నారాయణపేటను జిల్లా చేయాలి
Published Sat, Sep 10 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM
నారాయణపేట : నారాయణపేటను జిల్లా చేయాలని శనివారం పట్టణంలో భజనలు, బొడ్డెమ్మలతో ప్రజలు హోరెత్తించారు. జిల్లా ఏర్పాటు కోరుతూ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులందరూ స్థానిక వినాయక మండపాల్లో పూజలు నిర్వహించారు. జిల్లా సాధన సమితి కన్వీనర్ డాక్టర్ మనోహర్‌గౌడ్, సభ్యులు నాగూరావు నామాజీ, ఘన్‌శ్యాందాస్‌ధరక్, సుదర్శన్‌రెడ్డి, జ్యోతిర్నాథ్, సుధాకర్, రఘువీర్‌యాదవ్, గందెరవి, బోయలక్ష్మణ్, ఉద్దినారాయణల నేతృత్వంలో పట్టణంలోని సెంటర్ చౌక్ నుంచి భజనలు చేస్తూ, బొడ్డెమ్మలు ఆడారు. ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని భజనలు, బొడ్డెమ్మలు, డోలు చప్పుళ్లతో హోరెత్తించారు. ప్రతి వినాయకుడి వద్ద ‘పేట’ జిల్లా ఏర్పాటుకు పూజలు చేసి ఆర్డీఓ చీర్ల శ్రీనివాస్‌కు టెంకాయలతో పాటు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈసందర్భంగా జిల్లా సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటులో అన్ని అర్హతలు ఉన్న ‘పేట’ను ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లాగా ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు.
Advertisement