
మహిళలపై టీఆర్‌ఎస్ వివక్ష: శారద
సాక్షి, హైదరాబాద్: జోగినీలు, వికలాంగులు, భర్త విడిచిపెట్టిన మహిళలకు అభయహస్తం పింఛన్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై వివక్ష చూపుతోందని టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద విమర్శించారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఏడాదిగా మహిళలకు అభయహస్తం పింఛన్లు అందలేదన్నారు. సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యం పేరిట కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నారన్నారు.