Gandhibhavan
-
మరింత మంచి పాలన
సాక్షి, హైదరబాద్: క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం గాం«దీభవన్‌లో ఘనంగా జరిగాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, వర్కింగ్ ప్రెసిసెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితుడు శ్రీనివాసమూర్తి పంచాంగ పఠనం చేశారు. ప్రజాభీష్టం మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అద్భుతంగా పాలన సాగిస్తుందన్నారు. వంద రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలు అమలు చేసి, ప్రజాదరణ పొందారని, రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా పాలన సాగుతుందని జోష్యం చెప్పారు. ఈ సందర్భంగా మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ ఈ క్రోది నామ సంవత్సరంలో కోపం తగ్గించుకొని కాంగ్రెస్ కార్యకర్తలు పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, కాంగ్రెస్ నాయకులు కుమార్‌రావ్, నిరంజన్, చల్లా నర్సింహారెడ్డి, మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల ఘర్షణ
-
రాష్ట్ర కాంగ్రెస్‌లో సంక్షోభం.. దిద్దుబాటలో డిగ్గీరాజా
రాష్ట్ర కాంగ్రెస్‌లో ముదిరిన సంక్షోభం.. దాన్ని చక్కదిద్దేందుకు హైకమాండ్ దిగ్విజయ్‌సింగ్‌ను బరిలోకి దింపడం.. ఆయన సుదీర్ఘంగా పది గంటల పాటు నేతలతో విడివిడిగా భేటీ అయి చర్చించడం ఉత్కంఠ రేపుతోంది. రేవంత్ తీరును నిరసిస్తూ పలువురు సీనియర్లు పేపర్ క్లిప్పింగ్స్, వీడియోలను దిగ్విజయ్‌కు సమర్పించారని, కోవర్టులంటూ జరిగిన ప్రచారం, కమిటీల్లో ప్రాధాన్యంపై ఫిర్యాదు చేశారనే సమాచారం ఓవైపు.. ఇదే సమయంలో రేవంత్ వల్ల రాష్ట్ర పార్టీలో ఊపు వచ్చిందంటూ ఆయనను సమర్థించే నేతలు వివరించారనే ప్రచారం మరోవైపు ఆసక్తి రేపాయి. అసలు దిగ్విజయ్ ఏ సమాచారం సేకరించారు, అధిష్టానానికి ఏం చెబుతారన్నది హాట్ టాపిక్‌గా మారింది. గాంధీభవన్‌లో డిగ్గీరాజా సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలోనే.. ఉస్మానియా విద్యార్థి నేతలు చేసిన రచ్చ, దానిపై దిగ్విజయ్ ఆగ్రహం కూడా చర్చనీయాంశమైంది. శుక్రవారం కూడా పలువురు నేతలతో సమావేశం కానున్న దిగ్విజయ్.. మీడియా సమావేశంలో ఏం చెప్తారోనని కాంగ్రెస్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. పది గంటలు.. సుదీర్ఘ భేటీలు బుధవారం రాత్రే హైదరాబాద్‌కు వచ్చిన దిగ్విజయ్‌సింగ్‌ను కొందరు నేతలు ఉదయమే హోటల్ వద్ద కలిసి మాట్లాడారు. తర్వాత గాంధీభవన్‌లో సీనియర్లతో దిగ్విజయ్ భేటీ అయ్యారు. రాత్రి 9 గంటల వరకు.. అంటే దాదాపు పది గంటల పాటు విడివిడిగా జరిగిన ఈ సమావేశాల్లో రాష్ట్ర పార్టీలో పరిణామాలు, చక్కదిద్దే చర్యలపై అభిప్రాయాలు తీసుకున్నారు. విద్యార్థి నేతల రచ్చ.. దిగ్విజయ్ పార్టీ నేతలతో భేటీలు జరుపుతున్న సమయంలోనే ఓయూ విద్యార్థి నేతలు తమకు పదవులు ఇవ్వకుండా అన్యాయం చేశారంటూ గాంధీభవన్ వద్ద నినాదాలు చేశారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, మరికొందరు నాయకులకు.. విద్యార్థి నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. దీనిపై దిగ్విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీసీ కులగణనతోనే సామాజికన్యాయం
సాక్షి, హైదరాబాద్: దేశంలో బీసీల జనాభా ఎంత ఉందో కచ్చితంగా తేలితేనే ఆయా కులాలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. దేశంలో సామాజికన్యాయం జరగాలంటే బీసీ కులాల జనగణన చేపట్టాల్సిందేనని స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడి గాంధీభవన్‌లో బీసీల జనగణనపై అఖిలపక్ష సమావేశం జరిగింది. టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం, ఎం.వి.రమణ(సీపీఎం), బాలమల్లేశ్(సీపీఐ), సంధ్య(న్యూడెమోక్రసీ)లతోపాటు ప్రొఫెసర్ మురళీమనోహర్, ప్రొఫెసర్ తిరుమలి, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ మాట్లాడుతూ బీసీల ఓట్లు లేకుండా ఎవరూ చట్టసభల్లో అడుగుపెట్టలేరని, వారి జనాభా లెక్కలు చెప్పాలని అడగడంలో న్యాయం ఉందని అన్నారు. వన్‌నేషన్–వన్ సెన్సెన్ విధానాన్ని తీసుకురావాలని కోరారు. మన రాష్ట్రంలో కులాలవారీగా లెక్కలు తీసిన సమగ్ర కుటుంబసర్వే వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదని రేవంత్ ప్రశ్నించారు. వెంటనే సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టును బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జనగణన కోసం బీసీలు చేపట్టే ఏ ఉద్యమానికైనా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తుందని రేవంత్ హామీ ఇచ్చారు. ప్రొఫెసర్ మురళీమనోహర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక బీసీలు వెనుకబడిపోతున్నారని వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ ఎం.కోదండరాం మాట్లాడుతూ బీసీ జనగణనపై రాష్ట్రపతికి అన్ని పార్టీల పక్షాన లేఖ రాయాలని సూచించారు. పెద్ద ఎత్తున ఉత్తరాల ఉద్యమం చేపట్టాలన్నారు. కాగా, అఖిలపక్ష భేటీలో భాగంగా వెంటనే బీసీ గణన చేపట్టాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. -
గాంధీభవన్‌లో దండోరా సభ పాస్‌ల గొడవ
హైదరాబాద్: గాంధీభవన్‌లో దండోరా సభ పాస్‌ల గొడవ తీవ్ర దుమారాన్ని రేపింది. కాగా, సభకు సంబంధించి తమకు పాస్‌లు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ, నిరంజన్లు గాంధీభవన్‌లో ఆందోళన చేపట్టారు. సీనియర్లకు వీఐపీ పాస్‌లు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, టీడీపీ నుంచి వచ్చిన వారి పెత్తనమేంటని సీనియర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
కాంట్రాక్ట్ నర్సుల ఆందోళన.. గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన తమను ప్రభుత్వం అన్యాయం తొలగించిందంటూ కాంట్రాక్ట్ నర్సులు శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ర్యాలీగా బయల్దేరారు. ఈ క్రమంలో పోలీసులు వారిని గాంధీభవన్ వద్ద అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు, నర్సుల మధ్య తోపులాట జరిగింది. పలువురు గాయాల బారిన పడ్డారు. దీంతో గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలంటూ కాంట్రాక్ట్ నర్సులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1640 మంది కాంట్రాక్ట్ నర్సులను విధుల నుంచి తొలగించింది. దీంతో వారిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ విషయమై నర్సులు హెచ్ఆర్సీనీ సైతం ఆశ్రయించారు. -
దేశంలో అభద్రతాభావం
సాక్షి, హైదరాబాద్: ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దేశంలో ఏ వర్గానికి చెందిన ప్రజలూ భయపడుతూ బతకలేదని, ఆరేళ్ల బీజేపీ పాలనలో మాత్రం లక్షలాది మంది భయంతో బతికే పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ శాసన సభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. సెక్యులర్ భావజాలం ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం పార్లమెంటులో తగ్గడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రజలు రోడ్ల మీదకు వస్తే సరిపోదని, ప్రజల గొంతుక వినిపించే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ఉండాలని ఆయన అన్నారు. టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన నాగరిగారి ప్రీతమ్ మంగళవారం గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భట్టి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దళితులు ఆత్మగౌరవంతో బతికారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన రిజర్వేషన్ల కారణంగా ఆయా వర్గాలు చైతన్యవంతులయ్యారని, ఎస్సీ విభాగం బలోపేతం అయితేనే కాంగ్రెస్ బలోపేతం అవుతుందని అన్నారు. కాంగ్రెస్ తీసుకువచ్చిన రిజర్వేషన్లకు ఇప్పుడు ప్రమాదం ఏర్పడిందని, కేంద్రంలోని బీజేపీ వైఖరి కారణంగా రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి, ఏపీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్, ఏఐసీసీ కార్యదర్శులు ఎస్.సంపత్‌కుమార్, మధుయాష్కీగౌడ్, పొన్నాల లక్ష్మయ్య, దాసోజు శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రీతమ్‌కు తన అభినందన సందేశం పంపారు. -
గాంధీభవన్‌లో ఎలక్షన్ సెల్: భట్టి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల సమన్వయం కోసం ఏర్పాటు చేసిన టీపీసీసీ లాజిస్టిక్స్ కమిటీ 24 గంటల పాటు గాంధీభవన్‌లో పని చేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పా టైన తర్వాత తొలి సమావేశం బుధవారం గాంధీ భవన్లో జరిగింది. దీనికి భట్టితో పాటు కుసుమ కుమార్, కమిటీ కన్వీనర్ కుమార్‌రావు, సభ్యులు వినయ్‌కుమార్, కోదండరెడ్డి తదితరులు హాజర య్యారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడు తూ రెవెన్యూ, పోలీస్, న్యాయ, ఎన్నికల సంఘంతో పాటు ముఖ్యమైన ప్రభుత్వ యంత్రాంగంతో సమా చార సేకరణ, ఎన్నికల అంశాలకు సంబంధించిన సంప్రదింపులు ఈ కమిటీ జరుపుతుందని చెప్పారు. ఏఐసీసీ నుంచి వచ్చే సమాచారాన్ని సేకరించి జిల్లా పార్టీ అధ్యక్షులు, పోటీలో ఉన్న నేతలకు చేరవేస్తుం దని, వారితో సంప్రదింపులు జరిపి అవసరమైన సమాచారాన్ని అందిస్తారని చెప్పారు. ప్రతి 6 గంటలకు ఒక టీమ్ గాంధీభవన్‌లో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. -
లోక్‌సభకు పోటీ చేస్తా
సాక్షి, హైదరాబాద్: తాను వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేస్తానని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ వెల్లడించారు. అయితే, ఏ స్థానం నుంచి పోటీ చేయాలన్నది పార్టీ నిర్ణయిస్తుందని, ఎక్కడి నుంచి పోటీచేయమన్నా అందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ దొడ్డిదారిన గెలిచారని విమర్శించారు. వీవీప్యాట్లను లెక్కించాలని తాము కోరుతున్నామని, కాలం గడిచేకొద్దీ సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాము వేసిన పిటిషన్‌పై వీవీ ప్యాట్ల వివరాలు ఐదేళ్లు ఉంటాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టులో చెప్పారని, దీనిపై వచ్చేనెల 7లోపు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు చెప్పిందని ఆయన వెల్లడించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యంతో పాటు ఓట్ల కూల్చివేత కూడా జరిగిందని, ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్ పో -
కొంచెం ముందు కుదిరితే బాగుండేది
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనే క్రమంలో ఇతర పార్టీలతో పొత్తులు కుదుర్చుకోవడం కొద్దిగా ముందు జరిగి ఉంటే బాగుండేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పొత్తులు కొంచెం త్వరగా కుదిరి కూటమిగా ప్రజల్లోకి వెళ్లి ఉంటే బాగుండేదని, అయినా తాము ప్రచారంలో ఎక్కడా వెనుకబడలేదని చెప్పారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు. పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడంతో పాటు టీవీల్లో విస్తృత ప్రచారం చేసినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే ఏఐసీసీకి ప్రాథమిక నివేదిక ఇచ్చామని, పోటీ చేసిన అభ్యర్థులు, గెలిచిన వారితో మాట్లాడుతున్నామని తెలిపారు. రెండు, మూడ్రోజుల్లో ఫలితాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామని చెప్పారు. ఈ ఫలితాలెలా ఉన్నా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎల్పీ సమావేశం గురించి ప్రస్తావించగా, ఎప్పుడు నిర్వహించాలనేది ఆలోచిస్తున్నామని చెప్పిన ఆయన.. ఇంకా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారమే కాలేదు కదా అని వ్యాఖ్యానించారు. కూటమి కొనసాగింపుపై రెండు, మూడ్రోజుల్లో కుంతియాతో చర్చిస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. సీఈసీ, ఈసీకి ఫిర్యాదు చేస్తాం.. ఎన్నికల్లో తమ ఓటమికి అనేక కారణాలున్నాయని, ఎన్నికల నిర్వహణపైనే ప్రజల్లో ఎన్నో అనుమానాలున్నాయని ఉత్తమ్ చెప్పారు. ఒక్క శాతం ఓట్ల తేడాతో తమ అభ్యర్థులు ఓడిన ధర్మపురి, కోదాడ, ఇబ్రహీంపట్నంలలో ఎందుకు వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించలేదని ప్రశ్నించారు. అసలు వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కపెట్టడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పోలైన ఓట్లకు, లెక్కింపు ఓట్లకు తేడా ఉందనే విషయాన్ని చెప్పినా కనీసం సమాధానం చెప్పే వాళ్లు లేరని.. దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. మంచిర్యాల నియోజకవర్గంలో సాయంత్రం 4 గంటల తర్వాత వేల సంఖ్యలో ఓట్లు పోల్ కావడం ఎలా సాధ్యమన్నారు. వీటన్నింటిపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ), రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి ప్రశ్నించగా తానేమీ మాట్లాడనని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. -
సీఎల్పీ నేతగా అవకాశమిస్తే న్యాయం చేస్తా: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా అధిష్టానం బాధ్యతలు అప్పగిస్తే న్యాయం చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలోనూ ఉండదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారతారని తాను అనుకోవడం లేదన్నారు. కొందరికి కొన్ని బలహీనతలున్నాయని, వాటిని తెలుసుకుని అండగా ఉంటే ఎవరూ పార్టీని వీడివెళ్లరని చెప్పారు. పార్టీ వీడాలనుకునే వారిని గుర్తించి వారితో పాటు కేడర్‌కు ధైర్యం ఇవ్వాలని ఆయన సూచించారు. కుంతియా, ఉత్తమ్‌తో పాటు హైకమాండ్ రంగంలోకి దిగి ఇందుకు తగిన కార్యాచరణ చేపట్టాలని కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయినందునే ఓడిపోయామని చెప్పారు. కర్ణుడి చావుకు ఎన్ని కారణాలున్నాయో తన గెలుపునకు కూడా అన్ని కారణాలున్నాయన్నారు. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసే అవకాశం తన భార్య నిర్మలకు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరనున్నట్టు ఆయన చెప్పారు. తన కుమార్తె జయను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించే ఆలోచన లేదని, ఎన్ఎస్యూఐలో క్రియాశీలకంగా పనిచేయించి సంస్థాగతంగా ఆమెను చురుకుగా తయారు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. -
అధికారంలోకి రావాలంటే ఏం చేద్దాం!
కాంగ్రెస్ నేతలతో కుంతియా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలన్న అంశంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా ఆదివారం గాంధీభవన్‌లో ముఖ్యనేతలతో సమాలోచనలు జరిపారు. మల్లు భట్టివిక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, రేణుకాచౌదరి, దామోదర రాజనర్సింహ, దానం నాగేందర్, పొన్నం ప్రభాకర్, జగ్గారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులతో ఆయన విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ వైఫల్యాలపై పాదయాత్ర చేస్తానని పార్టీ ఇన్చార్జి కుంతియాకు చెప్పినట్టుగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. పార్టీ ముఖ్యనేతలందరినీ కలుపుకొని పోవాలని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ప్రస్తుత నాయకత్వం ఏకపక్షంగా పనిచేస్తోందని ఆరోపించారు. మూడు నెలలకోసారి భారీ బహిరంగసభను నిర్వహించాలని, ఒక్కో జిల్లాలో ఒక్కో అంశంపై సభను పెట్టాలని జగ్గారెడ్డి సూచించారు. -
దేవరకొండలో తన్నుకున్న కాంగ్రెస్ నేతలు
- పరస్పరం దాడి - పగిలిన తలలు.. చిందిన రక్తం సాక్షి, యాదాద్రి: కాంగ్రెస్ నాయకులు మళ్లీ తన్నుకున్నారు. పార్టీలోని రెండువర్గాల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పూలకుండీలు, టీ కప్పులతో పరస్పరం దాడి చేసుకున్నారు. వారిద్దరి తలలు పగిలాయి. దీంతో సమావేశంలో తీవ్ర గందరగోళం.. ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలు తన్నుకున్న విషయం మరువక ముందే భువనగిరిలో మరోసారి బాహాబాహీకి దిగడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రిజర్వుడ్ నియోజకవర్గాలైన తుంగతుర్తి, నకిరేకల్, దేవరకొండ ప్రాంత నాయకులతో లీడర్ షిప్ డెవలప్మెంట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఏఐసీసీ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు ప్రశాంత్, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, తెలంగాణ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరేపల్లి మోహన్ పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 15 మంది ముఖ్యుల పేర్లను ముందుగా నిర్ణయించి వారితోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేవరకొండ నియోజకవర్గం సమీక్ష ప్రారంభం కాగానే.. మాజీ జెడ్పీటీసీ గుంజ రేణుక భర్త నారాయణ లేచి ముందుగా ప్రకటించిన జాబితాలో తన పేరు ఎందుకు లేదని, రేపటి ఎన్నికల్లో గెలవాలనుకునే వారికి తనతో అవసరం లేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో తనను లెక్క చేయకుండా వ్యవహరిస్తున్న నీ పేరెందుకు రాయాలని ఇన్చార్జి జగన్‌లాల్‌నాయక్ తన ముందు ఉన్న పూలకుండీని నారాయణవైపు విసిరాడు. అది అతని తలకు తాకి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో ఇరువురు బాహాబాహీకి దిగారు. ఈ నేపథ్యంలో ఇరువురిని విడిపించబోయిన ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరేపల్లి మోహన్ కింద పడి స్పృహ కోల్పోయారు. నారాయణ భార్య రేణుక టీ కప్పుతో జగన్‌లాల్‌నాయక్ తలపై కొట్టారు. దీంతో అతనికీ రక్తస్రావం అయింది. వెంటనే వారివురిని ఆస్పత్రికి పంపించి వైద్యం చేయించారు. తలకు కట్లు కట్టుకుని వారు మళ్లీ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ పటిష్టత కోసం విభేదాలు వీడి ఐక్యంగా పనిచేయాలని పీసీసీ నేతలు రాజీ కుదిర్చి వెళ్లిపోయారు. -
పాల్వాయికి అశ్రు నివాళి
- స్వగ్రామం ఇడికుడలో అధికార లాంఛనాలతో దహన సంస్కారాలు - అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు..గాంధీభవన్‌లో నేతల నివాళి చండూరు: హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూమనాలిలో గుండె పోటుతో హఠాన్మరణం చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం సాయంత్రం ఆయ న స్వగ్రామం ఇడికుడలోని వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంఛనాలతో జరిగాయి. శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు గాంధీభవన్ నుంచి బయలుదేరిన పాల్వాయి పార్థి వదేహం చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, మునుగోడు మండలాల మీదుగా ఇడికుడ గ్రామానికి చేరుకుంది. సంద ర్శకుల కోసం ఆయన ఇంటిముందు భౌతికకాయాన్ని ఉంచగా నియోజకవర్గ ప్రజలు, అభిమానులు నివాళులర్పించారు. 4.30 గంటలకు వేలాది మంది ప్రజల మధ్య మొదలైన అంతిమయాత్ర 6.30 గంటలకు వ్యవసాయ క్షేత్రానికి చేరింది. ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్ సమక్షంలో పోలీసులు 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపిన తర్వాత పెద్ద కుమారుడు శ్రవణ్‌కుమార్‌రెడ్డి పాల్వాయి చితికి నిప్పంటించారు. గాంధీభవన్‌లో అరగంటపాటు.. పాల్వాయి భౌతికకాయానికి గాంధీభవన్‌లో పలువురు నేతలు నివాళులర్పించారు. శనివారం ఉదయం పాల్వాయి నివాసం నుంచి భౌతికకాయాన్ని గాంధీభవన్‌కు తరలించారు. కార్య కర్తల సందర్శనార్థం అరగంటపాటు ఉంచారు. భౌతికకా యంపై పార్టీ జెండా, పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పిం చారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసన మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, పీఏసీ చైర్పర్సన్ జె.గీతారెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శులు ఆర్.సి. కుంతియా, వి.హనుమంతరావు, మాజీ మంత్రులు డి.శ్రీధర్ బాబు, టి.జీవన్‌రెడ్డి, వి.సునీతా లక్ష్మారెడ్డి, దానం నాగేందర్ తదితరులు పాల్వాయి భౌతికకాయానికి నివాళులర్పించారు. పాల్వాయి తెలంగాణ కోసం కృషి చేశారు: సురవరం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేశారని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా, రాష్ట్రమంత్రిగా, ఎంపీగా ప్రజాసమస్యలపై పనిచేశారన్నారు. పాల్వాయి ఆకస్మిక మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖుల సంతాపం.. పాల్వాయికి అనేక మంది ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, ఎంపీలు కే.కేశవరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, సుప్రీంకోర్టు జడ్జి నాగార్జున్‌రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు వాయిలార్ రవి, జెడ్పీ చైర్మన్ బాలూనాయక్, ఎమ్మెల్సీలు కోమటిరెడ్డి రాజగోపా ల్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, పూల రవీందర్, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వేముల వీరే శం, గ్యాదరి కిశోర్, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీను, తదితరులు ఘనంగా నివాళులర్పించారు. -
కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వం: వంశీ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయానికి, సాగునీటి రంగానికి తక్కువగా నిధులను కేటాయించడం ద్వారా తమది రైతు వ్యతిరేక ప్రభుత్వమని సీఎం కేసీఆర్ చెప్పుకున్నారని ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించు కోకుండా, వ్యవసాయ సమస్యలకు బడ్జెట్లో కేటాయింపులు లేకుండా చేశారని ఆరోపించారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు నిధులను కేటాయించకుండా ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. కల్వకుర్తి ఎత్తిపోతలను పూర్తి చేయకుంటే రైతులతో కలసి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 2,722 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. కమీషన్లు వచ్చే పథకాలకు, కార్యక్రమాలకే ఈ బడ్జెట్లో నిధులను కేటాయించారని ఆరోపించారు. -
నేడు సీఎల్పీ భేటీ
అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహంపై చర్చ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానాల అమలుకు పట్టుబట్టాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) భావిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు గురువారం సీఎల్పీ భేటీ కానుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ కార్యదర్శి కుంతియా బుధవారమే హైదరాబాద్ చేరుకున్నారు. కాగా, బుధవారం రాత్రి దిగ్విజయ్‌సింగ్, కుంతియా, ఉత్తమ్.. మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డిని కలిసి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కాగా బుధవారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌లో అటెండర్లు, స్వీపర్లుగా విధులు నిర్వహిస్తున్న మహిళలను సత్కరించారు. -
ప్రజలను పట్టించుకోని టీఆర్ఎస్ సర్కార్: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం గాంధీభవన్‌లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించకుండా, రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఉత్తమ్ ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలకు విలువలేకుండా పోయిందని, నియంతల పాలన సాగుతున్నదని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ప్రతిపక్షనేత జానారెడ్డి, పార్టీ నేతలు వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య,నర్సారెడ్డి, పాల్వాయి గో వర్ధన్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మధుయా ష్కీ, శ్రీధర్‌బాబు, దానం నాగేందర్ పాల్గొన్నారు. -
సమస్యలను పరిష్కరించలేక వ్యక్తిగత విమర్శలా?
మంత్రి కేటీఆర్‌పై భట్టి ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: గ్రామీణులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాక ప్రతిపక్ష పార్టీ నేతల గడ్డం, పంచెకట్టు గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. గాంధీభవన్‌లో మంగళవారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన పడకేసిందని, ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉందని, పాలకుల అసమర్థతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా కేటీఆర్ కళ్లుమూసుకుని, మాయమాటలతో కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ప్రతిపక్షాలపై నోటికొచ్చినట్టు మాట్లాడటం మానుకుని, ప్రజల దగ్గరకుపోతే వాస్తవాలేమిటో కేటీఆర్‌కు తెలుస్తాయని భట్టి సూచించారు. -
మహిళలపై టీఆర్ఎస్ వివక్ష: శారద
సాక్షి, హైదరాబాద్: జోగినీలు, వికలాంగులు, భర్త విడిచిపెట్టిన మహిళలకు అభయహస్తం పింఛన్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై వివక్ష చూపుతోందని టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద విమర్శించారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఏడాదిగా మహిళలకు అభయహస్తం పింఛన్లు అందలేదన్నారు. సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యం పేరిట కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నారన్నారు. -
ప్రజల సమస్యలే ఎజెండా: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: రైతులు, విద్యార్థులు, యువకులు, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయని టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే కాంగ్రెస్ ఎజెండా అని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేయలేదని, పంట నష్టాన్ని అంచనా వేయలేదని, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని, కేంద్రం ఇచ్చిన నిధులను కూడా రైతులకు ఇవ్వలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ కుటుంబం తప్ప ప్రజలెవరూ సంతోషంగా లేరని మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అన్నారు. -
రేవంత్.. ఉచిత సలహాలొద్దు: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఉచిత సలహాలేమీ తమకు అవసరం లేదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పై రేవంత్ విమర్శలు సరికాదన్నారు. రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే పోలవరం అంశంలో ఏపీ సీఎం చంద్రబాబును ఒప్పించి, ఎత్తును తగ్గించాలన్నారు. -
దృష్టి మళ్లించడానికే జిల్లాలు: పొన్నం
సాక్షి, హైదరాబాద్: సమస్యలు, ప్రభుత్వ చేతగానితనం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేశారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి, ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న జిల్లాలు భిన్నంగా ఉన్నాయన్నారు. ప్రజా సౌకర్యం, సౌలభ్యం కోసం జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారా అని ప్రశ్నించిన పొన్నం.. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించి, రాజకీయ ప్రయోజనం పొందడానికే జిల్లాల ఏర్పాటుపై వేగం పెంచారన్నారు. జిల్లాల ఏర్పాటును వ్యతిరేకించడం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. జిల్లాల ఏర్పాటులో విపక్షాల అభిప్రాయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. అనాలోచిత, ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. సూచనలు స్వీకరించకపోతే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలపై పునస్సమీక్షిస్తామని పొన్నం చెప్పారు. -
వైఎస్ మార్గంలో కాంగ్రెస్: టీపీసీసీ
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి చూపించిన మార్గంలోనే కాంగ్రెస్‌పార్టీ నడుస్తున్నదని టీపీసీసీ నివాళిని అర్పించింది. వైఎస్ వర్థంతి సందర్భంగా గాంధీభవన్‌లో శుక్రవారం నివాళులు అర్పించారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్, మాజీమంత్రి డి.కె.అరుణ, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ నేతలు మాట్లాడుతూ దివంగతనేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గొప్ప దార్శనికుడు, పేదల పట్ల అభిమానం చూపించిన మానవతావాది అని కొనియాడారు. వైఎస్ చూపించిన మార్గంలోనే కాంగ్రెస్‌పార్టీ నడుస్తున్నదన్నారు. -
కేసును సీబీఐకి అప్పగించాలి: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: నయీమ్ కేసుకు సంబంధించి చాలా అనుమానాలున్నాయని, రోజుకో కొత్త సమాచారం వస్తున్నదని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. గాంధీభవన్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ నయీమ్‌ను ఎక్కడో పట్టుకుని కాల్చి చంపినట్టుగా తెలిసిందన్నారు. అతడి ఇంటిలో దొరికిన రూ.2 కోట్ల కంటే డబ్బు చాలా ఎక్కువగా ఉన్నట్టుగా ఫోన్లు వస్తున్నాయన్నారు. మహిళల అక్రమ రవాణా కేసును ఇంటర్‌పోల్‌తో కలసి విచారణ జరిపించాల్సి ఉంటుందన్నారు. ఈ కేసులో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పారిశ్రామిక వేత్తల పేర్లు వస్తున్నాయన్నారు. అందుకే నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. -
భూ సేకరణపై కాంగ్రెస్ నేతలకు అవగాహన
వివిధ ప్రాజెక్టులకు భూసేకరణలో చేసే సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై కాంగ్రెస్ నేతలకు గాంధీభవన్‌లో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యూపీఏ హయాంలో తీసుకువచ్చిన ఈ చట్టంపై ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు అవగాహన కల్పించారు. ప్రాజెక్టుల భూసేకరణ కోసం కేసీఆర్ సర్కారు తెచ్చిన జీవో123పై టీ కాంగ్రెస్ యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ముఖ్యనేతలు ఉత్తమ్, జానారెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, డీకే అరుణతో పాటు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. -
నేడు పీసీసీ కార్యవర్గ భేటీ
పార్టీ తాజా పరిస్థితి, వలసలపై ప్రధాన దృష్టి సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంలో దిగజారిన పార్టీ పరిస్థితి, నేతల వలసలు, పరస్పర విమర్శల నేపథ్యంలో ఆదివారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ దిగ్విజయ్‌సింగ్ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రోత్సహిస్తున్న వలసల ధాటికి కాంగ్రెస్ పార్టీ కకావికలమవుతోంది. సీనియర్ నేతలందరూ వలసబాట పడుతున్నారు. తాజా గా నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్‌లు కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సీనియర్ నేతలు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించి నా మార్పు కనిపించడంలేదు. అలాగే ఇటీవలి కాలంలో సీనియర్‌నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎల్పీ నేతలపైనే మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇప్పటికే పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైన నేపథ్యంలో నేతల తీరు హైకమాండ్‌కు మరింత చికాకు తెప్పిస్తోంది. దాంతో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయాలని నిర్ణయించింది. మరో ముగ్గురికి షోకాజ్‌లు కాంగ్రెస్‌లో షోకాజ్ నోటీసుల పర్వం కొనసాగుతోంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై విమర్శలు చేసిన నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన పార్టీ క్రమశిక్షణ సంఘం తాజాగా మరో ముగ్గురు సీనియర్లకు నోటీసులిచ్చింది. సీఎల్పీ నేత జానారెడ్డి కోవర్టని ఆరోపించిన పాల్వాయి గోవర్దన్‌రెడ్డితోపాటు కరీంనగర్ సభలో పరస్పర విమర్శలు చేసుకున్న డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, ఎస్సీసెల్ రాష్ట్ర చైర్మన్ ఆరేపల్లి మోహన్‌కు షోకాజ్ నోటీసులిచ్చింది. శనివారం గాంధీభవన్‌లో క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి, సభ్యుడు బండ ప్రకాశ్‌లు సమావేశమై పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించిన నేతల వివరణ తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నెల 17న తమ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సింది గా నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా, వ్యక్తిగత విమర్శలకు పాల్పడే వారె వరైనా కఠిన చర్యలు తప్పవని క్రమశిక్షణ సంఘం హెచ్చరించింది. ప్రెస్మీట్లపై ఆంక్షలు... పార్టీ నేతలు విలేకరుల సమావేశాలు నిర్వహించడంపై ఒక విధానాన్ని అనుసరించాలని క్రమశిక్షణ సంఘం సూచించింది. గాంధీభవన్‌లో నిర్వహించే ప్రెస్మీట్లకు సంబంధించి నేతలు ముందుగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ లేదా మీడియా వ్యవహారాల ఇన్చార్జి మల్లురవికి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరింది. అలాగే సీఎల్పీలో నిర్వహించే ప్రెస్మీట్లకు సంబంధించి అసెంబ్లీలో విపక్ష నేత కె.జానారెడ్డి లేదా మండలిలో విపక్ష నేత షబ్బీర్ ఆలీకి నాయకులు ముందుగా సమాచారం అందించాలని క్రమశిక్షణ సంఘం స్పష్టం చేసింది. -
ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది
ఎమ్మెల్సీ కోమటిరెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వంపై, టీఆర్ఎస్పై వ్యతిరేకత మొదలైందని, ఇకపై క్షేత్రస్థాయిలో క్రియాశీల పోరాటాలు చేయాల్సి ఉందని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో మంగళవారం ఆయన మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షునిగా ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరున్నా ఇప్పుడు పెద్దగా తేడా ఏమీ ఉండదన్నారు. పీసీసీ అధ్యక్షుని సమర్థతపై ఇప్పుడే విశ్లేషించడం సరికాదని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపై భవిష్యత్తులో చేసే పోరాటాలు, కార్యాచరణపై ఆధారపడి విశ్లేషించవచ్చని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి, అందరినీ కలుపుకుని, 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని నడిపించాలన్నారు. -
పార్టీ ఫిరాయింపులు అనైతికం
కబ్జాలు, కాలేజీలను కాపాడుకోవడానికే అజయ్ ఫిరాయిస్తున్నారు: పీసీసీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులు అనైతిక రాజకీయాలకు పరాకాష్ట అని పీసీసీ కిసాన్‌సెల్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ విమర్శించారు. గాంధీభవన్‌లో సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. అధికార పక్షం రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులను పట్టించుకోకుండా ఫిరాయింపులపైనే దృష్టి పెట్టిందన్నారు. గ్రామా ల్లో తాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పనులు దొరక్క పేదలు వలసలు పోతున్నారని, అయినా సీఎం కేసీ ఆర్, మంత్రులు పట్టించుకోవడం లేద న్నారు. టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తి అయితే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను బెదిరించి, బతిమిలాడి ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. స్వార్థం కోసమే: ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ కేవలం స్వార్థ ప్రయోజనాలకోసమే టీఆర్ఎస్లోకి ఫిరాయిస్తున్నారని కోదండరెడ్డి, నిరంజన్లు ఆరోపించారు. అజయ్ పార్టీలోకి వచ్చి రెండేళ్లు కాకున్నా సీఎల్పీ కోశాధికారి పదవి, పార్టీ సీనియర్లతో ఏర్పాటుచేసిన కార్యనిర్వాహక కమిటీలో చోటు దక్కిందన్నారు. పాలేరు ఉప ఎన్నికకు ముందు అజయ్ పార్టీ మార డం స్వార్థం, మోసాలకు పరాకాష్ట అని అన్నారు. వ్యాపారాలను, కాలేజీలను, కబ్జాలను కాపాడుకోవడానికే అజయ్ ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్‌లలో దశాబ్దాలు పనిచేసిన వారిని కాదని టికెట్ ఇచ్చిన కాంగ్రెస్‌పార్టీపై తప్పుడు వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. -
ఆరని జ్వాల
► గాంధీభవన్‌లో రెబల్స్ ఆందోళన ► ఉత్తమ్ కుమార్‌రెడ్డి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు ► గాంధీభవన్‌కు తాళాలు నేతల తీరుపై అభ్యర్థుల నిరసన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించి.. భంగపడిన నేతలు అగ్ర నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు శుక్రవారం గాంధీభవన్‌కు ఏకంగా తాళాలు వేశారు. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీ పీలోనూ నిరసన మంటలు రేగాయి. చిలుకానగర్‌లో నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు నాయకులు, కార్యకర్తలు ప్రకటించారు. నాంపల్లి:సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ దగా కోరు పార్టీగా మారిపోయిందని ఆ పార్టీ రెబల్ అభ్యర్థులు ఆరోపించారు. శుక్రవారం నాంపల్లి గాంధీభవన్‌లో బి- ఫారం అందని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ‘ఉయ్ వాంట్ జస్టిస్ ...ఉత్తమ్ కుమార్ డౌన్ డౌన్’ అంటూ నినదించారు. పీసీసీ అధ్యక్షుడు గాంధీభవన్‌కు వచ్చే వరకు అక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చున్నారు. వీరిని నిరోధించేందుకు తొలుత కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్‌కు తాళాలు వేయగా..ఆ తరువాత నేతల తీరుకు నిరసనగా రెబల్స్ తాళాలు వేశారు. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం పడిగాపులు కాశారు. విసుగు చెందిన వీరంతా చివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కనిపించడం లేదంటూ బేగంబజార్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎన్నికల్లో అవకాశం ఇవ్వకుండా ముక్కూ మొహం తెలియని వారిని పోటీలో నిలిపారని ఆరోపించారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్‌లో పని చేస్తున్నాను: శోభారాణి గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల మహిళా కార్యకర్తగా పని చేస్తున్నాను. కార్యకర్తలు చిన్న చిన్న పదవులను ఆశిస్తారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులను ఇవ్వమన్నా ఇవ్వరు. డివిజన్ స్థాయిలో జరిగే ఎన్నికల్లో కూడా కష్టపడి పనిచేసే వారికి అవకాశం ఇవ్వకుంటే ఎలా? లంగర్‌హౌస్ డివిజన్ పార్టీ టికెట్ అడిగితే కార్వాన్ ఇన్చార్జి రూప్సింగ్ రూ.25 లక్షలు డిమాండ్ చేశారు. ఎందుకని అడిగితే ఈ డబ్బులు దానం నాగేందర్‌కు ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. ఎన్నికల్లో ప్రచారం కోసం డబ్బు అడిగితే ఖర్చు చేసుకోగలం కానీ... జేబులు నింపడానికిఎక్కడ తెచ్చి ఇవ్వాలి? డబ్బులు ఇవ్వనందుకు టికెట్ కేటాయించలేదు. బి-ఫారం ఇవ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేస్తే నకిలీది ఇచ్చారు. ఇదెక్కడి న్యాయం? తప్పుడు బి-ఫారం ఇచ్చిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై బేగంబజార్ పీఎస్‌లో ఫిర్యాదు చే శాను. మాయ మాటలతో ఉపసంహరింపజేశారు: రేణు కేస్వాని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందనే భరోసాతో ఘాన్సీ బజార్లో నామినేషన్ వేశాను. ఉపసంహరణ నాటికి బీ ఫారాన్ని ఇతరులకు ఇచ్చేశారు. గాంధీభవన్‌లో ఇదేమని ప్రశ్నిస్తే మాజీ మంత్రి షబ్బీర్ అలీ దూతగా నావద్దకు వచ్చారు. ‘మీరు నామినేషన్‌ను ఉపసంహరించుకోవాల’ంటూ ప్రాధేయపడ్డారు. ఆ తరువాత పత్తాలేకుండా పోయారు. దగా కోరు పార్టీగా మారింది:పార్వతి శర్మ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వారికి పదవులు ఇవ్వడం లేదు. ఇన్నేళ్లుగా పార్టీలో కొనసాగుతుండటమే మేం చేసిన పెద్ద తప్పు. ఇతర పార్టీల్లో చేరిన వారు పెద్ద పదవుల్లో ఉన్నారు. సీనియర్ కార్యకర్తలను కాదని ఇతరులకు బి-ఫారమ్ ఎలా ఇచ్చారని ఉత్తమ్‌కుమార్ రెడ్డిని అడిగేందుకు గాంధీభవన్‌కు వస్తే పత్తా లేకుండాపోయారు. ఉదయం నుంచీ వేచి ఉన్నాం. మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం. -
మహిళా సాధికారత కాంగ్రెస్‌తోనే సాధ్యం
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: సాక్షి, హైదరాబాద్: దేశంలో మహిళా సాధికారతకు కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. అరవై ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన ఘనత సోనియాదేనని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మహిళలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. గాంధీభవన్‌లో ఆదివారం మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా భేరీలో ఆయన ప్రసంగించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించేలా చట్టం తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని అన్నారు. ఈ చట్టం ద్వారానే తొలిసారిగా గ్రేటర్లో 75 మంది మహిళలు కార్పొరేటర్లు కాబోతున్నారన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో... గెలిచే వారికే టికెట్లు కేటాయిస్తామని, ఇందుకోసం ప్రైవేటు సంస్థల ద్వారా సర్వేలు చేయిస్తున్నామన్నారు. ఈ నెల 13న అభ్యర్థులను ప్రకటించనున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు శోభా ఓజా మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో మహిళలు చురుగ్గా పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు. కేంద్ర మాజీ మం త్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ హయంలోనే హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెం ట్ భట్టి విక్రమార్క, ఎంపీ హనుమంతరావు, ఎమ్మెల్యే గీతారెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, ఎంఎల్సీ ఆకుల లలిత పాల్గొన్నారు. ఎంఐఎం బలహీనపడుతోంది... దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ఎంఐఎం పార్టీ హైదరాబాద్‌లోనే బలహీనపడుతోందని కర్ణాటక సమాచార శాఖ మంత్రి రోషన్ భేగ్ అన్నారు. ఎంఐఎంకు చెం దిన పలువురు నేతలు గాంధీభవన్‌లో ఆదివా రం కాంగ్రెస్‌పార్టీలో చేరారు. రోషన్ మాట్లాడుతూ ఎంఐఎం కర్ణాటకలో 27 కార్పొరేటర్ స్థానాలకు పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవలేదని, బీహార్‌లో కూడా అదే పరిస్థితని చెప్పా రు. హైదరాబాద్ ముస్లింలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్ అలీ, హన్మంతరావు పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో చేరికలు: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలోని పలువురు టీఆర్ఎస్ స్థానిక నాయకులు మల్కాజ్గిరి కాంగ్రెస్ ఇన్చార్జి నందికంటి శ్రీధర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రె డ్డి పార్టీలోకి వచ్చిన వారిని కాంగ్రెస్ కండువాలతో ఆహ్వానించారు. -
కాంగ్రెస్‌కు కేఎం ప్రతాప్ రాజీనామా
గాంధీభవన్, ఏఐసీసీ కార్యాలయం, సోనియాకు ఫ్యాక్స్ ద్వారా లేఖ హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కేఎం ప్రతాప్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శుక్రవారం గాంధీభవన్, ఏఐసీసీ కార్యాలయం, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీలకు వేర్వేరుగా ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్‌లో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొందరు కాంగ్రెస్ నాయకులపై నిప్పులు చెరిగారు. తాను కాంగ్రెస్‌లో 40 ఏళ్లుగా క్రియాశీలక స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి మూడు సార్లు డీసీసీ అధ్యక్షుడిగా పని చేశానన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీగా ఉండేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మారిందని దుయ్యబట్టారు. కష్టపడే వారికి పార్టీలో గుర్తింపు లభించడం లేదని, కేవలం దళారులకే నిలయంగా మారిందని ఆరోపించారు. పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ వల్లే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. దిగ్విజయ్ సింగ్ ఒంటెద్దు పోకడలతో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని.. పార్టీలో పీసీసీ అధ్యక్షులుగా పని చేసిన కేకే, డి. శ్రీనివాస్‌లు పార్టీని వీడటమే ఇందుకు నిదర్శనమన్నారు. గతంలో తొమ్మిదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాను ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడానన్నారు. అలాంటిది తనకు పార్టీలో గుర్తింపు ఇవ్వకపోవడంతో కొన్ని రోజులుగా తటస్థంగా ఉంటూ వస్తున్నానన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వలేదని, డీసీసీ అధ్యక్షునిగా కూడా తొలగించారని, తాను చేసిన పొరపాటు ఏమిటని ప్రశ్నించారు. తన రాజకీయ భవిష్యత్ ప్రణాళిక రెండు రోజుల్లో వెల్లడిస్తానని పేర్కొన్నారు. సమావేశంలో కేపీ విశాల్, కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ గూటికేనా..! కేఎం ప్రతాప్ ఆదివారం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులతో టీఆర్ఎస్లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. తన రాజకీయ గురువైన డి.శ్రీనివాస్ టీఆర్ఎస్లో ఉండడంతో ఆ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
సొంత గూటికి..
కాంగ్రెస్‌లోకి జగ్గారెడ్డి - నేడు దిగ్విజయ్ సమక్షంలో చేరిక - భారీఎత్తున జన సమీకరణ - ఎమ్మెల్సీ బరిలో దింపే అవకాశం! సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎట్టకేలకు మాజీ ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి సొంతగూటికి చేరుతున్నారు. సోమవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి 10 వేల మందితో కలిసి వెళ్లి సత్తా చాటాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన అనుచరులు భారీ జన సమీకరణ ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాది జగ్గారెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డీసీసీ అధ్యక్షునిగా ప్రకటించింది. ఆయన బాధ్యతలు తీసుకోవడానికి సమాయత్తం అవుతుండగానే ప్రకటనను రద్దు చేసింది. దీంతో ఆయన కొంత మనస్తాపంతో ఉన్న సమయంలోనే మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయడానికి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మరోవైపు జనసేన నాయకుడు పవన్‌కళ్యాణ్ ఒత్తిడి చేయడం చేయడంతో జగ్గారెడ్డి బీజేపీలో చేరారు. ఆపై మెదక్ ఉప ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అనంతరం నెల నుంచే జగ్గారెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరడానికి ప్రయత్నం సాగించారు. ఆయన చేరిక పట్ల మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సానుకూలత వ్యక్తం చేసినా.. డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, ఎమ్మెల్యే, మాజీ మంత్రి గీతారెడ్డి, దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి తదితరుల అభ్యంతరం వ్యక్తం చేయడంతో చేరిక ఆలస్యమైనట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల నేరుగా ఢిల్లీ వెళ్లి రాహుల్‌గాంధీని కలిసి, పార్టీలో చేరికపై చర్చించినట్లు సమాచారం. రాహుల్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో జగ్గారెడ్డి ఏర్పాట్లను చేసుకున్నారు. ఎమ్మెల్సీగా బరిలోకి..! త్వరలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో జగ్గారెడ్డి కాంగ్రెస్‌లో చేరటం ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బలం ఉన్నా... ఎక్కువ మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీలు టీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ నుంచి పోటీకి అభ్యర్థులెవరూ ముందుకు రాని పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో జగ్గారెడ్డిని బరిలోకి దింపితే పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. -
30 మందికి మించకుండా కార్యవర్గం
టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ కార్యవర్గాన్ని 30 మందికి మించకుండా ఏర్పాటుచేసేందుకు కసరత్తు చేస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గం అంతా కలిపి 30 లోపు ఉండేలా చూస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ముసాయిదా జాబితా కూడా సిద్ధమైందని సోమవారం గాంధీభవన్‌లో విలేకరులతో చెప్పారు. ప్రభుత్వంపై పోరాటం, ఇతర కార్యక్రమాల వల్ల కార్యవర్గం ఏర్పాటులో జాప్యం జరిగిందని, త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. ఏఐసీసీలో బాధ్యతల కోసం టీపీసీసీ నుంచి జాబితాను అడిగారని ఉత్తమ్ వెల్లడించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీచేయడానికి 8 మంది పార్టీ నేతలు ఆసక్తితో ఉన్నారని, వారి బలాబలాలపై సర్వే జరుగుతోందన్నారు. భట్టి విక్రమార్క వరంగల్ టికెట్‌ను అడగడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మాజీ ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య అభ్యర్థిత్వంపైనా చర్చ జరగలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 17న కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. 18 నుంచి 30 వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో టీపీసీసీ నేతలు పాదయాత్రలు చేస్తారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని, దీనికి నిరసనగా నియోజకవర్గ కేంద్రాల్లో 4న ధర్నాలను నిర్వహిస్తున్నామన్నారు. కాగా, సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి ..ఉత్తమ్‌తో భేటీ అయ్యారు. నాటక ప్రదర్శనకు ఆహ్వానించడానికే ఆయనను కలిశానని చెప్పారు. ఆందోళనలకు టీ పీసీసీ పిలుపు లోక్‌సభలో తమ పార్టీ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ టీ పీసీసీ ఆందోళనకు పిలుపునిచ్చింది. కేంద్రం విధానాలను ఎండగట్టేలా మంగళవారం దీక్షలు, ధర్నాలు చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించింది. -
రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి : భట్టి
‘సాక్షి’కి అభినందనలు భట్టిని కలసిన ఓయూ జేఏసీ నేతలు హైదరాబాద్: అనేక సమస్యలతో సతమతమవుతున్న రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. గాంధీభవన్‌లో సోమవారం జరిగిన కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, అనుబంధ పరిశ్రమల్లో సమస్యలపై ఈ సందర్భంగా చర్చించినట్టుగా ఆయన చెప్పారు. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఉద్యమించాల్సిన అవసరముందనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పారు. టీఆర్ఎస్ మాటలకు, హామీలకే పరిమితమైందని విమర్శించారు. ఈ సమావేశానికి ఎం.కోదండ రెడ్డి అధ్యక్షత వహించగా కాంగ్రెస్ సీనియర్ నేతలు బలరాం నాయక్, డి.శ్రీధర్‌బాబు, దాసోజు శ్రవణ్, మల్లు రవి, అద్దంకి దయాకర్, నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రైతుల సమస్యలపై ‘సాక్షి’ సోమవారం ప్రచురించిన కథనానికి కాంగ్రెస్ నేతలు మల్లు భట్టివిక్రమార్క, ఎం.కోదండ రెడ్డి, వి.సునీతా లక్ష్మారెడ్డి తదితరులు ప్రత్యేకంగా అభినందనలను తెలిపారు. ‘సాక్షి’ కథనం విశ్లేషణాత్మకంగా, పక్కా సమాచారంతో ఉందన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఓయూలో పర్యటించేలా చూడాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్కను ఓయూ జేఏసీ నేతలు కోరారు. గాంధీభవన్‌లో భట్టిని సోమవారం ఓయూ జేఏసీ నేతలు పున్నా కైలాష్ నేత, కె.విజయకుమార్, లోకేష్‌యాదవ్, శ్రీధర్‌గౌడ్ తదితరులు కలిశారు. -
కేసీఆర్ మహాత్ముడా? : షబ్బీర్ అలీ
-
కేసీఆర్ మహాత్ముడా? : షబ్బీర్ అలీ
హైదరాబాద్: ‘కేసీఆర్‌ను మహాత్ముడు అని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఎందుకు పొగిడారు..? దళితుడిని తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పి మాటతప్పినందుకా?, వారికి దక్కాల్సిన సీఎం కుర్చీని కబ్జా చేసినందుకా..? ఎందుకు మహాత్మా అని పొగుడుతున్నారు?’ అని శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ నిల దీశారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతాంగాన్ని టీఆర్ఎస్ ప్లీనరీ నిరాశకు గురిచేసిందన్నారు. కేయూ పీజీ సెట్‌కు 31 వేల దరఖాస్తులు కేయూ క్యాంపస్: కాకతీయ వర్సిటీ, శాతవాహన వర్సిటీ పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న కేయూ పీజీ సెట్‌కు ఇప్పటివరకు 31 వేల దరఖాస్తులు వచ్చినట్లు కేయూ అడ్మిషన్ల ఇన్చార్జి డెరైక్టర్ డాక్టర్ నర్సింహాచారి తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 30వ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. -
కేసీఆర్‌ది తుగ్లక్ పాలన: పొన్నాల
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్‌గా పనిచేయడం తన అదృష్టం అని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆదివారం ఎంఎల్ఏ ఉత్తమ్ కుమార్‌రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గాంధీభవన్‌లో మాట్లాడిన ఆయన ఉత్తమ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందని చెప్పారు. అదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేసీఆర్ ది తుగ్లక్ పాలన అని, ఆయనకు పరిపాలన అనుభవం లేదని ఎద్దేవా చేశారు. కాగా, గాంధీభవన్‌లో మాజీ మంత్రులు గీతారెడ్డి, డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డిని కాంగ్రెస్ నేతలు సన్మానించారు. -
రోడ్డెక్కిన ‘హస్తం’
మడికొండ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే బట్టలూడ దీసి రోడ్ల మీద నిలబెడతామని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. టీపీసీసీ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్ వరకు నిర్వహిస్తున్న ర్యాలీని అడ్డుకుని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై పోలీసు అధికారులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం మడికొండలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ధర్నాలో నారుుని మాట్లాడుతూ ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని, పోలీసు అధికారులు ప్రభుత్వ ఒత్తిడికి లొంగి అన్యాయంగా నాయకులపై కేసులు పెట్టి వేధించకుండా వృత్తిని న్యాయబద్ధంగా నిర్వహించాలని సూచించారు. మాజీ మంత్రి బస్వారాజు సారయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రియల్ ఎస్టేట్‌గా మారుస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం సచివాలయం, ఛాతి ఆస్పత్రి తరలింపు యోచనను ప్రభుత్వం వెం టనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ రాజయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గాంధేయవాద పార్టీ అని, శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ నాయకులు మడికొండ చౌరస్తాలో 20 నిమిషాలపాటు ధర్నా నిర్వహిం చడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కాజీ పేట డీఎస్పీ జనార్దన్ ఆధ్వర్యంలో మడికొండ, ధర్మసాగర్, కాజీపేట, హసన్‌పర్తి సీఐలు డేవిడ్‌రాజ్, రాజయ్య, రఘునందన్, రమేష్ చేరుకుని నాయకులను అరెస్ట్ చేసి, మడికొండ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు, ఇనుగాల వెంకట్రామిరెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, రాజారాపు ప్రతాప్, అమృతరావు, గొట్టిముక్కల రమణారెడ్డి, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్మెట వెంకటరమణగౌడ్, గ్రామ అధ్యక్షుడు తొట్ల రాజు, కుర్ల మోహన్, ముల్కలగూడెం సర్పంచ్ కట్కూరి బాబు, బొల్లం కృష్ణమూర్తి, రాజగారి రఘు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా నిరసనలు.. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలపై పోలీసుల దాడికి నిరసనగా వరంగల్ నగరంతోపాటు కేసముద్రం, రఘునాథపల్లి, జనగామ, మద్దూరు, చేర్యాల, వర్ధన్నపేట, పరకాల, సంగెం, గీసుకొండ, ఆత్మకూరు, నర్సంపేటలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. జిల్లావ్యా ప్తంగా కార్యక్రమం చేపట్టాలని పిలుపుని చ్చినా.. చాలా మండలాల్లో కార్యక్రమాలు నిర్వహించకపోవడం గమనార్హం. -
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే స్వైన్‌ఫ్లూ: పొన్నాల
హైదరాబాద్: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ ప్రబలిందని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. గాంధీ భవన్లో సోమవారం జరిగిన గణతంత్ర దినోత్సవానికి హాజరైన పొన్నాల పైవిధంగా స్పందించారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ.. మోదీ సర్కారు పాలనతో దేశంలో రాజ్యంగా స్ఫూర్తి, లౌకికవాదం పూర్తిగా దెబ్బతిన్నాయని ఎద్దేవా చేశారు. ఇక రాష్ట్రం విషయానికొస్తే టీఆర్ఎస్ పాలన కులాన్ని, మతాన్ని రెచ్చగొట్టేలా ఉందంటూ దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ టీఆర్ఎస్ ప్రజాప్రయోజనాలను విస్మరిస్తోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాకే పెద్దపీట వేస్తూ ఆందోళన తెలంగాణగా మార్చిందని ఆయన మండిపడ్డారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా స్వైన్‌ఫ్లూ సాకుతో దళిత మంత్రిని బలిపశువును చేశారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని స్వైన్‌ఫ్లూ ని అరికట్టగలిగిందని పొన్నాల సమర్థించుకున్నారు. -
‘కాకా’ స్మారకచిహ్నం నెలకొల్పాలి
కాంగ్రెస్ నేతల డిమాండ్ గాంధీభవన్‌లో వెంకటస్వామి సంస్మరణ సభ కాకలు తీరిన వారికే ‘కాకా’ అని కొనియాడిన నేతలు సాక్షి, హైదరాబాద్: కాకలు తీరిన రాజకీయ నేతలకూ ‘కాకా’గా కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి చరిత్రలో నిలిచిపోయారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కొనియాడారు. దివంగత నాయకుడు వెంకటస్వామి పేరుతో స్మారకచిహ్నం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. శనివారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన వెంకటస్వామి సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో పీసీసీ మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, వి.హనుమంతరావు, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, పార్టీ అగ్రనేతలు జె.గీతారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కె.ఆర్.సురేశ్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, నంది ఎల్లయ్య, షబ్బీర్ అలీ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, బలరాం నాయక్, మల్లు భట్టి విక్రమార్క, అద్దంకి దయాకర్, మాదు సత్యం, కత్తి వెంకటస్వామి, మల్లు రవి, పీసీసీ ఉపాధ్యక్షులు ఇతర సీనియర్ నేతలు మాట్లాడారు. సామాన్య కుటుంబంలో జన్మించిన వెంకటస్వామి అసామాన్య స్థాయికి ఎదిగిన దళితజాతి రత్నంగా వారు అభివర్ణించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కాకా పేరు పెట్టాలని, కాకా పేరుతో ఆడిటోరియం నిర్మించాలని పలువురు ప్రభుత్వాన్ని కోరారు. కొత్తగా ఏర్పడబోయే వాటిలో ఓ జిల్లా కు కాకా పేరు పెట్టాలని కోరారు. త్రివేణి సంగమంలో అస్థికలు నిమజ్జనం కాటారం: జి.వెంకటస్వామి అస్థికలను శనివారం ఆయన కుమారులు కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు. కాకా కుమారులు మాజీ మంత్రి వినోద్, మాజీ ఎంపీ వివేక్‌లు కుటుంబ సభ్యులతో ఉదయం కాళేశ్వరం వచ్చారు. గోదావరి వద్ద ప్రత్యేక పూజలు చేసి, మూడు నదులు కలిసే చోట అస్థికలను నిమజ్జనం చేశారు. -
ఇక చాలు.. నన్ను తప్పించండి : తూడి దేవేందర్‌రెడ్డి
డీసీసీ రేసులో భిక్షమయ్యగౌడ్, చిరుమర్తి లింగయ్య, రాపోలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి రామచంద్రకుంతియా, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యల సమక్షంలో శుక్రవారం జరిగిన సమావేశంలో భాగంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత కారణాల వల్ల తాను పార్టీ జిల్లా బాధ్యతలను మోయలేనని, గతంలో తాను ఇచ్చిన రాజీనామాను ఆమోదించి, తనను బాధ్యతల నుంచి తప్పించాలని పార్టీ అధినాయకత్వాన్ని కోరారు. తూడి విజ్ఞప్తి పట్ల పార్టీ నాయకత్వం కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. తూడిని తప్పిస్తే మాజీ ఎమ్మెల్యేలు భిక్షమయ్యగౌడ్, చిరుమర్తి లింగయ్య, మునుగోడుకు చెందిన రాపోలు జయప్రకాశ్‌లలో ఒకరిని డీసీసీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా తూడి మాట్లాడుతూ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా మూడేళ్ల పాటు జిల్లా పార్టీ బాధ్యతలు నిర్వర్తించానని, తనకు సహకరించిన, సహకరించని నాయకులందరికీ కృత జ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఎలాంటి చందాలు, పైరవీలకు అవకాశం లేకుండా పార్టీ బాధ్యతలు మోసానని, తాను బాధ్యతల నుంచి తప్పుకున్నా పార్టీకి పూర్తి స్థాయి సహకారం అందిస్తానని, అసంపూర్తిగా ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ భవనాన్ని కూడా పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. తూడి గురించి జానా మాట్లాడుతూ బాగా పనిచేశాడని కితాబిచ్చినట్టు సమాచారం. అయితే, తూడి తన ప్రసంగంలో భాగంగా పీసీసీ, ఏఐసీసీ నేతల పనితీరును కూడా ప్రశ్నించారు. మనం అధికారం కోసమే తెలంగాణ ఇచ్చామనే విధంగా జరిగిన ప్రచారం దెబ్బతీసింది. ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఇచ్చామన్నది మరిచిపోయారు. పార్టీలో స్టేట్స్‌మెన్ తగ్గిపోయి లీడర్లే మిగిలారు. తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత రాష్ట్రం ఇవ్వకుండా జాప్యం చేసి ఇరువైపులా నష్టపోయారు. అయినా టీఆర్ఎస్ అధినేత దీక్షకు స్పందించి రాష్ట్ర ప్రకటన చేయడమేంటి?* అని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం. -
అజ్ఞాతంలో విష్ణు, బెయిల్‌కు యత్నం
-
అజ్ఞాతంలో విష్ణు, బెయిల్‌కు యత్నం
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి అరెస్ట్‌కు మాదాపూర్ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. వంశీచంద్ రెడ్డిపై దాడి కేసుకు సంబంధించి ప్రత్యేక టీమ్..గురువారం ఉదయం అదుపులోకి తీసుకునేందుకు అతని నివాసానికి వెళ్లారు. అయితే విష్ణు ఆ సమయంలో ఇంట్లో అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన రెండు సెల్ఫోన్లు కూడా స్విచ్చ్ ఆఫ్ చేసి ఉన్నట్లు సమాచారం. మరోవైపు విష్ణు రంగారెడ్డి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా విష్ణువర్దన్‌రెడ్డి నిన్న గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డితో జరిగిన గొడవకు సంబంధించిన వివరాలు ఆయనకు తెలిపారు. విష్ణువర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వంశీతో జరిగిన గొడవ విచారకరం.మా గొడవకు, పార్టీకి ఏ సంబంధం లేదు. మేమంతా కాంగ్రెస్ కుటుంబ స భ్యులం..' అని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఇద్దరు నేతల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. వంశీచంద్ రెడ్డిపై పోలీసులకిచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటారా అన్న ప్రశ్నకు విష్ణు స్పందించ లేదు -
పొన్నాలను కలిసిన విష్ణువర్దన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డితో జరిగిన గొడవకు సంబంధించిన వివరాలు ఆయనకు తెలిపారు. అనంతరం విష్ణువర్దన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే వంశీతో జరిగిన గొడవ విచారకరం. మా గొడవకు, పార్టీకి ఏ సంబంధం లేదు. మేమంతా కాంగ్రెస్ కుటుంబ స భ్యులం..’ అని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఇద్దరు నేతల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. వంశీచంద్ రెడ్డిపై పోలీసులకిచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటారా అన్న ప్రశ్నకు విష్ణు స్పందించ లేదు. -
కేసీఆర్ తొలి అడుగే... తప్పటడుగు: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో చెప్పిన మాయ మాటల్లాగే, కేసీఆర్ ప్రభుత్వ బడ్జెట్ మసిపూసి మారేడు కాయ చేసినట్లుగా ఉందని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ బడ్జెట్ ప్రజలను ఎంతో నిరాశకు గురిచేసిందన్నారు. ‘సీఎం కేసీఆర్ తొలి అడుగే తప్పటడుగు అయింది. లక్ష కోట్ల బడ్జెట్ అయినా, రైతుల శ్రేయస్సును విస్మరించారు. విద్యుత్తుకు కావాల్సినన్ని నిధుల్లేవు. ఉద్యోగ కల్పన ఊసు మరిచార’ అని పొన్నాల వ్యాఖ్యానించారు. ‘విద్యుత్ రంగానికి కేటాయించింది రూ.1,636కోట్లు... మరి మూడేళ్లలో 20వేల మెగావాట్ల విద్యుత్‌ను ఎలా ఉత్పత్తి చేస్తారు’ అని నిలదీశారు. ఈ సమావేశంలో పొన్నాలతో పాటు కిసాన్, ఖేత్ మజ్దూరు కాంగ్రెస్ అధ్యక్షుడు కోదండరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
పేలవంగా టీపీసీసీ సభ్యత్వ నమోదు
పార్టీ ముఖ్యనేతలు గైర్హాజరు కసితో సభ్యత్వం చేయించాలని పొన్నాల పిలుపు హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం తొలిరోజు పేలవంగా సాగింది. గాంధీభవన్ ఆవరణలో శనివారం చేపట్టిన కార్యక్రమానికి సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీని వాస్సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు రాలేదు. కార్యకర్తలు, నాయకుల హాజరు శాతం కూడా పలుచగా ఉంది. వచ్చిన వారూ సభ్యత్వ నమోదుపట్ల అంతగా ఆసక్తి చూపలేదు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన సభ్యత్వ నమోదును గంట సేపటికే ముగించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తొలి సభ్యత్వ రశీదును మాజీమంత్రి దానం నాగేందర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ గొప్ప చరిత్ర కలిగిన కాం గ్రెస్ పార్టీలో సభ్యుడిగా కొనసాగే అవకాశం దక్కడం తన జీవి తంలో మర్చిపోలేని అదృష్టమన్నారు. నాయకులంతా వాడవాడలా పర్యటించి కసిగా కాంగ్రెస్ సభ్యత్వాన్ని నమోదు చేయిం చాలని పిలుపునిచ్చారు. ఇంట్లో కూర్చుని సభ్యత్వ నమోదు పుస్తకాలను నింపితే పార్టీని మోసం చేసినట్లేనని, ఒక్క సంక్షిప్త సందేశమిస్తే పార్టీ కార్యక్రమానికి హాజరయ్యే వారికే సభ్యత్వం ఇవ్వాలని కోరారు. శాసనమండలిలో ఉపనేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకటరెడ్డి, వంశీచంద్‌రెడ్డితోపాటు సీనియర్ నేతలు అంజన్‌కుమార్‌యాదవ్, బలరాం నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళకళలాడిన డీఎస్ నివాసం మండలి ప్రతిపక్షనేత డి. శ్రీనివాస్ నివాసం శనివారం కళకళలాడింది. డీఎస్ 66వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర కార్పొరేటర్లు, మాజీ మంత్రులు ఆయన నివాసానికి వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఇష్టం లేనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జరపాల్సిందేనని కార్యకర్తలు ఒత్తిడి తేవడంతో వారి మాటను కాదనలేకపోయానని పేర్కొన్నారు. గాంధీభవన్‌లో బతుకమ్మ వేడుకలు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్‌లో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కోదాడ ఎమ్మెల్యే పద్మా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలితతోపాటు పలువురు మహిళా నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని బతుకమ్మ ఆడారు. పాటలు పాడుతూ కోలాటాలు ఆడుతూ సాంప్రదాయక నృత్యాలు చేశారు.