Rajendar reddy
-
'నా ఎదుగుదల మూలాలు మా ఊరిలోనే..' రైతుబడి మాస్టారు!
'దేశరాజధాని నగరం న్యూఢిల్లీలోని ట్రిపుల్ఐటీ సంస్థ. ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదిక మీద దేశవిదేశీ ప్రముఖుల సమక్షంలో ప్రసంగించవలసిందిగా ఆహ్వానం అందుకున్నాడు మన తెలుగు యువకుడు. నేడు జరగనున్న ఎంటర్ ప్రెన్యూర్షిప్ సమ్మిట్–2024లో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలలో యువతకున్న వ్యాపార అవకాశాల గురించి ప్రసంగించే అవకాశాన్నందుకున్న జూలకంటి రాజేందర్‌రెడ్డి ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన ప్రస్థానాన్ని పంచుకున్నారు.' ‘‘న్యూఢిల్లీ వేదికగా అది కూడా అత్యున్నత స్థాయి విద్యాసంస్థలో ప్రసంగించే అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అంతకుముందు జాతీయ స్థాయిలో ‘ద నేషనల్ క్రియేటర్స్ అవార్డు’కు సంబంధించిన ‘మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ అగ్రి క్రియేటర్’ కేటగిరీలో 36 శాతానికి పైగా ఓట్లు సాధించి రైతుబడి చానెల్ ప్రథమస్థానంలో నిలిచింది. ఇందుకు అసలైన కార్యక్షేత్రం మా నల్గొండ జిల్లా, మాడ్గుల పల్లి మండలంలోని మాచనపల్లి గ్రామం. నా ఎదుగుదల మూలాలు మా ఊరిలోనే ఉన్నాయి. మాది వ్యవసాయ కుటుంబం. కానీ నేనెప్పుడూ పొలం పని చేయలేదు. నన్ను బాగా చదివించి మంచి ఉద్యోగం చేస్తుంటే చూడాలని కలలు కన్నారు అమ్మా నాన్న. పనుల ఒత్తిడి ఉంటే సీజన్లో కూడా నాకు పొలం పనులు కాదు కదా, పశువుల దగ్గర సహాయానికి కూడా రానిచ్చేవారు కాదు. అలాంటిది ఇప్పుడు నా కెరీర్ వ్యవసాయ భూమిలోనే వేళ్లూనుకు΄ోయింది. పలక.. పేపర్! అమ్మానాన్న కోరుకున్నట్లే చదువుకున్నాను. బీఈడీ చేసిన తర్వాత స్కూల్లో పలక మీద పిల్లలకు అక్షరాలు దిద్దించాల్సిన వాడిని, అనుకోకుండా కొత్తదారిలో అడుగుపెట్టాను. రోజూ పేపర్ చదివే అలవాటు ఉండడంతో ఓ రోజు జర్నలిజం కోర్సు ప్రవేశ పరీక్ష ప్రకటన నా కంటపడింది. ఉత్సాహం కొద్దీ పరీక్ష రాశాను. సెలెక్ట్ అయ్యాను. కానీ అక్కడ శిక్షణ పూర్తి చేయలేదు. కానీ 2008లో ఓ ప్రైవేట్ టీవీ చానెల్‌తో జర్నలిస్టుగా నా ప్రయాణం మొదలైంది. టీవీ చానెల్స్ మారుతూ కొంతకాలం హైదరాబాద్‌లో, మరికొంత కాలం జిల్లాల్లో ఉద్యోగం చేశాను. వార్తలకే పరిమితం కాకుండా ఫీచర్ స్టోరీల కోసం అన్వేషించేవాడిని. నా అన్వేషణలో కెమెరా కంటికి చిక్కిన ఓ వాస్తవం ఎంత ఆసక్తికరమైందో ఊహించగలరా!? కాకతీయుల వారసులు ఇప్పటికీ ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే... చత్తీస్గడ్ రాష్ట్రం, జగదల్పూర్లో. ‘కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ’ అక్కడ రాజు హోదాలో ఉన్నారు. వివరాలు సేకరిస్తూ వాళ్లను వెతుక్కుంటూ వెళ్లి షూట్ చేయడంలో కలిగిన జాబ్ శాటిస్ఫాక్షన్ ఇంత అని చెప్పలేను. ఇలా ఆరేళ్లు గడిచింది, అనుకోకుండా ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ప్రింట్ మీడియాకి మారాను. అక్కడ ఆరేళ్లు పని చేశాను. ఉద్యోగం చేస్తున్నాను కానీ సంతృప్తి స్థాయి క్రమంగా తగ్గి΄ోసాగింది. ఎన్నాళ్లో... ఎన్నేళ్లో ఉద్యోగిగా నీ పయనం... అని నా ఆవేదనను ఫేస్బుక్లో రాసుకునేవాడిని. కరోనా వచ్చింది.. లాక్డౌన్ తెచ్చింది! అది 2020, ప్రపంచానికి గుర్తొచ్చేది కరోనా, లాక్డౌన్. నాకు గుర్తొచ్చే అపురూపమైన ఘట్టం రైతుబడి ఆవిర్భావం. ఆ ఏడాది జనవరిలోనే రైతుబడి మొదలుపెట్టేశాను. ఉద్యోగం మానేయాలనే నిర్ణయానికి వచ్చాను. మేలో మానేశాను. ఆశ్చర్యం ఏమిటంటే... ఉద్యోగంలో అందుకున్న జీతానికి సమానమైన రాబడిని జూన్‌లోనే చూశాను. రైతులకు ఉపయోగపడే అంశాల మీదనే ఉంటాయి నా వీడియోలన్నీ. ఒకే పంట వేస్తున్న రైతులకు రకరకాల పంటలు వేయమని మాటలతో చెప్పడం వల్ల ప్రభావితం చేయలేం. ఏకకాలంలో రకరకాల పంటలు పండిస్తున్న రైతు అనుభవాలను వారి మాటల్లో వింటే సాటి రైతులు త్వరగా ప్రభావితమవుతారు. ఇదే నా సక్సెస్ ఫార్ములా. వ్యవసాయరంగ పరిశోధకులు, అధికారుల ద్వారా కూడా కొన్ని విషయాలు చెప్పించాను. కానీ రైతులు చెప్పిన విషయాలనే సాటి రైతులు గుర్తు పెట్టుకుంటున్నారు, ఆచరణలో పెడుతున్నారు. రైతులు కొందరు వ్యవసాయ పరికరాలను సొంతంగా తయారు చేసుకుంటారు, ఉన్న పరికరాలను తమ అవసరాలకు అనుగుణంగా మలుచుకుంటూ ఉంటారు. అలాంటి వాటిని కూడా బాగా చూపించేవాడిని. పంటలను, రైతులను వెతుక్కుంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో పర్యటించాను. లక్షకు పైగా కిలోమీటర్లు ప్రయాణించాను. పదమూడు వందలకు పైగా వీడియోలు చేశాను. నా రైతుబడికి పదమూడు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లున్నారు. ఇప్పటి వరకు వన్ మ్యాన్ ఆర్మీలాగ నేనొక్కడినే పొలాలకు వెళ్లి కెమెరా ఆన్ చేసి రైతుతో మాట్లాడేవాడిని. ఆ ఫుటేజ్‌ని మా మంజుల (భార్య) ఇంట్లో ఎడిట్ చేసిచ్చేది. ఈ మధ్యనే ఒక టీమ్‌ను తయారు చేసుకున్నాను. నా విజయగాధ నేనే రాసుకున్నాను! "నాలో ఎడతెగని ఆలోచన మొదలైంది. ఎంతోమంది సక్సెస్ స్టోరీలు రాశాను. నా సక్సెస్ స్టోరీని నేను రాసుకోలేనా అనిపించింది. నాలుగు సంస్థల్లో పని చేశాను. సంస్థ పేరు నా ఇంటిపేరుగా నా పేరుకు ముందు చేరుతోంది. కానీ నా పేరే సంస్థ పేరు కాలేదా? ఆ మధనంలో నుంచి పుట్టుకొచ్చిందే రైతుబడి. రైతుబడి అనే అమృతం పుట్టడానికి ముందు నా మదిమధనంలో అనేక గరళాలు కూడా కోరలు సాచాయి. సూపర్‌మార్కెట్, ‘రైతు పంట’ పేరుతో రైతుల ఉత్పత్తుల విక్రయం, ఇన్ షాట్ తరహాలో ‘లోకల్ న్యూస్ యాప్’ పేరుతో ఓ న్యూస్ యాప్, అదే పేరుతో ఓ యూ ట్యూబ్ చానెల్... వీటిలో కొన్ని భారీ వైఫల్యాలు, మరికొన్ని పాక్షిక విజయాలనిచ్చాయి. ఆ తర్వాత మరో నాలుగు యూ ట్యూబ్ చానెళ్లు కూడా పెట్టాను. అవి విజయవంతం కాలేదు, కానీ నన్ను విజయపథంలో నడిపించే మార్గదర్శకాలయ్యాయి." – జూలకంటి రాజేందర్ రెడ్డి, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, రైతుబడి యూట్యూబ్ చానెల్ గుర్తు పడుతున్నారు! ‘నాకు గుర్తింపు వచ్చింది’ అనే పెద్ద మాట చెప్పను. కానీ ఇప్పుడు ఏ ఊరికి వెళ్లినా నన్ను గుర్తు పడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయం కోసం పని చేస్తున్న చానెళ్లలో రైతుబడి పెద్దది. ఇప్పుడు ఢిల్లీలో ప్రసంగించడానికి ట్రిపుల్ ఐటీ నుంచి ఆహ్వానం రావడానికి కారణం ఈ యూ ట్యూబ్ చానెలే. నేననుకున్నట్లే నా సంస్థపేరు నా పేరు కలిసి ‘రైతుబడి రాజేందర్’నయ్యాను. ఇది కాకుండా నేను చేరాల్సిన లక్ష్యాలు రెండున్నాయి. ఒకటి... వ్యవసాయంలో అనుభవాలు పంచుతున్న రైతుబడి తరహాలోనే మరో వేదిక ద్వారా వ్యాపార అనుభవాలను యువతకు చేర్చడం, కొత్త ఎంటర్ప్రెన్యూర్లను తయారు చేయడం. ఇప్పటికే బిజినెస్ బుక్ పేరుతో ఆ ప్రయత్నం మొదలైంది. మరొకటి వ్యవసాయ భూమిని కొనుక్కోవడం. నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాన్న ΄ోయారు. అనివార్యమైన పరిస్థితుల్లో మా పొలాన్ని అమ్ముకున్నాం. కొద్దిగానైనా వ్యవసాయభూమిని కొని మా అమ్మకు బహుమతిగా ఇవ్వాలి. రైతు కుటుంబంలో పుట్టిన వాళ్లం భూమితో బంధాన్ని తెంచుకోలేం’’ అన్నారు రాజేందర్‌రెడ్డి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇవి చదవండి: నారి వారియర్! -
'అధ్యక్షా..!' అనేదెవరో?
సాక్షి, వరంగల్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఓ ప్రత్యేకత కలిగి ఉంది. ఇక్కడి నుంచి మూడు ప్రధాన పార్టీల అధ్యక్షులు పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆయా పార్టీల ప్రెసిండెట్లు తలపడుతుండగా పోటీ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ఈ ముగ్గురిలో ఎవరు గెలుపొంది అసెంబ్లీలో అధ్యక్షా.. అంటారో అనే విషయంలో ఆయా పార్టీల నేతలతోపాటు ఓటర్లలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ నాలుగు పర్యాయాలు వరంగల్ పశ్చిమ నుంచి విజయం సాధించి, ఐదో విజయం కోసం ధీమాగా ముందుకు సాగుతున్నారు. ఇక.. కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తొలిసారి పార్టీ అభ్యర్థిత్వం దక్కించుకుని అసెంబ్లీలో అడుగిడడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అదే విధంగా బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి తొలిసారి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు విజయం కోసం ఎవరికి వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఐదో విజయం కోసం దాస్యం వినయ్ భాస్కర్.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ ఐదో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో, 2010 ఉప ఎన్నికల్లో, 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా ఉద్యమకారులకు అండగా నిలవడం, ఉద్యమకారుడిగా ప్రజల్లో గుర్తింపు ఉండడం, నిత్యం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల ముంగిటికి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వినయ్ భాస్కర్‌కు కలిసొచ్చే అంశాలు. ప్రధానంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బబ్దిదారులతో పాటు నియోజకర్గంలో వైద్య చికిత్స కోసం పెద్ద మొత్తంలో సీఎంఆర్ఎఫ్ నుంచి సాయం అందించారు. కార్మికులకు సొంతగా ప్రీమియం చెల్లించి వారికి గుర్తింపు కార్డులు ఇప్పించి బీమా సౌకర్యం కల్పించారు. దీంతోపాటు ఈ నెల 28న నిర్వహించిన సభకు సీఎం కేసీఆర్ రావడంతో తాను గెలుస్తాననే ధీమాలో ఉన్నారు. మొదటిసారి శాసనసభకు నాయిని రాజేందర్ రెడ్డి పోటీ.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న నాయిని రాజేందర్ రెడ్డి మొదటిసారి శాసన సభ ఎన్నికల బరిలో నిలిచారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డోలాయమానంలో పడిన సమయంలో కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారు. ఉమ్మడి వరంగల్, జిల్లాల పునర్విభజన తర్వాత హనుమకొండ, వరంగల్ జిల్లాలో పార్టీని కాపాడి ఈసారి టికెట్ సాధించారు. 2014, 2018లో పార్టీ టికెట్ ఆశించారు. ఆ రెండు సార్లు రాకపోయినా పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఈసారి అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించడంతో బరిలో దిగారు. నిత్యం ప్రజల మధ్య ఉండడంతో పాటు, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ, నాలుగు పర్యాయాలుగా వినయ్ భాస్కర్ ఎమ్మెల్యేగా ఉండి ఆయనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత నాయిని రాజేందర్ రెడ్డికి అనుకూలించే అంశాలు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, జార్ఖండ్ సీఎం బూపేష్ భఘేల్, సినీ నటి విజయ శాంతి చేసిన ప్రచారం తనకు విజయం చేకూరుస్తుందనే విశ్వాసంతో ఉన్నారు. 'పద్మ' విశసించేనా..!? వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన రావు పద్మ, పశ్చిమ నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. కాగా, రావు పద్మ 2014 ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నుంచి టికెట్ అశించి చివరకు వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి ఓటమి పొందారు. వరంగల్ మహానగరంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ సిటీ, అమ్మత్, హృదయ్ పథకాల ద్వారా జరిగిన అభివృద్ది, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌పై ఉన్న అసంతృప్తి, కాజీపేటలో రైల్వే ఓవరాయిలింగ్ యూనిట్, వ్యాగన్ తయారీ పరిశ్రమ మంజూరు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనకు అవకాశం, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, ప్రధాని మోదీకి ప్రజాదరణ ఉండడం, డబుల్ ఇంజన్ సర్కార్‌తో అభివృద్ధి, మహిళల ఓట్లు వంటివి రావు పద్మకు కలిపోచ్చే అంశాలు. రాష్ట్రంలో జనసేనతో పొత్తు, పవన్ కళ్యాణ్ రాక, బీజేపీ నుంచి కేంద్ర గ్రామీణాభివృద్ధి, మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి, ఇతర అగ్ర నాయకుల ప్రచారం చేయడం వల్ల రావు పద్మ తాను గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు. ఇవి చదవండి: జంగ్ తెలంగాణ: నేతల నసీబ్ మార్చేసే నియోజకవర్గం ఇది! -
పెళ్లి రోజే వరుడి మృతదేహం.. అసలేం జరిగింది?
కామారెడ్డి: పెళ్లి రోజే వరుడి మృతదేహం లభ్యమైన ఘటన సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మొసర్ల చిన్న నర్సింహులుకు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడైన రాజేందర్‌రెడ్డి(29) వివాహం రాంపూర్‌కు చెందిన అమ్మాయితో గురువారం జరగాల్సి ఉంది. రాజేందర్‌రెడ్డి అన్న శ్యామ్‌రెడ్డి ఇద్దరు కలిసి పెళ్లి పత్రికలను ఇటీవల బంధువులకు పంచారు. ఈ నెల 3న ఇంటి నుంచి వెళ్లిన రాజేందర్‌రెడ్డి ఇంటికి తిరిగి రాలేదు. చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. స్థానికుల సమాచారం మేరకు లింగంపేట మండలం ఎల్లారం అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని రాజేందర్‌రెడ్డి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై తెలిపారు. లింగంపేట ఏఎస్సై ప్రకాశ్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
నారాయణపేట: డీకే అరుణ ప్రభావం పడనుందా?
నారాయణపేట నియోజకవర్గంలో ఈ సారి త్రిముఖపోటీ అనివార్యం కానుంది. 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్దిగా పోటీచేసిన రాజేందర్‌రెడ్డి గెలిచారు. తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరారు. 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మరోసారి బీఆర్ఎస్ తరపున ఆయనే ఇక్కడి నుంచి పోటీచేసే అవకాశాలే ఉన్నాయి. అధికార పార్టీపై అసంతృప్తి.. అదే బీజేపీకి బలం కానుంది! అయితే అభివృద్ది విషయంలో తన వంతు కృషి చేశారు. నారాయణపేటను నూతన జిల్లాగా ఏర్పాటు చేయించారు. జిల్లా ఆస్పత్రి కూడ వచ్చింది. జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ పూర్తి చేయించారు. అయితే నారాయణపేటకు సాగునీటిని అందించాలనే ఉద్దేశ్యంతో ఇచ్చిన జీఓ 69ని అమలు చేయించటంలో ఆయన విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. జాయమ్మ చెరువు రిజర్వాయర్ చేస్తామన్న హమీ కూడ నెరవేరలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతానికి సాగునీటిని అందిస్తామన్న హమీకూడ నెరవేరకపోవటంతో ఇక్కడి జనం అసంతృప్తితో ఉన్నారు. అయితే నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండరనే ఆరోపణ ఉంది. పార్టీ కార్యకర్తలతో నేతలతో ముక్కుసూటిగా మాట్లాడుతుండటంతో క్యాడర్లో నైరాశ్యం ఉంది. ముఖ్యంగా బీజేపీ ఇక్కడ బలంగా ఉండటం కొంత మైనస్‌గా మారే అవకాశం ఉంది. తన వర్గీయులకే పెద్దపీఠ వేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్‌పార్టీ ఇక్కడ గడచిన రెండు ఎన్నికల్లో ఓటమి పాలై మూడో స్దానానికే పరిమితమయ్యింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి శివకుమార్‌రెడ్డి 2014లో పోటీ చేసి రెండవస్దానంలో నిలిచారు. 2018లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరిస్తే బీఎల్ఎఫ్ పార్టీ నుంచి పోటీ చేసి మళ్లీ రెండవస్దానంలో నిలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఆయనపై ఇటీవల ఓ మహిళ వ్యక్తిగతమైన ఆరోపణలు చేయటం,కేసు నమోదు కావటం కొంత ఇబ్బందిగా మారింది. ఆయనను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి సైతం తప్పించారు. మాస్ ఫాలోయింగ్ ఉండటం ఈయనకు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత సైతం ప్లస్ అవుతుందని అంటున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి పోటీ చేయాలని వ్యాపారవేత్త సుజేంద్ర శెట్టి ఆసక్తి కనబరుస్తున్నారు. డీకే అరుణ ప్రభావం బీజేపీకి కలిసోచ్చేనా? ఇక్కడ బీజేపీకి మొదటి నుంచి కొంత క్యాడర్ ఉంది. 2014లో రతంగ్ పాండు రెడ్డి పొత్తుల్లో భాగంగా టీడీపీకి సీటు కేటాయించటంతో ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి 23 వేల ఓట్లు సాధించారు. 2018లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఆయన 20 వేల ఓట్లు సాధించారు. అయితే వ్యక్తిగతంగా సౌమ్యుడిగా పేరున్న రతంగ్ పాండు రెడ్డిపై సానుభూతి కూడ ఉంది. ఇటీవల బండి సంజయ్ మార్క్ నిర్వహించిన ప్రజా సంగ్రామయాత్ర, బహిరంగ సభ విజయవంతం కావటంతో ఈసారి బీజేపీ గెలుస్తుందనే ధీమా ఆపార్టీ నేతల్లో కనిపిస్తుంది. బీసీలకు కేటాయించాలని ఆలోచిస్తే పార్టీ సీనియర్ నాయకుడు నాగూరావు నామాజీ, సత్యయాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ డీకే అరుణ ప్రభావం కూడ ఉండే అవకాశం ఉండటం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. నియోజకవర్గం భౌగోళిక పరిస్థితులు: కర్ణాటక సరిహద్దులో ఉన్న నియోజకవర్గం నారాయణపేట 2019 లో నూతన జిల్లాగా ఏర్పడింది, నారాయణపేట నియోజకవర్గంలోని ధన్వాడ, మరికల్ మండలాల్లోని కొన్ని గ్రామాలు మక్తల్ నియోజకవర్గానికి వెళ్లాయి.నారాయణ చేనేత మరియు పట్టు చీరలకు ప్రసిద్ది,ఇక్కడి బంగారపు ఆభరణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సాగునీరు లేకపోవటంతో వ్యవసాయభూముల బీళ్లుగా మారాయి.ఉపాధి లేక జనాలు ఇక్కడి నుంచి పెద్దమొత్తంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస పోతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటి మున్సిపాలిటీ నారాయణపేటలో ఏర్పాటయ్యింది. -
'నాన్న ఇచ్చిన ఆ డబ్బు నా జీవితాన్ని మార్చింది'
కలలు అందరూ కంటారు. కానీ వాటిని సాకారం చేసుకునే వారు కొంతమందే ఉంటారు. అనుకున్నది సాధించాలంటే కష్టపడక తప్పదు. లక్ష్య సాధనలో ఎదురయ్యే అవాంతరాలను అధిగమిస్తేనే అనుకున్నది సాధిస్తారు. సక్సెస్ అంటే షార్ట్‌కట్ కాదు.. లక్ష్యం దరి చేరాలంటే ముళ్లబాటన నడవక తప్పదు. కష్టపడితేనే జీవితంలో అనుకున్నది సాధించగలం అనే సిద్ధాంతాన్ని నమ్మారాయన. రూ.350 వేతనంతో జీవితం ప్రారంభించిన ఆయన ప్రస్తుతం 2 వేలకు పైగా మందికి ఉపాధి కల్పించేస్థాయికి ఎదిగారు. నవోదయ ట్రస్టు ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీలు.. విద్యాసంస్థలను నెలకొల్పారు. ప్రజలకు సేవ చేయాలన్న తపన కలిగిన ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సాధారణ కుటుంబంలో జన్మించి..వేలాది మందికి ఆదర్శంగా నిలిచిన నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో ‘సాక్షి’ పర్సనల్ టైమ్ సాక్షి,మహబూబ్‌నగర్ : మాది మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలం శేరివెంకటాపురం గ్రామం. తండ్రి సుంకి రాజేశ్వర్‌రెడ్డి తల్లి యశోధరారెడ్డి. మేం ముగ్గురం అన్నదమ్ములం. ఓ అక్క. అక్క శ్రీలత, బావ వెంకట్‌రెడ్డి. అన్న విజయభాస్కర్‌రెడ్డి చనిపోయారు. మరో అన్న రవీందర్‌రెడ్డి వ్యాపారవేత్త. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం బైరంపురంనకు చెందిన డాక్టర్ జగన్మోహన్రెడ్డి కుమార్తె స్వాతిరెడ్డితో 1994లో వివాహమైంది. మా కుమార్తె నందికారెడ్డి జిందాల్ గ్లోబల్ లా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసుకుని ప్రస్తుతం రాయచూర్‌లో ఉన్న నవోదయ సెంట్రల్ స్కూల్లో అడ్మినిస్ట్రేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. కుమారుడు అమృతరెడ్డి నవోదయ మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. నాన్న కల సాకారం మా నాన్న రాజేశ్వర్‌రెడ్డి జనసంఘ్ పార్టీ నాయకుడు. ఎల్కే అద్వానీ, వాజ్‌పేయి, వెంకయ్యనాయడు, బంగారు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ వంటి బీజేపీ సీనియర్లతో సత్సంబంధాలు ఉన్నాయి. పార్టీ అభీష్టం మేరకు 1973, 1978లో రెండు పర్యాయాలు మహబూబ్‌నగర్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రజాసేవ చేయాలన్న నాన్న తపన నన్ను రాజకీయాల్లోకి వచ్చేలా ప్రేరేపించింది. ప్రజల ఆదరణ, తల్లిదండ్రుల ఆశీర్వాదం, అన్నదమ్ములు, కుటుంబ సభ్యుల అండదండలతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. నాన్న ఇచ్చిన రూ.500తోనే దశ తిరిగింది నా చదువు మహబూబ్‌నగర్, రాయచూర్‌లో సాగింది. ఎస్సెస్సీ వరకు మహబూబ్‌నగర్‌లోని ఎంబీసీ స్కూల్ చదివా. పీయూసీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ రాయచూర్‌లో పూర్తయింది. స్కూల్లో నేను అబౌ యావరేజ్ స్టూడెంట్ను. బీ ఫార్మసీ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లోని ఎస్ఎల్ఎన్ కంపెనీలో రూ.350కు నైట్‌డ్యూటీ చేశా. ఇలా నాలుగునెలలు పని చేశా. తర్వాత 1986 డిసెంబర్15న మా నాన్న వద్ద రూ.500 తీసుకుని బెంగళూరుకు వెళ్లా. ఆ సమయంలో చిగ్బలాపూర్ ఫార్మ కంపెనీలో అధ్యాపకుడిగా చేరి.. రెండేళ్ల పాటు ప్రిన్సిపల్‌గా పని చేశా. అదే సమయంలో అక్కడ దేవనపల్లిలో మూతబడుతోన్న రూరల్ కాలేజీ ఆఫ్ ఫార్మసీని లీజుకు చేసుకుని ఐదేళ్లు నడిపా. అదే సమయంలో రాయచూర్‌లో ఎం ఫార్మసీలో చేరా. లీజు పూర్తయిన తర్వాత షాపూర్లో ఎంఫార్మసీ కాలేజీ పెట్టాను. రాయచూర్‌లో బీం ఫార్మసీ ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసినా. ప్రస్తుతం నర్సరీ నుంచి పీజీ వరకు కాలేజీలు ఉన్నాయి. ఆ కల నెరవేరేదే కాదు రాయచూర్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు ఈ ప్రాంత ప్రజల కల. 2001లో రాయచూర్‌లో మెడికల్ ఏర్పాటుకు స్థలం కొన్న తర్వాత.. దాని నిర్మాణం కోసం నా వద్ద అవసరమైన డబ్బు లేదు. బెంగళూరులో బ్యాంకు నుంచి రూ.2.6కోట్ల అప్పు తీసుకున్న. కానీ కళాశాలలో అవసరమైన యంత్రాలు. పరికరాల కొనుగోళ్ల కోసం మళ్లీ డబ్బు అవసరమైంది. మళ్లీ బ్యాంకు నుంచి రూ.2.5కోట్ల అప్పు చేసిన. దాంతో మిషనరీలు కొనుగోలు చేసిన. మెడికల్ కాలేజీని సందర్శించిన తనిఖీ బృందం నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ఆ సమయంలో కాలేజీలో బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు, ఇతర ఖర్చులకు మళ్లీ డబ్బు అవసరం వచ్చింది. తర్వాత ఎక్కడా అప్పు చేయలేని స్థితిలో ఉన్న నా పరిస్థితి తెలుసుకున్న నా బాల్యమిత్రుడు విష్ణుమోహన్ నాకు రూ.కోటిన్నర ఇచ్చాడు. ఇలా బ్యాంకు అప్పు, విష్ణు ఇచ్చిన ప్రోత్సాహంతో మెడికల్ కాలేజీ ఏర్పాటు కల నెరవేరింది. నా కుటుంబమే నా బలం నా విజయం వెనక మా అమ్మ యశోధరారెడ్డి, నా భార్య స్వాతిరెడ్డి ఉన్నారు. నేను ఏ పని చేసినా.. నాకు ఏ ఆపదొచ్చినా ముందు అమ్మనే తలుచుకుంటా. నేను బీ ఫార్మసీ పూర్తి చేసిన తర్వాత మా చిన్నాన్నా, పెద్దనాన్న పిల్లలు.. నా స్నేహితులందరూ అమెరికాకు వెళ్లారు. ఆ సమయంలో నేనూ అమెరికాకు వెళ్దామని నిర్ణయించుకున్నా. ఆ సమయంలో మా అమ్మ ‘ఎందుకు రా అమెరికాకు.. బంగారం తింటావా? ఇక్కడే ఉండి ఏదైనా చేసుకోవచ్చు కాదా?’ అని చెప్పింది. అమ్మ మాట కాదనకుండా ఇక్కడే ఉండిపోయా. ఎం ఫార్మసీ చేశా. తర్వాత మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సంబంధించిన అనుమతి కోసం మూడుసార్లు బృందాలు తనిఖీలు చేసినా అనుమతి రాలేదు. అప్పుడు ఢిల్లీలో ఉన్న నేను ఫోన్లో అమ్మతో మాట్లాతే ఎంతో ధైర్యం చెప్పింది. ఆ ధైర్యంతోనే ముందుకెళ్లితే నాలుగోసారి అనుమతి లభించింది. ఇక నా భార్య స్వాతిరెడ్డి పాత్ర నా విజయం వెనక ఎంతో ఉంది. ఏప్రిల్ 2, 1994న నా వివాహం జరిగింది. 7న మేమిద్దరం హైదరాబాద్‌కు వెళ్లాం. అదే రోజు ఆమెను హైదరాబాద్‌లో వదిలేసి మెడికల్ కాలేజీ పని నిమిత్తం పది రోజుల కోసం కేరళ వెళ్లాను. జూన్‌లో రాయచూర్‌లో ఇళ్లు కిరాయికి తీసుకుని ఇక్కడికి తీసుకొచ్చా. నెలలో 20రోజులు బెంగళూరు, ఢిల్లీ, కేరళ వెళ్లేవాడిని. ఇప్పటికీ పలు సందర్భాల్లో బయటే ఉంటా. కానీ ఏనాడూ నా భార్య నన్ను ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? అని ప్రశ్నించలేదు. నేను జీవితంలో పడుతున్న కష్టాలు చూసి నాకు ధైర్యం చెప్పేది. ఇలాంటి భార్య దొరకడం నా అదృష్టం. అలాగే నా పిల్లలు కూడా నా పరిస్థితిని అర్థం చేసుకుని నన్ను ఇబ్బందిపెట్టేవారు కాదు. రాయచూర్‌కు ఏదైనా చేయాలని.. ఎంతో ఆదరించిన రాయచూర్‌ను ఏదో చేయాలన్న తపన నాలో బలంగా ఉంది. అందుకే జిల్లాకేంద్రంలో 1,100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్న. మూడు పూటల ఉచిత ఆహార సదుపాయం అందుబాటులో ఉంది. ఇదే క్రమంలో సెంట్రల్ స్కూల్ ఏర్పాటు చేసి బెంగళూరులో రూ.6 లక్షల విలువ చేసే విద్యను రూ.37వేలకే అందిస్తున్న. అబద్ధానికి చోటు లేదు.. నా జీవితంలో ఇప్పటి వరకు అబద్ధం చెప్పలేదు. నేను చేసింది తప్పయినా.. ఒప్పయినా ఉన్నది ఉన్నట్టు చెబుతా. ఏ పని కోసం ఎక్కడికి వెళ్లినా స్వాతికి ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడిని. ఆమె నన్ను నమ్మేది. ఇదే అలవాటు నా భార్య, మా పిల్లలకు వచ్చింది. వారూ అసలు అబద్ధమాడరు. అలాగే నవోదయ విద్యాసంస్థలో పని చేసే ఓ ఉద్యోగి అబద్ధం చెప్పరు. ఎవరైనా చెప్పినట్లు నిరూపిస్తే వారిని ఉద్యోగం నుంచి తీసేస్తా. వ్యవసాయం చేయాలని ఉంది.. కోయిల్‌కొండ మండలంలోని అన్ని గ్రామాలు సాగునీరు లేక ఇబ్బందులు పడేవారు. మండల ప్రజలకు నీళ్లు ఇస్తేనే రాజకీయాల్లోకి వస్తానని చెప్పాను. దానికి చంద్రబాబు ఒప్పుకోవడంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చా. 2014లో తొలిసారిగా పోటీ చేసిన నేను టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను. కానీ తెలంగాణలో టీడీపీ ప్రాభావం కోల్పోతుండడంతో నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్ఎస్లో చేరాను. విద్యావేత్తగా.. ఎమ్మెల్యేగా ఆయా వర్గాలకు సేవ చేస్తున్న నాలో వ్యవసాయం చేయాలనే కోరిక ఉంది. పదవీ విరమణ 55ఏళ్లకు అనుకున్నా.. ఆ తర్వాత వ్యవసాయం చేయాలని ఉంది. అందుకోసం రాయచూర్‌లో కృష్ణాఒడ్డున, కోయిల్‌కొండ మండలం శేరివెంకటాపురంలో మాకు వ్యవసాయ భూమి ఉంది. -
డీసీసీ అధ్యక్షుడిగా రాజేందర్‌రెడ్డి
వరంగల్: కాంగ్రెస్ పార్టీ వరంగల్ అర్బన్–వరంగల్ రూరల్ జిల్లాల అధ్యక్షుడిగా నాయిని రాజేందర్‌రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహూల్‌గాంధీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రాజేందర్‌రెడ్డిని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం 2015లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రెండో సారి నియమించారు. 2018లో మూడో సారి కూడా రాహుల్ గాంధీ రాజేందర్‌రెడ్డినే నియమించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 31 జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించిన రాహూల్‌గాంధీ నాలుగో దఫాలో ఆయనను వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే వరంగల్ సిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కట్ల శ్రీనివాస్‌ను మరో సారి అదే పదవీ వరించింది. ఈ సందర్భంగా రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి. కుంతియాలకు కృతజ్ఞతలు తెలిపారు. నాయిని నియామకంపై టీపీసీసీ కార్యదర్శులు ఈ.వి.శ్రీనివాస్‌రావు, బత్తిని శ్రీనివాస్‌రావు శుభాకాంక్షలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. -
రాజన్నకా.. రామన్నకా ?!
నారాయణపేట : తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే చర్చ సర్వత్రా సాగుతోంది. గతంలో ఉమ్మడి జిల్లా నుంచి లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావుకు మంత్రి పదవులు దక్కగా ఇందులో కృష్ణారావు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన స్థానంలో మరొకరికే కాకుండా ఉమ్మడి జిల్లా నుంచి ఇంకొకరికి కూడా మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇది పక్కన పెడితే ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కొత్తగా నారాయణ జిల్లా ఏర్పడనుంది. తాజాగా జరిగిన సమావేశంలో ప్రతీ జిల్లాకు ఓ పదవి ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ సూచనప్రాయంగా వెల్లడించారు. దీంతో నారాయణపేట జిల్లాలో ఉన్న రెండు నియోజవర్గాల ఎమ్మెల్యేల్లో ఎవరికి ఏ పదవి దక్కుతుందన్న ఆసక్తి నెలకొంది. 17 నుంచి అసెంబ్లీ.. మంత్రి వర్గ విస్తరణ ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచాక సీఎంగా కేసీఆర్, రాష్ట్ర హోం శాఖ మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు తొలి విడత అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా ఆ సమయంలోనే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇదే క్రమంలో మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ మేరకు జిల్లాకో పదవి వచ్చేలా చూసేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు కొత్తగా ఏర్పడనున్న నారాయణపేట జిల్లా నుంచి ఎవరికి పదవి దక్కుతుందనే అంశంపై చర్చ సాగుతోంది. ఈ జిల్లా పరిధిలో నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలు ఉండనుండగా.. రెండింట్లోనూ టీఆర్ఎస్కే చెందిన ఎస్.రాజేందర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి విజయం సాధించారు. మంత్రి వర్గంలో ‘పేట’ జిల్లాకు చాన్స్ నూతనంగా ఆవిర్భవించనున్న నారాయణపేట జిల్లా నుంచి నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నా రు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరు విజయం సాధించారు. అయితే, వీరిద్దరు కూడా గత ఎన్నికల్లోనూ గెలిచినా టీడీపీ, కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఇక ప్రజల ఆకాంక్ష మేరకు ఇటీవల ఎన్నికల ప్రచారంలో నారాయణపేటను జిల్లాగా మారుస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఆ హామీ మేరకు విజయం సాధించగానే ప్రకటన చేశారు. తాజాగా కొత్త జిల్లాల నుంచి ఎమ్మెల్యేలకు కూడా మంత్రివర్గంతో పాటు పాటు పార్లమెంటరీ కార్యదర్శులు తదితర పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కేసీఆర్ స్వయంగా ప్రకటించడంతో నారాయణపేట జిల్లా వాసుల్లో ఆశలు చిగురించాయి. ఎవరికి ఆ వరం? నారాయణపేట కొత్త జిల్లాలో మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా చిట్టెం రాంమోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో వీరిద్దరు కూడా మంత్రి వర్గం ఏర్పాటులో తమకు స్థానం దక్కుతుందనే ఆశిస్తున్నారు. ఒకవేళ మంత్రిగా కాకున్నా పార్లమెంట్ సెక్రటరీలుగానైనా అవకాశం వస్తుందనే ధీమాతో ఉన్నారు. నారాయణపేట ప్రజల ఆకాంక్షను కేసీఆర్‌కు వివరించి కొత్త జిల్లా ఏర్పాటులో తమ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి కీలకపాత్ర పోషించినందున ఆయనకు సముచిత స్థానం దక్కుతుందని టీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మక్తల్ నుంచి గెలిచిన రాంమోహన్‌రెడ్డి అనుయాయులు కూడా అదే భావనలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన కీలక నేత, సొంత సోదరి అయిన డీకే.అరుణను కాదని కేసీఆర్ మాటను గౌరవవించి టీఆర్ఎస్లో చేరిన నేపథ్యంలో రాంమోహన్‌రెడ్డికి మంచి అవకాశం దక్కుతుందని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఎవరికి మంత్రి వర్గంలో స్థానం దక్కుతుంది, మరెవరికి పార్లమెంటరీ కార్యదర్శి పదవి దక్కొచ్చు..కొత్త జిల్లా నుంచి ఇద్దరికా లేక ఒకరికే పదవి వరిస్తుందన్న విషయం తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే! -
'నారాయణపేట అభివృద్ధి బాధ్యత నాది’
సాక్షి, కోయిల్‌కొండ: ఓటువేసి తనను గెలిపిస్తే అభివృద్ధి బాధ్యత తాను చూసుకుంటానని టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్ రాజేందర్‌రెడ్డి అన్నారు. గడిచిన నాలుగన్నర ఏళ్లలో రూ.600 కోట్లకు పైగా నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని రాజేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని వింజామూర్, నక్కవానికుంట, ఎల్లారెడ్డిపల్లి, సంగనోనిపల్లి, తమ్మలోనిబండతండా, అయ్యవారిపల్లి, చందాపూర్, అంకిళ్ల గ్రామాలలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నారాయణపేటను ప్రత్యేకంగా నిధులు కేటాయించి 60ఏళ్లుగా వెనకబడిన నియెజకవర్గాన్ని నాలుగేళ్లలో ఎన్నో కార్యక్రమాలను చేపట్టానని అన్నారు. ప్రతిపక్ష నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే తమకు ఓట్లను రాలుస్తాయన్నారు. ఇందులో టీఆర్ఎస్ నాయకులు రవి, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణయ్య, మల్లయ్య, లక్ష్మారెడ్డి, వాసు తదితరులు పాల్గొన్నారు. మరికల్: టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.రాజేందర్‌రెడ్డిని గెలిపించాలని పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రామారెడ్డి అన్నారు. మరికల్లో మంగళవారం టీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించి మరికల్ మండల అభివృద్దికి పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో రామస్వామి, జగదీశ్, కొండారెడ్డి, లంబడి తిరుపతయ్య, బాలకిష్ణ, నర్సిములు, సుధాకార్‌గౌడ్, రవి పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష...
సాక్షి, నారాయణపేట/దామరగిద్ద: కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీ అందరికి సేవచేసుకుంటానని ఆ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం దామరగిద్ద మండలంలోని మద్దెల్‌బీడు, బాపన్‌పల్లిలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధిపథంలో నడిపిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎంపీపీ కిష్టప్ప, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్, ఈదేప్ప, భాస్కర్, వెంకటప్ప, శరణప్ప, బాలప్ప, తిప్పన్న, భీంరెడ్డి, అశోక్ పాల్గొన్నారు. పతి కోసం సతి ప్రచారం పట్టణంలోని 10వ వార్డులో ఇంటింటా ప్రచారాన్ని తన పతి మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి కారుగుర్తుకు ఓటేసి గెలిపించాలని సతిమణి స్వాతిరెడ్డి విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు. ఆమెతో మున్సిపల్ చైర్పర్సన్ గందెఅనసూయ ఉన్నారు. అలాగే మండలంలోని బండగొండలో టీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్యా, మార్కెట్ చైర్మన్ సరాఫ్‌నాగరాజు ప్రచారాన్ని కొనసాగించారు. వారితోపాటు పార్టీ నాయకులు సతీశ్, ఆశిరెడ్డి, చందుయాదవ్ పాల్గొన్నారు. ఎస్.రాజేందర్‌రెడ్డిని గెలిపించండి మరికల్: టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని ఎస్.ఆర్‌రెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలని బుధవారం టీఆర్ఎస్ మండల నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మండలంలోని మాధ్వార్‌లో ఎస్.ఆర్ రెడ్డికి మద్దతుగా మండల అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకానలు ప్రజల్లోకి తీసుకెళ్లి విజయం సాధిస్తామన్నారు. అలాగే పేటలో నిర్వహించిన కేసీఆర్ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. లంబడి తిరుపతయ్య, బాలస్వామి, సుధాకర్‌గౌడ్, సోమయ్య, యదయ్య, వీరరాఘవరెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు. -
రొట్టె కొడతా..
మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి సోమవారం నారాయణపేట పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాలవాడలోని ఓ ఇంట్లో మహిళ వంట చేసుకుంటుండగా అక్కడికి వెళ్లి స్వయంగా జొన్నరొట్టె కొట్టి ఆకట్టుకున్నారు. ఆమె కట్టెల పొయ్యి వద్ద కూర్చొని ఓపికగా రొట్టె చేయడాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. – నారాయణపేట రూరల్ -
హత్య కేసులో రాజేందర్‌రెడ్డికి ఊరట
ముందస్తు బెయిల్ మంజూరు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ 44వ డివిజన్ కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్య కేసులో నాల్గవ నిందితుడైన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు ఉమ్మడి హైకోర్టు గురువారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. మురళి హత్య కేసులో ముందస్తు బెయిల్ మం జూరు చేయాలంటూ రాజేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని గురువారం జస్టిస్ సునీల్ చౌదరి విచారణ జరిపారు. ఈ కేసులో రాజేందర్‌రెడ్డి పాత్రపై పోలీసులు అదనపు సమాచారా న్ని కోర్టు ముందు ఉంచకపోవడంతో హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తులో పోలీసుల కు సహకరించాలని ఆదేశించింది. -
నకిలీ విత్తనాలతో కుళ్లిన వరి
ఐదున్నర ఎకరాల్లో పంట నష్టం హవేళిఘణాపూర్ (మెదక్): మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన రైతులు రాజేందర్‌రెడ్డి, రాంరెడ్డి నకిలీ విత్తనాలతో మోసపోయారు. మెదక్ పట్టణంలోని రైతునేస్తం ఫర్టిలైజర్ దుకాణంలో ఆమోగ్ కంపెనీకి చెందిన విత్తనాలను కొనుగోలు చేసి వీరు తూకాలు పోశారు. గత నెల తూకాలను తీసి నాట్లు వేశారు. 17 రోజులు గడుస్తున్నా వరి పైరు పెరగకపోగా, పంటంతా కుళ్లి పోయింది. వేళ్ల నుంచి మొదలుకొని ఆకులు మొత్తం ఎండిపోయాయి. ఐదున్నర ఎకరాల్లో ఇదే పరిస్థితి ఎదురైంది. రూ.80 వేల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటంతా కళ్ల ముందే కుళ్లిపోవడంతో ఏం చేయాలో తెలియక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. మండల వ్యవసాయాధికారి నాగమాధురి పొలాన్ని పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. -
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల నియామకం
18 మంది బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెల్లడించిన డీసీసీ అ«ధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి వరంగల్ : జిల్లాలోని 50మండలాలతో పాటు టౌన్, రూరల్ మండలాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, 10 నియోజకవర్గాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులను నియమించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా పార్టీ ఇన్చార్జీలు కాంతారావు అజ్మతుల్లా హుస్సేన్ ఆమోదంతో ఈ నియామకాలు చేపట్టినట్లు డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి వెల్లడించారు. కాగా, తాడ్వాయి, ములుగు, బచ్చన్నపేట, నర్సంపేట టౌన్ మండల పార్టీ అధ్యక్షులు, ములుగు, ఏటూరునాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల పేర్లను ఖరారు చేసినా, కొన్ని కారణాల వల్ల పేర్లను ప్రకటించలేదని తెలిపారు. ఈ సందర్భంగా మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల వివరాలిలా ఉన్నాయి. భూపాలపల్లి నియోజకవర్గం: మెతుకు తిరుపతిరెడ్డి(శాయంపేట), ఎన్.నర్సింహరావు(ములుగు గణపురం), ఎన్.వెంకట్‌రెడ్డి(మొగుళ్లపల్లి), హింగే మహేందర్‌జీ(రేగొండ), గొర్రె సాగర్(చిట్యాల), పి.రాజిరెడ్డి(భూపాలపల్లి), బుర్ర రమేగౌడ్(భూపాలపల్లి టౌన్). పరకాల నియోజకవర్గం; సారె రాజేశ్వర్‌రావు(ఆత్మకూరు), నలుబోల కృష్ణయ్య(పరకాల), బండి సారంగపాణి(పరకాల టౌన్), డోలే బాబూరావు(గీసుకొండ), తీగల రవీందగౌడ్(సంగెం). వర్ధన్నపేట నియోజకవర్గం ; వడిచెర్ల శ్రీనివాస్(వర్ధన్నపేట), మేడిపల్లి మదగౌడ్(హసన్‌పర్తి), కొంకటి రాఘవులు(హన్మకొండ), గొర్రె దేవేందర్(పర్వతగిరి). స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం; కత్తుల కట్టయ్య(స్టేషన్ఘనపూర్), రాజగారి రఘు(ధర్మసాగర్), సీహెచ్.కృష్ణమూర్తి(జఫర్‌గఢ్), శివకుమార్(లింగాల ఘనపురం), మంద రమేష్(రఘునాథపల్లి), మహబూబాబాద్ నియోజకవర్గం: ముల్లంగి ప్రతాప్‌రెడ్డి(మహబూబాబాద్ టౌన్), డి.ప్రకాశ్‌రెడ్డి(మహబూబాబాద్ రూరల్), కత్తి స్వామి(గూడూరు), బైరీ అశోగౌడ్(నెల్లికుదురు), గుగులోతు దస్రూనాయక్(కేసముద్రం). డోర్నకల్ నియోజకవర్గం: ఎం.లక్ష్మీనారాయణ(డోర్నకల్), గుగులోతు భట్టునాయక్(నర్సింహులపేట), డి.వై.గిరి(కురవి), బోడ రమేష్(మరిపెడ). నర్సంపేట నియోజకవర్గం; బానోత్ లక్ష్మణ్(నర్సంపేట), తోకల శ్రీనివాస్‌రెడ్డి(దుగ్గొండి), చిట్యాల తిరుపతిరెడ్డి(నల్లబెల్లి), జక్కా అశోక్(చెన్నారావుపేట), శాఖమూరి హరిబాబు(ఖానాపూర్), జనగామ నియోజకవర్గం; సి.బుచ్చిరెడ్డి(జనగామ టౌన్), సత్యనారాయణరెడ్డి(జనగామ రూరల్), కొమ్ము రవి(చేర్యాల), బండి శ్రీను(మద్దూర్), ఝూమ్లాల్(నర్మెట్ట). ములుగు నియోజకవర్గం ; ఎం.జైరాంరెడ్డి(మంగపేట), ఇర్సవడ్ల వెంకన్న(ఏటూరునాగారం), ఎం.తేజరాజు(గోవిందరావుపేట), వి.సారయ్య(కొత్తగూడ), సీహెచ్.సూర్యనారాయణ(వెంకటాపూర్) పాలకుర్తి నియోజకవర్గం ; ఉప్పల సురేష్‌బాబు(దేవరుప్పుల), జాటోతు హమ్యానాయక్(రాయపర్తి), అనుముల మల్లారెడ్డి(పాలకుర్తి), మోతుకూరి రవీంద్రాచారి(తొర్రూరు), కీసర ఉమేందర్‌రెడ్డి(కొడకండ్ల). బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు : గడ్డం కుమార్‌రెడ్డి(భూపాలపల్లి), యార మల్లారెడ్డి(చిట్యాల), మాడిశెట్టి రవి(పరకాల), వీసం ఓనారెడ్డి(గీసుకొండ), ముత్తిరెడ్డి కేశవరెడ్డి(వర్ధన్నపేట), బండ రత్నాకర్(హన్మకొండ), బేతి జైపాల్‌రెడ్డి(స్టేషన్ఘనపూర్), కడారి నగేష్(రఘునాథపల్లి), నాయిని సత్యపాల్‌రెడ్డి(మహబూబాబాద్), నూనావత్ రమేష్‌నాయక్(గూడూరు), .సత్యనారాయణరెడ్డి(డోర్నకల్), జినుకాల రమేష్(మరిపెడ), వంగేటి అశోక్‌కుమార్(నర్సంపేట), కొమ్ము రమేష్(నెక్కొండ), నర్సింగరావు(జనగామ), అర్జుల సుధాకర్‌రెడ్డి(చేర్యాల), కోతి ఉప్పలయ్య(పాలకుర్తి), మిత్తింటి వెంకటేశ్వర్లు(తొర్రూరు). -
టీడీపీకి దెబ్బ మీద దెబ్బ
హైదరాబాద్: తెలంగాణలో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. మరో టీడీపీ ఎమ్మెల్యే కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. గురువారం రాత్రి తెలంగాణ మంత్రులతో భేటీ అయిన రాజేందర్‌రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత శనివారం ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో అధికారికంగా చేరనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ విషయమై ఇప్పటికే కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడానని ఆయన తెలిపారు. తెలంగాణలో టీడీపీకి ఉనికి లేదని, అందుకే ఆ పార్టీని వీడుతున్నానని ఆయన పేర్కొన్నారు. కాగా, శాసనసభా పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ బుధవారమే కారు ఎక్కారు. అంతకుముందు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇప్పటికే తొమ్మిది మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. తాజాగా రాజేందర్‌రెడ్డి కూడా అధికార పార్టీ గూటికి చేరుతుండటంతో కారు ఎక్కిన టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరనుంది. రాజేందర్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అందులో 10కిపైగా మంది టీఆర్ఎస్లో చేరడంతో మూడింట రెండొంతుల మంది ఆ పార్టీలో చేరినట్టయింది. దీంతో టీటీడీపీ శాసనసభాపక్షం టీఆర్ఎస్ లో విలీనానికి మార్గం సుగమమైనట్టు భావిస్తున్నారు. దీంతో పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడబోదని భావిస్తున్నారు. నిజానికి టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి పార్టీ మారుతారని టాక్ రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ వినిపించలేదు. ఆయన టీడీపీలోనే కొనసాగుతారన్న అంతా భావించారు. ఇటీవల జరిగిన టీటీడీపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు. అయితే, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎర్రబెల్లి, ప్రకాశ్‌గౌడ్ మార్గంలోనే రాజేందర్‌రెడ్డి కూడా సైకిల్‌ను వీడి కారు ఎక్కుతుండటంతో టీడీపీకి మరో పెద్ద షాక్ తగిలినట్టయింది. -
రోడ్డెక్కిన ‘హస్తం’
మడికొండ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే బట్టలూడ దీసి రోడ్ల మీద నిలబెడతామని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. టీపీసీసీ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్ వరకు నిర్వహిస్తున్న ర్యాలీని అడ్డుకుని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై పోలీసు అధికారులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం మడికొండలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ధర్నాలో నారుుని మాట్లాడుతూ ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని, పోలీసు అధికారులు ప్రభుత్వ ఒత్తిడికి లొంగి అన్యాయంగా నాయకులపై కేసులు పెట్టి వేధించకుండా వృత్తిని న్యాయబద్ధంగా నిర్వహించాలని సూచించారు. మాజీ మంత్రి బస్వారాజు సారయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రియల్ ఎస్టేట్‌గా మారుస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం సచివాలయం, ఛాతి ఆస్పత్రి తరలింపు యోచనను ప్రభుత్వం వెం టనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ రాజయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గాంధేయవాద పార్టీ అని, శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ నాయకులు మడికొండ చౌరస్తాలో 20 నిమిషాలపాటు ధర్నా నిర్వహిం చడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కాజీ పేట డీఎస్పీ జనార్దన్ ఆధ్వర్యంలో మడికొండ, ధర్మసాగర్, కాజీపేట, హసన్‌పర్తి సీఐలు డేవిడ్‌రాజ్, రాజయ్య, రఘునందన్, రమేష్ చేరుకుని నాయకులను అరెస్ట్ చేసి, మడికొండ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు, ఇనుగాల వెంకట్రామిరెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, రాజారాపు ప్రతాప్, అమృతరావు, గొట్టిముక్కల రమణారెడ్డి, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్మెట వెంకటరమణగౌడ్, గ్రామ అధ్యక్షుడు తొట్ల రాజు, కుర్ల మోహన్, ముల్కలగూడెం సర్పంచ్ కట్కూరి బాబు, బొల్లం కృష్ణమూర్తి, రాజగారి రఘు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా నిరసనలు.. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలపై పోలీసుల దాడికి నిరసనగా వరంగల్ నగరంతోపాటు కేసముద్రం, రఘునాథపల్లి, జనగామ, మద్దూరు, చేర్యాల, వర్ధన్నపేట, పరకాల, సంగెం, గీసుకొండ, ఆత్మకూరు, నర్సంపేటలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. జిల్లావ్యా ప్తంగా కార్యక్రమం చేపట్టాలని పిలుపుని చ్చినా.. చాలా మండలాల్లో కార్యక్రమాలు నిర్వహించకపోవడం గమనార్హం.