
సాక్షి, విజయవాడ: గొల్లపూడిలోని నారాయణ కళాశాల హాస్టల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థి రామాంజనేయరెడ్డి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న అతను.. కాలేజీ హాస్టల్‌లోని రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యతో హాస్టల్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కళాశాల యాజమాన్యం వేధింపులవల్లే రామాంజనేయరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.