‘నారాయణ’ విద్యార్థి ఆత్మహత్య
మనస్తాపానికి గురైన ఈశ్వర్‌రెడ్డి మధ్యాహ్నం క్లాస్‌కు వెళ్లకుండా హాస్టల్ గదిలోనే ఉండిపోయాడు. సాయంత్రం రూమ్‌కి తిరిగివచ్చిన సహచర విద్యార్థులు.. ఫ్యాన్‌కు వేలాడుతున్న ఈశ్వర్‌రెడ్డిని గుర్తించి వెంటనే అధ్యాపకులకు సమాచారమిచ్చారు. చికిత్స కోసమంటూ వారు అతణ్ణి ఎనికేపాడు సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించారు.
కానీ అప్పటికే ఈశ్వర్‌రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మంత్రి నారాయణకు చెందిన కాలేజీ కావడంతో ఈ విషయం బయటకు రాకుండా సిబ్బంది గోప్యత పాటించారు. కనీసం విద్యార్థి తల్లిదండ్రులకు కూడా ఆదివారం రాత్రి వరకు సమాచారమివ్వలేదు. ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి పడినట్లుగా వారికి వివరించారు. కానీ సహచర విద్యార్థులను మీడియా ఆరా తీయగా.. ఈశ్వర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తేలింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విద్యార్థుల నుంచి ప్రాథమిక సమాచారం సేకరించారు. కాగా, విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాలు కామినేని ఆస్పత్రికి చేరుకుని ఆందోళన నిర్వహించాయి.