సమైక్య రాష్ర్టంలో ఇదే చివరి రచ్చబండ: డీకే అరుణ | This will be last Rachabanda for United Andhra Pradesh: DK Aruna | Sakshi
Sakshi News home page

సమైక్య రాష్ర్టంలో ఇదే చివరి రచ్చబండ: డీకే అరుణ

Published Tue, Nov 12 2013 9:49 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

సమైక్య రాష్ర్టంలో ఇదే చివరి రచ్చబండ: డీకే అరుణ - Sakshi

సమైక్య రాష్ర్టంలో ఇదే చివరి రచ్చబండ: డీకే అరుణ

నారాయణపేట: సమైక్యరాష్ట్రంలో ఇదే చివరి రచ్చబండ అని మంత్రి డీకే అరుణ అన్నారు. 2014లో కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో మొదటి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. మంగళవారం ఆమె మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో జరిగిన మూడో విడత రచ్చబండలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, రాబోయే తెలంగాణ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డు అందించే విధంగా ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం కింద ఆయా వర్గాల ప్రజల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement