శ్రీచైతన్య, నారాయణ కాలేజీలపై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం
వివిధ శాఖలు ఇచి్చన అనుమతులపై ఆరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేట్ ప్రైవేటు జూనియర్ కాలేజీలు భారీగా ఫీజులు దండుకుంటూ హాస్టళ్లలో విద్యార్థినులకు కనీస వసతు లు కలి్పంచకపోవడంపై తెలంగాణ మహిళా కమిషన్ తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద ఇటీవల రెండు కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీచైతన్య జూనియర్ కాలేజీ (మాదాపూర్ ఐఐటీ గర్ల్స్ క్యాంపస్), నారాయణ జూనియర్ కాలేజీ (బాచుపల్లి ఐఐటీ గర్ల్స్ క్యాంపస్)లను పూర్తిస్థాయిలో తనిఖీ చేసి అక్కడి విద్యార్థినులతో మాట్లాడారు. ప్రధానంగా ఆయా కాలేజీల్లో వాష్‌రూమ్‌లు, మంచినీటి వసతి అత్యంత దుర్భరంగా ఉన్న విషయాన్ని ప్రత్యక్షంగా గుర్తించి యాజమాన్యాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
పబ్లిక్ టాయిలెట్ల కంటే అధ్వానంగా...
రెండు కాలేజీల్లోనూ వందలాది మంది విద్యార్థినులు ఉండగా వారి సంఖ్యకు తగినన్ని వాష్‌రూమ్‌లు లేకపోవడం, మంచినీటి వసతి ప్రాంగణం దుర్గంధం వెదజల్లుతుండటంపై నేరెళ్ల శారద తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డారి్మటరీలు అపరిశుభ్రంగా ఉన్నాయని, చాలా వాష్‌రూమ్‌లకు తలుపులు లేవని పలువురు విద్యార్థినులు ఆమెకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ రెండు కాలేజీలకు ఎలాంటి అనుమతులు ఇచ్చారో పూర్తిస్థాయి నివేదిక సమరి్పంచాలని జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక, ఆహార భద్రత విభాగం, ఇంటర్ బోర్డు కమిషనర్‌కు తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద నోటీసులిచ్చారు. ఎలాంటి ఇబ్బందులున్నా తనకు ఫిర్యాదు చేయాలని సూచిస్తూ ఫోన్ నంబర్‌ను విద్యారి్థనులకు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment