rachaband programme
-
ప్రజావాణిలో రచ్చబండ దరఖాస్తుల నమోదు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రచ్చబండ కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను ప్రజావాణిలో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రేషన్‌కార్డులు, పింఛన్లు, దరఖాస్తుల జాబితాలను వేర్వేరుగా తయారు చేయాలన్నారు. ప్రజావాణిలో దరఖాస్తులను కేటగిరీల వారీగా ఆప్‌లోడ్ చేయాలని సూచించారు. బంగారుతల్లి పథకం కింద మే నుంచి పుట్టిన ఆడపిల్లల జాబితాను నమోదు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. 3వ విడత ‘రచ్చబండ’ దరఖాస్తుల వివరాలు రేషన్‌కార్డులకు 79,867, పింఛన్లకు 38,826, గృహాల కోసం 72,662 దరఖాస్తులు అందాయి. కాగా గత రచ్చబండ కార్యక్రమాల ద్వారా మంజూరైన వివరాలిలా ఉన్నాయి. 20,267 కొత్త రేషన్‌కార్డులు, 35,473 కూపన్లు, 20,321 పంఛన్ మంజూరు పత్రాలు, 29,437 గృహ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ గుర్తించిన 3,576, 2,508 ఎస్సీ కుటుంబాలకు రూ. 8.14 లక్షలు, గిరిజన సంక్షేమశాఖ గుర్తించిన 2,955 గిరిజన కుటుంబాలలో 2,872 కుటుంబాలకు రూ. 10.79 లక్షలను విద్యుత్తు బిల్లు బకాయిలను చెల్లించినట్టు కలెక్టర్ పేర్కొన్నారు. యువతను ఓటర్లుగా నమోదు చేయాలి 18 ఏళ్లు నిండిన యువతను శతశాతం ఓటర్లుగా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కళాశాల విద్యార్థులు ఓటరు నమోదుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు. బూత్ లెవెల్ కేంద్రాలతో పాటు, వెబ్సైట్ ద్వారా కూడా ఓటరుగా నమోదు కావచ్చని చెప్పారు. డిసెంబర్ 10వ తేదీ వరకు గడువు ఉందన్నారు. జనవరి 25న ఓటరు దినోత్సవంలో భాగంగా గుర్తింపు కార్డులు అందజేస్తామన్నారు. -
సమైక్య రాష్ర్టంలో ఇదే చివరి రచ్చబండ: డీకే అరుణ
నారాయణపేట: సమైక్యరాష్ట్రంలో ఇదే చివరి రచ్చబండ అని మంత్రి డీకే అరుణ అన్నారు. 2014లో కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో మొదటి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. మంగళవారం ఆమె మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో జరిగిన మూడో విడత రచ్చబండలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, రాబోయే తెలంగాణ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డు అందించే విధంగా ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం కింద ఆయా వర్గాల ప్రజల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. -
కోత పెట్టి.. కొత్తగా!
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: ఎన్నికల పుణ్యమా! అంటూ గతంలో కోత పెట్టిన పింఛన్ల ను ప్రభుత్వం తిరిగి ఇచ్చే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. వివిధ కారణాలు చూపి జిల్లాలో 97వేల సామాజిక పింఛన్లను రద్దుచేసిన అధికారులు వచ్చే రచ్చబండ కార్యక్రమం ద్వారా 44,830 పిం ఛన్లు మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రేషన్‌కార్డు ఆధారంగా వయస్సు తక్కువగా ఉందని వృద్ధాప్య పింఛన్లు, సదరన్ క్యాంపులు నిర్వహించి అంగవైకల్య శాతం తక్కువగా ఉందని పిం ఛన్లను తొలగించిన విషయం తెలిసిందే. అయితే ‘బంగారు తల్లి’ పథకం అమలులో భాగంగా గురువారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కొ త్త పింఛన్లను మంజూరుచేసే విషయం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సామాన్య ప్రజల కష్టాలు తెలుసుకుని అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తే ఆయన మరణానంతరం వచ్చిన సీఎంలు కె.రోశయ్య, ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డిలు గతంలో ఉన్న పలువురి పింఛన్లను తొలగించే విధంగా చర్యలు తీసుకున్నారు. బంగారు తల్లి పథకంపై ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గతంలో తిరస్కరించిన వికలాంగులందరికీ కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తామని, అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు కూడా ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తొలగించిన పింఛన్లు ఇలా.. అయితే జిల్లాలో జిల్లాలో దాదాపు 21వేల వికలాంగుల పింఛన్లు తొలగించారు. తిరిగి వారందరికీ పింఛన్లు మంజూరుకావాల్సి ఉండగా, అందులో కేవలం 2454 మంది వికలాంగులకు మాత్రమే పింఛన్లు మంజూరుచేసి చేతులు దులుపుకున్నారు. అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు దాదాపు 43 వేలు తొలగించగా కొత్తగా 25,466 పింఛన్లు మంజూరు చేశారు. వితంతువులకు సంబంధించి 33వేల పింఛన్లను తొలగించగా..వాటి స్థానంలో ప్రస్తుతం 13,491 పింఛన్లు మంజూరుచేశారు. చేనేత, కల్లు గీత కార్మికుల పింఛన్లు కూడా అరకొరగానే ఇవ్వడంతో ఆయా వర్గాలు ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్నారు. త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం సార్వత్రిక ఎన్నిలు కూడా ఆ వెంటనే వచ్చే అవకాశం ఉండటం, ఈ ఎన్నికలన్నీ కూడా పార్టీ గుర్తులపైనే జరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీలో భయం పట్టుకుంది. కాగా, ఇటీవల నిర్వహించిన సొసైటీ, సర్పంచ్ ఎన్నికలు పార్టీల రహితంగా జరగడంతో ఎక్కువ స్థానాలు తమకే వచ్చాయని ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ప్రకటించుకుని సంబరపడిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లోనైనా పరువు దక్కించుకోవాలంటే వైఎస్ హయాంలో లబ్ధిపొందిన ప్రతి ఒక్కరికీ తిరిగి లబ్ధి చేకూర్చకపోతే ఇబ్బందులు తప్పవని భావించి ఆ మేరకు అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. సునీతా ల క్ష్మారెడ్డి చేసిన ప్రకటనతో గతంలో పింఛన్లు కోల్పోయిన వికలాంగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.