nerella sharada
-
కాలేజీలా.. మురికి కూపాలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేట్ ప్రైవేటు జూనియర్ కాలేజీలు భారీగా ఫీజులు దండుకుంటూ హాస్టళ్లలో విద్యార్థినులకు కనీస వసతు లు కలి్పంచకపోవడంపై తెలంగాణ మహిళా కమిషన్ తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఇటీవల రెండు కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీచైతన్య జూనియర్ కాలేజీ (మాదాపూర్ ఐఐటీ గర్ల్స్ క్యాంపస్), నారాయణ జూనియర్ కాలేజీ (బాచుపల్లి ఐఐటీ గర్ల్స్ క్యాంపస్)లను పూర్తిస్థాయిలో తనిఖీ చేసి అక్కడి విద్యార్థినులతో మాట్లాడారు. ప్రధానంగా ఆయా కాలేజీల్లో వాష్‌రూమ్‌లు, మంచినీటి వసతి అత్యంత దుర్భరంగా ఉన్న విషయాన్ని ప్రత్యక్షంగా గుర్తించి యాజమాన్యాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పబ్లిక్ టాయిలెట్ల కంటే అధ్వానంగా... రెండు కాలేజీల్లోనూ వందలాది మంది విద్యార్థినులు ఉండగా వారి సంఖ్యకు తగినన్ని వాష్‌రూమ్‌లు లేకపోవడం, మంచినీటి వసతి ప్రాంగణం దుర్గంధం వెదజల్లుతుండటంపై నేరెళ్ల శారద తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డారి్మటరీలు అపరిశుభ్రంగా ఉన్నాయని, చాలా వాష్‌రూమ్‌లకు తలుపులు లేవని పలువురు విద్యార్థినులు ఆమెకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ రెండు కాలేజీలకు ఎలాంటి అనుమతులు ఇచ్చారో పూర్తిస్థాయి నివేదిక సమరి్పంచాలని జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, ఆహార భద్రత విభాగం, ఇంటర్ బోర్డు కమిషనర్‌కు తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద నోటీసులిచ్చారు. ఎలాంటి ఇబ్బందులున్నా తనకు ఫిర్యాదు చేయాలని సూచిస్తూ ఫోన్ నంబర్‌ను విద్యారి్థనులకు ఇచ్చారు. -
మహిళలపై టీఆర్ఎస్ వివక్ష: శారద
సాక్షి, హైదరాబాద్: జోగినీలు, వికలాంగులు, భర్త విడిచిపెట్టిన మహిళలకు అభయహస్తం పింఛన్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై వివక్ష చూపుతోందని టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద విమర్శించారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఏడాదిగా మహిళలకు అభయహస్తం పింఛన్లు అందలేదన్నారు. సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యం పేరిట కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నారన్నారు. -
'మహిళలపై టీఆర్ఎస్ వివక్ష'
హైదరాబాద్: అభయహస్తం పింఛన్లు, జోగినులకు, వికలాంగులకు, భర్త విడిచిపెట్టిన మహిళలకు పింఛన్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై వివక్ష చూపిస్తోందని టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద విమర్శించారు. గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ అభయహస్తం పింఛన్లు ఏడాది నుంచి మహిళలకు అందడం లేదన్నారు. వికలాంగులకు పింఛన్లు ఇవ్వడంలో సదరన్ క్యాంపుల్లో డాక్టర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యం అంటూ కొంతమంది కాంట్రాక్టర్లు భారీగా దండుకుంటున్నారని, సన్నబియ్యం పేరిట రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నారని శారద ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పటిదాకా ఎక్కడ పూర్తిచేశారో చెప్పాలని సవాల్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలతో కలిసి జిల్లా కలెక్టరేట్లను ముట్టడిస్తామని శారద హెచ్చరించారు. -
కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది
-
'ఆ మొత్తం' ఎంపీ కవిత కార్యక్రమాలకే ఖర్చు చేశారు
హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు, ఆశావర్కర్ల ఆత్మహత్యలపై కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నేరెళ్ల శారద శుక్రవారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. బతుకమ్మ పండగకు తెలంగాణ ప్రభుత్వం అధిక నిధులు కేటాయించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ వైపు రైతులు, ఆశావర్కర్లు ఆత్మహత్యల నేపథ్యంలో బతుకమ్మ పండగకు రూ. 10 కోట్లు కేటాయించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. గత ఏడాది కూడా ఈ పండగకు ప్రభుత్వం రూ. 10 కోట్లు కేటాయిస్తే అవి ఎంపీ కె.కవిత కార్యక్రమాల కోసమే ఖర్చు చేశారని నేరెళ్ల శారద ఆరోపించారు. బతుకమ్మ పండగ కోసం కేటాయించిన నిధులను గ్రామ పంచాయతీలకు కేటాయించాలని కేసీఆర్ ప్రభుత్వానికి సూచించారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి కాని జాగృతి సంస్థ దత్తత తీసుకోవడం ఏమిట అని కేసీఆర్ ప్రభుత్వాన్ని నేరెళ్ల శారద సూటిగా ప్రశ్నించారు. అలాగే అన్నదాతలు అనాధలని జాగృతి సంస్థ భావించడం సరికాదని నేరెళ్ల శారద అన్నారు. -
'కేసీఆర్ మహిళల పట్ల వివక్ష చూపుతున్నారు'
హైదరాబాద్: మహిళల పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వివక్ష చూపుతున్నారని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ధ్వజమెత్తారు. కేబినెట్లో మహిళలకు చోటు కల్పించలేదని, తెలంగాణ ఏర్పడి ఏడాది గడిచినా మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయకుండా తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ రెండురాష్ట్రాలకు ఉమ్మడి మహిళాకమిషన్ కొనసాగుతోందన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం కుంభకోణాల మయం కాగా, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మహిళల పట్ల వివక్షను చూపుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పలువురికి మంత్రి పదవులిచ్చి మహిళలకు పెద్దపీట వేశారని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా మంత్రిపదవి కల్పించలేదన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించలేదని విమర్శించారు. ఎన్నికలపుడు మహిళలను పొగిడిన కేసీఆర్ ఇప్పుడు మహిళలకు తగిన గుర్తింపునివ్వడం లేదన్నారు. ప్రజలు తిరగబడే పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. రాష్ర్టంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. ఎన్నికలకు ముందు అవినీతిరహిత పాలనను అందిస్తామని చెప్పిన నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక కుంభకోణాలు చేసి అవినీతిమయమై పోయిందన్నారు. -
ఏపీకి పద్మశ్రీ.. తెలంగాణకు శారద
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులను నియమించింది. ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సుంకర పద్మశ్రీని, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నేరెళ్ల శారదను నియమించారు. సోమవారం ఏఐసీసీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తొమ్మిది రాష్ట్రాలకు మహిళ కాంగ్రెస్ అధ్యక్షులను నియమించారు.