సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష... | Take Into Account The Welfare Schemes Implemented By TRS Government | Sakshi

సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష...

Published Thu, Nov 22 2018 11:03 AM | Last Updated on Wed, Mar 6 2019 6:06 PM

Take Into Account The Welfare Schemes Implemented By TRS Government - Sakshi

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్మే ఎస్‌.ఆర్‌రెడ్డి

సాక్షి, నారాయణపేట/దామరగిద్ద: కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీ అందరికి సేవచేసుకుంటానని ఆ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం దామరగిద్ద మండలంలోని మద్దెల్‌బీడు, బాపన్‌పల్లిలో రోడ్‌షో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధిపథంలో నడిపిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎంపీపీ కిష్టప్ప, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్, ఈదేప్ప, భాస్కర్, వెంకటప్ప, శరణప్ప, బాలప్ప, తిప్పన్న, భీంరెడ్డి, అశోక్‌ పాల్గొన్నారు.  


పతి కోసం సతి ప్రచారం 
పట్టణంలోని 10వ వార్డులో ఇంటింటా ప్రచారాన్ని తన పతి మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి కారుగుర్తుకు ఓటేసి గెలిపించాలని సతిమణి స్వాతిరెడ్డి విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు. ఆమెతో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందెఅనసూయ ఉన్నారు. అలాగే మండలంలోని బండగొండలో టీఆర్‌ఎస్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్యా, మార్కెట్‌ చైర్మన్‌ సరాఫ్‌నాగరాజు ప్రచారాన్ని కొనసాగించారు. వారితోపాటు పార్టీ నాయకులు సతీశ్, ఆశిరెడ్డి, చందుయాదవ్‌ పాల్గొన్నారు. 


ఎస్‌.రాజేందర్‌రెడ్డిని గెలిపించండి  
మరికల్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని ఎస్‌.ఆర్‌రెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలని బుధవారం టీఆర్‌ఎస్‌ మండల నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మండలంలోని మాధ్వార్‌లో ఎస్‌.ఆర్‌ రెడ్డికి మద్దతుగా మండల అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ అమలు చేసిన సంక్షేమ పథకానలు ప్రజల్లోకి తీసుకెళ్లి విజయం సాధిస్తామన్నారు. అలాగే పేటలో నిర్వహించిన కేసీఆర్‌ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. లంబడి తిరుపతయ్య, బాలస్వామి, సుధాకర్‌గౌడ్, సోమయ్య, యదయ్య, వీరరాఘవరెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement