Narayanapeta
-
చీరపైన బాపూ బొమ్మ
బాపు బొమ్మల అందం గురించి ఎంత వర్ణించినా.. మనవైన చేనేతల ఘనత గురించి ఎంత చెప్పినా మాటలు సరిపోవు. ఇక, ఈ రెండింటి కాంబినేషన్లో వచ్చిన కళా సోయగాలను ఎంత చూసినా తనివి తీరవు. ఆ అందమైన కాంబినేషన్‌ను నారాయణపేట చేనేత చీరల మీదకు వచ్చేలా రూపుకట్టారు హైదరాబాద్ వాసి, ఫ్యాషన్ డిజైనర్ హేమంత్‌సిరి. ఈ కొత్త కాంబినేషన్ గురించి, ఆమెకు వచ్చిన ఈ ఆలోచన గురించి ఆమె మాటల్లోనే.. ‘నాలుగేళ్లుగా ప్రతి యేడాది ఆగస్టు నెలలో మన తెలుగురాష్ట్రాల చేనేత కారులతో కలిసి ‘తస్రిక’ పేరుతో ఒక వేడుక నిర్వహిస్తున్నాను. ఇందులో భాగంగా గతంలో హ్యాండ్లూమ్స్ని యువత కోసం ఇండోవెస్ట్రన్ డ్రెస్‌లు రూపొందించాను. ఈ క్రమంలోనే నారాయణ పేట చేనేతకారులను కలిసినప్పుడు, వారి డిజైన్స్ చూసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నారాయణ పేట చీరలు సాధారణంగా ప్లెయిన్లోనే ఉంటాయి. అయితే అందరినీ ఆకర్షించాలంటే వీటిలో కొన్ని మార్పులు తీసుకురావచ్చు అనిపించింది. దీంతో కిందటేడాది లేపాక్షి డిజైన్స్‌ని నారాయణ పేట్ కాటన్ శారీస్మీదకు తీసుకువచ్చాం. బాపూ స్మరణం ఈ నెలలో బొమ్మల బాపూ వర్ధంతి ఉంది. హ్యాండ్లూమ్ డే కూడా ఈ ఆగస్టు నెలలోనే. బాపూగారిని తలుచుకోగానే మనకు ఆ ముగ్గులు, బొమ్మలు.. మన మదిలో అలా నిలిచిపోతాయి. దీంతో ఈ యేడాది బాపూ బొమ్మలను డిజిటల్ ప్రింట్లుగా నారాయణ పేటæపట్టు చీరల మీదకు తీసుకువచ్చాను. ఆ బొమ్మల రూపును నా డ్రెస్ డిజైన్స్పైకి తీసుకురావాలనే ఆలోచన కొన్నాళ్లుగా ఉంది. కానీ, నారాయణ పేట హ్యాండ్లూమ్స్కైతే మరింత బాగుంటుందని అనుకున్నాను. నారాయణæపేట పట్టు చీరల మీద డిజిటల్ ప్రింట్ల అందం గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనుకున్నది కూడా దీని వెనక ఉన్న ఉద్దేశ్యం. ఈ బాపూ బొమ్మల కాన్సెప్ట్‌ని ఐఎఎస్ హరిచందన, ఇతర అధికారులు చాలా అభినందించారు. చేనేత కారులకు మార్కెటింగ్ ప్లెయిన్‌గా ఉన్న హ్యాండ్లూమ్స్కి మరిన్ని హంగులు అద్దడం వల్ల ప్రజల్లోకి వీరి చేనేతలు మరింత వేగంగా వెళతాయి. చీరలపై డిజిటల్ ప్రింట్లు సులువుగానూ వేయచ్చు. స్థానికంగా బ్లాక్‌ప్రింట్, డిజిటల్ ప్రింట్ యూనిట్స్‌ని ప్రభుత్వం గానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ఏర్పాటు చేయగలిగితే చేనేత కారులకు మరిన్ని అవకాశాలు మెరుగవుతాయి. నారాయణ పేటæ చీరలు అనగానే పెద్దవాళ్లు కట్టుకునేవి అనే అభిప్రాయం ఉండేది. ఆ ఆలోచన మార్చాలనే టీనేజర్స్ కూడా ఇష్టపడేలా పేస్టల్ కలర్స్, మోటిఫ్స్లోనూ మార్పులు తీసుకురావడంపై కృషి జరుగుతోంది. చేనేతకారులకు అవకాశాలు మెరుగవడానికి చేస్తున్న చిరు ప్రయత్నం ఇది’ అని వివరించారు ఈ ఫ్యాషన్ డిజైనర్. – నిర్మలారెడ్డి -
ఇద్దరిని బలితీసుకున్న ప్రేమ వ్యవహారం
సాక్షి, నారాయణపేట: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడని మనస్తాపానికి గురైన యువతి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడగా.. భయంతో యువకుడు సైతం రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని పోస్టాఫీస్ సమీపంలో నివాసం ఉండే పోతిరెడ్డిపల్లికి చెందిన పావని(18) హైదరాబాద్‌లో చదువుతుండగా.. కోస్గికి చెందిన నరేందర్ (19) స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వీరిద్దరు ప్రేమించుకుంటున్న విషయం ఈ మధ్యనే తెలుసుకున్న ఇరు కుటుంబాల వారు ఈ నెల 7న పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. కాగా, నరేందర్ పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన పావని అదేరోజు ఇంటికి వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను పాలమూరు జనరల్ ఆస్పత్రికి.. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. అప్పటికే భయంతో ఉన్న నరేందర్ సైతం శనివారం ఉదయమే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మహబూబ్‌నగర్‌కు వెళ్లి.. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారంలో ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. చదవండి: (ఇన్‌స్టాలో పరిచయం, ఆపై స్నేహం.. చివరికి యువతిని నమ్మించి..) -
మగవేషధారణలో అమ్మాయి.. పక్కా ప్లాన్
సాక్షి, నారాయణపేట: మగ వేషధారణలో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ బాలికను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా.. సదరు బాలిక మగ వేషధారణలో ఉంటూ కొద్ది రోజులుగా దొంగతనాలకు పాల్పడుతోంది. సోమవారం కర్ణాటక రాష్ట్రం గుర్మిట్కల్ శివారులోని తొట్లూరుకు చెందిన వాసురామ్ కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్‌కు నారాయణపేటకు వచ్చాడు. ఈక్రమంలో సదరు బాలిక ఆయన జేబులో నుంచి రూ.50వేలు తస్కరించింది. బాధితుడు వెంటనే తేరుకుని బాలికను గుర్తించి చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అంతలోనే అక్కడికి వచ్చిన పోలీసులు మగవేశంలో ఉన్న బాలికను అదుపులోకి తీసుకున్నారు. బాలిక దగ్గర అప్పుడే కొనుగోలు చేసిన సెల్‌ఫోన్, దుస్తులపాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ బాలిక గతంలో చిన్నచిన్న దొంగతనాల్లో దొరికిందని, వయస్సు రిత్యా మైనర్ కావడంతో వెంటనే సఖీ కేంద్రం నిర్వాహకులకు బాలికను అప్పగించినట్లు తెలుస్తోంది. -
కడసారి చూపు దక్కలేదు..
నారాయణపేట: కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ అమల్లో ఉండటం తో ఎవరైనా మామూలుగా చనిపోయినా మృతదేహాలను సొంత ఊర్లకు తీసుకువెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. నారాయణపేట జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఇలాంటి దయనీయ పరిస్థితినే ఎదుర్కొంది. కుటుంబ సభ్యులు వాట్సాప్‌లో వీడియోకాల్ చూపిస్తూ అంత్యక్రియలు కానివ్వడంతో ఓ తల్లి తల్లడిల్లగా.. బంధువులు బోరుమన్నారు. ధన్వాడకు చెందిన రాములమ్మ, మాకం సాంబశివుడు దంపతులకు ఆరుగురు కుమారులు ఉన్నారు. వారిలో నాలుగో కుమారుడు మహేశ్‌కుమార్ (41) మహారాష్ట్రలోని సోలాపూర్‌లో కూలి పనిచేస్తున్నాడు. భార్య సువర్ణ, కూతుళ్లు దివ్య, శృతి, శ్రావణితో కలసి అక్కడే జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల మహేశ్‌కు షుగర్, బీపీ పెరిగింది. లాక్డౌన్ కారణంగా నెల రోజుల నుంచి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు మృతి చెందాడు. శనివారం ఉదయం వైద్యులు శవ పరీక్షలు నిర్వహించి కరోనా లేదని నిర్ధారించారు. అయితే తమ తండ్రి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళతామని అక్కడి పోలీసులను పిల్లలు వేడుకున్నా ఫలితం దక్కలేదు. ఈ విషయాన్ని ధన్వాడలో ఉంటున్న మహేశ్ తల్లి రాములమ్మ, అన్నదమ్ములకు తెలియజేశారు. అక్కడికి వెళ్లేందుకు అధికారులు అనుమతించకపోవడంతో సోలాపూర్ నుంచే వాట్సాప్‌లో వీడియోకాల్ చూపిస్తూ అంత్యక్రియలు కానిచ్చారు. చివరి చూపునకు నోచుకోకలేకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
మినీ గోవాగా ఖ్యాతిగాంచిన గ్రామం
సాక్షి, కృష్ణ (మక్తల్) : నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని ముడుమాల్ గ్రామం ఓ విశిష్టమైన, ఆధ్యాత్మిక, చారిత్రకమైన ప్రాంతంగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఆదిమానవులు, రుషులు, దేవతలు నడియాడిన ప్రాంతంగా ఇప్పటికే గుర్తింపు పొందింది. ఈ గ్రామంలోని నిలువురాళ్లు ఆదిమానవులు ఏర్పాటు చేసినవిగా ఇప్పటికే పురావస్తు శాఖ గుర్తించి వాటిని కాపాడడానికి ప్రభుత్వం కృషిచేయాలని సంబంధిత శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఇక్కడ చారిత్రాత్మకమైన యాదవేంద్రస్వామి మఠం, శివాలయాలు ఉన్నాయి. ఇక్కడ మంత్రాలయ గురు రాఘవేంద్రస్వామి తపస్సు ఆచరించినట్లు ఆధారాలు ఉండడంతోపాటు ఆయన సమకాలికుడే ఈ యాదవేంద్రస్వామి అని ఆలయ అర్చకులు చెబుతున్నారు. మరోపక్క ఈ మఠం పక్కనే కృష్ణానది, ఆ నదిలో ఇసుక మేటలతో సరిగ్గా గోవాలోని బీచును తలదిన్నే విధంగా ఉండడంతో ఇక్కడికి కర్ణాటక నుంచి ప్రతినిత్యం పర్యాటకులు వస్తుంటారు. ఇలాంటివి ఒకేచోట.. ఒకే గ్రమంలో ఉండడం అరుదు. ఏడాది క్రితం మహబూబ్‌నగర్ కలెక్టర్ సతీమణి, పురావస్తు శాఖ రాష్ట్ర డైరెక్టర్ విశాలాచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించి మంత్రముగ్ధులయ్యారు. దీంతో అప్పట్లో ఆమె పలుమార్లు కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో కలిసి వ్యక్తిగతంగా పర్యటించారు. అదేవిదంగా ఈ గ్రామం గతంలో రాజులు, సంస్థానాధీశులు పరిపాలించారు. అప్పటి సంస్థానాధీశులు ఇక్కడి పేద ప్రజలకు వేలాది ఎకరాల భూములను ఇనాంగా ఇచ్చారు. ఇంతటి విశిష్టమైన ప్రాంతాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం దారుణమని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా ఈ గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ధిపర్చాలని డిమాండ్ గ్రామస్తులు చేస్తున్నారు. ఇది చదవండి : కొండా.. కోనల్లో.. లోయల్లో.. సౌకర్యాలు కల్పించాలి ముడుమాల్ను ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా గుర్తించి చారిత్రాత్మకమైన ఆలయాలను అభివృద్ధిపర్చాలి. అదేవిధంగా ఇక్కడికి వచ్చే పర్యాటకులకు తాగునీటితోపాటూ ఇతర సౌకర్యాలు కల్పించాలి. ఇందుకు గాను ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు జిల్లా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి చొరవ చూపాలి. – అనిల్, ముడుమాల్ -
మళ్లీ బడికి..
ఏళ్ల తరబడి విద్యార్థుల మధ్య పాఠశాలలో గడిపిన టీచర్లకు పదవీ విరమణ పొందిన తర్వాత ఇంట్లో ఒంటరిగా కూర్చోడానికి ఇష్టపడరు. అదేవిధంగా కాలక్షేపం కోసం ఇతర పనులు చేయడానికి కష్టంగా భావిస్తారు. అందుకే వారి అనుభవం, జ్ఞానాన్ని పిల్లలకు అందించాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వివరాలు సేకరించే పనిలో ఎంఈఓలు నిమజ్ఞమయ్యారు. స్వచ్ఛందంగా ముందుకు వస్తే పాఠశాలలు బలపడి ఉత్తీర్ణత శాతం పెంచుకోవడానికి దోహదపడుతుంది. ముందుగా ధన్వాడ, మరికల్లో విద్యాంజలి పేరుతో ప్రారంభించేందుకు సన్నద్ధమయ్యాం. సాక్షి, మహబూబ్‌నగర్(నారాయణపేట) : పదవీ విరమణ వయస్సుకే కాని పనిచేయాలనే మనస్సుకు కాదు. ఇదే నినాదంతో విద్యాశాఖ ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఎన్నో సంవత్సరాలుగా విద్యాబోధన చేసి పదవీ విరమణ పొందిన టీచర్లు చాలావరకు ఇంటికే పరిమితం అవుతుంటారు. మరి కొందరు ఇష్టం లేకపోయినా కాలక్షేపం కోసం వివిధ రకాలైన వృత్తులు చేస్తుంటారు. అలాంటి వారి సేవలను తిరిగి సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యాబోధనతో చక్కటి ఫలితాలు సాధించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో విద్యాంజలి పేరుతో రూపొందించిన కార్యక్రమం ముందుగా ధన్వాడ, మరికల్ మండలాల్లో ప్రారంభించి అన్ని మండలాలకు విస్తరించాలని భావిస్తున్నారు. రిటైర్డ్ అయినా సేవలో.. ఏళ్ల తరబడి సర్కారు ఉప్పు తిన్నందుకు కనీసం శేష జీవితంలో తాను పనిచేసిన శాఖలో సేవ చేయాలనే తలంపుతో ఉన్న రిటైర్డ్ టీచర్ల వివరాల సేకరణలో జిల్లా విద్యాశాఖ అధికారులు నిమజ్ఞమయ్యారు. కొత్తగా ఏర్పాటైన నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో ఇటీవల చాలా మంది పదవీ విరమణ పొందారు. వారిలో కొందరు ఉచితంగా బోధన చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ముందుగా ధన్వాడ, మరికల్ మండలాల్లో పైలెట్ ప్రాజె క్టుగా ప్రారంభించాలని భావిస్తున్నారు. ఆ మేరకు ఆయా మండలాల్లో ప్రస్తుతానికి 30 మందిని గుర్తించగా 22 మంది సేవ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సంఖ్య రాబో యే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంద ని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. సౌకర్యవంతమైన సేవలు.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా విద్యాబోధన చేయడానికి ముందుకు వస్తున్న రిటైర్డ్ టీచర్లకు ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైన సేవలను తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయించింది. స్వచ్ఛందంగా వస్తుండటంతో వారు స్థానికంగా నివాసం ఉన్నచోటనే అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. గతంలో విద్యాబోధన చేసిన అనుభవం, జ్ఞానాన్ని విద్యార్థులతో పంచుకోవడంతో రాబోయే టెన్త్ ఫలితాల్లో సైతం ఉత్తీర్ణత శాతం పెంరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో ప్రయోజనం పొందేది కొత్తగా ఏర్పాటైన నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 11 మండలాల పరిధిలో 75 ఉన్నత, 86 యూపీఎస్, 337 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 68,501మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉన్నత పాఠశాలలకు ఉపయోగపడే లెక్షరర్లు, జీహెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్స్, పండిత్‌లతో విద్యాబోధన చేయిస్తారు. వీరి రాకతో ముఖ్యంగా 6461మంది టెన్త్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. అదేవిధంగా ఎస్జీటీలుగా పదవీ విరమణ పొందిన వారిని ప్రాథమిక పాఠశాలలో వారి సేవలను సద్వినియోగం చేసుకోనున్నారు. -
పేట చేనేతకు వందేళ్ల చరిత్ర..
మన్నికైన వస్త్రాలతో ఒకప్పుడు దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత చేనేత వృత్తిది.. ఆ కళాకారులది. చేనేత కార్మికులు నైపుణ్యంతో దేశీయ వస్త్రాలకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గద్వాల, రాజోళి, నారాయణపేట చీరల పేర్లు వింటేనే నాజూకు వస్త్రాలు గుర్తుకువస్తాయి. ఇక్కడి చేనేత కార్మికుల చేతిలో అద్భుతమైన చీరలు తయారవుతున్నాయి. సాధారణ నూలుతోనే ఆకర్షించే చీరలు నేస్తూ..విభిన్నమైన చీరలు రూపుదిద్దడంలో తమకు తామే సాటని చాటుతున్నారు. మగ్గాలపై తమలోని తృష్ణను బయటకు తీసి, చీరలపై అందమైన డిజైన్లుగా మారుస్తున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. సాక్షి, మహబూబ్‌నగర్(నారాయణపేట) : పల్లె నుంచి పట్నం వరకు అడిగిమరి కొనే చీరల్లో నారాయణపేట పట్టు ఒకటి. ఇక్కడి చేనేతకు వందేళ్ల చరిత్ర ఉంది. అంతటి మన్నికైన.. అపురూపమైన డిజైన్ల చీరలను తయారు చేయడం ఇక్కడి చేనేత కళాకారుల ప్రతిభ. పేట చీరల చీరల తయారీకి పట్టణంతో పాటు జాజాపూర్, కోటకొండ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చేనేత కార్మికులు ఉన్నారు. 1900 సంవత్సరం నుంచే ఇక్కడ పట్టుచీరలు తయారుచేస్తున్నట్లు చరిత్ర చెప్తుంది. మగ్గాలపై చీరలు నేస్తూ ఎంతో గుర్తింపు సంపాదించిన నారాయణపేట కార్మికులు నాలుగు సంవత్సరాల క్రితం జియోగ్రాఫికల్ నుంచి పెటెంట్హక్కును సాధించుకున్నారు. అగ్టిపెట్టెలో పట్టెంత చీరను నేసి రికార్డు నారాయణపేట పట్టుచీరలు దేశ, విదేశాల్లో సైతం ఖ్యాతిని సంపాదించుకున్నాయి. పెద్ద, పెద్ద పట్టణాల్లో సైతం ఎంతో ఆదరణ ఉంది. మారుతున్న డిజైన్లు, ఫ్యాషన్‌కు అనుగుణంగా చీరలు నేయడం ఇక్కడి ప్రత్యేకత. అగ్గిపెట్టెలో పట్టెంత చీరను నేసి రికార్డు సృష్టించిన చరిత్ర ఉంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధి సైతం ఈ చీరలు కట్టుకుందంటే ఎంతటి గుర్తింపు దక్కిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ వివిధ ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చి చీరలు తీసుకోవడం పరిపాటి. పట్టులో రకాలు పట్టు చీరల్లో పలు రకాలు అందుబాటులో ఉన్నాయి. టెంపల్ గర్భరేషన్, నిఖల్, పారాస్, పైటీనియా, సైటనీ, నీవాళి దనవతి, శివశంభు, నివాళి శివశంలలో కడ్డి మరియూ ప్లేన్ రకాలతో పాటు స్పెషల్ బార్డర్ వంటివి ప్రత్యేక ఆకర్శణగా ఉంటాయి. వీటికి తోడు కొత్తగా వస్తున్న మాడల్స్‌కు అనుగుణంగా తయారుచేస్తున్నారు. అర్డర్లు ఇచ్చి మరి తయారు చేయించుకోవడం జరుగుతుంది. మార్కెట్లో ముడిసరుకుల ధరలు పెరగడంతో చీరల ధరలు సైతం పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కో చీర నేయడానికి రెండు నుంచి మూడు రోజలు సమయం పడుతుంది. గల్లి నుంచి ఢిల్లీ వరకు విక్రయాలు ‘పేట’ నేత కార్మికుల కుటుంబాలు తయారు చేసిన పట్టు చీరలు ఢిల్లీ వరకు అమ్మకానికి వెళ్తుంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ముఖ్యంగా హైద్రాబాద్, వరంగల్, పూణె, ముంబాయి, సాంగ్లీ, షోలాపూర్, ఔరంగాబాద్, అహ్మదాబాద్, నాగ్‌పూర్, రాయిచూర్, గుల్బర్గ, యాద్గీర్, బెంగుళూర్, విజయవాడ, విషాఖపట్నం దుకాణాల్లో ప్రత్యేకంగా అమ్ముతుంటారు. డిల్లీలో సైతం ‘పేట’ పట్టు చీరలు దొరకడం విశేషం. పెళ్లిలు, శుభకార్యాలకు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి తీసుకువెళ్తుంటారు. గద్వాల టౌన్: సంస్థానాధీశుల కాలం నుంచి నేటి తరం ఆధునిక మహిళల మనస్సును కట్టిపడేసే డిజైన్లను అద్దుకున్న గద్వాల చీర నేడు దేశ, విదేశీ వనితల ఆదరణ పొందుతూ తన ప్రత్యేకతను నిలుపుకుంటుంది. కాటన్ చీరకు జరీ అంచుతో డిజైన్ చేయబడిన నాటి తరం సంప్రదాయాన్ని కొనసాగిస్తునే నేటి అదునిక అవసరాలకు అనుగుణంగా సీకో(కాటన్, సిల్క్)లను కలిపి దారంతో సరికొత్త డిజైన్లతో మహిళలను మనస్సుకు నచ్చేలా గద్వాల ప్రాంత చేనేత కార్మికులు చీరల నేతలను కొనసాగిస్తున్నారు. గద్వాల సంస్థానం ఏర్పడిన నాలుగు వందల ఏళ్ల నాటి నుంచి గద్వాల చీరకు ప్రత్యేక కాలగుణంగా ప్రత్యేకత ఉండేలా చేనేతకు ప్రాణం పోస్తున్నారు. ఆదునిక సాంకేతకను జోడిస్తూ గద్వాల చీర ప్రత్యేకతను నిలబెట్టుకునేలా ఇక్కడి చేనేత వృత్తిని సగర్వంగా కాలంతో వస్తున్న పోటీలో నిలుస్తున్నారు. చీరల తయారీలో మాస్టర్ వీవర్స్, వీవర్స్ తమ వృత్తిలో నిల్చునేలా, గద్వాల చీరకు ప్రత్యేకత, గుర్తింపు, మహిళల ఆదరణ ఉండేలా ఎవరికి వారు పోటీ పడుతున్నారు. సంస్థానాధీశుల కాలంలో చేనేత కార్మికులు తమ చేనేత కళ ప్రతిభతో అగ్గిపెట్టెలో చీర ఇమిడేలా తయారు చేసేవారు. ఆ నాటి నుంచి తిరుమల శ్రీనివాసుడికి ఏటా జరిగే దసర బ్రహ్మోత్సవాలలో గద్వాలలో నిష్టగా తయారు చేసిన ఎరవాడ పంచెలను ధరింప చేస్తున్నారు. అంతటి ప్రత్యేక గద్వాల చీరలకు, చేనేత ప్రతిభకు ఉంది. రూ.1200 నుంచి రూ.40వేల విలువ వరకు... కాటన్ చీరకు అంచు, కొంగు బార్డర్లో గద్వాల వారసత్యంగా వస్తున్న డిజైన్లతో పాటు, నేటి ఆదునిక డిజైన్లను నేస్తున్నారు. జరీలో వెండి, రాగి, బంగారుతో తయారైన జరీ పోగులను బార్డర్, కొంగు, చీర మద్యలో డిజైన్, బుట్టాలకు తమ ప్రతిభతో అందాలను అద్దుతున్నారు. గద్వాల చీర రూ.12 వందల నుంచి రూ.40 వేల విలువ వరకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. అంతకు మించి డిజైన్‌ను మరింత ఖరీదుతో చేయాలంటే ముందస్తు ఆర్డర్‌ను ఇవ్వాల్సింటుంది. -
ములుగు, నారాయణపేట జిల్లాలకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటు కోసం రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాను విభజిస్తూ ఒక రెవెన్యూ డివిజన్, 9 మండలాలతో ములుగు జిల్లా.. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఒక రెవెన్యూ డివిజన్, 12 మండలాలు కలుపుతూ నారాయణపేట జిల్లా ఏర్పాటు చేసేలా డిసెంబర్ 31న ఈ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా ములుగు, నారాయణపేటలను కొత్త జిల్లాలుగా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల అనం తరం ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కూడా రెవెన్యూ శాఖతో జరిగిన సమీక్ష సందర్భంగా రెండు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే కొత్త జిల్లాలుగా ములుగు, నారాయణపేటను ఏర్పాటు చేసేలా ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. భూపాలపల్లి జిల్లాలోని ములుగు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ములుగు, వెంకటాపూర్, గోవిందరావ్‌పేట్, తడ్వాల్, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట్, వెంకటాపురం, వాజేడు మండలాలను ములుగు జిల్లాలో చేర్చారు. నారాయణపేట్ జిల్లాలో ఉన్న మండలాల విషయమై అధికారిక సమాచారం ఇంకా బయటకు రాలేదు. జిల్లాల ఏర్పాటు విషయమై జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల, గ్రామాల ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలను ప్రభుత్వం స్వీకరించనుంది. ఈ నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి నెలరోజుల్లో భూపాలపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లకు ఎలాంటి సలహా లు, అభ్యంతరాలైనా తెలియజేయవచ్చు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాతే కొత్త జిల్లా ఏర్పాటును గెజిట్‌లో చేరుస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది. అప్పటినుంచి కొత్త జి ల్లాలు ఉనికిలోకి వస్తాయి. ఈ ప్రక్రియ పూర్తయి తే రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కి పెరగనుంది. కొత్తగా 4 మండలాలు..: రాష్ట్రంలో కొత్తగా మరో 4 మండలాలు ఏర్పాటయ్యాయి. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలాన్ని విభజించి మోస్రా, చందూరు మండలాలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతోపాటే సిధ్దిపేట రూరల్ మండలాన్ని విభజించి నారాయణరావుపేట మండలం.. మేడ్చల్ జిల్లా పరిధిలో చిన్న మఠంపల్లిని మరో మండలంగా ఏర్పాటు చేసింది. ఇక జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లాలో చేరుస్తూ ఉత్తర్వులిచ్చింది. -
నాటి ఉద్యమానికి ఫలితం.. త్వరలో మరో కొత్త జిల్లా !
నారాయణపేట రూరల్ : నాటి ఉద్యమానికి నేడు ఫలితం రాబోతోంది.. రోజుల తరబడి చేసిన దీక్షలు.. రోడ్లపై చేపట్టిన ఆందోళనలకు అప్పట్లో చలించని ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను నాలుగు జిల్లాలుగా ఏర్పాటుచేసిన అప్పటి ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రావడంతో ప్రజల ఆశయాన్ని నెరవేర్చేందుకు ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు అడుగులు వేస్తోంది.. ఎన్నికల కోడ్ తదితర అడ్డంకులన్నీ తొలిగిపోయాక రెండు, మూడు నెలల్లో నారాయణపేట జిల్లాగా రూపుదాల్చనుంది. అది పూర్తయ్యాక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఐదు జిల్లాలుగా ఏర్పడినట్లవుతుంది. 2016 ఏప్రిల్‌లో.. పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఏప్రిల్ 2016లో నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాలు, రెవెన్యూ డివిజన్ వంటి నిర్ధిష్టమైనప్రాతిపదికలేవీ లేకుండా లేకుండా ముందుకుపోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఉద్యమాలు జరిగాయి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో గద్వాల, నారాయణపేటను సైతం జిల్లాలు చేయాలంటూ ఆందోళనలు చేపట్టారు. అయితే, చివరి నిమిషంలో గద్వాలకు ఆ హోదా దక్కినా.. నారాయణపేటను మాత్రం విస్మరించా రు. చిన్నచిన్న ప్రాంతాలను జిల్లాలుగా చేసి, అన్ని అర్హతలు ఉన్న ‘పేట’ను ఎందుకు చేయడంలేదని ఈ ప్రాంత ప్రజలు అప్పట్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. జిల్లా సాధన సమితి ఏర్పాటు చారిత్రాత్మకంగా, శాస్త్రీయంగా పరిశీలిస్తే ఉమ్మడి జిల్లాలో తొలి మున్సిపాలిటీగానే కాకుండా రెవెన్యూ డివిజన్ కేంద్రంగా కొనసాగుతున్న నారాయణపేట జిల్లాగా ఏర్పాటు చేయడానికి అర్హత ఉంది. ఈ మేరకు 2016 మే 19న జిల్లా సాధన సమితిని ఏర్పాటు చేశారు. అన్ని పార్టీల ఆధ్వర్యంలో నిరహారదీక్షలు, వినూత్న నిరసనలు చేసి జిల్లా ఆకాంక్షను వెల్లడించారు. అయినా ప్రభుత్వం వివిధ కారణాల తో సానుకూలంగా స్పందించలేదు. దాదాపు ఏడాది పాటు చేపట్టిన ఆందోళనల్లో ఇక్కడి ప్రజలు అన్ని రకాల పండుగలను సైతం త్యాగం చేసి రోడ్లపైనే ఉన్నారు. సర్దిచెప్పిన అమాత్యులు తెలంగాణ ఉద్యమానికి సరిసమానంగా కొనసాగిన ‘పేట’ జిల్లా ఉద్యమంపై స్పందించిన అమాత్యులు ఇచ్చిన హామీతో నాయకులు వెనక్కి తగ్గారు. అప్పట్లో ఉద్యమ తీవ్రతను చూసి అధికార పార్టీలో చేరిన స్థానిక ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి సైతం రాజీనామా అస్త్రం ప్రయోగించారు. చివరికి మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, రామ్మోహన్‌రెడ్డి ‘పేట’కు వచ్చి అప్పటి ఎస్ఎల్డీసీ కళాశాలలో జిల్లా సాధన సమితి నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. జిల్లా ఇవ్వడం కష్టమని.. భవిష్యత్‌లో జిల్లాల ఏర్పాటు ప్రక్రియ చేపడితే 32వ జిల్లా హోదా నారాయణపేటకే వస్తుందని సీఎం చెప్పినట్లు వారు పేర్కొన్నారు. అందుకు ప్రతిగా జిల్లా స్థాయికి తగినట్లు ఒక ఐఏఎస్ అధికారితో సబ్ కలెక్టర్ కార్యాలయం, జిల్లా ఆస్పత్రి వంటివి ఏర్పాటు చేస్తామని చెప్పడంతో వారు ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల హామీగా కొత్త జిల్లా తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీల నాయకులు నారాయణపేట అసెంబ్లీ స్థానంలో గెలుపు కోసం జిల్లా ఏర్పాటు అంశాన్ని ముందుకు తెచ్చారు. ప్రచారంలో ప్రతీ అభ్యర్థి ఇదే అంశంపై హామీ ఇస్తుండటంతో టీఆర్ఎస్ పార్టీ ఆలోచనలో పడింది. ఇక అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్‌రెడ్డి తరపున ప్రచారానికి ఈనెల 25న నారాయణపేటకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక మినీ స్టేడియం గ్రౌండ్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ రాజేందర్‌రెడ్డిని గెలిపిస్తే నారాయణపేటను జిల్లాగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అనుకున్నట్లుగానే ఓటర్లు రాజేందర్‌రెడ్డిని గెలిపించారు. దీంతో సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందు జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం కేసీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో జిల్లాల నుంచి సంఖ్య 33కు పెరగనుందని చెప్పడం ద్వారా నారాయణపేట జిల్లాకు ఏర్పడనుందని స్పష్టత ఇచ్చారు. కార్యాలయాల ఏర్పాటుపై దృష్టి? రాష్ట్రంలో మరో రెండు జిల్లాలు ఏర్పాటు కానున్నాయంటూ సీఎం కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. దీంతో నారాయణపేట జిల్లా కానుందని స్థానికుల నుంచి ఆనందం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా ఎప్పుడు జిల్లా ప్రకటన వచ్చినా కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై అధికారులు ముందుగానే భవనాల పరిశీలనలో నిమగ్నమైనట్లు సమాచారం. పట్టణ శివారు సింగారం క్రాస్ రోడ్డు పక్కన గల మూతబడిన ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల భవానిన్న కలెక్టరేట్ కోసం, పాత కోర్టు(కల్లు డిపో) భవనాన్ని ఎస్పీ కార్యాలయం కోసం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇక ఆర్డీఓ గెస్ట్ హౌస్‌ను కలెక్టర్ బంగ్లాగా, ఆర్అండ్బీ రెస్ట్ హౌస్‌ను ఎస్పీ రెసిడెన్స్‌గా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా మైనార్టీ పాఠశాల భవనం, వెటర్నరీ కార్యాలయ భవనంతో పాటు మరికొన్ని కూడా అందుబాటులో ఉండడంతో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అధికారులు భావిస్తున్నారు. ఏయే మండలాలు ? కొత్తగా ఏర్పాటయ్యే నారాయణపేట జిల్లాలో ఏయే మండలాలు ఉండనున్నాయనే అంశంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాలతో జిల్లాను ఏర్పాటుచేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నారాయణపేట మున్సిపాలిటీతో పాటు దామరగిద్ద, మద్దూర్, దౌల్తాబాద్, ధన్వాడ, మరికల్, ఊట్కూర్, మక్తల్, మాగనూర్, కృష్ణ, నర్వ, కోయిలకొండ మండలాలు చేర్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, చివరి వరకు ఇందులో చిన్నచిన్న మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు. ప్రజల ఆకాంక్ష నెరవేరబోతుంది ఈ ప్రాంత ప్రజలు నారాయణపేటను జిల్లాగా ఏర్పాటుచేయాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు. ఈ మేరకు వారి కల నేరవేరబోతుంది. నెలల తరబడి చేసిన ఉద్యమ ఫలితంగా నేడు జిల్లాగా మారనుంది. ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్కు అనుకూలంగా రావడంతో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సిద్ధం కావడం ఆనందంగా ఉంది. -డాక్టర్ మనోహర్ గౌడ్, జిల్లా సాధనసమితి కన్వీనర్ పాలన చేరువ అవుతుంది నారాయణపేట జిల్లా కావడం వల్ల పరిపాలన ప్రజలకు చేరువవుతుంది. వివిధ పనుల నిమిత్తం ఇప్పటి వరకు మహబూబ్‌నగర్ వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు జిల్లా కావడంతో విద్యా, వైద్య రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఉపాధి అవకాశాలు పెరిగి వలసలు తగ్గుతాయి. అలాగే, స్థానికంగా జిల్లా స్థాయి అధికారులు అన్ని శాఖల్లో అందుబాటులో ఉంటారు. – భార్గవి, యువతి, నారాయణపేట ‘లోకాయపల్లి’గా నామకరణం చేయాలి కేసీఆర్ గతంలో ఇచ్చిన జిల్లాలకు సంప్రదాయ బద్ధంగా దేవుడి పేరు తో పేర్లు పెట్టారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఏర్పాటుచేయను న్న రెండు జిల్లాల్లో ములుగును సమ్మక్క – సారలమ్మ జిల్లాగా పేరు పెట్టనున్నట్లు తె లుస్తోంది. నారాయణపేటకు సైతం చారిత్రక ప్రాచు ర్యం కలిగిన లోకాయపల్లి లక్ష్మమ్మ పేరు పెట్టాలి. – మణికుమార్, విద్యార్థి, నారాయణపేట -
సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష...
సాక్షి, నారాయణపేట/దామరగిద్ద: కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీ అందరికి సేవచేసుకుంటానని ఆ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం దామరగిద్ద మండలంలోని మద్దెల్‌బీడు, బాపన్‌పల్లిలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధిపథంలో నడిపిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎంపీపీ కిష్టప్ప, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్, ఈదేప్ప, భాస్కర్, వెంకటప్ప, శరణప్ప, బాలప్ప, తిప్పన్న, భీంరెడ్డి, అశోక్ పాల్గొన్నారు. పతి కోసం సతి ప్రచారం పట్టణంలోని 10వ వార్డులో ఇంటింటా ప్రచారాన్ని తన పతి మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి కారుగుర్తుకు ఓటేసి గెలిపించాలని సతిమణి స్వాతిరెడ్డి విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు. ఆమెతో మున్సిపల్ చైర్పర్సన్ గందెఅనసూయ ఉన్నారు. అలాగే మండలంలోని బండగొండలో టీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్యా, మార్కెట్ చైర్మన్ సరాఫ్‌నాగరాజు ప్రచారాన్ని కొనసాగించారు. వారితోపాటు పార్టీ నాయకులు సతీశ్, ఆశిరెడ్డి, చందుయాదవ్ పాల్గొన్నారు. ఎస్.రాజేందర్‌రెడ్డిని గెలిపించండి మరికల్: టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని ఎస్.ఆర్‌రెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలని బుధవారం టీఆర్ఎస్ మండల నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మండలంలోని మాధ్వార్‌లో ఎస్.ఆర్ రెడ్డికి మద్దతుగా మండల అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకానలు ప్రజల్లోకి తీసుకెళ్లి విజయం సాధిస్తామన్నారు. అలాగే పేటలో నిర్వహించిన కేసీఆర్ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. లంబడి తిరుపతయ్య, బాలస్వామి, సుధాకర్‌గౌడ్, సోమయ్య, యదయ్య, వీరరాఘవరెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు. -
20 సంవత్సరాల తర్వాత..
నారాయణపేట రూరల్ : దాదాపు 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ మహిళ ఎట్టకేలకు తిరిగొచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని సింగారం గ్రామానికి చెందిన గంగమ్మ కూలీ పనిచేస్తుండగా.. భర్త పశువులు కాసేవారు. ఈమెకు ముగ్గురు ఆడపిల్లలు. అయితే భర్త అనారోగ్యం పాలుకావడంతో కుటుంబ పోషణ గంగమ్మపై పడింది. దీంతో మానసిక ఒత్తిడికి లోనై చిన్న కూతురు రేణును తీసుకుని అదృశ్యమైంది. ఏళ్ల తరబడి ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. ఇంట్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు పనిచేసుకుంటూ తండ్రిని పోషిస్తూ వచ్చారు. గ్రామానికి చెందిన పెద్ద మనుషులు దగ్గరుండి వారికి వివాహం చేశారు. ఈ క్రమంలో గత పదేళ్ల క్రితం గంగమ్మ భర్త మృతిచెందాడు. అదృశ్యమైన గంగమ్మ నాలుగేళ్ల క్రితం చేతకాని పరిస్థితుల్లో భూత్పూర్ మండలం అన్నాసాగర్ పంచాయతీ రావులపల్లికి ఒంటరిగా చేరుకుంది. అక్కడే పాచి పనిచేస్తూ కాలం వెళ్లదీసింది. ఈ నెల 19న కిందపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆచూకీ అడగటంతో సొంతూరు సింగారం అని చెప్పడంతో గ్రామ యువకులు సర్పంచ్ నాగిరెడ్డికి సమాచారం ఇచ్చారు. వివరాలు సేకరించి గంగమ్మ పెద్ద కుమార్తె చెన్నమ్మకు చెప్పి, భూత్పూర్ పోలీసుల సహకారంతో ఆమెను అప్పగించారు. -
గ్రానైట్ రాయిపడి కూలీ దుర్మరణం
దామరగిద్ద (నారాయణపేట): పొట్ట కూటికోసం వలస వెళ్లి గ్రానైట్ కంపెనీలో పనిచేస్తూ జీవిస్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు గ్రానైట్ రాయి మీదపడి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండలంలోని లోకుర్తిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అశోక్(30) గత మూడేళ్లుగా ఉపాధి కోసం షాద్‌నగర్‌లోని మహి గ్రానైట్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాగా మంగళవారం ప్రమాదవశాత్తు యంత్రంలో నుంచి గ్రానైట్ రాయి మీద పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామ సర్పంచ్, సుదర్శన్, ఎంపీటీసీ సభ్యుడు రాచప్ప, రాష్ట్ర సీపీఎం నాయకులు భూపాల్‌తోపాటు 40 మంది గ్రామస్తులు కంపెనీ ఎదుట బైటాయించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆందోళన చేపట్టారు. ఎండీ అందుబాటులో లేకపోవడంతో అక్కడి అదనపు సిబ్బందితో మాట్లాడారు. బాధిత కుటుంబానికి రూ.13 లక్షలు ఆర్థికసాయం చేయాలని కోరగా అంగీకరించడంతో ఆందోళన విరమించినట్లు చెప్పారు. అశోక్‌కు భార్య లక్ష్మి, కూతురు, కుమారుడు ఉన్నారు. -
ఎమ్మెల్యే వేధిస్తుండు సారూ!
నారాయణపేట: మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి వేధిస్తున్నారని దామరగిద్ద మండలం బాపన్‌పల్లి సర్పంచ్ జి.శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు మెయిల్, రిజిస్టర్డ్ పోస్టు ద్వారా లేఖను పంపినట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన శివకుమార్‌రెడ్డి పక్షన తాను నిలబటం తప్పా అని ప్రశ్నించారు. తనపై అక్రమకేసులు బనాయింపచేస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పనులను ప్రారంభించాలని కోరి నా శివకుమార్‌రెడ్డి అనుచరుడిగా ముద్ర వేస్తూ పట్టించుకోవడం లేదన్నారు. -
నారాయణపేటను జిల్లా చేయాలి
జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన నారాయణపేట: మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేటను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం, వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నారాయణపేట జిల్లా సాధన కోసం ఈ నెల 5 నుంచి నిర్వహించే 48 గంటల బంద్లోను, 6న మరికల్లో జరిగే హైవే దిగ్బంధంలో సకలజనులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా సాధన సమితి సభ్యులు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రాజీనామా లేఖ నారాయణపేటను జిల్లాగా ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి మంగళవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామా పత్రాన్ని సీఎం కేసీఆర్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపిస్తున్నట్లు తెలిపారు. మక్తల్‌ను మహబూబ్‌నగర్‌లోనే కొనసాగించాలి మక్తల్: మక్తల్ నియోజకవర్గాన్ని మహబూబ్‌నగర్‌లోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల బంద్ మొదటి రోజు మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. కాగా, మక్తల్‌ను మహబూబ్‌నగర్‌లోనే కొనసాగించాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సెల్‌టవరెక్కిన ఇద్దరు యువకులు చేగుంట: మెదక్ జిల్లాలోని నార్సింగిని మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జెట్టి శ్రీనివాస్, మైలారం రాజులు మంగళవారం సెల్‌టవర్ ఎక్కారు. ఇప్పటికే నార్సింగి మండలం కోసం గ్రామానికి చెందిన అంచనూరి రాజేశ్, మల్లాగౌడ్ , సిద్దారెడ్డి నిరాహార దీక్ష చేస్తున్నారు. గ్రామానికి చెందిన సందీప్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండల ఏర్పాటుపై ప్రకటన వచ్చే వరకు టవర్ దిగమని యువకులు తెలిపారు. -
నారాయణపేటను జిల్లా చేయాలి
నారాయణపేట : నారాయణపేటను జిల్లా చేయాలని శనివారం పట్టణంలో భజనలు, బొడ్డెమ్మలతో ప్రజలు హోరెత్తించారు. జిల్లా ఏర్పాటు కోరుతూ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులందరూ స్థానిక వినాయక మండపాల్లో పూజలు నిర్వహించారు. జిల్లా సాధన సమితి కన్వీనర్ డాక్టర్ మనోహర్‌గౌడ్, సభ్యులు నాగూరావు నామాజీ, ఘన్‌శ్యాందాస్‌ధరక్, సుదర్శన్‌రెడ్డి, జ్యోతిర్నాథ్, సుధాకర్, రఘువీర్‌యాదవ్, గందెరవి, బోయలక్ష్మణ్, ఉద్దినారాయణల నేతృత్వంలో పట్టణంలోని సెంటర్ చౌక్ నుంచి భజనలు చేస్తూ, బొడ్డెమ్మలు ఆడారు. ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని భజనలు, బొడ్డెమ్మలు, డోలు చప్పుళ్లతో హోరెత్తించారు. ప్రతి వినాయకుడి వద్ద ‘పేట’ జిల్లా ఏర్పాటుకు పూజలు చేసి ఆర్డీఓ చీర్ల శ్రీనివాస్‌కు టెంకాయలతో పాటు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈసందర్భంగా జిల్లా సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటులో అన్ని అర్హతలు ఉన్న ‘పేట’ను ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లాగా ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. -
‘పేట’ను జిల్లాగా ప్రకటించేవరకు పోరాడుతాం
– జిల్లా సాధన సమితి స్పష్టికరణ నారాయణపేట : అన్ని అర్హతలు ఉన్న నారాయణపేటను జిల్లాగా ప్రకటించేంతవరకు ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని జిల్లా సాధన సమితి కన్వీనర్ డాక్టర్ మనోహర్‌గౌడ్, సభ్యులు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూరావు నామాజీ, కాంగ్రెస్ నియోజకవర్గ సరాఫ్‌కృష్ణ, ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాంమైనోద్దీన్ చాంద్ స్పష్టం చేశారు. ‘పేట’ను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం స్థానిక సెంటర్ చౌక్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నల్లగుడ్డ ధరించి మౌన ప్రదర్శన నిర్వహిస్తూ నిరసన తెలిపారు. నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేయాలని స్థానిక ఆర్డీఓ చీర్ల శ్రీనివాసులకు వినతులు సమర్పించి వారు మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఆశాస్త్రీయంగా ఉందని ప్రజాభిష్టానికి ఏమాత్రం పొంతన లేదన్నారు. కేవలం రాజకీయ కోణంలోనే జిల్లాల ఏర్పాటు జరిగిందని ఆరోపించారు. అన్ని అర్హతలు ఉన్న నారాయణపేటకు తీవ్ర అన్యాయానికి గురవుతుందన్నారు. ఇప్పటికైనా ఎంపీ, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌పై ఒత్తిడితీసుకొచ్చి జిల్లా ఏర్పాటుకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నింగిరెడ్డి, కొండయ్య, పేట మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయ, టీడీపీ నాయకులు ఓంప్రకాశ్, నర్సింహరెడ్డి, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు సిద్రామప్ప, రఘువీర్‌యాదవ్, ప్రభాకర్‌వర్ధన్, కెంచె శ్రీనివాస్, బోయలక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు సుధాకర్, కెంచె నారాయణ, సాధన సమితి సభ్యులు సుదర్శన్‌రెడ్డి, వెంకోబ, రంగారెడ్డి, శ్రీనివాస్ లహోటి, దీలిప్‌కుమార్, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. -
పేట డివిజన్‌కు నీరందిస్తామనడం విడ్డూరం
– టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నారాయణపేట : పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నారాయణపేట డివిజన్‌కు నీరు అందించడం సాంకేతికపరంగా ఇబ్బందులు తప్పవని, దాదాపు 300 కిలోమీటర్ల దూరం నుంచి ఈ ప్రాంతానికి నీళ్లు తెస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ‘నారాయణపేట–కోడంగల్’ ఎత్తిపోతల ప్రాజెక్టు సాధనకు జలసాధన సమితి ఆధ్వర్యంలో గురువారం పేట సత్యనారాయణచౌరస్తాలో చేపట్టిన రిలేదీక్షను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నారాయణపేట డివిజన్లోని మక్తల్, నారాయణపేట, కోడంగల్ నియోజకవర్గాలతో పాటు రంగారెడ్డి జిల్లాలోని తాండూరు, పరిగి ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు వీలుకలుగుతుందన్నారు. పంటలు పండించి ఈ ప్రాంతం నుంచే ఎగుమతి పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. నారాయణపేట చేనేత చీరలకు ప్రపంపస్థాయిలో ప్రసిద్ధి ఉందన్నారు. అదేవిధంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కే. దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు సాధించేంతవరకు సకల జనులు కదంతొక్కి రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరూ ముందుండి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పట్టణ పురవీధుల గుండా ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి, టీజేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ అరుణ, జలసాధన సమితి కన్వీనర్ అనంత్‌రెడ్డి, వివిధ పార్టీల నాయకులు బి.రాము, వెంకట్రామరెడ్డి, నింగిరెడ్డి, రెడ్డిగారిరవీందర్రెడ్డి, కాశీనాథ్, ప్రశాంత్, గోపాల్, సత్యనారాయణరెడ్డి, నర్సిములుగౌడ్, మనోహర్‌గౌడ్, వెంకోబ, కెంచె శ్రీనివాస్, బాల్‌రాం తదితరులు పాల్గొన్నారు. -
కనీస ప్రమాణాలు పాటించాలి
ఎమ్మెల్సీ నాగేశ్వర్ నారాయణపేట : ప్రభుత్వ విద్యావిధానంలో కనీస ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ డా.కె.నాగేశ్వర్ అన్నారు. శుక్రవారం స్థానిక పోలేపల్లి ఫంక్షన్హాల్లో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రథమ విద్యా మహాసభలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సభలకు తొలిరోజు ఎమ్మెల్సీ నాగేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘బంగారు తెలంగాణ’ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పరి తపిస్తున్నదన్నారు. ఈ కల సాకారానికి బంగారం లాంటి చదువు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలకు అక్షరాస్యత, ప్రభుత్వ విద్య బలోపేతంపై చిత్తశుద్ధి లేనందున ఆశించిన అభివృద్ధి జరగడం లేదన్నారు. ఆరేళ్ల క్రితం సీఎం నేతృత్వంలో ఏర్పాటు చేసి న ‘సాక్షరత మిషన్’కు తనను కూడా ఒక సభ్యుడిగా నియమించినా ఇంతవరకు ఒక్క సమావేశం జరగలేదన్నారు. మిషన్ విధివిధానాలు ఏమిటో కూడా తెలియవన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అమలుచేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇందు కు రూ. 25 కోట్లు కేటాయించి అధ్యయనం చేస్తున్నామని చెబుతున్నారేగా ని, ఇంతవరకు నిపుణుల బృందాన్ని ఏ ర్పాటు చేయ లేదన్నారు. విద్యారంగ అభివృద్ధి జరగనిదే బంగారు తెలంగాణ సాధ్యం కాదని, ప్రతి ఉపాధ్యాయుడు కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన బోధన చేయూలన్నారు. పిల్లల్లో ప్రశ్నిం చే, ఆలోచించే తత్వాన్ని చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నా రు. ఉపాధ్యాయుడు తరగతి గదిని ప్ర పంచానికి అనుసంధానం చేయాలని, ప్రపంచ విషయాలను పరిచయం చేసినప్పుడే శాస్త్రీయ విద్యావిధానం వస్తుం దన్నారు. ఎమ్మెల్సీ పొతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలన్నారు. ఉపాధ్యాయులు హక్కుల కోసమే కాకుండా బాధ్యతల విషయంలోనూ ముందుండాలన్నారు. రాష్ట్రంలో తొలి యూటీఎఫ్ విద్యా మహాసభల చర్చలు, అభిప్రాయాలు, తీర్మానాలు రేపటి భవిష్యత్ బాగుకు, బంగారు తెలంగాణ కలల సాకారానికి ఉపయోగపడాలన్నారు. ప్రభుత్వం ఉచిత నిర్బం దవిద్య అమలుకు కృత నిశ్చయంతో ఉందన్నారు.మహాసభ ఆహ్వాన సం ఘం అధ్యక్షుడు, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు విఠల్‌రావు ఆర్య మాట్లాడుతూ వెనకబడిన ‘పేట’ డివిజన్లో విద్యా సదస్సును నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. పెట్టుబడిదారి, బాలకార్మికుల వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని, సమాజాన్ని తీర్చిదిద్దేది ఉపాధ్యాయలోకమేనన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎల్కొటి ఎల్లారెడ్డి, టీఆర్ఎస్ నేత శివకుమార్‌రెడ్డి, కృష్ణభగవాన్, చావరవి, కిష్టయ్య, రఘుపాల్, సంయుక్త, విజయ్‌కుమార్, వెంకటప్ప, వెంకట్రామరెడ్డి, వెంకట్‌రెడ్డి, లక్ష్మణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వర్షార్పరణం
గురువారం కురిసిన అకాలవర్షానికి జిల్లాలోని ప్రధాన వ్యవసాయ మార్కెట్ లలో విక్రయానికి వచ్చిన వరి, మొక్కజొన్న ధాన్యం తడిసిముద్దయింది. జడ్చర్ల, అలంపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, వనపర్తి, నారాయణపేట మార్కెట్లో రైతులు కవర్లు కప్పి ధాన్యాన్ని కాపాడుకున్నారు. వర్షానికి పత్తి నల్లబారుతుందే మోనని రైతులు బెంబేలెత్తిపోతున్నారు. అకాల వర్షం జిల్లా రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. అష్టకష్టాలు పడి పండించిన ధాన్యం నీటి పాలైంది. నాగర్‌కర్నూల్, వనపర్తి, జడ్చర్ల, నారాయణపేట, పెబ్బేరు, అలంపూర్, కొడంగల్, దేవరకద్ర ప్రాంతాల్లో కొతకు వచ్చిన వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మార్కెట్ యార్డుల్లో విక్రయానికి తెచ్చిన మక్కలు తడిసిముద్దయ్యాయి. బాదేపల్లి మార్కెట్ 30వేల బస్తాల ధాన్యం తడవగా, నారాయణపేటలో వెయ్యి, వనపర్తిలో పది వేలు, లింగాలలో 15 వేలు, నాగర్‌కర్నూల్‌లో దాదాపు 20 వేల బస్తాలు తడిపిపోయాయి. - ‘సాక్షి’ నెట్వర్క్ -
పింఛన్ రాక ప్రాణం పాయె!
జిల్లాలో ముగ్గురు వృద్ధులు మృతి జడ్చర్ల, పాన్‌గల్, నారాయణపేట రూరల్ : పింఛన్‌పై ఆదారపడి జీవించే వృద్ధులు ‘ఆసరా’ కోల్పోయామని రోజుకొకరు ప్రాణాలు వదులుతున్నారు. ఆధార్ కార్డులో ఉన్న వయసు ఆధారంగా అధికారులు పింఛన్ జాబితాలో పేర్లు తొలగించేశారు. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పింఛన్ వస్తుందో రాదోనన్న బెంగతో వారు మంచం పట్టి మరణిస్తున్నారు. ఈ సంఘటనలు జిల్లాలో నిత్యకృత్యమవ్వగా ఆదివారం మరో ముగ్గురు మృతిచెందారు. జడ్చర్ల మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన నాయినిపల్లి కృష్ణయ్య(62) అనే వృద్ధుడు తన పేరు పింఛన్ జాబితాలో లేదని తెలుసుకుని వారం రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడి లోనై శనివారం రాత్రి ఇంట్లో పడుకున్న దగ్గరే మృతి చెందాడు. కృష్ణయ్యకు రెండేళ్ల కిందట పక్షవాతం రావడంతో అప్పటినుంచి మందులకోం పింఛన్‌పై ఆధారపడేవాడు. తీరా పింఛన్ రద్దు కావడంతో బెంగతో మృతిచెందాడు. ఈ విషయంపై తహసీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి విచారణ చేపట్టారు. పాన్‌గల్ మండలం జమ్మాపూర్ గ్రామానికి చెందిన కుర్వ రామచంద్రయ్య (80) కూడా పింఛన్ రాలేదని చనిపోయాడు. తన పేరు రద్దయిన తర్వాత ఇటీవల కొత్త ఫించన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తుది జాబితాలోకూడా తన పేరు లేదని రెండ్రోజులుగా మనస్తాపానికి గురయ్యాడని, చివరికి ఆదివారం అదే దిగులుతో మరణించాడని మృతుని కుమారులు నాగయ్య, కృష్ణయ్య, మల్లయ్య రోదిస్తూ వాపోయారు. బాధిత కుటుంబాన్ని సర్పంచు భాస్కర్‌రెడ్డి, అధికారులు పరామర్శించారు. నారాయణపేట పట్టణంలోని 23వ వార్డుకు చెందిన కొనంగేరి సీతమ్మ (71) కూడా పింఛన్ రావడంలేదనే దిగులుతో ప్రాణాలు వదిలింది. ఆమెకు ఇదివరకే * 200 పింఛన్ వచ్చేది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఆసరా పథకం జాబితాలో పేరు రాకపోవడంతో బెంగపడి ఆదివారం ఉదయం చనిపోయింది. పింఛన్ వచ్చి ఉంటే వృద్ధురాలు బతికుండేదని తోటి వృద్ధులు వాపోయారు. -
పరమావధి..!
మునిసిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడమే పరమావధిగా పలు రాజకీయ పార్టీలు కలిసొచ్చే సమీకరణాలపై దృష్టిసారించాయి. మిత్రపక్షమా.. వైరీపక్షమా?.. ఇదేమీ పట్టించుకోకుండా పట్టు నిలుపుకోవడమే లక్ష్యంగా వ్యూహం రచిస్తున్నాయి. ‘నాకు నీవు.. నీకు నేను!’ అనే ఫార్ములాను అనుసరిస్తూ మైత్రి కోసం సిద్ధమవుతున్నాయి. ఈ కోవలోనే జిల్లాలో హస్తం, కమలం దోస్తీ కట్టేందుకు తహతహలాడుతున్నాయి. సాధారణ ఎన్నికల్లో తన మిత్రపక్షం టీడీపీని కాదని కాంగ్రెస్ వెంట నడిచేందుకు బీజేపీ కౌన్సిలర్లు సిద్ధమవుతుండటంతో వింతరాజకీయం చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : మునిసిపల్ చైర్మన్ల ఎన్నికలో పరస్పరం సహకరించుకునే విధంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య అంతర్గతంగా ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. గద్వాల, షాద్‌నగర్‌లో కాంగ్రెస్, అయిజలో టీఆర్ఎస్కు చైర్మన్ పదవి దక్కించుకునేందుకు స్పష్టమైన సంఖ్యాబలం ఉంది. నారాయణపేటలో బీజేపీ సొంతబలం ఆధారంగానే చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. అయితే మహబూబ్‌నగర్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి మునిసిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన సంఖ్యాబలం లేకపోవడంతో ఇతర పార్టీలపైన ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు పార్టీలు పావులు కదుపుతున్నాయి. మహబూబ్‌నగర్‌లో ఎంఐఎంతో కలిసి చైర్మన్‌పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నా సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. తమకే చైర్మన్ పదవి ఇవ్వాలని ఎంఐఎం పట్టుబడుతుండటంతో కాంగ్రెస్ ప్రత్యామ్నాయంపై దృష్టి సారించినట్లు తెలిసింది. ఆరుగురు కౌన్సిలర్ల బలం ఉన్న బీజేపీ మద్దతుతో కౌన్సిల్ చైర్మన్‌ను చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మరోవైపు వనపర్తి మునిసిపాలిటీలో బీజేపీకి మద్దతు పలకాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య క్షేత్రస్థాయిలో చర్యలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి నగర పంచాయతీల్లోనూ ఇదేరకమైన సహకారంతో ముందుకు సాగాలనే ప్రతిపాదన తెరమీదకు వస్తోంది. ఈ మేరకు ఇరుపార్టీల జిల్లా నాయకత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. రెండుచోట్లా వైస్‌చైర్మన్ పదవితో సరిపెట్టుకోవాలని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తోంది. ‘దేశం’తో అంగీకారం లేనట్లే! వనపర్తిలో బీజేపీ సహకారంతో చైర్మన్ పదవి దక్కించుకోవాలని భావిస్తున్న టీడీపీకి బీజేపీ నిర్ణయం ఆశనిపాతంగా మారింది. చైర్మన్ పదవి తమకే ఇవ్వాలని బీజేపీ పట్టుబట్టినా టీడీపీ నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వీలైనంత లబ్ధిపొందేందుకు కాంగ్రెస్‌తో వెళ్లడమే మేలని బీజేపీ భావించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ సహకరించుకుంటే వనపర్తి మునిసిపాలిటీ చైర్మన్గిరీతో పాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తిలో వైస్‌చైర్మన్ పదవిని దక్కించుకోవాలని బీజేపీ లెక్కలు వేస్తోంది. సాధారణ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ ఎన్నికల అవగాహన కుదుర్చుకుని అభ్యర్థులను బరిలోకి దించాయి. టీడీపీ ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగినా, బీజేపీ మాత్రం ఫలితం సాధించలేకపోయింది. సాధారణ ఎన్నికల సమయంలో ఇరు పార్టీల నడుమ పొత్తు కుదిరినా క్షేత్రస్థాయిలో శ్రేణుల నడుమ పూర్తిస్థాయిలో సమన్వయం కుదరలేదు. మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు లేనందున వనపర్తిలో టీడీపీకి మద్దతివ్వాల్సిన అవసరం లేదని బీజేపీ భావిస్తోంది. -
టీడీపీ ప్రచార జీపు ఢీకొని బాలుడి దుర్మరణం
నారాయణపేట, న్యూస్‌లైన్ : టీడీపీ ప్రచార జీపు ఢీకొనడంతో ఓ బాలుడు మృతి చెందగా, కోపోద్రిక్తులైన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనలో ఓ వాహనం ధ్వంసం కాగా, ఓ హోటల్ డబ్బాకు బాధితులు నిప్పంటించారు. వివరాలు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం కోటకొండలో టీడీపీ ప్రచార జీపు తిరుగుతోంది. అదే సమయంలో గ్రామ బొడ్రాయి సమీపంలో బాల్‌రాజ్ (6) కంకర కుప్పపై ఆడుకుంటున్నాడు. అతన్ని గమనించకుండానే డ్రైవర్ వేగంగా వాహనాన్ని నడపడంతో ఆ బాలుడు దుర్మరణం చెందాడు. దీంతో ఆగ్ర హించిన ప్రజలు రాళ్లు, కర్రలతో అద్దాలు పగులగొట్టి జీపును ధ్వంసం చేశారు. దాని యజమాని ఇంటిముందు మృతదేహంతో బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు జనాన్ని చెదరగొట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు పట్టుబట్టారు. దీంతో గ్రామ పెద్దలతో చర్చించి అందుకు సరేననడంతో వారు శాంతించి వెనుదిరిగారు. -
పరుగులు పెట్టించిన వాన..
కొందుర్గు,/జడ్చర్ల,/జడ్చర్లటౌన్,/ఊట్కూర్, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా బుధ వారం చిరుజల్లులు కురిశాయి. జిల్లా కేంద్రంతోపాటు, నారాయణపేట డివిజన్ ప్రాం తంలో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షం కురిసిం ది. బలంగా వీచిన ఈదురుగాలులకు మామిడి కాయాలు నేలరాలాయి. కూరగాయల పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జడ్చర్లలో కురిసిన వర్షం కారణంగా విక్రయానికి తీసుకొచ్చిన ధాన్యం మార్కెట్లో తడిపోయింది. దీంతో రైతులు తడిసిన పంటను ఆరబెట్టుకునేందుకు తంటాలు పడ్డారు. మధ్యాహ్నం 3గంటల నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో ఇబ్బందులకు గురయ్యారు. కొద్దిరో జులుగా ఉక్కబోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణం చల్లబడటం ఉపశమనం కలిగించింది. ఊట్కూర్‌కు చెందిన పీర్ మహ్మద్‌సాబ్‌కు తోటలో మామిడికాయలు నేలరాలాయి. దీంతో రూ. 50 ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. పాలమూరు జిల్లాలో మంగళవారం (నిన్న) రికార్డు స్థాయిలో ఈ వేసవిలోనే అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో బుధవారమే వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు విక్రయానికి తీసుకువచ్చిన ధాన్యం నీటిలో కలిసిపోరుుంది. అకాలంగా కురిసిన వానతో ఆరుగాలం కష్టించి పండించిన పంట వర్షార్పణమైంది. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. భూత్పూర్ మండలం కప్పెటకు చెందిన రైతు కుర్వ యాదయ్య 50 బస్తాల ధాన్యాన్ని యార్డుకు తీసుకు వచ్చి ఆవరణలో ఆరబోశాడు. సాయంత్రం అకాల వర్షం ఒక్క సారిగా కురువడంతో తడిసి ముద్దయింది.అంతేగాక దాదాపు 15 బస్తాల ధాన్యం కొట్టుకుపోయింది. -
పిడమర్తి రవిని నేనే రమ్మన్నా: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ పునర్మిర్మాణం అనేది జీవన్మరణ సమస్యగా మారిందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించాల్సిన అవసరముందని కేసీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట టీడీపీ ఎమ్మెల్యే వై.ఎల్లారెడ్డి, వరంగల్ జిల్లా టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రేమలతారెడ్డి, తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... మక్తల్ నియోజకవర్గంలో ఎల్లారెడ్డికి మంచి పేరువుందని అన్నారు. పిడమర్తి రవిని తానే పార్టీలోకి ఆహ్వానించానని, తనను తానుగా ఆయన రాలేదన్నారు. మంచి స్థానంలో రవిని ఎమ్మెల్యేగా పోటీకి పెడతానన్నారు. లక్ష ఓట్లతో మెజారిటీతో ఆయనను గెలిపించాలన్నారు. -
అమ్మో.. టమా‘ఠా’..!
ఎర్రగా..చూడగానే కొనాలనిపించే టమాటా ఈ రబీ సీజన్లో రైతులపాలిట విలన్‌గా మారింది. చెట్టునుంచి కోయకుండానే ‘ఢామ్మని’ పేలిపోయే పరిస్థితి ఏర్పడింది. కొద్ది నెలల కిందట వరకూ మంచి ధర పలికిన పంట ఇప్పుడు తీవ్రంగా పతనమై ఆందోళనకర పరిస్థితులు ఎదురయ్యాయి. పెట్టుబడులకే ఎసరొచ్చి అప్పుల ఖాతా పెరిగి అన్నదాతలు సాగంటే భయపడేలా మారింది. దీనికి అకాల వర్షం తోడై పూడ్చుకోలేని నష్టం తెచ్చి పెట్టింది. మహబూబ్‌నగర్ వ్యవసాయం/కొందుర్గు, న్యూస్‌లైన్: కర్షకుడి కష్టాలు అంతా ఇంతా కాదు. ఆరుగాలం శ్రమ దక్కక ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. బహిరంగ మా ర్కెట్లో టమాటా ధర రూ.2 నుంచి రూ.3 మాత్రమే పలుకుతుండడంతో సాగు కోసం పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు కుదేలవుతున్నారు. విత్తనాలు,ఎరువుల ధరలు, క్రిమి సంహారక మందుల ధరలకు రెక్కలు రావడంతో పెట్టుబడి అమాంతంగా పెరిగిపోయింది. ఒక ఎకరా విస్తీర్ణంలో సాగుకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు అవుతోంది. శాపమైన వర్షాలు.. తాజాగా మార్కెట్‌కు పం ట తరలించే దశలో అకా ల వర్షం రైతులపాలిట శా పంగా మారింది. ఈ కారణంగా ఒక్క అలంపూర్, గద్వాల నియోజక పరిధిలోనే 100 హెక్టార్లలో ట మాటా పంటకు నష్టం వా టిల్లింది. అంతేకాకుండా వాతావరణంలో మార్పులు వచ్చి గాలులు వీయడంతో టమాట పంట నేలకొరిగి పాడువుతున్నాయి. మార్కెట్లో ధరలేకపోవడంతో పాటు కూలీల చెల్లింపులకూ రైతులు నానా కష్టాలు పడుతున్నారు. దీంతో వారు పంటను తెంపించడానికి వెనకడుగు వేస్తున్నారు. కొంతమంది రైతులు ఈ అదనపు భారం తమకెందుకని పండ్లను తీయకుండానే వదిలేస్తున్నారు. మరికొందరూ వాటిని పశువులకు మేతగా వేస్తున్నారు. హడలెత్తిస్తున్న అప్పులు... ప్రస్తుతం పంట కారణంగా పెట్టుబడి కూడా రావడం లేదు. ఈ పరిస్థితుల్లో చేసిన అప్పులు ఎలా తీర్చాలా అని రైతులు లోలోపల మధనపడుతున్నారు. ఈ కారణంగా కొందరు బలవన్మరణాలను ఆశ్రయిస్తుండగా, మరికొందరు వలస బాట పడుతున్నారు. గత మూడునాలుగు నెలల కింద టమాటా ధర కిలో రూ.80 పలికింది. దీంతో రైతులు రబీలో ఈ పంటపై దృష్టి సారించారు. ధరలు ఒక్కే సారి పతనం కావడంతో వారికి దిక్కుతోచన పరిస్థితి ఎదురైంది. జిల్లాలో ఎక్కువగా కేశంపేట,కొందుర్గు, షాద్‌నగర్, జడ్చర్ల, బాలానగర్, హన్వాడ, గద్వాల, అలంపూర్, మల్దకల్, కల్వకుర్తి, వనపర్తి, ఆత్మకూర్, నారాయణపేట మండలాల్లో ఎక్కువగా సాగు చేశారు. దాదాపు 4వేల హెక్టార్లకు పైగా సాగుచేశారు.వీరందరి పరిస్థితీ ఆందోళనకరంగా ఉంది.