మాట్లాడుతున్న సాధన సమితి సభ్యులు
‘పేట’ను జిల్లాగా ప్రకటించేవరకు పోరాడుతాం
Published Thu, Sep 1 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
– జిల్లా సాధన సమితి స్పష్టికరణ
నారాయణపేట : అన్ని అర్హతలు ఉన్న నారాయణపేటను జిల్లాగా ప్రకటించేంతవరకు ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని జిల్లా సాధన సమితి కన్వీనర్ డాక్టర్ మనోహర్‌గౌడ్, సభ్యులు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూరావు నామాజీ, కాంగ్రెస్ నియోజకవర్గ సరాఫ్‌కృష్ణ, ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాంమైనోద్దీన్ చాంద్ స్పష్టం చేశారు. ‘పేట’ను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం స్థానిక సెంటర్ చౌక్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నల్లగుడ్డ ధరించి మౌన ప్రదర్శన నిర్వహిస్తూ నిరసన తెలిపారు. నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేయాలని స్థానిక ఆర్డీఓ చీర్ల శ్రీనివాసులకు వినతులు సమర్పించి వారు మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఆశాస్త్రీయంగా ఉందని ప్రజాభిష్టానికి ఏమాత్రం పొంతన లేదన్నారు. కేవలం రాజకీయ కోణంలోనే జిల్లాల ఏర్పాటు జరిగిందని ఆరోపించారు. అన్ని అర్హతలు ఉన్న నారాయణపేటకు తీవ్ర అన్యాయానికి గురవుతుందన్నారు. ఇప్పటికైనా ఎంపీ, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌పై ఒత్తిడితీసుకొచ్చి జిల్లా ఏర్పాటుకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నింగిరెడ్డి, కొండయ్య, పేట మున్సిపల్ చైర్‌పర్సన్ గందె అనసూయ, టీడీపీ నాయకులు ఓంప్రకాశ్, నర్సింహరెడ్డి, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు సిద్రామప్ప, రఘువీర్‌యాదవ్, ప్రభాకర్‌వర్ధన్, కెంచె శ్రీనివాస్, బోయలక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు సుధాకర్, కెంచె నారాయణ, సాధన సమితి సభ్యులు సుదర్శన్‌రెడ్డి, వెంకోబ, రంగారెడ్డి, శ్రీనివాస్ లహోటి, దీలిప్‌కుమార్, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement