
సాక్షి, గన్నవరం: ఆత్మహత్యకు పాల్పడ్డ డిగ్రీ విద్యార్థి మురళిపై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని, అతడి ఆత్మహత్యతో ఎటువంటి సంబంధం లేదని గన్నవరం ఎస్‌ఐ నారాయణమ్మ తెలిపారు. మురళి ఆత్మహత్యపై ఎస్‌ఐ వివరణ ఇచ్చారు. మురళి ఓవర్ స్పీడ్‌తో రాంగ్ రూట్‌లో బైక్ నడపడంతోనే స్టేషన్‌కు పిలిచి మాట్లాడనని, ఎస్‌ఐ అయితే నాకేంటి అంటూ దురుసుగా ప్రవర్తించాడని తెలిపారు. ఇదే విషయాన్ని సీఐ దృష్టికి తీసుకెళ్ళానని చెప్పారు. చదువుకుంటూ టీ దుకాణం నడిపే మురళి తమకు ముందు నుంచి పరిచయస్తుడేనని, స్టేషన్‌కు పిలిచాం కానీ, ఎటువంటి వార్నింగ్ ఇవ్వలేదని ఎస్‌ఐ నారాయణమ్మ స్పష్టం చేశారు. తన భర్త కూడా ఎలాంటి హెచ్చరికలు కానీ, బెదిరించడం కానీ చేయలేదని ఆమె తెలిపారు. కాగా ఎస్‌ఐ నారాయణమ్మ వేధింపుల వల్ల తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు డిగ్రీ విద్యార్థి మురళి గన్నవరంలోని కోనాయిచెరువులో దూకి ప్రాణాలు తీసుకున్న విషయం తెలిసిందే.
(చదవండి:నా చావుకు ఎస్‌ఐ వేధింపులే కారణం)