నారాయణ కాలేజీకి చెందిన మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లాకు చెందిన హృతిక్ నందన్ రెడ్డి అనే విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పటాన్‌చెరు: మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమెల శివారులో గల నారాయణ ఐఐటీ క్యాంపస్ ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి రిత్విక్ నందారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లాకు చెందిన రిత్విక్ (16) బుధవారం సాయంత్రం టిఫిన్‌కు రాలేదు. దీంతో తోటివిద్యార్థులు వెళ్లిచూడగా తన గదిలో ఉరే సుకొని కనిపించాడు. కళాశాల యాజమాన్యం రిత్విక్ మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.