లాడాలని అక్కడ సిబ్బంది నాగేంద్ర, పి.రెడ్డిని కోరారు. అయితే కుమారుడితో కలవనివ్వకుండానే ఆయన్ను వారు పంపివేశారు. దీంతో ఫాజిల్ తల్లి ఆరీఫా బుధవారం రాత్రి నెల్లూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీచైతన్య సిబ్బందిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. నారాయణ యాజమాన్యం నుంచి ఒత్తిడి ఉండడంతో పోలీసులు వివరాలు వెల్లడించడం లేదు. ఐపీసీ సెక్షన్ 363 కింద కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు హైదరాబాద్‌కు పయనమైనట్టు సమాచారం. -
చదువులా ? చావులా ?
-
చదివేదెలా..?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఇవన్నీ నారాయణ కళాశాల పాపాలే. ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల్లో కడుపు కోతను మిగిల్చాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ కళాశాలలో చోటుచేసుకున్న ఆత్మహత్యల నేపథ్యంలో జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలను విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి నెలకుంది. వేధింపులు...సతాయింపు సకాలంలో ఫీజులు కట్టకపోతే వేధింపులు...ఇరుకిరుకు గదులు...కడుపునింపని భోజనాలు ...ఆశించిన మార్కులు రాకపోతే సతాయింపు....అంటగడుతున్న బలవంతపు చదువులు...రేటింగ్ పెంచుకోవడానికి విద్యార్థులను ఆయుధాలుగా వాడుతున్న పరిస్థితి...ఇలా ఒకటేంటి కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టుగా నారాయణ కళాశాలలపై అనేక ఆరోపణలున్నాయి. బలవంతపు చదువులు అంటగడుతూ ప్రాణాలను తోడేస్తున్నాయి. కార్పొరేట్ కలరింగ్‌లో తల్లిదండ్రుల ఆశల్ని చిదిమేస్తున్నాయి. మానసిక ఒత్తిడికి గురి చేసి మరణ శాసనాలను లిఖిస్తున్నాయి. విద్యార్థులను మార్కుల యంత్రాలుగా వాడుతున్నాయి. మార్కుల వేటలో మానసిక ఒత్తిళ్ల మధ్య విద్యార్థులు తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. కార్పొరేట్ కళాశాలలో చదవితే ప్రయోజకులవుతారన్న ఆశతో చదివిస్తున్న తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగుల్చుతున్నాయి. నారాయణలో చదివేందుకు వెనుకంజ... రోజురోజుకీ పరిస్థితి దయనీయంగా మారడం, విద్యార్థుల జీవితాలకు గ్యారంటీ లేకపోవడంతో నారాయణ కళాశాలల్లో చదివించేందుకు తల్లిదండ్రులు సైతం క్రమేపీ వెనుకంజ వేస్తున్నారు. దీంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో నారాయణ కళాశాలల్లో గతంలో 15 బ్రాంచీలుడగా వాటిలో 15 వేల మంది విద్యార్థులు చదువుతుంటేవారు. యాజమాన్య విధానాలు, ఒత్తిడి, చోటుచేసుకుంటున్న వరుస ఆత్మహత్యలతో కళాశాలల సంఖ్య జిల్లాలో ప్రస్తుతం ఆరుకు చేరింది. విద్యార్థులు 50 శాతం మంది పైగా తగ్గిపోయారు.కళాశాల యాజమాన్యం వేధింపుల ధోరణి, నిర్వహణ, పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం లేకపోవడంతో విద్యార్థులు నారాయణ కళాశాలల్లో చేరడంలేదన్న వాదనలున్నాయి. ఫలితంగా చాలావరకు హాస్టళ్లు మూసేసినట్టు సమాచారం. తరగతి గదులు ఇరుకు,ఇరుకుగా, చీకటిగా ఉంటాయని, రోజంతా విద్యుత్తు దీపాలతోనే తరగతులు బోధిస్తున్న పరిస్థితులున్నాయి. గాలిరాక విద్యార్థులు ఉక్కపోతకు గురవుతుంటారని, ఏసీ తరగతి గదులు పేరుకే కానీ అవి సక్రమంగా ఉండవనే వాదనలున్నాయి. జిల్లాలో ప్రైవేటు కళాశాలలు ఇలా... జిల్లాలో మొత్తం 282 ప్రైవేట్ జూనియర్ కళాశాలలుండగా వాటిలో జనరల్‌లో 201, ఒకేషనల్‌లో 81 కళాశాలలున్నాయి. వీటిలో 35 వేలమంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇక హాస్టళ్ల విషయానికి వస్తే రాజమహేంద్రవరం దానవాయిపేటలో గతంలో నారాయణ రెండు హాస్టళ్లుండేవి. విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో హాస్టళ్లను మూసివేశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం రూరల్ తిరుమల కళాశాలలో ఒకటి, శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఈ ఏడాది నుంచి, ప్రతిభ జూనియర్ కళాశాలకు ఒక హాస్టల్ రాజమహేంద్రవరంలో ఉండగా, కాకినాడలో నారాయణకు ఒక హాస్టల్ ఉంది. ఆత్మహత్యల వివరాలు ఇలా... 04 సెప్టెంబర్ 2015 : తాడితోట షెల్టాన్ హోటల్ ఎదురుగా ఉన్న నారాయణ కళాశాలలో యాజమాన్యం ర్యాంకుల వేధింపులు తాళలేక ఇంటికి వెళ్లి ఇంటర్ చదువుతున్న పెదపాటి రాజేశ్వరరావు బాత్రూమ్లో ఆత్మహత్యచేసుకున్నాడు. తండ్రి జోగేశ్వరరావు బంగారు ఆభరణాల తయారీ పని చేస్తుంటారు. ఈ సందర్భంగా ఆయనను ‘సాక్షి’ పలుకరించగా కన్నీళ్ల పర్యంతమయ్యారు. కళాశాల ఫీజు చెల్లించడంలో కొద్ది రోజులు ఆలస్యమైతే యాజమాన్యం తరగతి గదిలో అందరిముందు అవమానించేలా ఫీజు కట్టని విద్యార్థులను అవమానించడంతో సున్నిత మనస్కుడైన అతడు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల కోసమైతే తల్లిదండ్రులకు ఫోన్‌చేసి అడగాలే తప్ప విద్యార్థులను నిలదీయడం మంచి పద్దతికాదన్నారు. 13 అక్టోబర్ 2015 : పాలకొల్లుకు చెందిన నందిని అనే విద్యార్థిని తల్లి రాజమహేంద్రవరంలో నర్స్‌గా పనిచేస్తుండడంతో ఆమె దానవాయిపేట నారాయణ కళాశాలలో ఇంటర్ చదువుతూ స్థానికంగా ఉన్న షాడే బాలికల హాస్టల్లో ఉంటోంది. మార్కులు తక్కువ వస్తున్నాయని, సరిగా చదవడంలేదని ఆ విద్యార్థినిని కళాశాలలో మందలించారు. ఈ నేపథ్యంలో అవమానంగా భావించి హాస్టల్‌కు వచ్చి తెల్లవారు జామున ఆవరణలో చెట్టుకు ఉరివేసుకుని చనిపోయింది. 2008లో : దానవాయిపేటలోని నారాయణ క్యాంపస్‌లో ఇంటర్ చదువుతున్న విద్యార్థినితోపాటు మరో విద్యార్థినిని కూడా మార్కులు తక్కువ వస్తున్నాయని తరగతి గదిలో తోటి విద్యార్థులందరి ముందు అసభ్య పదజాలంతో ఉపాధ్యాయులు దూషించారు. కళాశాల భవనం మూడో అంతస్తుకు వచ్చి పైనుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. -
భగ్గుమన్న విద్యార్థి సంఘాలు
సాక్షి, విజయవాడ: ఆదివారం కూడా కార్పొరేట్ కాలేజీల్లో తరగతులు నిర్వహిస్తుండటాన్ని నిరసిస్తూ విజయవాడలో విద్యార్థి సంఘాలు ఆందోళనలకు దిగాయి. భారతీనగర్‌లోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఉదయం నుంచి తరగతులు నిర్వహిస్తుండటంతో సమాచారం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కాలేజీ వద్దకు చేరుకొని.. ధర్నాకు దిగాయి. ఆదివారం క్లాసులు నిర్వహించొద్దని ప్రభుత్వం ప్రకటించిన నాలుగు రోజులకే రెసిడెన్షియల్ క్యాంపస్‌లలో తరగతులు ఎలా నిర్వహిస్తారని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. కొనసాగుతున్న నిరసనలు.. కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల మరణాలపై నిరసనలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కడపలో విద్యార్థి సంఘాలు నిరవధిక నిరాహార దీక్షకు దిగాయి. విద్యార్థులను యంత్రాల్లా చదివిస్తూ కేవలం ర్యాంకుల కోసం పరితపిస్తున్న నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలను వెంటనే మూసివేయాలని కోరుతూ.. నెల్లూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. నారాయణ, శ్రీచైతన్య కళాశాలలో చేరిన విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వీ.ఆర్.కళాశాల సెంటర్లో మెడకు ఉరితాళ్లు వేసుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మంత్రి పదవి నుంచి నారాయణను తప్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా యాజమాన్యాలు తమ ధోరణిని మార్చుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గుంటూరులో.. కార్పొరేట్ విద్యాసంస్థలు ఇంటర్‌బోర్డు నిబంధనలకు అనుగుణంగానే తరగతుల నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు ఆర్ఐవో కార్యాలయాన్ని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. బోర్డు మార్గదర్శకాలను కార్పొరేట్ కాలేజీలు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపించారు. ఒత్తిడి భరించలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా.. ఏ ఒక్క విద్యాసంస్థపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు. ఆదివారాలు, సెలవు రోజుల్లో కూడా క్లాసులు నిర్వహిస్తున్న ఇంటర్ బోర్డు పట్టించుకోవడం లేదని, ఇలాగైతే తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
‘నారాయణ’ యాజమాన్యమే పొట్టన పెట్టుకుంది
కడప వైఎస్ఆర్ సర్కిల్: ‘‘మా కుమార్తె పావనిని నారాయణ కళాశాల యాజమాన్యమే పొట్టనపెట్టుకుంది’’ అని మృతురాలి తల్లిదండ్రులు మల్లేశ్వర్‌రెడ్డి, శివమ్మలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వైఎస్సార్ జిల్లా కడపలోని అంబేడ్కర్ సర్కిల్లో నారాయణ కళాశాలల్లో ఆత్మహత్యలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరవకధిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్లో పాల్గొన్న విద్యార్థిని పావని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ మాట్లాడారు. తమ కుమార్తె చదువుతోపాటు అన్నింటిలో మొదటిస్థానంలో నిలిచేదని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తెలిపారు. నారాయణ కళాశాల యాజమాన్యమే తమ కుమార్తెను చంపిందని వారు ఆరోపించారు. తల్లిదండ్రులకు, పోలీసులకు ఎటువంటి సమాచారం అందించకుండా రిమ్స్ మార్చురీలో అనాథ శవంలా పావనిని ఉంచారని, దీనిని బట్టి చూస్తే యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహారించిందో అర్థమవుతోందని ధ్వజమెత్తారు. పావని మృతి పట్ల న్యాయం చేయాల్సిన పోలీసులే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పడం దారుణమని, తమకు జరిగిన అన్యాయం ఇతర తల్లిదండ్రులకు జరగకూడదన్నారు. నారాయణ కళాశాల మంత్రులకు చెందినది కాబట్టే ప్రభుత్వం సైతం వారికి వత్తాసు పలుకుతోందని విమర్శించారు. తమ కుమార్తె మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మల్లేశ్వర్‌రెడ్డి, శివమ్మ డిమాండ్ చేశారు. -
కన్నవారికి కడుపుకోత
-
నారాయణలో ఆత్మ’హత్య’లు
-
సారీ మమ్మీ.. సారీ డాడీ
-
సారీ మమ్మీ.. సారీ డాడీ
సారీ మమ్మీ... సారీ డాడీ.. ఐ మిస్ యూ సోమచ్.. బై సన్నీ.. టెన్త్‌లో మంచి మార్కులు తెచ్చుకో..బై అక్కా.. బాగా చదివి గ్రూప్స్ సాధించి నాన్నకు మంచి పేరు తీసుకురా.. నాకోసం వెతకొద్దు ప్లీజ్..వేస్ట్ నారాయణ కాలేజీ... క్లోజ్ ది నారాయణ కాలేజీ... నారాయణ కాలేజీ కిల్లింగ్ ద స్టూడెంట్స్ టు రీడ్... సో ప్లీజ్ హెల్ప్ ద స్టూడెంట్స్ ఫ్రం నారాయణ. దే ఆర్ ఆర్ సఫరింగ్ ఇన్ దిస్ కాలేజీ, హాస్టల్... సారీ మమ్మీడాడీ .’ ఇది హైదరాబాద్ నారాయణ కాలేజీలో చదువుతూ తాజాగా అదృశ్యమైన విద్యార్థిని సాయి ప్రజ్వల వేదన.. కార్పొరేట్ కాలేజీల ఒత్తిడికి తట్టుకోలేక ఇంటర్ విద్యార్థులు ఎలా రాలిపోతున్నారో ప్రత్యక్ష నిదర్శనం ఈ లేఖ. ఈ మూడేళ్లలో ఏకంగా 60 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం నారాయణ తదితర కార్పొరేట్ కాలేజీల్లో నెలకొన్న తీవ్ర ఒత్తిళ్లను స్పష్టం చేస్తోంది. సాక్షి, అమరావతి: కార్పొరేట్ కాలేజీల ధనదాహానికి, చదువుల ఒత్తిడికి అమాయక విద్యార్థులు నేల రాలిపోతున్నారు. నారాయణ, చైతన్య కాలేజీల్లో భరించలేనంత ఒత్తిడికి గురై నిండు నూరేళ్ల జీవితాలను అర్థంతరంగా ముగిస్తున్నారు. మొన్న కృష్ణా జిల్లా గూడవల్లిలో... నిన్న విజయవాడలో... నేడు హైదరాబాద్‌లో ఓ విద్యార్థిని ఒత్తిడికి తట్టుకోలేక అదృశ్యమైంది. హైదరాబాద్ సమీపంలోని బండ్లగూడ నారాయణ కాలేజీలో బైపీసీ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిని సాయి ప్రజ్వల కొద్ది రోజులుగా కనిపించటం లేదు. కరీంనగర్ జిల్లా గోదావరి ఖని మండలం అడ్డగుంటపల్లికి ఆమె తల్లిదండ్రులు ప్రజ్వల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు గుర్తించి కొద్ది రోజుల క్రితం నగరంలోని బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం విద్యార్థిని నారాయణ కాలేజీలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు లేఖ రాసి కనిపించకుండా పోయింది. కాలేజీలో ఏదో జరగటం వల్లే తమ బిడ్డ వెళ్లిపోయిందని విద్యార్థిని తండ్రి విద్యాగిరి శ్రీనివాస్ ఆరోపించారు. ఇటీవల కడప నారాయణ కాలేజీలో పావని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఒక్క ఈ వారం పది రోజుల్లోనే 8 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో బోధపడుతోంది. ఈ మూడేళ్లలో ఒక్క ఏపీలోనే 60 మంది ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడినా ప్రభుత్వంలో చలనం లేదు. కార్పొరేట్ కాలేజీలకు ప్రభుత్వం వంత పాడుతుండడమే పరిస్థితి ఇంతగా దిగజారడానికి కారణం. అడ్మిషన్ల నుంచే అవకతవకలు కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోవడానికి ప్రధాన కారణం విచ్చలవిడిగా అడ్మిషన్లు చేపట్టటమే. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు, బోధించే వారిని నియమించకుండా ధన దాహంతో వ్యవహరిస్తున్నాయి. కాసుల కక్కుర్తితో ఇరుకు గదుల్లో విద్యార్ధులను కుక్కుతున్నాయి. ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే సరిపోయే గదిలో ఏకంగా 8 నుంచి 10 మందిని కూర్చోబెడుతున్నాయి. కాలేజీలకు అడ్మిషన్ల సమయంలో సైన్సు, ఆర్ట్స్ తరగతులకు రెండేసి సెక్షన్లకు మాత్రమే అనుమతిస్తారు. నిబంధనల ప్రకారం ఒక్కో తరగతిలో 80 మందిని చేర్చుకోవచ్చు. ఇలా తొలుత నాలుగు సెక్షన్లకు 320 మంది విద్యార్థుల కోసం వసతులు చూపించి అనుమతులు పొందుతున్న కార్పొరేట్ కాలేజీలు ఆ తరువాత 10 శాతం వెసులుబాటును ఆసరాగా చేసుకొని మరింత మందిని చేర్చుకుంటున్నాయి. అవే వసతుల్లో అదనపు విద్యార్థులను కుక్కుతున్నాయి. వసతులు లేకుండా మరో 9 సెక్షన్లను ఏర్పాటు చేసి ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇలా మరో 720 మందితో పాటు అదనంగా మరో 10 శాతం నిబంధనతో విద్యార్థులను ఇబ్బడి ముబ్బడిగా చేర్చుకుంటున్నాయి. దీనికితోడు మరి కొంత మందిని పరీక్షల సమయంలో వేరే కాలేజీ విద్యార్ధుల కింద చూపించి పరీక్షలు రాయిస్తున్నాయి. కార్పొరేట్ కాలేజీల్లో ఒక్కో క్యాంపస్‌లో ఇరుకిరుకు గదుల్లో 2,500 మంది నుంచి 3 వేల మంది వరకు విద్యార్థులు ఉంటున్నారు. ముందు చూపించిన కొద్ది మంది బోధకులతోనే ఈ వేలాది మంది పిల్లలకు బోధన చేయిస్తున్నారు. మరోవైపు నిబంధనల ప్రకారం ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి ట్యూషన్ ఫీజు కింది రూ.2,800 వరకు వసూలు చేయాల్సి ఉండగా రూ. 40,000 నుంచి రూ. లక్ష వరకూ గుంజుతున్నారు. హాస్టల్లో ఉంటే దీనికి మరో రూ. లక్ష అదనం. ఇంటర్ బోర్డుపై కార్పొరేట్‌దే పెత్తనం గాలి వెలుతురు లేని ఇరుకు గదులు, అపరిశుభ్ర వాతావరణంలో విద్యార్ధులు మగ్గిపోతున్నారు. ఈ వ్యవహారాలన్నీ తెలిసినా కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు, ప్రభుత్వ పెద్దలకు ఉన్న సంబంధ బాంధవ్యాలతో ఇంటర్ బోర్డు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. స్వయంగా నారాయణ విద్యాసంస్థల అధిపతి పి.నారాయణ కేబినెట్ మంత్రిగా ఉండగా ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. రాష్ట్రంలో 3,500 వరకు జూనియర్ కాలేజీలు ఉండగా ఇందులో 525 మాత్రమే ప్రభుత్వ కాలేజీలు. తక్కిన కాలేజీలన్నీ కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో ఉన్నవే. ప్రభుత్వ కాలేజీల్లో 3 లక్షల మంది విద్యార్ధులు చదువుతుండగా ప్రైవేట్ కాలేజీల్లో 7 లక్షల మంది చదువుతున్నారు. ఇంటర్మీడియెట్ బోర్డులో ఈ కాలేజీలదే పెత్తనంగా మారింది. సొంత సిలబస్... కార్పొరేట్ కాలేజీలు ప్రభుత్వం రూపొందించిన సిలబస్‌ను పట్టించుకోకుండా తమ సొంత సిలబస్‌ను బోధిస్తున్నాయి. జేఈఈ మెయిన్స్, అడ్వాన్సుడ్, ఎంసెట్, నీట్ సహా ఇతర పరీక్షలకు వాటి దారి వాటిదే. పరీక్షలకు నెలన్నర ముందు మాత్రమే ఇంటర్ సిలబస్‌ను బోధిస్తున్నాయి. పదో తరగతి పాసై వచ్చిన విద్యార్థికి ఇంటర్ పాఠాలతో బోధన ప్రారంభిస్తే కొంతమేర అవగాహన ఏర్పడుతుంది. కానీ ప్రారంభంలోనే జేఈఈ, నీట్ లాంటి పోటీ పరీక్షల సిలబస్‌ను బోధిస్తుండడంతో విద్యార్ధులు బెంబేలెత్తిపోతున్నారు. రోజువారీ... వారాంతపు పరీక్షలతో ఒత్తిడి పదో తరగతి వరకు ఆటపాటలతోనో, ఒకింత స్వేచ్ఛగా చదివిన విద్యార్ధులు ఒక్కసారిగా పెరిగిన సిలబస్, ఆపై పోటీ పరీక్షల బోధనతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కార్పొరేట్ కాలేజీల్లో రోజువారీ, వారాంతపు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అందులో వచ్చే మార్కులను అనుసరించి విద్యార్ధులను వేర్వేరు సెక్షన్లలోకి మార్పులు చేస్తున్నారు. ఒకవారం ఒక సెక్షన్లో ఉంటే మరో వారం మరో సెక్షన్లోకి వెళ్లాల్సి స్తోంది. దీంతో బోధకులు కూడా మారిపోతుండడం, పాఠ్యాంశాలు కూడా మారిపోతుండడంతో తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. అర్హతలు లేని వారిని లెక్చరర్లుగా, వైస్ ప్రిన్సిపాళ్లుగా... సరైన అర్హతలు లేని వారిని లెక్చరర్లు, వైస్‌ప్రిన్సిపాళ్లుగా నియమిస్తున్నారు. కనీసం సబ్జెక్టు గురించి అవగాహన లేని వారిని తీసుకోవటంతో విద్యార్ధులకు వచ్చే సందేహాలు కూడా తీర్చలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో తమ బలహీనతలు బయటపడకుండా ఉండడానికి ఇతరుల ముందే విద్యార్ధులను తిట్టడం, కొట్టడం ఇతర విపరీత చేష్టలకు లెక్చరర్లు దిగుతున్నారు. ఇది కూడా విద్యార్ధుల్లో అవమానానికి, ఆత్మన్యూనతకు దారితీస్తోంది. ఆయా లెక్చరర్లకు ఇచ్చే వేతనాలు రూ.9 వేల లోపే ఉండడంతో యాజమాన్యంపై కోపాన్ని విద్యార్ధులపై చూపిస్తున్నారు. ఇంటర్బోర్డులో అరకొరగా సిబ్బంది.... కార్పొరేట్ కాలేజీలపై పర్యవేక్షణకు ఇంటర్ బోర్డులో తగినంత మంది సిబ్బంది లేరు. జిల్లాకొక ఆర్ఐవో పోస్టు ఉన్నా అందులో చాలావరకు ఖాళీగానో, ఇన్‌ఛార్జులతోనో నడుస్తున్నాయి. వారికింద సిబ్బంది లేరు. ఇక ఇంటర్ సగానికి పైగా పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం బోర్డులో ఎక్కువ శాతం మంది తెలంగాణకు వెళ్లిపోగా ఏపీలో నియామకాలు మాత్రం చేపట్టలేదు. దీంతో బోర్డులో ఒక్కో అధికారి నాలుగైదు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. కాలకృత్యాలూ తీర్చుకోలేకపోతున్న విద్యార్ధులు చదువుల ఒత్తిడితో దొరికిన కొద్ది సమయంలోనే కాలకృత్యాలు తీర్చుకోవలసిన దుర్గతిలో విద్యార్ధులుంటున్నారు. ఇక హాస్టళ్లలో యాజమాన్యాలు అందించే ఆహారం చాలా నాసిరకం. దాదాపు ఏకబిగిన రెండు గంటలసేపు సాగే స్టడీ అవర్‌లో వారు సూచించిన సబ్జెక్టును మాత్రమే విద్యార్ధులు చదవాలి. ఇష్టం లేకున్నా అవే పుస్తకాలు పట్టుకొని తీవ్ర మనస్తాపంతో జీవితంపై అనాసక్తి ఏర్పరచుకుంటున్నారు. వారానికో, నెలకో వచ్చే తల్లిదండ్రులను నిమిషాల వ్యవధిలోనే హడావుడిగా పంపేస్తున్నారు. -
‘నారాయణ’ను మూసేయండి..
-
‘నారాయణ’ను మూసేయండంటూ లేఖ..
సాక్షి, హైదరాబాద్ : ‘నారాయణ కళాశాలలు విద్యార్థుల పాలిట నరక కూపాలుగా మారాయి. దయచేసి నారాయణ విద్యాసంస్థలను మూసేయించండి’ అంటూ లేఖ రాసి ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైంది. ఈ సంఘటన రాచకొండ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ నెల 11న బండ్లగూడలోని నారాయణ కాలేజీకి వెళ్లిన సాయి ప్రజ్వల తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఆరా తీశారు. ప్రజ్వల ఆచూకీ తెలీకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రజ్వల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నారాయణ కళాశాలలో చదువుకోవడం ఇష్టం లేక, వాళ్లు పెడుతున్న ఒత్తిడి తట్టుకోలేకే తాను వెళ్లి పోతున్నట్లు ప్రజ్వల లేఖలో పేర్కొంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఉద్దేశించి లేఖలో రాసిన ప్రజ్వల కళాశాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, సాయి ప్రజ్వల ఇంటి నుంచి కళాశాలకు అని చెప్పి వెళ్తున్న సీసీటీవీ ఫుటేజిని పోలీసులు గుర్తించారు. దీంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సాక్షి ఎఫెక్ట్ : ‘నారాయణ’ లో గంటా ఆకస్మిక తనిఖీలు
-
మంత్రా మజాకా!
పురపాలక శాఖా మంత్రే అ‘క్రమబద్ధీకరణ’కు తెరలేపారు. మున్సిపాలిటీల్లో భవనాల క్రమబద్ధీకరణకు ఆ శాఖ మంత్రిగా ఇచ్చిన ఉత్తర్వులను ఆయనే ఉల్లంఘిస్తూ గూడూరు మున్సిపాలిటీకి సుమారు రూ.7 కోట్లకు శఠగోపం పెట్టారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పైసా చెల్లించకుండా తన భవనాలు క్రమబద్ధీకరణకు కౌన్సిల్ ద్వారా ఏక్షపక్షంగా తీర్మానాన్ని చేయించుకున్నారు. నెల్లూరు , గూడూరు : గూడూరు మున్సిపాలిటీ పరిధిలో నారాయణ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్, రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి నారాయణ తండ్రి సుబ్బ రామయ్య సర్వే నంబరు 954/ఏ, 955/ఈ, 954/1, 955/ఏ, 955/సీ, 955/డీల్‌లో కళాశాల విద్యార్థులు కోసం వసతిగృహాలను 2001లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారు. ఈ భవనాలు క్రమబద్ధీకరణ చేసుకోవాలని మున్సిపల్ అధికారులు గతంలో ఉత్తర్వులు జారీచేశారు. అయినా స్పందించలేదు. ఈ నేపథ్యంలో 2014లో నారాయణ పురపాలక శాఖ మంత్రి అయ్యారు. మున్సిపల్‌శాఖ మంత్రిగా 2015లో జీఓ నంబరు 128 జారీ చేస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మితమైన భవనాలను క్రమబద్ధీకరించుకునే అవకాశాలు కల్పించారు. మంత్రి నారాయణకు సంబంధించిన భవనాల క్రమబద్ధీకరణకు నిబంధనల ప్రకారం సుమారు రూ.7 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీన్ని ఎగనామం పెట్టేందుకు రూపాయి చెల్లించకుండా క్రమబద్ధీకరణ చేపట్టేందుకు కౌన్సిల్ ఆమోదం కోసం ప్రతి కౌన్సిల్ అజెండాలో పెట్టడం, ఈ అంశాన్ని వైఎస్సార్సీపీ కౌన్సిల్ సభ్యులు తిరస్కరించడం జరుగుతూ వచ్చింది. దీంతో నేరుగా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌కు ప్రతిపాదనలు చేసుకున్నారు. సంబంధిత అధికారులు 21 షరతులు విధిస్తూ.. వాటిని పూర్తిచేసి కౌన్సిల్ ఆమోదం పొందాకే క్రమబద్ధీకరిస్తామని చెబుతూ సమాచారం ఇచ్చారు. ఆ 21 షరతుల్లో ముఖ్యంగా అక్రమంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకోవాలంటే చెల్లిం చాల్సిన ఫీజుతో పాటు, 33 శాతం మొత్తాన్ని పెనాల్టీగా చెల్లించాలి. వాస్తవంగా భవన నిర్మాణానికి 10 శాతం స్థలాన్ని వదిలి నిర్మాణం చేపట్టాలి. దీనికి విరుద్ధంగా భవనాలు నిర్మించడంతో అందుకు గాను 14 శాతం జరిమానా చెల్లించాలి. ఈ లెక్కన సుమారుగా రూ.7 కోట్ల మేర మున్సిపాలిటీకి చెల్లించాల్సి ఉంది. దీన్ని ఎగ్గొట్టేందుకు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విధించిన షరతులను పూర్తి చేయకపోగా, ఆ విభాగం పన్ను మినహాయింపునకు అనుమతి ఇచ్చిందంటూ క్రమబద్ధీకరణకు అధికార పక్షం కౌన్సిల్ అజెండాలో గత ఏప్రిల్ పెట్టి ఏక్షపక్షంగా ఆమోదించుకున్నారు. ఈ అంశానికి వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యులు, కౌన్సిలర్ ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు నాశిన నాగులు, మహేష్‌రెడ్డి, గిరిబాబు, రమీజా డీసెంట్ తెలిపారు. విపక్షం వ్యతిరేకించి, డీసెంట్ తెలిపిన ఈ అంశంపై చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు ప్రశ్నార్థకమయ్యాయి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి నాశిన నాగులు, పట్టణాధ్యక్షుడు బొమిడి శ్రీనివాసులులు, కౌన్సిలర్లు చోళవవరం గిరిబాబు, రమీజా జిల్లా కలెక్టర్, ఆర్జేడీలతో పాటు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేయడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. -
సాక్షి ఎఫెక్ట్ : ‘నారాయణ’ లో గంటా తనిఖీలు
సాక్షి, విశాఖపట్నం : చదువుల కోసం నారాయణ-చైతన్య కాలేజీల్లో చేరినవారు ఒక్కొక్కరుగా శవాలై ఇంటికి తిరిగొస్తుంటే ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం. గడిచిన మూడేళ్లలో ఆయా క్యాంపస్‌లలో ఏకంగా 38 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అనుమతులు లేకుండా హాస్టళ్లు నిర్వహిస్తూ, ర్యాంకుల కోసం విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోన్న యాజమాన్యాలే ఇందుకు బాధ్యత వహించాలని పెద్ద ఎత్తున డిమాండ్ సైతం వ్యక్తమైంది. నారాయణ-చైతన్య కాలేజీల్లో నానాటికీ పెరుగుతోన్న విద్యార్థుల ఆత్మహత్యలపై ‘సాక్షి’ పలు సంచలనాత్మక కథనాలను ప్రచురించింది. ఆ కథనాలతో ఇప్పుడు ప్రభుత్వంలో కొద్దిపాటి కదలిక వచ్చింది. గంటా ఆకస్మిక తనిఖీలు : వరుస ఆత్మహత్యల నేపథ్యంలో ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం విశాఖ నగరంలోని నారాయణ-చైతన్య హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కాలేజీలకు అనుబంధంగా కొనసాగుతోన్న ప్రైవేట్ హాస్టల్స్‌ను తనిఖీ చేసిన ఆయన.. వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. దానితోపాటు బోధన జరుగుతున్న తీరుపై ఆరాతీశారు. నిబంధనలు పాటించకపోతే ఎవ్వరినైన ఉపేక్షించబోమని అన్నారు. ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఆయన స్పందిస్తూ.. పిల్లల ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదని, అవసరమైతే కళాశాల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదుచేసేందుకు వెనుకాడబోమని చెప్పారు. ఈ నెల 16న రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో సమావేశం కాబోతున్నట్లు తెలిపారు. ఇంటర్ బోర్డ్ పేర్కొన్న నిబంధనలను అన్ని కళాశాలలు విధిగా అమలుచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. 158 హాస్టళ్లకు అసలు అనుమతేలేదు : విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని శుక్రవారం మొదటిసారి అంగీకరించిన మంత్రి గంటా.. 24 గంటలు తిరగకముందే నారాయణ కాలేజీల్లో తనిఖీలు చేయడం గమనార్హం. పి.నారాయణ ఏపీ మంత్రిగా కొనసాగుతున్న గడిచిన మూడేళ్లలో నారాయణ-చైతన్య కాలేజీలకు అనుబంధంగా.. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే దాదాపు 158 ప్రైవేట్ హాస్టళ్లు వెలిశాయి. దీనిపై ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క నోటీసు కూడా జారీ కాకపోవడం గమనార్హం. మంత్రులు గంటా, నారాయణలు వియ్యంకులన్న సంగతి తెలిసిందే. -
విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోరా?
-
వైఎస్సార్ జిల్లాలో విద్యాసంస్థల బంద్
-
‘నారాయణ’లో మరో ఆత్మ‘హత్య’!
కడప అర్బన్/చింతకొమ్మదిన్నె/కోటిరెడ్డి సర్కిల్: వైఎస్సార్ జిల్లా కడప నగర శివార్లలోని కృష్ణాపురంలో ఉన్న నారాయణ జూనియర్ కళాశాల బాలికల హాస్టల్ క్యాంపస్‌లో శుక్రవారం తెల్లవారుజా మున చెన్నూరు పావని (17) అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే కళాశాల సిబ్బంది మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించి పత్తాలే కుండా పోయారు. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు రిమ్స్‌కు చేరుకుని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. సిద్దవటం మండలం పేర య్యగారిపల్లెకు చెందిన పావని కృష్ణాపురం నారాయణ జూనియర్ కళాశాల క్యాంపస్‌లో ఇంటర్ (ఎంపీసీ) మొదటి ఏడాది చదువు తోంది. అదే క్యాంపస్‌లో ఉన్న హాస్టల్లోని ఒక గదిలో 12 మంది విద్యార్థినులతో కలసి ఉంటోంది. ఎంపీసీ క్లవర్ బ్యాచ్‌లో పావని టాప్ 10లో ఉంది. ఈ నేపథ్యంలో దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చిన పావని 4వ తేదీ సాయంత్రం కళాశాలకు వెళ్లింది. ఎప్పటి లాగే తోటి విద్యార్థులతో సరదాగా గడిపింది. గురువారం రాత్రి సహచర విద్యార్థినులతో కలిసి నిద్రపోయిన పావని.. శుక్రవారం తెల్లవారు జామున శవమై కనిపించింది. తోటి విద్యార్థులు సిబ్బందికి సమాచారం అందించడంతో వారు రిమ్స్‌కు తరలించారు. పావని అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో మృతదేహాన్ని మార్చురీలో ఉంచి, ఉదయం 5.45 గంటలకు మృతురాలి తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం అందించి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పావని అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు చింతకొమ్మదిన్నె పోలీసులు కేసు నమోదు చేశారు. రెండేళ్లలో ముగ్గురు.. సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కడప నగర శివారులోని కృష్ణాపురం నారాయణ బాలికల జూనియర్ కళాశాలలో ఇలాంటి సంఘటన జరగడం ఇది మూడోసారి. ఈ కళాశాల హాస్టల్లో 2015 ఆగస్టు 17వ తేదీ ఇంటర్ ఎంపీసీ చదువుతున్న నందిని, మనీషారెడ్డి ఒకే గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున కడపకు చెందిన పావని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయపడుతున్నారు. -
నారాయణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
-
నారాయణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
కడప: నారాయణ కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా కడపలో కృష్ణాపురంలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్న పావని(17) హాస్టల్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా బాకరాపేటకు చెందిన పావని గురువారం రాత్రి హాస్టల్లోని తన గదిలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పావని ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించడానికి వెళ్లిన బంధువలను నారాయణ కాలేజీ సెక్యురిటీ సిబ్బంది అడ్డుకుంది. విద్యార్థిని బంధువులను హాస్టల్లోకి యాజమాన్యం అనుమతించలేదు. యాజమాన్యం తీరుకు నిరసనగా హాస్టల్ ఎదుట బంధువలు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి ఎదుట పావని మృతదేహంతో బంధువులు నిరసన తెలిపి, కాలేజీ తీసుకొస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నారాయణ కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆత్మహత్యపై విచారణకు ఆదేశం విద్యార్థిని ఆత్మహత్యపై విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. విద్యార్థిని పావని మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్‌తో మాట్లాడారు. కళాశాల యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవ్వరి కళాశాల అయినా నిందితులపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. -
కొట్టి చంపేశారా?
♦ విజయవాడ ‘నారాయణ’ విద్యార్థి ఈశ్వర్‌రెడ్డి మృతిపై సందేహాలు ♦ కర్రలతో కొట్టినట్లు మృతదేహంపై ఆనవాళ్లు! ♦ కాలేజీలో ఆందోళనకు దిగిన విద్యార్థులు ♦ హఠాత్తుగా సెలవులు ప్రకటించిన యాజమాన్యం సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ శివారు గూడ వల్లిలో నారాయణ కాలేజీ విద్యార్థి ఈశ్వర్‌రెడ్డి అనుమానా స్పదస్థితిలో మృతి చెందిన ఘటనపై 24 గంటలు గడిచినా హత్యా..ఆత్మహత్యా? అనేది తేలకపోవటంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈశ్వర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నా డని కాలేజీ యాజమాన్యం చెబుతుండగా తమ బిడ్డను కర్రలతో కొట్టి చంపేశారని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపి స్తున్నారు. మరోవైపు తమ సహచరుడి అనుమానా స్పద మృతిపై నారాయణ విద్యార్థులు భగ్గుమన్నారు. కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోపోద్రిక్తులైన దాదాపు 1,700 మంది విద్యార్థులు ఆదివారం రాత్రి కాలేజీ భవనాల అద్దాలు, ఫర్నిచర్ «ధ్వంసం చేశారు. దీంతో కాలేజీ యాజమాన్యం అప్పటికప్పుడు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. విచారణకు విద్యార్థి సంఘాల డిమాండ్ ఈశ్వర్‌రెడ్డి అనుమానాస్పద మృతిపై న్యాయ విచారణ జరిపించాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఎస్ఎఫ్ఐ, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం తదితర సంఘాలు నారాయణ కాలేజీ వద్ద సోమవారం ఆందోళన నిర్వహించాయి. మంత్రి నారాయణను వెంటనే మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. విద్యార్థి మృతిపై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించాయి. నారాయణ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశాయి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు ఈశ్వర్‌రెడ్డి మృతిని అనుమానాస్పద మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని సీఐ శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ ప్రశ్నలకు బదులేది? ఈశ్వర్‌రెడ్డి ఆదివారం ఉదయం కూడా తరగతులకు హాజరయ్యాడు. మధ్యాహ్నం కాలేజీలో నిర్వహించిన వారంతపు పరీక్ష కూడా రాశాడు. అలాంటిది సాయంత్రం అయ్యేసరికి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? హాస్టల్ గదిలో ఉరివేసుకుంటుంటే సహ విద్యార్థులు గమనించరా? విద్యార్థులు అంతా తరగతి గదిలో ఉంటే ఈశ్వర్‌రెడ్డి ఒక్కడే హాస్టల్‌కు ఎందుకు వెళ్లాడు? ఓ విద్యార్థి తరగతి గదిలో లేకుంటే ప్రిన్సిపల్, అధ్యాపకులు, సూపర్వైజర్లు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నలకు కాలేజీ యాజమాన్యం సమాధానాలు చెప్పట్లేదు. సాయంత్రం 4.45 గంటలకు విద్యార్థి ఈశ్వర్‌రెడ్డి మృతి చెందినట్లు గుర్తించినా వెంటనే అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సహవిద్యార్థులు రాత్రి 8 గంటలకు ఫోన్ చేసి చెబితేనే ఈశ్వర్‌రెడ్డి తల్లిదండ్రులకు విషయం తెలిసింది. ఈశ్వర్‌రెడ్డి ఎలాంటి ఆత్మహత్య లేఖ రాయలేదని పోలీసులు చెబుతున్నారు. మరి అలాంటి లేఖ ఏదీ లేకుండానే ఆత్మహత్య అని ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారన్నది అంతుచిక్కుండా ఉంది. కొట్టి చంపారా? ఈశ్వర్‌రెడ్డి మృతదేహంపై కర్రలతో కొట్టిన గుర్తులు ఉండటం గమనార్హం. విద్యార్థిని కొట్టి చంపారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలేజీ నిర్వాహకుల్లో ఒకరు కొట్టారని కొందరు విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ వాస్తవం బయటపడదు. మా అబ్బాయిని హత్య చేశారు: తల్లిదండ్రులు మా అబ్బాయిని కర్రలతో కొట్టి చంపారు. ఒంటి మీద కర్రలతో కొట్టిన వాతలు స్పష్టంగా ఉన్నాయి. చదువులో చురుగ్గానే ఉండేవాడు. మా బిడ్డ ఆత్మహత్మ చేసుకునేంత పిరికివాడు కాదు. – మల్లారెడ్డి, మంగమ్మ (ఈశ్వర్‌రెడ్డి తల్లిదండ్రులు) -
నారాయణ కాలేజిలో ఇంటర్ విద్యార్ధి సూసైడ్
-
నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య.
-
‘నారాయణ’ విద్యార్థి ఆత్మహత్య
గన్నవరం: ర్యాంకుల కోసం సాగిస్తున్న వేధింపులకు నారాయణ కాలేజీలో మరో విద్యార్థి బలయ్యాడు. వారాంతపు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని అధ్యాపకులు చితకబాదడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా గూడవల్లిలోని నారాయణ క్యాంపస్‌లో ఆదివారం ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. విద్యార్థుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం మంచికల్లుకు చెందిన పి.ఈశ్వర్‌రెడ్డి(15) గూడవల్లి నారాయణ క్యాంపస్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం జరిగిన వారంతపు పరీక్షల్లో ఈశ్వర్‌రెడ్డికి తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో విద్యార్థులందరి ముందు ఈశ్వర్‌రెడ్డిని అధ్యాపకులు తీవ్రంగా కొట్టారు. మనస్తాపానికి గురైన ఈశ్వర్‌రెడ్డి మధ్యాహ్నం క్లాస్‌కు వెళ్లకుండా హాస్టల్ గదిలోనే ఉండిపోయాడు. సాయంత్రం రూమ్‌కి తిరిగివచ్చిన సహచర విద్యార్థులు.. ఫ్యాన్‌కు వేలాడుతున్న ఈశ్వర్‌రెడ్డిని గుర్తించి వెంటనే అధ్యాపకులకు సమాచారమిచ్చారు. చికిత్స కోసమంటూ వారు అతణ్ణి ఎనికేపాడు సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఈశ్వర్‌రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మంత్రి నారాయణకు చెందిన కాలేజీ కావడంతో ఈ విషయం బయటకు రాకుండా సిబ్బంది గోప్యత పాటించారు. కనీసం విద్యార్థి తల్లిదండ్రులకు కూడా ఆదివారం రాత్రి వరకు సమాచారమివ్వలేదు. ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి పడినట్లుగా వారికి వివరించారు. కానీ సహచర విద్యార్థులను మీడియా ఆరా తీయగా.. ఈశ్వర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తేలింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విద్యార్థుల నుంచి ప్రాథమిక సమాచారం సేకరించారు. కాగా, విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాలు కామినేని ఆస్పత్రికి చేరుకుని ఆందోళన నిర్వహించాయి. -
‘నారాయణ’ విద్యార్థి ఆత్మహత్య
-
నారాయణ..నారాయణ.!
♦ నారాయణ కళాశాలలో ♦ విద్యార్థులను చితకబాదిన వైనం ♦ విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన చింతకొమ్మదిన్నె : నారాయణ విద్యా సంస్థల్లో రోజురోజుకు విద్యార్థుల పట్ల దండన తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. వారి దండన ఫైబర్ లాఠీలతో మొదలై విద్యార్థుల చేతులు విరిగే స్థాయికి చేరుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆదివారం వెలుగు చూసింది. తల్లిదండ్రులు, విద్యార్థుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చింతకొమ్మదిన్నె మండలం కడప–పులివెందుల రహదారిలో కృష్ణాపురంలోని కేఎస్ఆర్ఎం కళాశాల ఎదురుగా నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి విడివిడిగా బాలురు, బాలికల హాస్టళ్లు ఉన్నాయి. అక్కడే విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యను అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో ఎర్రగుంట్లకు చెందిన కృష్ణారెడ్డి కుమారుడు త్రినేత్రకుమార్రెడ్డితోపాటు సుమంత్ కుమార్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డిలు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో చదువుతున్నారు. గత శుక్రవారం అనవసరంగా మాట్లాడుతున్నారని వీరిపై జూనియర్ విద్యార్థులు ఫిర్యాదు చేశారనే నెపంతో ఓ అధ్యాపకుడు, డీజీఎం రామ్మోహన్‌రెడ్డిలు వీరిని కార్యాలయంలోకి పిలిచి ఒకసారి, మరోసారి విద్యార్థులందరి ముందు తమ దగ్గరున్న ఫైబర్ లాఠీలతో చితకబాదారు. ఈ సంఘటనలో త్రినేత్రకుమార్‌రెడ్డి ఎడమ చేయి కాస్త విరిగింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో త్రినేత్రకుమార్‌రెడ్డి చికిత్స చేయించి కట్టు కట్టించారు. అంతేగాకుండా సుమంత్‌కుమార్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డిల చేతులు, కాళ్లకు తీవ్ర స్థాయిలో వాతలు పడ్డాయి. ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రులు ఆదివారం రోజు వారి పిల్లలను చూసేందుకు వచ్చిన సమయంలో బయటపడింది. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనతో అధ్యాపకులను ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. అయితే సంబంధిత అధ్యాపకులు కనీసం సంఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించేందుకు కూడా ముందుకు రాలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలను పోలీసుల మాదిరిగా ఫైబర్ లాఠీలతో కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సంబంధిత అధ్యాపకులపై, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కళాశాల ఆవరణంలో ఆందోళన చేశారు. ఆందోళన సమయంలో హుటాహుటిన అక్కడికి వచ్చిన ఎస్ఐ హేమకుమార్, తమ సిబ్బందితో కలిసి పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. బాధ్యులపై ఫిర్యాదు చేయాలని కేసు నమోదు చేస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కనుమరుగైన మనీష, నందినిల అనుమానాస్పద మృతి కేసు చింతకొమ్మదిన్నె పోలీసు స్టేషన్ పరిధిలోనే ఇదే క్యాంపస్‌లో 2015 ఆగస్టు 16వ తేదీన జూనియర్ ఇంటర్ విద్యార్థులు నందిని, మనీషాలు తమ హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వం, సీబీసీఐడీతోపాటు మానవ హక్కుల కమిషన్, ఇతర అధికారులు హడావుడి చేసి అప్పట్లో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. ఆ కేసు వ్యవహారం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. మొత్తానికి నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థులపై జరుగుతున్న దాష్టీకంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. -
నారాయణ విద్యాసంస్థలో విద్యార్ధిని అత్మహత్య
-
నారాయణ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
కర్నూలు: కర్నూలు జిల్లాలోని నన్నూరు నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రొద్దుటూరుకు చెందిన శ్రీహర్ష ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాడు. చదువుకోవాలని ఉపాధ్యాయులు పెట్టడంతో ఒత్తిడి తట్టుకోలేక శనివారం ఉదయం కళాశాల భవనం ఎక్కి కిందకు దూకాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. విద్యార్థి కాలు, చేయి విరిగినట్లు సమాచారం. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్ది సంఘాలు కాలేజీ దగ్గర ఆందోళనకు దిగాయి. -
‘నారాయణ’కు తలొగ్గారు
పక్కదారి పట్టిన విద్యార్థులపై దాడి ఘటన ఆర్ఐఓ విచారణలో వాస్తవాలు కనుమరుగు అల్లరి చేశారనే నెపంతోనే కొట్టినట్లు చెప్పిన కళాశాల యాజమాన్యం అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యార్థులపై నారాయణ కళాశాల యాజమాన్యం దాడి ఘటన విచారణ పక్కదారి పట్టింది. ఘటనపై ఆర్ఐఓ సురేష్‌బాబు శుక్రవారం కళాశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. విద్యార్థులు, కళాశాల యాజమాన్యంతో విడివిడిగా మాట్లాడారు. యాజమాన్యం ఒత్తిళ్లకు విద్యార్థుల తల్లిదండ్రులు, బాధిత విద్యార్థులు తలొగ్గడంతో వాస్తవాలు కనుమరుగయ్యాయి. వివరాల్లోకి వెళితే.. స్థానిక టీవీటవర్ సమీపంలో ఉన్న నారాయణ కళాశాలలో మౌలిక వసతులపై ప్రశ్నించిన పాపానికి ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సతీష్, జీవన్, అరుణ్‌ల ఒంటిపై వాతలు పడేలా చావబాదారు. హాస్టల్లో వసతులు చాలా అధ్వానంగా ఉన్నాయని, మెస్‌లో అన్నం తినలేకున్నామని, కుళ్లిన కూరగాయలతో కూరలు చేస్తున్నారని, బాత్రూంలు లేవని, మరుగుదొడ్లలో స్నానం చేయాల్సిన దుస్థితి అని ముందురోజు స్వయంగా విద్యార్థులు మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. చివరకు పోలీసులకు వీటిపైనే ఫిర్యాదు చేశారు. అయితే రోజు గడిచేలోగా ఏమి జరిగిందో ఏమో కాని మొత్తం సీను రివర్సయింది. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులపై యాజమాన్యం తీవ్రస్థాయిలో ఒత్తిడి చేసినట్లు తెలిసింది. తమ పిల్లలకే ఇబ్బంది కల్గుతుందనే భయంతో తల్లిదండ్రులు రాజీకొచ్చినట్లు సమాచారం. దీంతో విచారణాధికారి ఎదుట వాస్తవాలు కప్పి పుచ్చుతూ ఘటన జరిగిన రోజు రాత్రి కరెంటు పోయిన సమయంలో అల్లరి చేస్తుండడంతో ప్రిన్సిపల్, ఇన్‌చార్జ్‌ల వచ్చి మందలించే క్రమంలో కొట్టారని వివరించారు. యాజమాన్యం కూడా ఇదే విధమైన వివరణ ఇచ్చింది. ఈ నివేదికను ఇంటర్ విద్య కమిషనర్‌కు పంపనున్నట్లు ఆర్ఐఓ తెలిపారు. -
నారాయణ కళాశాలలో దాష్టీకం
వసతులపై ప్రశ్నించిన విద్యార్థులను చితకబాదిన వైనం – ప్రిన్సిపాల్, ఇన్‌చార్జ్‌లు మద్యం మత్తులో కొట్టారని ఆరోపణ – దెబ్బలు భరించలేక రోడ్డెక్కిన విద్యార్థులు అనంతపురం ఎడ్యుకేషన్ : నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో మౌలిక వసతులపై ప్రశ్నించిన పాపానికి ఒంటిపై వాతలు పడేలా చావబాదిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. బాధిత విద్యార్థులు తెలిపిన మేరకు వివరాలిలా.. నగరంలోని టీవీ టవర్ సమీపంలో ఉన్న నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో సతీష్, జీవన్, అరుణ్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. హాస్టల్లో వసతులు చాలా అధ్వానంగా ఉన్నాయని, మెస్‌లో అన్నం తినలేని పరిస్థితి ఉందంటూ విద్యార్థులు బుధవారం యాజమాన్యాన్ని ప్రశ్నించారు. కుళ్లిన కూరగాయలతో కూరలు చేస్తున్నారని, బాత్రూంలు లేవని, మరుగుదొడ్లలో స్నానం చేయాల్సిన దుస్థితి అని వాపోయారు. వీరి ముగ్గురితో పాటు మరికొందరు విద్యార్థులు ఇవే సమస్యలను లేవనెత్తారు. అయితే రాత్రి 10.30 గంటల సమయంలో మద్యంమత్తులోని ప్రిన్సిపాల్ శిఖామణి, ఇన్‌చార్జ్‌లు భవాని, శ్రీనివాసరెడ్డి విద్యార్థులు సతీష్, జీవన్, అరుణ్‌లను కట్టెలతో చితక్కొట్టారు. మమ్మల్నే ప్రశ్నిస్తారా? అంటూ దాడి చేసినట్లు విద్యార్థులు కన్నీటి ³పర్యంతమయ్యారు. విషయం బయటకు చెబితే టీసీ ఇచ్చి పంపుతామని.. బయట ఏ కళాశాలలోనూ చేర్చుకోకుండా చేస్తామంటూ భయపెట్టారు. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపిన విద్యార్థులు గురువారం ఉదయం సమాచారాన్ని మీడియా, విద్యార్థి సంఘాలకు చేరవేశారు. కళాశాలకు చేరుకున్న మీడియా, విద్యార్థి సంఘాలు విద్యార్థులను పరిశీలించగా కందిపోయిన దెబ్బలు కనిపించాయి. కళాశాలలో చాలా హీనంగా చూస్తున్నారని, తల్లిదండ్రులు బాధపడతారనే ఉద్దేశంతో బయటకు చెప్పలేకపోతున్నట్లు విద్యార్థులు వాపోయారు. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థి నేతలకు పోలీసులు సర్దిచెప్పారు. బాధిత విద్యార్థుల నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం వ్యవహారంపై ప్రిన్సిపాల్ శిఖామణిని వివరణ కోరగా పిల్లలు అల్లరి చేస్తుండటంతో మందలించామన్నారు. -
ఔటింగ్ కోసం ఫైటింగ్!
- ఔటింగ్ ఇవ్వకపోవడంతో నారాయణ విద్యార్థుల ఆగ్రహం - హాస్టల్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం - పోలీసులపైకి రాళ్లు విసిరిన వైనం - సెలవులు ప్రకటించిన యాజమాన్యం.. - ఇళ్లకు వెళ్లిపోయిన విద్యార్థులు హైదరాబాద్: విద్యార్థులు విధ్వంసం సృష్టించారు. సెలవులు ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫర్నిచర్‌కు నిప్పు పెట్టారు. రెండు గంటలపాటు పోలీసులను సైతం హాస్టల్లోనికి రానీయకుండా రాళ్లు, అద్దాలను విసిరివేశారు. పోలీసులు ప్రిన్సిపాల్‌ను రప్పించి విద్యార్థులకు సెలవు ప్రకటించడంతో ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ విద్యార్థులంతా ఇంటిబాట పట్టారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ నిజాంపేట రోడ్డులోని నారాయణ కళాశాలలో చోటు చేసుకుంది. సుమారు 4 వందల మంది విద్యార్థులు కాలేజీ హాస్టల్లో ఉంటున్నారు. హోమ్‌సిక్‌లో భాగంగా సెలవులు, ఆదివారంతోపాటు రెండు రోజుల రంజాన్ సెలవులున్నా యాజమాన్యం ఔటింగ్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి, ఆగ్రహానికి లోనయ్యారు. మంగళవారం రాత్రి భోజనాలు ముగిసిన తరువాత అర్ధరాత్రి హాస్టల్ సిబ్బందిని సమస్యల పేరుతో ఒక గదిలోకి పిలిచి తాళం వేశారు. ఔటింగ్ ఇవ్వకపోవడమే ప్రధాన కారణంగా పేర్కొంటూ విద్యార్థులందరూ ఒక్కసారిగా విధ్వంసానికి దిగారు. ఫర్నిచర్, కుర్చీలు, బెంచీలు, కిటీకీల అద్దాలు, తలుపులు, లైట్లు ధ్వంసం చేశారు. మూడు ఫ్లోర్లలోని హాçస్టల్ గదులతో పాటు మెస్‌పైనా దాడి చేశారు. మంచినీటి ట్యాంక్‌లను సైతం ధ్వంసం చేశారు. బెంబేలెత్తిన సిబ్బంది సెల్ఫోన్ల ద్వారా పోలీసులకు, యాజమాన్యానికి సమాచారం చేరవేశారు. కేపీహెచ్‌బీ పోలీసులు హుటాహుటిన హాస్టల్ భవనం వద్దకు చేరుకున్నారు. మైక్‌లతో విద్యార్థులను పోలీసులు హెచ్చరించినప్పటికీ పట్టించుకోకుండా వారిపైకి రాళ్లు, అద్దం ముక్కలను విసిరివేశారు. వందల మంది విద్యార్థులు గట్టిగా నినాదాలు చేస్తూ విధ్వంసానికి పాల్పడటంతో స్థానికంగా ఉన్న కాలనీవాసులు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల సెక్యూరిటీ సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్‌తోపాటు పలువురు ప్రతినిధులను పోలీసులు రప్పించి విద్యార్థులకు సెలవులు ఇప్పించి ఇళ్లకు పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది. కొన్ని గదులలో మంటలు, పొగలు రావడంతో అగ్ని ప్రమాదం చోటుచేసుకోకుండా నీళ్లు పోసి అదుపుచేశారు. రాత్రి రెండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ అడిషనల్ డీసీపీ శ్రీనివాసరెడ్డి, కేపీహెచ్‌బీ సీఐ కుషాల్కర్‌లతోపాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది అక్కడే ఉండి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. హాస్టల్లోని పరిస్థితులు జైలును తలపించినట్లుగా ఉన్నాయని, అందుకే విద్యార్థులు తిరగబడ్డారని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. గతంలోనూ ఒకసారి ఇదే హాస్టల్లో విధ్వంసం జరిగినట్లు గుర్తుచేశారు. -
విద్యార్థిని అదృశ్యం
కర్నూలు: కలెక్టరేట్లో రికార్డు అసిస్టెంట్‌గా పని చేస్తున్న విజయభవాని కూతురు కీర్తిశ్రీ (16) అదృశ్యమైంది. విజయభవాని భర్త శ్రీనివాసులు నాలుగు సంవత్సరాల క్రితం మృతి చెందాడు. వీరికి ముగ్గురు సంతానం. కీర్తిశ్రీ..నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరు లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈనెల 7వ తేదీన ఉదయం 9.30 గంటల సమయంలో బయటికి వెళ్తున్నట్లు తల్లికి చెప్పి కీర్తిశ్రీ ఇంతవరకు ఇంటికి రాలేదు. కూతురు కోసం కర్నూలుతో పాటు చుట్టుముట్టు గ్రామాల్లో స్నేహితులు, బంధువుల వద్ద ఆరా తీసినా కనిపించలేదు. కనిపించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అరోరనగర్కు చెందిన తేజ యువకుడిపై అనుమానం ఉన్నట్లు సోమవారం మూడో పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇంటి నుంచి బయటికి వెళ్లేటపుడు గ్రీన్ టాప్, బ్లాక్ లోయర్ ధరించింది. ఐదు అడుగుల ఎత్తు, తెలుపు వర్ణం ఉంటుంది. ఆచూకీ తెలిస్తే 78422 73868 లేదా 94406 27735కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సీఐ శ్రీనివాసరావు కోరారు. -
'నారాయణ' విద్యార్థి అదృశ్యం
హైదరాబాద్: నారాయణ కళాశాలలో ఇంటర్ విద్యార్థి అదృశ్యమైన సంఘటన కలకలం రేపుతోంది. నల్లగొండ జిల్లా హాలియ పట్టణానికి చెందిన గౌరీశంకర్ మాదాపూర్‌లోని నారాయణ సమతా క్యాంపస్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో గత మూడు రోజులుగా గౌరీ శంకర్ కనిపించడం లేదు. అయినా కాలేజ్ యాజమాన్యం పట్టించుకోలేదు..విద్యార్థి అదృశ్యంపై తల్లిదండ్రులకు కనీస సమాచారం ఇవ్వలేదు. కాగా తోటి విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. తమ కుమారుడి ఆచూకీ తెలయజేయాలని కోరుతూ విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు. -
అనంతలో నారాయణ కాలేజీ నిర్వాకం
-
కుప్పకూలిన నారాయణ కాలేజీభవనం
-
నారాయణలో చేర్పించొద్దు
సదుం: పదో తరగతి పూర్తయిన విద్యార్థులను నారాయణ కళాశాలలో చేర్పించవద్దంటూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు సోమవారం సదుంలో కరపత్రాలు పంచారు. ఆరు నెలల కాలంలో తిరుపతి నారాయణ విద్యాసంస్థల్లో 13 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. కళాశాలలో విద్యార్థులను వేధింపులకు, ఒత్తిడికి గురుచేస్తుండటమే ఇందుకు కారణమన్నారు. ఎంతో మంది మధ్యతరగతి కుటుంబాల వారు తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం లక్షలాది రూపాయలు అప్పు చేసి మంచి చదువులు చదివించాలని ఆశపడితే, వారి ప్రాణాలు హరించేలా విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రవర్తించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా సంయుక్త కార్యదర్శి బావాజీ, పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జి మదన్ పాల్గొన్నారు. నారాయణ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి రొంపిచెర్ల: విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంటున్న నారాయణ విద్యా సంస్థల గుర్తింపును ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఎన్ఎస్యూఐ జిల్లా ఉపాధ్యక్షుడు వసీం అక్రమ్ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల్లో వేధింపుల వల్లే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర మంత్రిగా ఉన్న నారాయణ నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలన్నారు. ఒక ఏడాదిలోనే నారాయణ విద్యా సంస్థల్లో 14 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. విచారణ చేపట్టి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతి నారాయణ విద్యా సంస్థలో సోమవారం కూడా ఒక విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయాన్ని గుర్తు చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరగకపోతే డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. -
‘నారాయణ’ విద్యార్థుల ఆచూకీ లభ్యం
హిమాలయాలకు వెళ్తుండగా మధ్యప్రదేశ్‌లో పట్టుకున్న పోలీసులు అనంతపురం సెంట్రల్ : ఒత్తిడి తట్టుకోలేక.. బడి ఎగ్గొట్టి... హిమాలయాలకు బయలుదేరిన ‘నారాయణ స్కూల్’ విద్యార్థులను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ పట్టణ రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా విద్యార్థుల ఆచూకీని కనుగొన్నట్లు అనంతపురం మూడో పట్టన సీఐ వెంకటేశులు తెలిపారు. రైల్వే పోలీసుల సహకారంతో తీసుకొని వారిని పట్టుకున్నారు. అనంతపురం మూడో రోడ్డుకు చెందిన విద్యార్థులు ప్రణవ్ దీక్షిత్, షమీర్ మంగళవారం రాత్రి ఇంటి నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. ఇక్కడి నారాయణ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రణవ్‌దీక్షిత్, సెయింట్ థామస్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదివే షమీర్‌ఖాన్ మంచి స్నేహితులు. గతంలో ఇద్దరూ నారాయణ స్కూల్ ఒకే తరగతిలో చదువుకున్నారు. ప్రస్తుతం కూడా నారాయణ స్కూల్లో యోగా నేర్చుకుంటున్నారు. అయితే మంగళవారం రాత్రి లేఖ రాసి మరీ ఇంటి నుంచి పారిపోయారు. ఉదయం లేచినప్పటి నుంచి యోగాపైనే ధ్యాస పెట్టిన విద్యార్థులు నిత్యం ఆన్లైన్లో యోగా గురువుల ఉపన్యాసాలు వింటూ ఉండేవారు. ఈ నేపథ్యంలో హిమాలయాలకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. మంగళవారం రాత్రి అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌లో సైకిళ్లు పెట్టి వెళ్లిపోయారు. వారి ఆచూకీ తెలియలేదు. బుధవారం రాత్రి విద్యార్థుల్లో ఒకరు తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. వెంటనే సెల్‌ఫోన్ నెంబర్ ఆధారంగా సిగ్నల్‌ను గుర్తించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెళ్తున్నట్లు కనుగొన్నారు. వెంటనే స్థానిక రైల్వే సీఐ వినోద్‌కుమార్ సహకారంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీ రైల్వే పోలీసులతో మాట్లాడారు. రైల్లో ఇద్దరు విద్యార్థులు వస్తున్నట్లు తెలిపారు. నిఘా పెట్టిన అక్కడి పోలీసులు విద్యార్థులను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం ఇక్కడి పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థుల తల్లిదండ్రుల బంధువులను, కొంతమంది పోలీసులను పంపి జిల్లాకు తీసుకొస్తున్నారు. శుక్రవారం అధికారికంగా విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పజెప్పనున్నట్లు త్రీటౌన్ సీఐ వెంకటేశులు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే తక్షణం స్పందించడం ద్వారా ఆచూకీని త్వరితగతిన కనుగొనగలిగామని సీఐ అన్నారు. -
నారాయణ విద్యాసంస్థలో దారుణం
-
విద్యార్థి తండ్రిపై కళాశాల సిబ్బంది దాడి
నాగోలు(హైదరాబాద్‌సిటీ): టిఫిన్ కోసం బయటకు వెళ్లిన విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్‌ను అడగటానికి వెళ్లిన తండ్రిపై కూడా దౌర్జన్యం చేయడంతో బాధితులు ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం... కర్నూలుకు చెందిన కె.వంశీ బండ్లగూడ నారాయణ కళాశాలలో లాంగ్‌టర్మ్‌లో మెడిసిన్ కోచింగ్ తీసుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం వంశీ టిఫిన్ కోసం బయటకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ వెంకట్ విద్యార్థి వంశీని గదిలో బంధించి చితకబాదాడు. ఈ విషయం వంశీ తన తండ్రి కె.నర్సింహుడుకు చెప్పగా ఆదివారం వచ్చి సంఘటనపై ప్రిన్సిపాల్ వెంకట్‌ను అడిగారు. వివరాలు అడుగుతున్న తండ్రిపై కూడా కళాశాల సిబ్బంది దౌర్జన్యం చేసి దాడికి యత్నించారు. దీంతో బాధితులు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అవమాన భారం.. విద్యార్థిని బలవన్మరణం
హైదరాబాద్: గుంటూరులో ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న పీజీ వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఉదంతం మరువకముందే మరో ఘటన నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. తోటి విద్యార్థుల ముందు ఓ లెక్చరర్ దూషించి, అవమాన పరచడంతో ఎస్ఆర్నగర్లోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న సనత్‌నగర్ పోలీసులు సదరు లెక్చరర్‌తో పాటు కళాశాల ప్రిన్సిపాల్‌ను నిందితులుగా చేర్చారు. ఆది నుంచీ చదువుల తల్లే... మోతీనగర్‌లో నివసించే ఎల్లయ్య, అలివేలు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఎల్లయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అలివేలు గృహిణి. వీరి రెండో సంతానమైన శ్రీవర్ష(17) ఎస్ఆర్నగర్లోని నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతోంది. చదువంటే ప్రాణంగా భావించే శ్రీవర్ష పదో తరగతిలో 8.5 జీపీఏ, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 92 శాతం మార్కులు సాధించింది. అనారోగ్యం కారణంగా ఇటీవల కొన్ని రోజుల పాటు కళాశాలకు వెళ్లలేకపోరుుంది. ఫిజిక్స్ లెక్చరర్ ప్రవర్తనతో విసిగి... అనారోగ్యం తరువాత కోలుకున్న శ్రీవర్ష ఈ నెల 12న కళాశాలకు వెళ్లింది. ఫిజిక్స్ లెక్చరర్ ప్రేమ్‌కుమార్ తరగతి గదిలోనే తోటి విద్యార్థుల ముందు శ్రీవర్ష పట్ల అవమానకరంగా మాట్లాడాడు. పక్కన కూర్చో బెట్టుకుని మరీ అందరి ముందూ పరుష పదజా లంతో దూషించాడు. ‘కళాశాలకు ఎందుకొస్తావ్... పరీక్ష ఎందుకు రాయలేదు.. నీ లాంటి వాళ్ల వల్లే కళాశాలకు చెడ్డ పేరు వస్తోంది... టీసీ ఇచ్చి పంపించేస్తాం’అంటూ బెదిరించాడు. ఆ నాటి నుంచి తీవ్ర మానసిక క్షోభకు గురైన విద్యార్థిని కళాశాలకు వెళ్లడం మానేసింది. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో ఇంటి హాల్లో పైకప్పు రెరుులింగ్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి నిద్రలేచిన కుటుంబ సభ్యులకు శ్రీవర్ష వేలాడుతూ కనిపించింది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సనత్‌నగర్ పోలీసులు ఐపీసీ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించేలా వ్యవహరించడం) కింద లెక్చరర్ ప్రేమ్‌కుమార్‌తో పాటు కళాశాల ప్రిన్సిపాల్ ఉమపై కేసు నమోదు చేశారు. ఫీజులు ఇస్తా... నా కూతుర్ని తిరిగిస్తారా - శ్రీవర్ష తల్లి అలివేలు లెక్చరర్ తీవ్రంగా అవమానించడం వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని శ్రీవర్ష తల్లి అలివేలు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ చెప్పారు. కళాశాల ఫీజు చెల్లించడం ఆలస్యమైతే మాత్రం అందుకు కారణాలను తరగతి గదిలో రాతపూర్వకంగా రారుుంచుకునే యాజమాన్యం విద్యార్థుల బాగోగులు పట్టించుకోదంటూ ఆమె మండిపడ్డారు. ఫీజులు చెల్లిస్తాం... నా కుమార్తెను తీసుకువస్తారా? అంటూ ఏడవటం అక్కడివారిని కలచివేసింది. ఈ దుస్థితి ఎవరికీ రాకూడదు - శ్రీవర్ష తండ్రి ఎల్లయ్య ఇలాంటి కడుపు కోత మరెవ్వరికీ రాకుండా ఉండాలంటే వేధింపులకు పాల్పడుతున్న నారాయణ కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీవర్ష తండ్రి ఎల్లయ్య డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని, అప్పుడు ప్రభుత్వం స్పందించి ఉంటే ఇప్పుడు తమకు ఈ కడుపుకోత ఉండేది కాదంటూ విలపించారు. కళాశాలను మూసివేయాలి - బాలల హక్కుల సంఘం లెక్చరర్ అవమానపరచడంతో మానసిక ఒత్తిడికి గురైన శ్రీవర్ష బలవన్మరణానికి పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడైందని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు పేర్కొన్నారు. లెక్చరర్ ప్రేమ్‌కుమార్‌తో పాటు ప్రిన్సిపాల్ ఉమను అరెస్టు చేసి, నారాయణ కళాశాలను మూసివేయాలని ఆమె డిమాండ్ చేశారు. లెక్చరర్‌ను అరెస్టు చేసి ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. శ్రీవర్ష ఆత్మహత్య చేసుకునేలా నారాయణ కళాశాల సిబ్బంది వ్యవహరించడాన్ని యువజన కాంగ్రెస్ తప్పుబట్టింది. -
నారాయణ కళాశాల విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: ఎస్ఆర్ నగర్‌లోని నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కళాశాల యాజమాన్యమే ఇందుకు కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మోతీనగర్‌కు చెందిన శ్రీవర్ష(17) ఎస్సార్‌నగర్‌లోని నారాయణ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ సెకండియర్ చదువుకుంటోంది. శుక్రవారం ఉదయం ఆమె ఉరి వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పరీక్షలకు హాజరు కాలేదనే కారణంతో ఫిజిక్స్ లెక్చరర్ ప్రేమ్‌కుమార్ తోటి విద్యార్థుల ఎదుట తిట్టాడని, అవమానంగా భావించిన తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఫీజు చెల్లించటం ఆలస్యమైతే చాలు.. విద్యార్థులను గదిలోకి పిలిపించుకుని రాత పూర్వక హామీ తీసుకునే యాజమాన్యం, వారి బాగోగులు మాత్రం పట్టించుకోలేదని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. సనత్‌నగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కళాశాల భవనంపై నుంచి పడిన విద్యార్థి
హైదరాబాద్: ఓ విద్యార్థి కళాశాల భవనంపైనుంచి పడి తీవ్రంగా గాయపడగా.. విషయం తెలిసిన అతని తల్లి కోమాలోకి వెళ్లింది. ఈ ఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక చెరుకుతోట కాలనీలో ఉన్న నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థి మనోహర్‌కుమార్(17) శుక్రవారం మధ్యాహ్నం కళాశాల భవనం పైనుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే కొత్తపల్లిలోని ఓమ్ని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అతడి తల్లి కోమాలోకి వెళ్లింది. ఆమెను కూడా వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నారాయణ కళాశాల విద్యార్థి ఆత్మహత్య
-
నారాయణ కళాశాల విద్యార్థి ఆత్మహత్య
♦ చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఘటన ♦ అధ్యాపకుల ఒత్తిళ్లే కారణమనే ఆరోపణలు ♦ ఫర్నిచర్ ధ్వంసం చేసిన విద్యార్థులు ♦ జాతీయ రహదారిపై రాస్తారోకో రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంట చెక్‌పోస్టు సమీపంలోని నారాయణ కళాశాలలో ఆదివారం రాత్రి కమలేష్ (16) అనే ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి 10.30 గంటల తర్వాత ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు కళాశాలలో ఆందోళనకు దిగారు. చదువు విషయంలో అధ్యాపకుల ఒత్తిళ్ల కారణంగానే కమలేష్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ఆరోపించారు. పోలీసుల కథనం మేరకు.. పలమనేరుకు చెందిన కమలేష్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల వరకు స్టడీ అవర్‌లో సహచర విద్యార్థులతో కలసి చదువుకున్నాడు. తర్వాత హాస్టల్లోని తన గదికి వెళ్లిన కమలేష్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. దీన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. యాజమాన్యం కమలేష్‌ను తిరుపతి సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతిచెందాడు. అయితే ఈ ఘటనను బయటకు పొక్కనీయకుండా కళాశాల యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంది. రాత్రి పొద్దుపోయిన తర్వాత విషయం తెలుసుకున్న విద్యార్థులు ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపైకి చేరుకుని ధర్నాకు దిగారు. వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. కళాశాల యాజమాన్యం కమలేష్ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంలో ఆలస్యం చేసినట్లు విద్యార్థులు ఆరోపించారు. ఎస్ఐ మధుసూదన్ రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కాలేజీలో స్టూడెంట్స్ బైకులు దగ్ధం
-
'చనిపోయాడని చెప్పకుండా కనిపించడం లేదని చెప్పారు'
చనిపోయిన 10 గంటల తరువాత విషయం చెప్పారు న్యాయం అడిగితే పోలీసులతో అడ్డుకున్నారు అనుమతులు లేకుండా నాలుగేళ్లుగా పాఠశాల నిర్వహణ న్యాయం చేయాలంటూ హాస్టల్ ఎదుట మృతుని బంధువుల ధర్నా గుంటూరు రూరల్ : ‘‘మా కొడుకు చనిపోయాడని చెప్పకుండా కనిపించడం లేదని చెప్పారు. మరో రెండు గంటల తరువాత చనిపోయాడని చెప్పారు. కేవలం నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే మా కొడుకు చనిపోయాడు’’ అని అమరనాథ్ తండ్రి, బంధువులు ఆరోపించారు. గురజాల మండలం మాడుగుల గ్రామానికి చెందిన కంచుపాటి శ్రీనివాసరావు, తిరుపతమ్మలకు లేక లేక కలిగిన కుమారుడు అమరనాథ్(14) నారాయణ పాఠశాలలో పొత్తూరు క్యాంపస్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. శ్రీనివాసరావు తమ్ముడు రామకోటయ్యకు సైతం పిల్లలు లేకపోవడంతో రెండు కుటుంబాలకు ఒక్కగానొక్క కొడుకు ఇతడే. అందుకే మంచి స్కూల్లో వేసి బాగా చదివించుకోవాలని పొత్తూరు గ్రామ పంచాయితీ పరిధిలో ఒక అపార్ట్మెంట్లో నిర్వహిస్తున్న నారాయణ విద్యా సంస్థల పాఠశాలలో చేర్చారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఘటన జరిగిన తరువాత సైతం పాఠశాల యాజమాన్యం సాయంత్రం 6 గంటల సమయలలో అమరనాథ్ పాఠశాల ఫీజు చెల్లించాలని బకాయి ఉందని తనకు ఫోన్ చేశారని మృతుని తండ్రి తెలిపారు. అప్పుడే చెప్పినా తన కొడుకును చూసుకునే వాడినని, అర్థరాత్రి వరకూ దిక్కు లేకుండా పొలాల్లో అనాథ శవంలా వదిలేశారని భోరున విలపించాడు. ఫీజుకోసం ఫోన్ చేసిన అనంతరం మరో గంటకు మీ కొడుకు కనిపించడం లేదని చెప్పారని, మరో రెండు గంటల తర్వాత గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్నాడని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారన్నారు. తమ కుమారుడి మృతికి కారణాలు చెప్పాలని సోమవారం ఉదయం 5 గంటల నుంచి పాఠశాల ఎదుట బైఠాయించినా సమాధానం లేదని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ పాఠశాలలోకి చొచ్చుకుని వెళ్లి కార్యాలయం తలుపు అద్దాలను పగుల గొట్టారు. దీంతో స్పందించిన యాజమాన్యం దిగి వచ్చి, తమకు సంబంధం లేదని అమరనాథ్ తన స్నేహితులు ముగ్గురితో కలిసి వెళ్లి ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ పడిపోయాడని తెలిపారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో జన సంచారం లేకుండా, కనీసం సదుపాయాలు లేని చోట పాఠశాలను ఏ విధంగా నిర్వహిస్తున్నారని ప్రశ్నించగా యాజమాన్యం జవాబు ఇవ్వలేదు. దీంతో విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనుమతులు లేవు, దరఖాస్తు చేశారు... నాలుగేళ్లుగా అనుమతులు లేకుండా పాఠశాలను నిర్వహిస్తున్నా ఒక్క అధికారి కూడా అటువైపు రాకపోవడం గమనార్హం. ఏడాది ప్రారంభంలో అనుమతులు లేని పాఠశాలలను సీజ్ చేసిన అధికారులు నారాయణ పాఠశాలకు అనుమతులు లేకున్నా ఎందుకు వదిలేశారనేది బహిరంగ రహస్యమే. అధికార పార్టీ అండతో అక్రమంగా పాఠశాలను నిర్వహిస్తున్నా పట్టించుకోకుండా తమ కుమారుడి మృతికి కారణమయ్యారని విద్యార్థి బంధువులు ఆరోపించారు. దసరా సెలవులకు వస్తానన్నాడు... తాను శనివారం మధ్యాహ్నం ఫోన్లో మాట్లాడానని, దసరా సెలవులు మరో రెండు రోజుల్లో ఇస్తారని, అప్పుడు ఇంటికి వస్తానని చెప్పాడని అమరనాథ్ బాబాయి రామకోటి వాపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకును నారాయణ యాజమాన్యం పొట్టన పెట్టుకుందని రామకోటి విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మరో విద్యార్థి కుటుంబానికి ఇలా జరుగకుండా అధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని రామకోటి కోరారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, వీలైనంత త్వరగా న్యాయం చేస్తామని మృతుని కుటుంబసభ్యులకు సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
‘నారాయణ’ విద్యార్థి అనుమానాస్పద మృతి
పటాన్ చెరు టౌన్ : మండల పరిధిలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బీడీఎల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన మయాంక్ ముకుంద్ పటాన్ చెరులోని నారాయణ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతనితో పాటు మరో నలుగురు హాస్టల్ గదిలో ఉంటున్నారు. శనివారం రాత్రి స్నేహితులతో సరదాగా గడిపిన ముకుంద్ ఆదివారం తెల్లవారే సరికి విగతజీవిగా పడి ఉన్నాడు. తెల్లవారుజామున ముకుంద్‌ను నిద్రలేపేందుకు వచ్చిన సిబ్బంది గమనించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ముకుంద్ చనిపోరుునట్టు వైద్యులు తెలిపారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని, మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు. గోప్యంగా ఉంచిన యాజమాన్యం విద్యార్థి మృతి విషయాన్ని కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచింది. మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆదివారం తెల్లవారుజామున కనీసం స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ముకుంద్‌ను గాంధీకి తరలించారు. కళాశాల ప్రాంగణంలోని సిబ్బంది, విద్యార్థులకు ముకుంద్ చనిపోరుున విషయం ఇప్పటికీ తెలియదు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు వస్తేనే మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందని బీడీఎల్ పోలీసులు తెలిపారు. సీఐ కృష్ణకిషోర్ ఈ కేసు వివరాలు తెలిపేందుకు మీడియాకు అందుబాటులోకి రాలేదు. సోమవారం రాత్రి వరకు కేసు నమోదుకాలేదు. ముకుంద్ తండ్రి రాజాముకుంద్ ప్రసాద్ సిన్హా బిహార్‌లో వ్యవసాయదారుడు. మృతుడి మేనమామ మనీష్రాజన్ హైదరాబాద్‌లోని ఎస్బీహెచ్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి మృతదేహాన్ని అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. -
నారాయణ కాలేజీలో విద్యార్థిపై దాడి
హైదరాబాద్ : నగరంలోని హయత్‌నగర్ నారాయణ కళాశాలలో ఓ విద్యార్థిపై దాడి జరిగింది. విద్యార్థి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా కళాశాల హాస్టల్లో మద్యం సేవించిన ఆరుగురు విద్యార్థులు తోటి విద్యార్థిని చితకబాదారు. ఈ దాడిలో నవీన్(17) అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాధితుని కుటుంబసభ్యులు, బంధవులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. అన్యాయంగా తమ కొడుకును కొట్టిన విద్యార్థులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
‘ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు’
-
‘నారాయణ’ విద్యార్థి అనుమానాస్పద మృతి
– అధ్యాపకుడు మందలించాడని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి? కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న సందీప్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు నగరంలోని బుధవారపేటలో నివాసం ఉంటున్న మహానంది, సరస్వతి దంపతులకు నలుగురు సంతానం కాగా.. రెండవ కుమారుడు సందీప్ స్థానిక నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం ఉదయం కళాశాలకు వెళ్లిన సందీప్‌ను తరగతి గదిలో మ్యాథ్స్ లెక్చరర్ మందలించినట్లు తెలిసింది. తోటి విద్యార్థుల ఎదుట చోటు చేసుకున్న ఘటనతో విద్యార్థి తీవ్ర మనోవేదనకు లోనైనట్లు సమాచారం. రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటికి చేరుకోగా.. అప్పటికి ఎవరూ లేకపోవడంతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతని తండ్రి ఆటోడ్రై వర్ కాగా.. తల్లి నగరంలోని కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వీపర్‌గా పని చేస్తున్నారు. విధులు ముగించుకొన్ని తల్లి రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకోగా విగతజీవిగా మారిన కుమారుడిని చూసి నిశ్చేష్టురాలయింది. స్థానికుల సహకారంతో సమాచారం భర్తకు చేరవేసింది. అప్పటికే సందీప్ మృతి చెందినట్లు తెలుసుకొని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయంలో కళాశాల ప్రేమయం లేదని చెప్పించేందుకు పెద్ద ఎత్తున పైరవీలు జరిగినట్లు తెలుస్తోంది. రాత్రి నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు పోలీసులు మధ్యవర్తిగా ఈ పంచాయితీ జరిగినట్లు సమాచారం. చివరకు.. తమ కుమారుడు అనారోగ్యంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఆ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు త్రీటౌన్ సీఐ మధుసూదన్‌రావు తెలిపారు. ఇదిలాఉంటే గత ఏడాది నన్నూరు సమీపంలోని నారాయణ బ్రాంచ్‌లోనే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడాది సమయంలో చోటు చేసుకున్న రెండు ఘటనలు కార్పొరేట్ కళాశాలల్లో ఒత్తిళ్లకు అద్దం పడుతోంది. -
‘నారాయణ’లో విద్యార్థుల తిరుగుబాటు
ముత్తుకూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం, పిడతాపోలూరులోని నారాయణ రెసిడె న్షియల్ జూనియర్ కళాశాలలో సోమవారం అర్ధరాత్రి విద్యార్థులు బీభత్సం సృష్టించారు. కళాశాల నిర్వాహకుల నిర్వాకాన్ని నిరసిస్తూ ఆస్తులు ధ్వంసం చేశారు. వివరాలిలా ఉన్నాయి. కళాశాలలో మొత్తం 1,080 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 500 మందికిపైగా సీనియర్ ఇంటర్ విద్యార్థులున్నారు. కొంతకాలంగా కళాశాలలో సౌకర్యాల కొరతపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వసూలు చేస్తున్న ఫీజులకు తగ్గట్టు భోజన వసతి లేకపోవడం, స్వగ్రామాల నుంచి వచ్చే తల్లిదండ్రులు, బంధువుల పట్ల ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి వారిని మరింత విసిగించింది. మంగళవారం పరీక్షలు ముగిసే జూనియర్లతో సీనియర్లు కలిశారు. రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. విద్యార్థుల్లో ఆవేశం పెల్లుబికింది. మూడుసార్లు విద్యుత్ సరఫరా(తొలగించారు)కు అంతరాయం ఏర్పడింది. జనరేటర్ మొరాయించింది. ఈ సమయంలో విద్యార్థులు కళాశాల అడ్మిన్ భవనంలో ఫర్నిచర్, ఏసీ మిషన్లు, ఫ్యాన్లు, గదులపైకప్పు సీలింగ్‌ను ధ్వంసం చేశారు. ప్రాంగణంలో వీధిలైట్లు పగులగొట్టారు. నిర్వాహకుల కారుపై విరుచుకుపడ్డారు. ల్యాబ్‌లో పరికరాలను నాశనం చేశారు. తరగతుల్లోని బెంచ్‌లు, కుర్చీలు, కిటికీ అద్దాలు విరగ్గొట్టారు. వసతిగృహం ఇన్చార్జ్ నాగార్జునపై దౌర్జన్యానికి దిగారు. పోలీసుల రంగప్రవేశం కళాశాల నిర్వాహకుల నుంచి సమాచారం రావడంతో ముత్తుకూరు, కృష్ణపట్నం ఎస్సైలు శ్రీనివాసరెడ్డి, విశ్వనాథరెడ్డి తమ సిబ్బందితో రంగంలోకి దిగారు. పరిస్థితి చక్కబెట్టే ప్రయత్నం చేశారు. కృష్ణపట్నం సీఐ శ్రీనివాసరావు కళాశాలకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ముందు జాగ్రత్తగా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. జరిగిన బీభత్సం బయటకు పొక్కకుండా మంగళవారం ఉదయం కళాశాల ఉద్యోగులు చక్కబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ధ్వంసమైన పరికరాలు, ఫ్యాన్లు, బెంచ్‌లను తొలగించారు. జూనియర్ ఇంటర్ విద్యార్థులను పరీక్ష కోసం నెల్లూరుకు పంపారు. సీనియర్ విద్యార్థులను స్టడీ అవర్స్‌పై కూర్చోబెట్టారు. ఉద్యోగులు మీడియాతో ఎక్కువ మాట్లాడ కుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. కళాశాలలో ఏమీ జరగలేదు: ఏజీఎం కళాశాలలో ఎటువంటి సంఘటన జరగలేదని ఏజీఎం పద్మారెడ్డి విలేకరులతో అన్నారు. పరీక్షలు పూర్తయ్యే దశలో చిన్న సంఘటనలు జరగడం సహజమన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసుల సాయం కోరామని చెప్పారు. కళాశాల నిర్వహణలో అప్రమత్తంగా ఉంటున్నామన్నారు. -
నారాయణగూడలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ నగరంలోని నారాయణ గూడ విటల్ వాడీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించింది. నారాయణ కాలేజీ మెయిన్ బ్రాంచ్ భవనంలోని స్టోర్ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పంటుకుంది. లోపల ఉన్న మెటీరియల్స్ తో పాటు.. రెండు భవనాల మధ్య ఉన్న ఫైబర్ పైకప్పు కాలి పోయింది. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. -
నారాయణ కాలేజీలో మరో ఆత్మహత్య
పటాన్చెరు: మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమెల శివారులో గల నారాయణ ఐఐటీ క్యాంపస్ ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి రిత్విక్ నందారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లాకు చెందిన రిత్విక్ (16) బుధవారం సాయంత్రం టిఫిన్‌కు రాలేదు. దీంతో తోటివిద్యార్థులు వెళ్లిచూడగా తన గదిలో ఉరే సుకొని కనిపించాడు. కళాశాల యాజమాన్యం రిత్విక్ మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. -
నారాయణ కాలేజీలో వార్డెన్ ఆత్మహత్య
- ప్రేమ వ్యవహారమే కారణమన్న పోలీసులు - యాజమాన్యం వేధింపులే అంటున్న సహ ఉద్యోగులు హైదరాబాద్: నారాయణ కళాశాలల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా అత్తాపూర్ హైదర్‌గూడ నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో ఓ వార్డెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమని పోలీసులు అంటుండగా... యాజమాన్యం వేధింపులే కారణమని తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదర్‌గూడలోని నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో వరంగల్ జిల్లా కొత్తగూడకు చెందిన వేముల విష్ణు(27) రెండేళ్లుగా వార్డెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, శనివారం రాత్రి ఎవరూ లేని సమయంలో కళాశాలలోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం గమనించిన సిబ్బంది... విషయాన్ని కళాశాల నిర్వాహకులు, పోలీసులకు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విష్ణు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి ఫేస్బుక్ అక్కౌంట్‌ను పరిశీలించిన పోలీసులు... ‘దిస్ ఈజ్ లాస్ట్ డే.. బాయ్ స్వాతి’ అనే పోస్టును గుర్తించారు. దీన్నిబట్టి అతడి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమనే నిర్ధారణకు వచ్చారు. అయితే... దసరా సెలవుల్లో కూడా పనిభారం మోపి యాజమాన్యం ఒత్తిడి తేవడం వల్లనే విష్ణు ఆత్మహత్య చేసుకున్నాడని సహ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. విషయం తెలియగానే... ఈ కళాశాలలో ఉండే సిబ్బంది వెళ్లిపోయి వారి స్థానంలో వేరే బ్రాంచ్‌కు చెందిన ఉద్యోగులు విధుల్లోకి రావడం, ఇంత జరిగినా ప్రిన్సిపాల్ కాలేజీకి రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఐ విల్ మిస్ యూ.. మై బ్యాడ్‌లక్
నారాయణ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య ఏపీలోని రాజమండ్రిలో ఘటన చెట్టుకు ఉరివేసుకొని మృతి కాలేజీలో ఒత్తిడే కారణమంటున్న తల్లి రాజమండ్రి క్రైం: ఆంధ్రప్రదేశ్‌లో నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల బలవన్మరణాలకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్న దాసరి నందిని(17) అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నందిని స్వస్థలం ఒంగోలు. తండ్రి ప్రసాద్ గతంలోనే మృతి చెందాడు. దీంతో నందినిని, ఆమె చెల్లెలిని తీసుకొని వారి తల్లి నిర్మల తన పుట్టిల్లయిన రాజమండ్రికి వచ్చేసింది. నిర్మల ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. నందిని స్థానికంగా ఓ బాలికల హాస్టల్లో ఉంటూ దానవాయిపేటలోని నారాయణ కాలేజీలో ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతోంది. ఇటీవల జరిగిన త్రైమాసిక పరీక్షలు బాగా రాయలేదని స్నేహితుల వద్ద బాధపడింది. సోమవారం రాత్రి హాస్టల్ ఎదుట ఉన్న రావిచెట్టుకు చున్నీతో ఉరి వేసుకొంది. మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించా రు. మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాలేజీలో ఒత్తిడి తాళలేక ఆత్మహత్య: తల్లి నిర్మల ఆదివారం నందినిని బయటకు తీసుకెళ్లింది. ఆ సందర్భంగా నందిని తన గోడు వెళ్లబోసుకుంది. నారాయణ కాలేజీలో ఒత్తిడి ఎక్కువగా ఉంటోందని, ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటివరకూ 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తల్లికి చెప్పింది. కాలేజీలో ఒత్తిడికి తాళలేక తన బిడ్డ ఆత్మహత్య చేసుకుందని నిర్మల రోదించింది. ఐ మిస్ యూ.. నందినికి సహ విద్యార్థినులు వనం దుర్గాభవాని, పోలిపల్లి దేవిక ప్రాణ స్నేహితులు. వారితో నాలుగు రోజుల క్రితం చిన్నపాటి స్పర్థ ఏర్పడింది. ఆత్మహత్య చేసుకునే ముందు వారినుద్దేశించి నందిని తన నోట్‌బుక్‌లో ఒక లేఖ రాసింది. ‘నాతో మాట్లాడరనుకున్నాను. మాట్లాడుతున్నందుకు సంతోషం. వచ్చే జన్మలో కూడా మీరే నా స్నేహితులుగా పుట్టాలి. ఐ విల్ మిస్ యూ.. మై బ్యాడ్‌లక్’ అని అందులో రాసింది. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
చెట్టుకు ఉరేసుకుని నారాయణ విద్యార్థిని ఆత్మహత్య
-
‘నారాయణ’ విద్యార్థుల తిరుగుబాటు
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని నారాయణ ఐఐటీ క్యాంపస్‌లో భోజనం సరిగా లేదంటూ విద్యార్థులు మంగళవారం రాత్రి తిరుగుబాటు చేశారు. భోజనం, సౌకర్యాలు సరిగా లేవంటూ హాస్టల్ విద్యార్థులు విధ్వంసం సృష్టించారు. భవనం కిటికీల అద్దాలు పగులగొట్టారు. తరగతి గదులతోపాటు ఇతర ప్రాంతాల్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. హాస్టల్లో దాదాపు 500 మంది విద్యార్థులు ఉంటున్నట్లు సమాచారం. తమ విద్యార్థుల మధ్య చిన్న వివాదం చోటు చేసుకుందని, ఎవరూ కలుగజేసుకోవద్దని యాజమాన్య ప్రతినిధులు పేర్కొనడంతో.. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు సైతం బయటే గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది. తమ తల్లిదండ్రులు రూ.వేలకువేలు ఫీజులు చెల్లిస్తున్నా యాజమాన్యం మాత్రం తమకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందంటూ విద్యార్థులు ఆగ్రహంతో పెద్దగా కేకలు వేశారు. విషయం తెలుసుకున్న మీడియా అక్కడకు చేరుకోవడాన్ని గమనించిన యాజమాన్య ప్రతినిధులు విద్యార్థుల నోరు నొక్కేందుకు విఫలయత్నం చేశారు. టూ టౌన్ ఎస్సైలు కె.పార్థసారథి, నాగరాజు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని యాజమాన్య ప్రతినిధులతో చర్చించారు. ఫిర్యాదు అందకపోవడంతో వారు కూడా వెనుదిరిగారు. ఈ ఘటనతో నారాయణ ఐఐటీ క్యాంపస్‌లో మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 10.30 గంటల వరకు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. -
‘నారాయణ’ అనుమతి రద్దు చేయాలని ధర్నా
ఇబ్రహీంపట్నం: విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి కారణమైన నారాయణ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యూఐ జాతీయ కమిటీ సభ్యుడు అత్తిలి సుజీత్, జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మరాజు నర్సింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్ గేటు సమీపంలో నారాయణ కళాశాల ఎదుట ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వరంగల్ జిల్లాకు చెందిన ఇంటర్ ఎంపీసీ రెండో ఏడాది విద్యార్థి పవన్‌నాయక్(17)ను వేధించిన నారాయణ కళాశాల అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ డీవో విఠల్ విచారణ: విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఘటనపై నారాయణ కళాశాలలో సోమవారం ఆర్డీవో విఠల్, ఆదిబట్ల సీఐ అశోక్ కుమార్ విచారణ జరిపారు. ఎన్ఎస్యూ నాయకులతో ఆర్డీవో మాట్లాడారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. -
‘నారాయణ’లో మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
-
‘నారాయణ’లో మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఆదిభట్ల(రంగారెడ్డి): నారాయణ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరుగేటు సమీపంలోని నారాయణ ఐఐటీ స్పార్క్ అకాడమీ వద్ద ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. వరంగల్ జిల్లాకు చెందిన పవన్ నాయక్(17) ఈ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం కళాశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన తోటి విద్యార్థులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్ పరిస్థితి నిలకడగానే ఉందని.. కానీ రెండు కాళ్లు విరిగిపోయాయని వైద్యులు తెలిపారు. కాగా.. విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి కళాశాల యాజమాన్యానిదే బాధ్యత అని పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు కళశాల ముందు ఆందోళనకు దిగారు. -
నారాయణ విద్యార్థిని తల్లి ఆత్మహత్యాయత్నం.
-
నారాయణ విద్యార్థిని తల్లి ఆత్మహత్యాయత్నం
కడప: నారాయణ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న మనీషా(16) తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్రమాత్రలు మింగి ఆమె ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను హుటాహుటిన కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం తప్పినప్పటికీ ఆమె పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని తెలుస్తోంది. కడప నగర శివారులోని నారాయణ జూనియర్ బాలికల కళాశాల హాస్టల్లో ఆగస్టు 17న ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థినులు మనీషా(16), నందిని(16) ఆత్మహత్యకు పాల్పడ్డారు. నారాయణ కాలేజీ యాజమాన్యం ఒత్తిడి కారణంగానే వీరిద్దరు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. కాగా, ఇప్పటివరకు 14 మంది నారాయణ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడినా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. -
'నారాయణ' విద్యార్ధి ఆత్మహత్యాయత్నం
అనంతపురం: కళాశాల లెక్చరర్లు ఒత్తిడి పెట్టడంతో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన అనంతపురం పట్టణంలో బుధవారం జరిగింది. భరత్‌కుమార్ అనే విద్యార్థి అనంతపురంలోని నారాయణ కాలేజ్ లో జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు. చదువుకోసం లెక్చరర్లు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక బుధవారం ఉదయం తన ఇంటిలో ఆత్మహత్యాయత్నం చేశాడు. సకాలంలో తల్లిదండ్రులు గుర్తించి అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కళాశాలపై బాధిత బంధువుల దాడి విద్యార్థి ఆత్మహత్యాయత్నంపై ఆగ్రహం చెందిన విద్యార్ధి బంధువులు, విద్యార్ధి సంఘాలు కళాశాలపై దాడి చేశాయి. ఫర్నీచర్‌ను విరగొట్టారు. ఇది ఇలావుండగా ఆసుపత్రిలో విద్యార్థి తన ఆత్మహత్యాయత్నానికి కాలేజీ లెక్చర్ర్ల ఒత్తిడే కారణమని పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే కాలేజీ యాజమాన్యానికి అనుకూలంగా ఆ స్టేట్మెంట్ ను మార్చారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఆగ్రహం చెందిన వారు కళాశాల ముందు ఆందోళనకు దిగారు. -
అఖిల్ మృతిపై అనుమానాలు
విజయవాడ (లబ్బీపేట) : 'మా అబ్బాయికి ఎటువంటి అనారోగ్యం లేదు. మెడికల్ రికార్డు చాలా బాగుంది. పర్సనల్ ప్రాబ్లమ్స్ లేవు. కానీ మృతి విషయంలో కాలేజీ యాజమాన్యం ఏవేవో అభూత కల్పనలు ప్రచారం చేస్తూ రకరకాల కథలు చెపుతున్నారు' అంటూ విజయవాడ సమీపంలోని నిడమానూరులోని నారాయణ కాలేజీలో శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందిన నర్రా అఖిల్తేజ్కుమార్ రెడ్డి తండ్రి సింగారెడ్డి అంటున్నారు. అసలు మృతిపైనే అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో శనివారం అఖిల్తేజ్కుమార్ రెడ్డి మృతదేహానికి పంచనామా నిర్వహించే సమయంలో సింగారెడ్డి మీడియాతో మాట్లాడారు. కాలేజీ యాజమాన్యం శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ఫోన్ చేసి మీ అబ్బాయికి బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తే ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు చెప్పారన్నారు. అనంతరం 6.15కు ఫోన్ చేసి మృతి చెందినట్లు చెప్పారన్నారు. కానీ అక్కడకు వెళ్లిన తర్వాత సాయంత్రం 4.30 గంటలకే అఖిల్ మృతి చెందినట్లు సహచర విద్యార్థులు గుర్తించారని తెలుసుకున్నామన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు క్లాసుకు వెళ్తూ కడుపునొప్పి వస్తోందని తిరిగి రూమ్‌కు వచ్చాడని చెపుతున్నారని, రూమ్‌కు తాళం వేసి ఉంటే కిటికీలో నుంచి రూమ్‌లోకి వెళ్లినట్లు యాజమాన్యం చెబుతోందని వివరించారు. సహచర విద్యార్థులు సాయంత్రం 4.30 గంటలకు రూమ్‌కు వచ్చే సరికి ప్యాంట్‌తో ఫ్యాన్ కొక్కేనికి ఉరివేసుకుని కాళ్లు నేలకు ఆనుతున్నట్లు ఉన్నాడని చెబుతున్నారని, ఆ పరిస్థితుల్లో హ్యాంగింగ్ చేసుకుని మృతి చెందాడంటే నమ్మశక్యంగా లేదన్నారు. మృతిపై కాలేజీ యాజమాన్యం అనేక అపోహలు సృష్టిస్తూ అభూత కల్పనలు సృష్టిస్తున్నట్లు పేర్కొన్నారు. నారాయణ మంత్రిగా ఉండటంతో ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని, న్యాయం చేస్తే చేయండి లేకుంటే లేదని, ఇవే విషయాలను ఫిర్యాదులో పేర్కొన్నట్లు సింగారెడ్డి మీడియాతో పేర్కొన్నారు. వినాయకచవితి పండుగకు ఇంటికి వస్తే ఈ నెల 20న తిరిగి కళాశాలకు పంపించామని, బుధవారం చివరిసారిగా తనతో పది నిమిషాలు మాట్లాడాడని కన్నీరు మున్నీరవుతూ వివరించారు. -
అఖిల్ మృతిపై అనుమానాలు
-
నారాయణ కాలేజీ ఎదుట విద్యార్ధుల ధర్నా
-
నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య
-
నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య
విజయవాడ: నారాయణ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా విజయవాడలో మరో విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. నారాయణ కాలేజీ నిడమానూరు క్యాంపస్ లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అఖిల్ రెడ్డి శుక్రవారం కళాశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఒంగోలుకు చెందినవాడుగా సమాచారం. అఖిల్ రెడ్డి మృతదేహాన్ని కామినేని ఆస్పత్రికి తరలించారు. కాగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతనెల 17వ తేదీ కడప నారాయణ కళాశాలలో మనీషారెడ్డి, నందిని అనే విద్యార్థినులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. -
విశాఖలో బాలికపై సామూహిక అత్యాచారం
-
ఆ ఆత్మహత్యలు కనిపించవా?
- రాజకీయంగా ఎదుర్కోలేకే మంత్రి శిద్ధా కుటిల చేష్టలు - జీ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి అరెస్టుకు వైఎస్సార్సీపీ నిరసన - బూచేపల్లి అరెస్టును నిరసిస్తూ రోడ్డెక్కిన విద్యార్థులు ఒంగోలు క్రైం: రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ కాలేజీలు, హాస్టళ్లలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డిని ప్రకాశం జిల్లా దర్శి పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఒంగోలు జిల్లా జైలు ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు సోమవారం సాయంత్రం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కళాశాలలో చదువుతున్న తాళ్లూరు మండలం కొత్తపాలేనికి చెందిన విద్యార్థిని స్వగ్రామంలోనే సొంత ఇంటిలో ఈ నెల 5న ఆత్మహత్య చేసుకుంటే కళాశాల చైర్మన్‌కు సంబంధం ఏమిటని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, వైపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు ప్రశ్నించారు. రిషితేశ్వరి డైరీలో రాసినా.. :నాగార్జున వర్సిటీలో రిషితేశ్వరి స్వయంగా ప్రిన్స్‌పల్ పాత్రపై డైరీలో రాస్తే ఇంత వరకూ పోలీసులు అరెస్ట్ చేయలేదని,నారాయణ కాలేజీల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల వ్యవహారంలోనూ స్పందించని ప్రభుత్వం, పోలీసులు ఇప్పుడెందుకు అతిగా స్పందిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి శిద్ధా రాఘవరావు రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని సుబ్బారెడ్డి సతీమణి వెంకాయమ్మ విమర్శించారు. మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, వైఎస్సార్సీపీ కనిగిరి ఇన్చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్‌తోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. బూచేపల్లి సుబ్బారెడ్డి అరెస్టు..రిమాండ్ అద్దంకి: ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, చీమకుర్తిలోని బీవీఎస్సీ ఇంజనీరింగ్ కళాశాల అధినేత బూచేపల్లి సుబ్బారెడ్డి,ఓఎస్డీ మాలకొండారెడ్డిలను పోలీ సులు సోమవారం ఉదయం చీమకుర్తిలో అరెస్ట్ చేసి అద్దంకి స్టేషన్‌కు తరలించారు. అనంతరం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మున్సిఫ్ (పీడీఎం) కోర్టులో హాజరుపరచగా జడ్జి నాగేశ్వరరావు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించడంతో ఒంగోలు సబ్‌జైలుకు తరిలించారు. అరెస్టును నిరసించిన విద్యార్థులు చీమకుర్తి: బూచేపల్లి సుబ్బారెడ్డి అరెస్టును ఖండిస్తూ ఆ కళాశాల విద్యార్థులు సోమవారం రోడ్డెక్కారు. కళాశాల ఎదుట కర్నూల్‌రోడ్డుపై బైఠాయించారు. ఒంగోలు వెళ్లి కలెక్టర్‌ను కల వాలని ప్రయత్నం చేయగా పోలీసులు నిలువరించారు. దీంతో పోలీసులతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. కళాశాలకు నీటిని రవాణా చేసే ట్యాంకర్ డ్రైవర్ నిడమానూరు సుబ్బారావు ఉద్వేగానికిలోనై డీజిల్‌ను శరీరంపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. -
న్యాయం జరిగేనా ?
-
గంటా.. వియ్యంకుడికి భయపడుతున్నారా?
-
గంటా.. వియ్యంకుడికి భయపడుతున్నారా?: రోజా
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో మహిళా వ్యతిరేక పాలన కొనసాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. మహిళలపై దాడులు, ఆత్మహత్యలు కొనసాగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు. సోమవారం పార్టీ కార్యాలయంలో రోజా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ నేరస్తులకు అండగా నిలుస్తోందని ధ్వజమెత్తారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మరణానికి కారణమైన ప్రిన్సిపాల్ బాబూరావును ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె డిమాండ్ చేశారు. బాలసుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించి తక్షణమే బాబూరావుపై విచారణకు ఆదేశించాలన్నారు. రిషితేశ్వరి మృతిపై బాలసుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన నివేదినకు ఆంధ్రప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టిందని రోజా ప్రశ్నించారు. నిజాలు బయటపడతాయని ప్రభుత్వం భయపడుతుందన్నారు. తమకు న్యాయం జరగలేదనే రిషితేశ్వరి తండ్రి... తన కుమార్తె మృతిపై సీబీఐతో విచారణ చేయించాలంటున్నారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరోవైపు నారాయణ కాలేజీల్లో 11మంది విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరపాలన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు...తన వియ్యంకుడు నారాయణకు భయపడే ఆ కళాశాలపై చర్యలు తీసుకోవటానికి వెనకాడుతున్నారన్నారు. నారాయణ కాలేజీల్లో జరుగుతున్న ఆత్మహత్యలపై విచారణ జరిపించి, తప్పులు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని, నారాయణ కాలేజీల గుర్తింపు రద్దు చేయాలన్నారు. రాష్ట్రంలో మహిళలు అంతా ఏకమై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను నిలదీసి పోరాడాలని రోజా పిలుపు నిచ్చారు. -
విద్యార్థినుల మృతిపై మౌనం ఎందుకు?
కడప సెవెన్‌రోడ్స్ : కడప నారాయణ కళాశాలలో చోటు చేసుకున్న నందిని, మనీషా మృతి సంఘటనపై ముఖ్యమంత్రి ఎందుకు మౌనం పాటిస్తున్నారో చెప్పాలని రాయలసీమ విద్యార్థి వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎం.భాస్కర్, కో కన్వీనర్ దస్తగిరి ప్రశ్నించారు. విద్యార్థుల మరణంపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని, నారాయణ విద్యా సంస్థలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్ఎస్ఎఫ్ ఆద్వర్యంలో గురువారం కోటిరెడ్డి సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబుకు ఏమాత్రం విశ్వసనీయత, నిజాయితీ ఉంటే తక్షణమే మంత్రి నారాయణను కేబినెట్ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. సంఘటన జరిగిన పది రోజులైనా నారాయణ యాజమాన్యం కనీసం స్పందించక పోవడం శోచనీయమన్నారు. ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ నారాయణ విద్యా సంస్థల సీఈఓగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు నారాయణ సంస్థల్లో జరిగిన మరణాలపై హైకోర్టు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసి విచారణ జరపాలన్నారు. జియోన్ పాఠశాలలో జరిగిన హత్యలపై తక్షణమే స్పందించి ఆ సంస్థ గుర్తింపును రద్దు చేసిన విద్యాశాఖ అధికారులు నారాయణ సంస్థల విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలన్నారు. ఒక తరగతిలో 100 మందిని కుక్కి కేవలం బట్టీ పాఠాలతో పిల్లలను హింసిస్తున్నారని చెప్పారు. తల్లిదండ్రులు ఎవరూ ఆ సంస్థల్లో తమ పిల్లలను చేర్చవద్దని విజ్ఞప్తి చేశారు. నారాయణ కళాశాల గుర్తింపును రద్దు చేయాలి కడప ఎడ్యుకేషన్ : ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన నారాయణ కళాశాల గుర్తింపును రద్దు చేయటంతోపాటు యాజమాన్యాన్ని క ఠినంగా శిక్షించాలని పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. కడప నగరంలోని ఐటీఐ సర్కిల్లోని గాంధీ విగ్రహం వద్ద గురువారం పీడీఎస్‌యూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ జిల్లా కార్యదర్శి అంకన్న మాట్లాడుతూ మనీషా, నందినీల సంఘటన జరిగి పదిరోజులు గడుస్తున్నా ఇంత వరకూ ఎలాంటి చర్యలు లేకపోవడం దారుణమన్నారు. ఆ కళాశాల కరస్పాండెంట్ మంత్రి కావటంతో హత్యలను ఆత్మహత్యలుగా చిత్రీకరించారని ఆరోపించారు. సంబంధిత విషయంలో రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకుని న్యాయ విచారణకు ఆదేశించాలని వారు డిమాండ్ చేశారు. మనీషా, నందినీల కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ ఉద్యమాలను ఆపేది లేదని స్పష్టం చేశారు. -
ప్రాణస్నేహం
ఆత్మహత్య ఆపడానికి ఒక్క ఫ్రెండూ ఉండడు... కాటికి మోసుకెళ్లడానికి నలుగురు అవసరమా? స్నేహం చెయ్యాల్సింది బాటలో ముళ్లు తీయడానికి... అంతిమయాత్రలో పూలు చల్లడానికి కాదు! స్నేహం నిలబడాల్సింది భారం మోయడానికి... కాయాన్ని మోయడానికి కాదు! స్నేహం కావల్సింది కన్నీటిని తుడవడానికి... నీటి కుండ పగలేయడానికి కాదు! స్నేహం ఉండాల్సింది జీవాగ్ని నింపడానికి... చితికి మంట పెట్టడానికి కాదు! వృథా... వృథా... వృథా... స్నేహం వృథా... ఫ్రెండ్ ప్రాణం కాపాడలేని స్నేహం వ్యథ! ఏడవకండి... ఏడుస్తూ కూర్చోకండి. మీ స్నేహంలో దమ్ముంటే... స్నేహం ప్రాణాన్ని నిలబెట్టండి. ఆత్మీయ స్నేహితుల్లారా... ఆత్మహత్యల్ని ఆపండి. ఎదుటి వారి మాటలను మనం ఎప్పుడైనా వింటున్నామా..? కనీసం ‘ప్రాణ’స్నేహితుల్ల మాటలను మనసుపెట్టి ఆలకిస్తున్నామా..? గజి‘బిజీ‘ జీవితాలతో గిడసబారిపోయి, మనం వినే అలవాటును ఎప్పుడో పోగొట్టుకున్నాం. బతుకుపోరు సాగించలేని ప్రాణస్నేహితులు... జీవితంపై విరక్తి చెంది ప్రాణాలు తీసేసుకున్నాక... చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు నిండు జీవితమే ముగిసిపోయాక వగచి విలపిస్తున్నాం. అలా కాకుండా, నిరాశలో కూరుకుపోయిన మిత్రుల మాటలను కాస్త ఓపికగా విని ఉంటే ఇన్ని అనర్థాలు జరిగేవా? ఒక రవళి, ఒక రిషితేశ్వరి, ఒక నందిని, ఒక మనీషా... ఇంకా ఇలాంటి చాలామంది...అర్ధంతరంగా తమ బతుకుకు చరమగీతం పాడేవారా..? మొన్న కడప నారాయణ కాలేజీలో నందిని, మనీషాలు, అటుమొన్న గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి, నిన్న నెల్లూరు డిగ్రీ కాలేజీలో రవళి... ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలు ఏవైనా కావచ్చు... ఈ ఏడాది ఇప్పటివరకు మనకు తెలిసి తెలుగు రాష్ట్రాలలో పదిహేను మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో పదకొండు మంది ఒక విద్యాసంస్థకు చెందిన కాలేజీల్లోని విద్యార్థులే! తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక... ఒకవేళ చెప్పుకుందామని ఆశగా ప్రయత్నించినా, వినేవాళ్లు ఎవరూ లేక... ఒంటరిపక్షుల్లా అల్లాడి అల్లాడి... చాలామంది నిరాశలో కూరుకుపోయి, అర్ధంతరంగా తమ జీవితాలను ముగించేసుకుంటున్నారు. అనర్థాలు జరిగిపోయాక అందరూ తీరికగా ఆవేదన చెందుతున్నారు. మిత్రుల బలవన్మరణాలను జీర్ణించుకోలేక. ఆవేశంతో బంద్‌లు, రాస్తారోకోలు చేస్తున్నారు. మిత్రుల మరణాలను మరవలేకున్నా, ఏమీ చేయలేని నిస్సహాయతతో కాలగమనంలో పడి కొట్టుకుపోతున్నారు. మనసుపెట్టి గమనించండి ‘ప్రాణ’స్నేహితులుగా ఉండేవారు మనసుపెట్టి గమనిస్తే, తమ స్నేహితుల్లోని ఆత్మహత్యా ధోరణులను ముందుగానే కనిపెట్టి జాగ్రత్తపడవచ్చు. చదువుల ఒత్తిడి తట్టుకోలేక నిరాశలో కూరుకుపోయిన వారు, ప్రేమ వ్యవహారాల్లో విఫలమై మనోవేదనను అనుభవించేవారు, ర్యాగింగ్ వంటి వేధింపుల కారణంగా మనస్తాపం చెందిన వారు మీ మిత్రుల్లో కొందరు ఉండే ఉంటారు. వాళ్లలో కొందరు ఇదివరకు ఆత్మహత్యకు విఫలయత్నాలు చేసిన వారూ ఉండే ఉంటారు. పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం లేక ఒంటరిగా కుమిలిపోతున్న వారు మీ మిత్రుల్లో కొందరు ఉండే ఉంటారు. అలాంటి వాళ్ల పట్ల కాస్త శ్రద్ధపెట్టండి. ఒంటరిగా మిగిలిపోయామని భావించి, బాధపడుతున్న వారికి ఆసరాగా ఉన్నామంటూ భరోసా ఇవ్వండి. వాళ్లు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించండి. బతుకుపోరులో తోడుగా మేమున్నామంటూ వారికి ధైర్యం చెప్పి, వాళ్లకు బతుకు మీద ఆశ కల్పించండి. ఈ కాస్త మిత్రధర్మాన్ని పాటించినట్లయితే, మీరు మీ మిత్రుల నిండుప్రాణాలను కాపాడినవాళ్లవుతారు. మీ మిత్రుల్లో డేంజర్ సిగ్నల్స్ ఏవి కనిపించినా, వెంటనే అలెర్ట్ కావాల్సిందే. అలాంటి మిత్రుల వద్ద ప్రమాదకరమైన వస్తువులేవీ లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. వారి మనసు మళ్లించడానికి, ధైర్యం చెప్పడానికి మీ వంతు ప్రయత్నాలు చేయడంతో పాటు, విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకువెళ్లడం, వారికి నిపుణుల సలహా సూచనలు అందేలా సాయం చేయడం మీ మిత్రధర్మంగా గుర్తెరగండి. అవసరమైతే ఢిల్లీలోని సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్‌లైన్- 88888 17666, హైదరాబాద్‌లోని రోష్నీ స్వచ్ఛంద సంస్థ 040-27848584, 66202000. ముంబైలోని ఆస్రా స్వచ్ఛంద సంస్థ 91-22-27546669 నంబర్లకు సంప్రదించి, సలహా సూచనలు కోరండి. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇన్పుట్స్: మోపూరు బాలకృష్ణారెడ్డి, సాక్షి, కడప పోలు అశోక్ కుమార్, సాక్షి, నెల్లూరు, సాక్షి ఇవీ... డేంజర్ సిగ్నల్స్ ఆత్మహత్యలకు సిద్ధపడే వారు ముందుగానే కొన్ని సిగ్నల్స్ ఇస్తారు. వాటిని గుర్తించి, సకాలంలో అలర్ట్ అయితే చాలు... నిండుప్రాణాలు బలికాకుండా కాపాడుకోవచ్చు. అంతర్జాతీయ నిపుణులు చెబుతున్న ప్రకారం ఆత్మహత్యలకు సిద్ధపడేవారు ఇచ్చే కొన్ని ముఖ్యమైన డేంజర్ సిగ్నల్స్... తిండి, నిద్ర అలవాట్లలో విపరీతమైన మార్పులు కనపరుస్తారు. నిత్యం ఉల్లాసంగా ఉండేవారు అకస్మాత్తుగా ముభావంగా మారిపోతారు. లేదంటే, ఎప్పుడు మౌనంగా ఉండేవారు హఠాత్తుగా ఉత్సాహం ఉరకలేస్తూ కనిపిస్తారు. మిత్రులకు, కుటుంబ సభ్యులకు దూరదూరంగా ఉంటారు. కొందరు హింసాత్మక ధోరణిని కూడా ప్రదర్శిస్తారు. ఏకాగ్రత లోపంతో కనిపిస్తారు. తరచు కడుపునొప్పి, తలనొప్పి, అలసటగా ఉన్నట్లు చెబుతారు. కత్తి, బ్లేడు, తాడు, విషం, నిద్రమాత్రలు... వంటి ఆత్మహత్యా సాధనాల గురించి తరచుగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఆత్మహత్యా పద్ధతుల గురించి చదవడం వంటివి చేస్తుంటారు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు బాధగా ఉంటారు. ఏ పని మీదా ఆసక్తి చూపరు. ఎక్కువసేపు ఒంటరిగా ఉంటారు. ఎవరినీ కలవడానికి ఇష్టపడరు.అపరాధ భావనలో ఉంటారు. ‘నాకు బతికే అర్హత లేదు’, ‘నన్ను పట్టించుకునే వారే లేరు’, ‘ఈ జీవితంతో విసిగిపోయాను’... అంటూ నిరాశాపూరితమైన మాటలు మాట్లాడుతుంటారు. అప్పుడే వెళ్లి ఉంటే... రవళిది, మాది ఒకే ఊరు. ఒకే రూమ్‌లో ఉండేవాళ్లం. ఇద్దరం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాం. ‘హాస్టల్లో ఉండలేకపోతున్నాను. మా నాన్నకు ఫోన్‌చేసి రమ్మంటాను. రాగానే ఇంటికి వెళ్లిపోతాను’ అని చెప్పింది. బట్టలు కూడా బ్యాగులో సర్దుకుంది. గురువారం ఎప్పట్లాగే క్లాసుకు బయల్దేరాం. కిందకు రాగానే ‘నోట్స్ మర్చిపోయాను’ అంటూ తన బుక్స్ నా చేతికిచ్చి, మేడమీద గదిలోకి వెళ్లింది. ఎంతకూ రాకపోవడంతో మేం క్లాస్‌కు బయల్దేరాం. రవళి బుక్స్‌ను ఆమె క్లాస్‌రూమ్‌లో ఇచ్చి వెళ్లాం. కొంతసేపటి తర్వాత రవళి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది. అప్పుడే అనుమానించి, మేమూ రూమ్‌కి వెళ్లి ఉంటే ఆమె బతికేదనిపిస్తోంది. - ఎర్రబల్లి గంగాభవాని, రాపూరు మండలం,పెనుబర్తి, నెల్లూరు తెలుసుకోలేకపోయాం... మేమిద్దరం ఒకే ఊరు వాళ్లం. దాంతో మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. నేను డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఒకే హాస్టల్లో ఉండటంతో నాతో చనువుగానే ఉండేది. అయితే, తన కష్టమేంటో ఎప్పుడూ చెప్పేది కాదు. నేనూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు తను మా మధ్య లేదంటే బాధగా ఉంది. - మాదమాల శ్రీలక్ష్మి, రాపూరు మండలం, పెనుబర్తి మంచి స్నేహితులు... మాకు ఇక్కడ మార్కులు ఆధారంగా సెక్షన్స్ కేటాయిస్తారు. తక్కువ మార్కులు వస్తే అటు పేరెంట్స్ నుంచి, ఇటు కాలేజీ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అప్పటి వరకూ మేం మా పేరెంట్స్ వద్దే పెరిగి ఒక్కసారిగా హాస్టల్ పరిస్థితులకు అలవాటు కావడం చాలా కష్టంగా ఉంటుంది. దీంతో త్వరగా డిప్రెషన్లోకి వెళ్లిపోతాం. అదే విషయాన్ని కొన్ని సార్లు మనీషా, నందిని మాటల్లోనూ దొర్లాయి. మేమంత సీరియస్ తీసుకోలేదు. మంచి స్నేహితులు దూరమైపోయారు. - జి.గీతారెడ్డి, ద్వితీయ సంవత్సరం, నారాయణ కళాశాల బాలికల క్యాంపస్, కడప ఊహించలేదు.. మనీషా, నందిని ఇద్దరూ నా క్లోజ్ ఫ్రెండ్స్. చాలా హుషారుగా ఉండేవారు. హాస్టల్లోని మిగతావారితోనూ బాగా మాట్లాడేవారు. అలాంటి వారు ఒక్కసారిగా చనిపోయారంటే చాలా భయపడ్డాం. కళాశాలలో ఉదయం నుంచి రాత్రి వరకు చదువే. బాగా ఒత్తిడి ఉంటుంది. అమ్మనాన్నలు ఎలాగూ అందుబాటులో ఉండరు. ఆ ఒత్తిడి గురించి మా మాటల్లో దొర్లినా ఇదంతా మామూలేకదా అనుకున్నాం. కానీ, ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదు. - పి.శివబిందు, మొదటి సంవత్సరం, నారాయణ కళాశాల బాలికల క్యాంపస్, కడప ఒక్క ఆత్మహత్య ఆపడానికి ఎంతోమంది స్నేహితులు కావాలి. ఉన్న స్నేహితులే కాదు... తల్లిదండ్రులూ స్నేహితులు కావాలి. గురువులూ స్నేహితులు కావాలి.ఇరుగు పొరుగు వారూ స్నేహితులు కావాలి. నాయకుడనేవాడూ స్నేహితుడు కావాలి. కాపాడగలవారందరూ స్నేహితులు కావాలి. అప్పుడే ఈ ఆత్మహత్యల్ని ఆపగలుగుతాం. కడపలో ఆత్మహత్య చేసుకున్న కాలేజీ స్టూడెంట్ (మనీషా) తల్లిని ఓదార్చుతున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి (ఫైల్‌ఫొటో) -
హత్య చేసి ఆత్మహత్య అంటున్నారు
- సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలి - మనీషా తల్లిదండ్రుల డిమాండ్ కడప అగ్రికల్చర్ : 'మా అమ్మాయి మనీషా ఆత్యహత్య చేసుకునేంత పిరికిది కాదు. నారాయణ కళాశాలలోనే చంపి ఉరివేసి యాజమాన్యం ఆత్మహత్యగా చిత్రీకరిస్తోంది. ఇప్పుడు విచారణ చేసిన కమిటీ వల్ల మాకు న్యాయం జరగదు. సిట్టింగ్ జడ్జితోగానీ, సీబీఐతోగానీ విచారణ జరిపిస్తేనే మాకు న్యాయం జరుగుతుంది' అని కడప నారాయణ కళాశాలలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని మనీషా త ల్లిదండ్రులు సరోజ, బాలకృష్ణారెడ్డి, ఇతర బంధువులు డిమాండ్ చేశారు. ఆదివారం క డప నగరంలోని సీపీఎం కార్యాలయ ఆవరణలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. . సంఘటన జరిగిన రోజే మధ్యాహ్న సమయంలో ఏమమ్మా..భోజనం చేశావా? అని మనీషాను ఫోన్ ద్వారా అడుగగా ఇంకా తినలేదని తినడానికి పోతున్నానని, తలనొప్పిగా ఉందని చెప్పిందని, తలనొప్పి మందు రాసుకోమని చెప్పామని వారన్నారు. అదేరోజు రాత్రి 7.30 గంటలకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఉరివేసుకుని చనిపోయిందని చెప్పారన్నారు. తాము వెంటనే అక్కడికి వెళ్లగా తమను కళాశాలలోకి రాన్వికుండా పోలీసులతో అడ్డగించారని చెప్పారు. ‘ఇక్కడ చనిపోయింది మా పాపే మేము చూడడానికి కూడా వీలులేదా’ అని అడిగితే అడుగడుగునా అడ్డగించారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతులు, కాళ్ల మీద కమిలిన గాయాలు ఉన్నాయని, ఉరి వేసుకుంటే దెబ్బలెలా తగిలాయో చెప్పాలని కోరారు. ఆ రోజు ఎలాంటి కాగితాలు దొరకనప్పుడు ఇప్పుడెలా ఆ కాగితాలు పుట్టుకొచ్చాయో అర్థం కావడంలేదన్నారు. ఉరివేసుకుంటే కనీసం ఫ్యాను రెక్కలు వంగిపోయి ఉండాలని, నాలుక బయటకు వచ్చి ఉండాలని పోలీసులే చెప్పారు. మరి అలా అక్కడలేదన్నారు. ఇది ముమ్మాటికీ హత్యేనని, ప్రిన్సిపాల్‌ను, వార్డెన్‌ను ఎందుకు అదుపులోకి తీసుకోలేదని వారు పోలీసు అధికారులను ప్రశ్నించారు. మాకు ఒక్క అవకాశం ఇస్తే పోలీసుల ఎదుట ప్రిన్సిపాల్‌ను, వార్డెన్‌ను మూడు ప్రశ్నలు అడుగుతామని చెప్పారు. తమకు న్యాయం జరగాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అలాగే యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
నారాయణ కాలేజీ ముందు విద్యార్థి ఫెడరేషన్ ధర్నా
గుంతకల్లు (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని నారాయణ జూనియర్ కాలేజీ ఎదుట తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ ధర్నాకు దిగింది. ఆదివారం సెలవు దినం అయినా కూడా తరగతులు నిర్వహిస్తున్నందుకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. సెలవు రోజుల్లో కూడా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తీవ్ర ఒత్తిళ్లకు గురైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. -
నందిని, మనీషాల మృతిపై న్యాయ విచారణ జరపాలి
కడప ఎడ్యుకేషన్ : నారాయణ కళాశాలలో ఈనెల 17న ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినులు నందిని, మనీషాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై న్యాయ విచారణ నిర్వహించాలని వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. కడపలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని సంధ్యా సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ హరితా హోటల్ వరకు సాగింది. అనంతరం కోటిరెడ్డి సర్కిల్లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు అలూరు ఖాజా రహ్మతుల్లా మాట్లాడుతూ.. నందిని, మనీషాలవి ముమ్మాటికి హత్యలేనన్నారు. ఇందుకు కారణమైన కళాశాల సిబ్బంది, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాల అనుమతులను రద్దు చేయాలని కోరారు. మరణించిన విద్యార్థుల ఇళ్లకు తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్లి.. దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు తిష్ట వేయడం చూస్తుంటే పలు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నేతలు నిత్య పూజయ్య, నాగార్జున రెడ్డి, మాసిన్, పెంచలయ్య, సందీప్, అబ్బాస్, సలావుద్ధీన్, సోహెల్, వెంకటేష్ పాల్గొన్నారు. -
విద్యార్థినుల మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి
కడప సెవెన్‌రోడ్స్ : కడప నారాయణ కళాశాల విద్యార్థినులు మనీషా, నందినిల మృతి సంఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం కడపలో ప్రదర్శన నిర్వహించారు. బాలికల జూనియర్ కళాశాల, న్యూ విక్రమ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద కాసేపు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ జి.సుబ్బరాజు మాట్లాడుతూ నారాయణ కళాశాలలో జరిగిన ఘటన ఆత్మహత్య కాదని, అది ముమ్మాటికీ హత్యేనన్నారు. అయితే, మంత్రి నారాయణ, కళాశాల యాజమాన్యం కలిసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నారాయణ కళాశాలలో జరిగిన ఈ ఘాతుకాన్ని చూసి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు.మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు అంజలి, శిరీషా, అనూష, ఏబీవీపీ నాయకులు బాబూ రామ్మోహన్, శ్రీనివాసులు, సాయిప్రసాద్, శివారెడ్డి, షఫీ పాల్గొన్నారు. బీజేవైఎం నిరసన దీక్ష కడప నారాయణ విద్యా సంస్థల్లో చదువుతున్న నందిని, మనీషాల మృతిపై సిట్టింగ్ జడ్జిచే విచారణ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భారతీయ యువమోర్చా కార్యకర్తలు గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా మోర్చా జిల్లా కార్యదర్శి సాయిప్రతాప్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మాదినేని రామసుబ్బయ్య, సిటీ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల మరణానికి కారణమైన దోషులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. విద్యార్థుల కుటుంబాలను నారాయణ కళాశాల యాజమాన్యం, రాష్ర్ట ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. ర్యాంకులు సాధించాలంటూ ఒత్తిడి చేయడం తగదన్నారు. ప్రతి విద్యా సంస్థలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర ఉపాధ్యక్షుడు దస్తగిరి, ప్రధాన కార్యదర్శి విజయ నరసింహులు, బీజేఎంఎం నాయకులు సుదర్శన్ రాయల్, రవికుమార్ పాల్గొన్నారు. -
త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభం
విద్యార్థినుల మృతిపై కడప నారాయణ కళాశాల ప్రిన్సిపాల్‌ను విచారించిన సభ్యులు * మూడురోజులపాటు విచారణ కొనసాగుతుందని వెల్లడి సాక్షి ప్రతినిధి, కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కడప నగర శివారులోని నారాయణ జూనియర్ కళాశాల హాస్టల్లో విద్యార్థినుల మృతిపై త్రిసభ్య కమిటీ గురువారం విచారణ చేపట్టింది. ఇంటర్(ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతున్న సాయి మనీషా(16), నందిని(16)లు ఈ నెల 17న అనుమానాస్పద రీతిలో మృతిచెందడం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తడమూ విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ విజయలక్ష్మి, ఇంటర్ బోర్డు సహాయ కార్యదర్శి మాణిక్యం, కడప డీఆర్ఓ కె.సులోచనలతో విచారణ కమిటీని నియమించింది. కమిటీ సభ్యులు గురువారం ఉదయం నారాయణ కళాశాలకు వెళ్లారు. రికార్డుల్ని తనిఖీ చేశారు. ప్రిన్సిపాల్ సుజాతను విచారించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మూడు రోజులపాటు సమగ్రంగా విచారించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. త్రిసభ్య కమిటీ విచారణలోనూ గోప్యత ఇద్దరు విద్యార్థినుల మృతిపై పారదర్శకంగా విచారణ చేపట్టి దోషులపై చర్యలు తీసుకుంటామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పినా... అలాంటిదేమీ కనిపించడంలేదు. గుట్టుచప్పుడు కాకుండా కళాశాలకు వెళ్లిన కమిటీ సభ్యులు మీడియాను లోనికి అనుమతించలేదు. అంతేగాక సభ్యులు కళాశాలకు చేరేటప్పటికే జిల్లావ్యాప్తంగా ఉన్న నారాయణ విద్యాసంస్థల ఇన్చార్జిలందరూ అక్కడ తిష్టవేయడమేగాక.. విచారణ ఎదుర్కొంటున్నవారికి సూచనలు, సలహాలు అందిస్తుండడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళాశాలలో మొత్తం 560 మందిదాకా విద్యార్థినులున్నారు. ఘటన జరిగిన వెంటనే అందర్నీ ప్రత్యేక వాహనాల్లో ఇళ్లకు తరలించారు. వారం రోజులుసెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మూడురోజులపాటు విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కమిటీ వెల్లడించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జ్యుడీషియల్ విచారణకు డిమాండ్ త్రిసభ్య విచారణ కమిటీపై తమకు నమ్మకం లేదని, జ్యుడీషియల్ విచారణ జరపాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఖాజా రహంతుల్లా డిమాండ్ చేశారు. విద్యార్థుల్లేకుండా విచారణ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. విద్యార్థినులందరినీ క్యాంపస్‌కు రప్పించి.. అందర్నీ విచారిస్తే చాలా విషయాలు వెలుగు చూస్తాయని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వి.గంగాసురేష్ పేర్కొన్నారు. -
'విద్యార్థినుల మృతిపై 3 రోజుల్లో నివేదిక ఇస్తాం'
కడప : నారాయణ కాలేజీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన ఘటనపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ ముగిసింది. నిష్పక్షపాతంగా విచారణ జరిపి 3 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని కమిటీ సభ్యురాలు, పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ విజయలక్ష్మి తెలిపారు. ఈ ఘటనపై ఆ విద్యార్థినుల రూమ్మేట్స్ను కూడా విచారణ చేస్తామని ఆమె చెప్పారు. కడప సమీపంలోని సీకే దిన్నెలో నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య ఘటనపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఇంటర్మీడియెట్ బోర్డులోని పరీక్షల నియంత్రణాధికారి మాణిక్యం, పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ విజయలక్ష్మి, వైఎస్సార్ జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.సులోచన ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.