మడికొండ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే బట్టలూడ దీసి రోడ్ల మీద నిలబెడతామని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. టీపీసీసీ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్ వరకు నిర్వహిస్తున్న ర్యాలీని అడ్డుకుని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై పోలీసు అధికారులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం మడికొండలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ధర్నాలో నారుుని మాట్లాడుతూ ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని, పోలీసు అధికారులు ప్రభుత్వ ఒత్తిడికి లొంగి అన్యాయంగా నాయకులపై కేసులు పెట్టి వేధించకుండా వృత్తిని న్యాయబద్ధంగా నిర్వహించాలని సూచించారు.
మాజీ మంత్రి బస్వారాజు సారయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రియల్ ఎస్టేట్‌గా మారుస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం సచివాలయం, ఛాతి ఆస్పత్రి తరలింపు యోచనను ప్రభుత్వం వెం టనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ రాజయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గాంధేయవాద పార్టీ అని, శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ నాయకులు మడికొండ చౌరస్తాలో 20 నిమిషాలపాటు ధర్నా నిర్వహిం చడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
కాజీ పేట డీఎస్పీ జనార్దన్ ఆధ్వర్యంలో మడికొండ, ధర్మసాగర్, కాజీపేట, హసన్‌పర్తి సీఐలు డేవిడ్‌రాజ్, రాజయ్య, రఘునందన్, రమేష్ చేరుకుని నాయకులను అరెస్ట్ చేసి, మడికొండ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు, ఇనుగాల వెంకట్రామిరెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, రాజారాపు ప్రతాప్, అమృతరావు, గొట్టిముక్కల రమణారెడ్డి, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్మెట వెంకటరమణగౌడ్, గ్రామ అధ్యక్షుడు తొట్ల రాజు, కుర్ల మోహన్, ముల్కలగూడెం సర్పంచ్ కట్కూరి బాబు, బొల్లం కృష్ణమూర్తి, రాజగారి రఘు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లావ్యాప్తంగా నిరసనలు..
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలపై పోలీసుల దాడికి నిరసనగా వరంగల్ నగరంతోపాటు కేసముద్రం, రఘునాథపల్లి, జనగామ, మద్దూరు, చేర్యాల, వర్ధన్నపేట, పరకాల, సంగెం, గీసుకొండ, ఆత్మకూరు, నర్సంపేటలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. జిల్లావ్యా ప్తంగా కార్యక్రమం చేపట్టాలని పిలుపుని చ్చినా.. చాలా మండలాల్లో కార్యక్రమాలు నిర్వహించకపోవడం గమనార్హం.
రోడ్డెక్కిన ‘హస్తం’
Published Mon, Feb 9 2015 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM
Advertisement
Advertisement