గ్రానైట్‌ రాయిపడి కూలీ దుర్మరణం | granite stone fell on labour..died | Sakshi
Sakshi News home page

గ్రానైట్‌ రాయిపడి కూలీ దుర్మరణం

Published Thu, Mar 1 2018 11:09 AM | Last Updated on Mon, Oct 1 2018 6:22 PM

granite stone fell on labour..died - Sakshi

మృతుడు అశోక్‌(ఫైల్‌ ఫోటో)

దామరగిద్ద (నారాయణపేట):    పొట్ట కూటికోసం వలస వెళ్లి గ్రానైట్‌ కంపెనీలో పనిచేస్తూ జీవిస్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు గ్రానైట్‌ రాయి మీదపడి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండలంలోని లోకుర్తిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అశోక్‌(30) గత మూడేళ్లుగా ఉపాధి కోసం షాద్‌నగర్‌లోని మహి గ్రానైట్‌ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాగా మంగళవారం ప్రమాదవశాత్తు యంత్రంలో నుంచి గ్రానైట్‌ రాయి మీద పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామ సర్పంచ్, సుదర్శన్, ఎంపీటీసీ సభ్యుడు రాచప్ప, రాష్ట్ర సీపీఎం నాయకులు భూపాల్‌తోపాటు 40 మంది గ్రామస్తులు కంపెనీ ఎదుట బైటాయించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆందోళన చేపట్టారు. ఎండీ అందుబాటులో లేకపోవడంతో అక్కడి అదనపు సిబ్బందితో మాట్లాడారు. బాధిత కుటుంబానికి రూ.13 లక్షలు ఆర్థికసాయం చేయాలని కోరగా అంగీకరించడంతో ఆందోళన విరమించినట్లు చెప్పారు. అశోక్‌కు భార్య లక్ష్మి,  కూతురు, కుమారుడు ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement